విరగకాసిన పనస
ఇంట్లో పనస పండు ఉంటే ఎంత దాచి పెట్టినా అందరికీ తెలిసిపోతుంది. దాని ఘుమఘుమ అలాంటిది. ఇక పనస తొనల మాధుర్యం చెప్పనలవే కాదు. అటువంటి పనస పండు ఇంట్లో ఒకటుంటేనే ఎంతో సంతోషం. అవే వందల సంఖ్యలో కనిపిస్తే ఆ ఆనందమే వేరు. పనస చెట్టుకు కాయలు కాయడం సాధారణమే. అలా కాకుండా ఆరు నుంచి ఎనిమిది కాయలతో గుత్తులు గుత్తులుగా కాస్తే నిజంగా విశేషమే! పెరవలి మండలం ఖండవల్లిలో రాజు గారి చేను వద్ద రోడ్డు పక్కన ఈ పనస చెట్టు ఉంది.
ఇది ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 250 కాయలు కాసింది. చెట్టు మొదలు నుంచి గుత్తులుగుత్తులుగా పై వరకూ ఉన్న కాయలు కాసిన ఈ చెట్టును అటుగా వెళ్తున్న వారు కన్నార్పకుండా చూసి, ఆనందిస్తున్నారు. ఇంతలా కాయలు కాసిన పనస చెట్టును చూడటం ఇదే మొదటిసారంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చెట్టు ఏటా కాపు కాస్తుందని, ఈ ఏడాది ఇంతలా గుత్తులుగుత్తులుగా కాయటం విశేషమేనని రైతు రాజు చెప్పారు.
– పెరవలి(తూర్పుగోదావరి)
చదవండి: Seshachalam Hills: మాట వినం..తాట తీస్తాం!
Comments
Please login to add a commentAdd a comment