మారిన రాజమహేంద్రవరం రూపురేఖలు
కాకినాడ తీరంలో అపార ఆయిల్ నిక్షేపాలు
తొలిదశలో 20 మిలియన్ టన్నుల సామర్థ్యంలో గేట్‌వే పోర్టు
రూ.1,265 కోట్ల !పెట్టుబడులతో భారీ, మధ్యతరహా పరిశ్రమలతో 3,586 మందికి ఉపాధి
నాలుగున్నరేళ్లలో 3,516 ఎంఎస్‌ఎంఈలు
16,394 మందికి ఉద్యోగకల్పన
రూ.875.18 కోట్లతో 3586 మందికి ఊతం
సాక్షి ప్రతినిధి, కాకినాడ:/సాక్షి, రాజమహేంద్రవరం/అమలాపురం: తూర్పు గోదావరికి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతే వేరు. గడచిన ఐదేళ్ల ప్రగతితో ఆ జిల్లా స్వరూపమే మారిపోయింది. పట్టణాలతో పోటీపడేలా పల్లెల్లో సైతం పారిశ్రామికీకరణకు పునాదులు పడ్డాయి. రూ.299.40 కోట్లతో రోడ్లు, భవన నిర్మాణాలు చేపట్టారు. రూ.229.40తో పనులు మొదలయ్యాయి. మరో 33 రోడ్లను రూ.42.87 కోట్లతో మరమ్మతులు చేశారు. రెండో దశలో రూ.26.37 కోట్లతో పనులు చేపట్టారు. కత్తిపూడి–ఒంగోలు జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి రూ.580.42 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కోనసీమ రైల్వే లైన్ కల సాకారమవుతోంది. దీనికోసం ఈ ఏడాది రూ.300 కోట్లు నిధులు వచ్చాయి. అయినవిల్లి మండలంలో రూ.300 కోట్లతో 440/132 కేవీ మెగా విద్యుత్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. పి.గన్నవరం మండలం ఉడిమూడిలంక, గంటి పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలు గోదావరిపాయ దాటాల్సిన అవసరం లేకుండా రూ.49.50 కోట్లతో వంతెన పనులు మొదలయ్యాయి.
ముమ్మిడివరం– ఐ.పోలవరం సరిహద్దులో వృద్ధ గౌతమీ, గౌతమీ నదీ పాయల మధ్య పశువుల్లంక మొండి రేవు వద్ద రూ.49 కోట్లతో వంతెనను సీఎం జగన్‌న్‌పూర్తి చేయడంతో 16 గ్రామాల్లోని 8 వేల మందికి సౌకర్యం కలిగింది. 2023, 2024 సంవత్సరాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రికార్డు స్థాయిలో దిగుబడి సాధించారు. గతేడాది ఎకరాకు 32 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది 38 నుంచి 45 బస్తాలు పండించారు. ఏటా ఖరీఫ్ సీజ¯న్‌లో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
రాజమహేంద్రి రాత మారింది
♦ రూ.423 కోట్లతో నాలుగున్నరేళ్లలో నగర రూపురేఖలు మారిపోయాయి.
♦ నవరత్నాలుతో జిల్లా వ్యాప్తంగా 33 పథకాలతో ప్రజలకు మేలు జరిగింది. రికార్డు స్థాయిలో రూ.25,436 కోట్లు వెచ్చించారు.
♦ నాడు–నేడులో 1069 పాఠశాలల భవనాలకు రూ.369.89 కోట్లు వెచ్చించారు.
♦ గృహాల కోసం 68,518 మందికి రూ.1233.34 కోట్లు వెచ్చించారు. 336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు విడుదలయ్యాయి.
♦ డిసెంబర్ నాటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ.25,436 కోట్లు వెచ్చించింది.
♦ రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో ఏర్పాటైన మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
♦ 1.46 లక్షల మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. తొలి దశలో రూ.113.48 కోట్లతో 63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
♦ అనపర్తి బలభద్రపురంలో రూ.2500 కోట్లతో గ్రాసిమ్ కాస్టిక్ సోడా పరిశ్రమతో 2500 మందికి ఉపాధి లభించింది.
♦ గోకవరం మండలం గుమళ్లదొడ్డి వద్ద రూ.260 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. 210 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.
♦ కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి వద్ద రూ.1,350 కోట్లతో త్రివేణి రెన్యువబుల్స్ ఆధ్వర్యంలో సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2400 మందికి ఉద్యోగాలు దక్కాయి.
♦ నల్లజర్ల మండలం పోతవరంలో రూ.50 కోట్లతో జాగృతి బయోటెక్ ప్రైవేటు సంస్థ బయోటెక్నాలజీ కంపెనీ అందుబాటులోకి రానుంది.
♦ ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాడు–నేడులో రూ.9.21 కోట్లు మంజూరు
♦ గడప గడపకు మన ప్రభుత్వంలో ఎదురైన సమస్యల్లో రూ.72.88 కోట్ల నిధులతో 1,102 పనులకు పరిష్కారం.
♦‘నాడు– నేడు’ మొదటి విడతలో రూ.104.96 కోట్లతో 436 పాఠశాలలు, రెండో విడతలో రూ.257 కోట్లతో 761 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి.
♦ పేదలందరికీ ఇళ్లు రెండు విడతల్లో 34,454 ఇళ్లకు రూ.62,017 కోట్లు కేటాయింపు.
♦ జల జీవన్ మిషన్‌లో రూ.515.93 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్‌ల నిర్మాణం.
♦ జగనన్న కాలనీల్లో 209 లే అవుట్లలో కుళాయిల కోసం రూ.45.75 కోట్లు కేటాయింపు.
♦ ఇంటింటికీ గోదావరి జలాలందించేందుకు రూ.1,650 కోట్లు కేటాయింపు
ఫుడ్ ప్రాసెసింగ్, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, హేచరీల్లో కల్పిస్తున్న ఉపాధి ఇలా
2019– 20లో 265 యూనిట్లతో 1707 మందికి
2020–21లో 119 యూనిట్లతో 978 మందికి
2021–22లో 720 యూనిట్లతో 4254 మందికి
2022–23లో 2412 యూనిట్లతో 9455 మందికి
Comments
Please login to add a commentAdd a comment