
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్‌లో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్ ఇంజిన్‌లో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడ్డారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల కారణంగా బస్సులో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదంలో బస్సు సగం వరకు కాలిపోయింది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను మరో బస్సులో విజయవాడకు తరలించారు.