Peravali
-
చంద్రబాబు వేస్ట్.. రైతుల ఆవేదన
-
‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే!
పెరవలి: ఇత్తడి.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది అజ్జరం. ఇత్తడికి పుట్టిల్లుగా ఈ గ్రామం జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు గాంచింది. వివిధ ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి తమకు కావలసిన ఇత్తడి వస్తువులు తయారు చేయించుకుంటారు. ఇక్కడ తయారవ్వని వస్తువంటూ లేదు. పవిత్రమైన దేవాలయాల్లోను, సామాన్యుల ఇళ్లలోను, సినిమాల్లోనూ కనిపించే అరుదైన ఇత్తడి వస్తువులు అజ్జరంలో తయారైనవే. బ్రిటిష్ వారి హయాం నుంచీ.. బ్రిటిష్ హయాం నుంచే అజ్జరంలో ఇత్తడి వస్తువులు తయారవుతున్నాయి. నాడు కేవలం చేతి పనిముట్ల సాయంతో వస్తువులు తయారు చేసేవారు. నేడు యంత్రాలతో తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన గంటలు దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పాటు దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలకూ ఏదో ఒక వస్తువు ఇక్కడి నుంచే తయారై వెళ్లిందే. ‘దేవత’ బిందెలు.. ఆలయాల్లో గంటలు ‘దేవత’ సినిమాలో ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ అనే పాట కోసం వేసిన సెట్టింగ్‌లో వాడిన బిందెలన్నీ అజ్జరంలో తయారైనవే. అదొక్కటే కాదు ఎన్నో సినిమాల్లోని లెక్కలేనన్ని సన్నివేశాల్లో వాడిన ఇత్తడి వస్తువులు అజ్జరానివే. ఈ గ్రామ జనాభా 2,957 మంది. వారిలో ఇత్తడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారే 2,500 మంది. తాత ముత్తాతల కాలం నుంచీ గ్రామస్తులు ఈ పనిని కుటుంబ వారసత్వంగా భావిస్తున్నారు. 50 గ్రాముల నుంచి 500 కిలోల బరువు వరకూ గంటలు తయారు చేసి ఈ గ్రామస్తులు రికార్డు సృష్టించారు. అమెరికాలోని ప్రముఖ చర్చిలకు కూడ ఇక్కడ తయారైన గంటలను ఎగుమతి చేశారు. నాణ్యత, నమ్మకం కారణంగానే అజ్జరం ఇత్తడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. తండ్రి నుంచీ ఇదే వృత్తి మా తండ్రి గారు ఇత్తడి వస్తువులు తయారు చేసేవారు. నాకూ అదే నేర్పారు. మేం ఈ పనిని ఇష్టంగా చేస్తాం. అందుకే ఇంతకాలమైనా విసుగు రాలేదు. వచ్చిన కస్టమర్లు మా పనిని చూసి ఎంతో అందంగా చేస్తున్నావని అన్నపుడు చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ పనిలో ఎంతో హాయి ఉంది. – నున్న వీర వెంకట సత్యనారాయణ, ఇత్తడి వస్తువుల తయారీ కార్మికుడు నేర్చుకునే వారు తగ్గిపోయారు మేం నాయీబ్రాహ్మణులం. ఈ పనంటే ఎంతో ఇష్టం. అందుకే దీనినే జీవనోపాధిగా ఎంచుకున్నాను. మెషీన్లు రావడంతో ఇత్తడి వస్తువుల తయారీ పని నేర్చుకునేవారు ఇప్పుడు తగ్గిపోయారు. కార్మిక చట్టాల వలన పిల్లలు పనికి రావడం లేదు. దీంతో ఈ పని మా తరంతోనే అంతమైపోతుందేమోనని అనిపిస్తోంది. – బొజ్జొరి బాలరాజు, కార్మికుడు 40 ఏళ్లుగా ఇదే పని గత 40 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. కులాలకు అతీతంగా అందరం కలసి ఉంటాం. గ్రామంలోని దాదాపు అందరూ ఈ పనిలోనే ఉన్నారు. ఇప్పుడు యంత్రాల రాకతో పని నేర్చుకునేవారే లేరు. ఈ పనితో కుటుంబాన్ని బాగా పోషించుకుంటున్నాం. – యడ్ల పోతురాజు, కార్మికుడు వేగం పెరిగినా కార్మికులు తగ్గిపోయారు ఒకనాడు ఇత్తడి పరిశ్రమ అజ్జరంలో వైభవంగా ఉండేది. యంత్రాలు వచ్చాక పని వేగంగా జరుగుతోంది. నైపుణ్యం ఉన్న కార్మికులు తగ్గిపోతున్నారు. గ్రామంలో 200 ఏళ్లుగా ఈ వ్యాపారం ఉంది. మా తాత బెప్పే పేరలింగం, మా తండ్రి సాంబమూర్తి కూడా ఈ వ్యాపారమే చేసేవారు. ఆయనకు మేం ముగ్గురు కుమారులం. అందరం ఈ పనే చేస్తున్నాం. చిన్నాపెద్దా తేడా లేకుండా 20 ఏళ్ల క్రితం అందరూ ఈ పనికి వచ్చేవారు. ఇప్పుడు పిల్లలు పనికి రావడం లేదు. చిన్నప్పటి నుంచీ పని నేర్చుకునేవారు తగ్గిపోయారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. – బెప్పే సత్యలింగం, ఇత్తడి పరిశ్రమ యజమాని -
స్పెషల్ పికిల్స్: ‘‘ఊరగాయల ఊరు’’.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే
Pickle Village Usulumarru: ఊరగాయలనే నమ్ముకుని ఊరంతా బతుకుతోందంటే నమ్ముతారా. నమ్మకం కలగకపోతే ఓసారి ఆ గ్రామానికి వెళ్లాల్సిందే.పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నసమయంలో బతుకుదెరువు కోసం ఓ కుటుంబం చేపట్టిన ఊరగాయల తయారీయే ఇప్పుడు ఆ ఊరికి ఉపాధి కల్పిస్తోంది. అక్కడి వారందరినీదర్జాగా బతికిస్తోంది. సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ రకరకాల ఊరగాయలు తయారు చేయడం ఆ ఊరి ప్రత్యేకత. అక్కడ తయారయ్యే పచ్చళ్లకు లేబుల్ లేకపోయినా.. బ్రాండ్ మాత్రం ఉంది. ఆ ఊరి పేరు ఉసులుమర్రు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో కలిసిన పెరవలి మండలంలోని గ్రామమది. పెరవలి: ఊరగాయల ఊరుగా ఉసులుమర్రు పేరొందింది. గ్రామ జనాభా 2,500 కాగా.. వారిలో 1,600 మంది పచ్చళ్ల తయారీ, విక్రయాలలో నిమగ్నమవుతుంటారు. ఏడాది పొడవునా ఏదో రకం ఊరగాయ తయారు చేస్తూ నిత్యం కోలాహలంగా ఉంటుంది. చిన్నాపెద్ద.. ఆడ మగా అనే తేడా లేకుండా అందరూ ఈ పనిలో నిమగ్నమై ఉంటారు. మగవాళ్లు దూరప్రాంతాలకు వెళ్లి ఊరగాయల వ్యాపారాలు చేస్తుంటే.. మహిళలు ఇంటి వద్ద పిల్లలను చూసుకుంటూ ఊరగాయలు తయారు చేస్తుంటారు. సీజన్ల వారీగా ఆవకాయ, మాగాయ, టమాటా, ఉసిరి, అల్లం, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ, దబ్బ, కాకర వంటి నిల్వ పచ్చళ్లు చేసి ఏడాది పొడవునా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కేవలం ఈ ఒక్క గ్రామం నుంచే సుమారు 300 మంది వ్యాపారులు పుట్టుకురాగా.. ఏటా 200 టన్నులకు పైగా ఊరగాయల ఉత్పత్తి అమ్మకాలు జరుగుతున్నాయి. కిలో ఊరగాయ రూ.200–రూ.250కి విక్రయిస్తున్నారు. అందరికీ అదే ఉపాధి ఉసులుమర్రు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన గ్రామం. ఇక్కడ కేవలం వరి మాత్రమే పండిస్తారు. అందువల్ల ఏటా జూన్, జూలై, డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే వ్యవసాయ పనులుంటాయి. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులకు బతుకుదెరువు కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో సుమారు 40 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన పిళ్లా శ్రీరామమూర్తి కుటుంబం ఊరగాయలు తయారు చేసి ఊరూరా వెళ్లి విక్రయించడం ప్రారంభించారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో ఆయనే మరికొందరికి ఉపాధి కల్పిస్తూ వచ్చారు. అలా మొదలైన ఆ ఊరి ఊరగాయల ప్రస్థానం ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల వరకు విస్తరించింది. ఊరగాయల తయారీతో గ్రామస్తులందరికీ ఇప్పుడు నిత్యం పని దొరుకుతోంది. మహిళలకు రోజుకు రూ.300, పురుషులకు రూ.400 చొప్పున కనీస కూలి లభిస్తోంది. ఆటుపోట్లు ఎన్నొచ్చినా.. ఈ వ్యాపారంలో తాము ఎన్ని ఆటుపోట్లు, కష్టనష్టాలు ఎదుర్కొన్నా కేవలం తామిచ్చే నాణ్యత మాత్రమే తమను నిలబెట్టిందని గ్రామస్తులు సగర్వంగా చెబుతుంటారు. ఇక్కడి వ్యాపారులు తెలంగాణలోని బోధన్, హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలతోపాటు మన రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తిరుపతి, ఒంగోలు, విశాఖ, ఒడిశా, అస్సాం, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు వెళుతుంటారు. అక్కడి హోటళ్లు, పికిల్స్ షాపులకు విక్రయిస్తుంటారు. వ్యాపారులంతా ఏడాదిలో 10 నెలలపాటు ఇతర ప్రాంతాల్లోనే ఉంటారు. కొందరు భార్యాబిడ్డలను వెంట తీసుకుని వెళతారు. మరికొందరు మాత్రం భార్యాబిడ్డలను గ్రామంలోనే ఉంచి సరుకు తయారు చేయించుకుంటారు. 20 ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం 20 ఏళ్ల క్రితం మా నాన్నగారు ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారాన్ని నేటికీ కొనసాగిస్తున్నాం. ఏడాదిలో 10 నెలలు బయటి ప్రాంతాల్లోనే ఉంటాం. భార్యాబిడ్డలు ఇక్కడే ఉంటారు. ఈ వ్యాపారం వల్ల ఆస్తులైతే కూడగట్టలేం గానీ.. దర్జాగా బతకగలుగుతాం. – కొమ్మర వెంకటేశ్వరావు, వ్యాపారి ఇదే మాకు బతుకునిస్తోంది పిల్లల భవిష్యత్ కోసం మా వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఊరగాయల్ని విక్రయిస్తుంటే.. నేను ఊళ్లోనే ఉండి పిల్లలను చూసుకుంటూ పచ్చళ్లు తయారు చేసి పంపిస్తుంటా. బ్యాంకులు అప్పులు ఇవ్వవు. వడ్డీకి తెచ్చుకుని పెట్టుబడి పెట్టుకుంటాం. – కూనపురెడ్డి సత్యవతి పచ్చడి వ్యాపారి ఉసులుమర్రు ఈ వ్యాపారం అంత సులభం కాదు ఈ వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర వ్యాపారాల మాదిరిగా పచ్చళ్ల వ్యాపారం చేయడం అంత సులభం కాదు. సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అధికారుల వేధింపులు ఎదురవుతాయి. తృణమో ఫణమో ముట్టజెప్పి ముందుకు వెళుతుంటాం. ఈ వ్యాపారానికి బ్యాంకుల సహకారం ఏమాత్రం లేదు. రుణాలిస్తే మరింత మెరుగ్గా వ్యాపారాలు చేస్తాం. పెట్టుబడి కోసం ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తోంది. వచ్చిన లాభం వడ్డీకే సరిపోతోంది. – ముత్యాల రామాంజనేయులు, వ్యాపారి -
పనసల పదనిస.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 250 కాయలు
ఇంట్లో పనస పండు ఉంటే ఎంత దాచి పెట్టినా అందరికీ తెలిసిపోతుంది. దాని ఘుమఘుమ అలాంటిది. ఇక పనస తొనల మాధుర్యం చెప్పనలవే కాదు. అటువంటి పనస పండు ఇంట్లో ఒకటుంటేనే ఎంతో సంతోషం. అవే వందల సంఖ్యలో కనిపిస్తే ఆ ఆనందమే వేరు. పనస చెట్టుకు కాయలు కాయడం సాధారణమే. అలా కాకుండా ఆరు నుంచి ఎనిమిది కాయలతో గుత్తులు గుత్తులుగా కాస్తే నిజంగా విశేషమే! పెరవలి మండలం ఖండవల్లిలో రాజు గారి చేను వద్ద రోడ్డు పక్కన ఈ పనస చెట్టు ఉంది. ఇది ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 250 కాయలు కాసింది. చెట్టు మొదలు నుంచి గుత్తులుగుత్తులుగా పై వరకూ ఉన్న కాయలు కాసిన ఈ చెట్టును అటుగా వెళ్తున్న వారు కన్నార్పకుండా చూసి, ఆనందిస్తున్నారు. ఇంతలా కాయలు కాసిన పనస చెట్టును చూడటం ఇదే మొదటిసారంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చెట్టు ఏటా కాపు కాస్తుందని, ఈ ఏడాది ఇంతలా గుత్తులుగుత్తులుగా కాయటం విశేషమేనని రైతు రాజు చెప్పారు. – పెరవలి(తూర్పుగోదావరి) చదవండి: Seshachalam Hills: మాట వినం..తాట తీస్తాం! -
అరుదైన దేవాలయం.. ఆదరణేదీ?
సాక్షి, పెరవలి (పశ్చిమ గోదావరి): మండలంలోని అన్నవరప్పాడులో పరశురాముడి ఆలయం దేశంలోనే అరుదైనది. ఇలాంటి ఆలయం కోల్‌కతలో ఒకటి, ఆ తర్వాత మళ్లీ అన్నవరప్పాడులోనే ఉంది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో వెలిసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడ పరశురాముడు పాలరాతి విగ్రహంలో ఉండగా, విగ్రహం చూస్తే మాత్రం బుద్ధుడు స్ఫురించడం విశేషం. పెద్దపెద్ద చెవులతో ఈ విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలో వివాహాలు చేసుకున్నవారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, పిల్లాపాపలతో జీవిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో ప్రత్యేక ఉత్సవం అంటూ లేకున్నా ఏటా శ్రీరామనవమికి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆ దిశగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి మా తాత ముత్తాతల నుంచి ఆలయంలో అర్చకులుగా సేవలు అందిస్తున్నాం. ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. అయితే ప్రభుత్వ ఆదరణ లేక అభివృద్ధి చెందలేదు. ఇటువంటి అరుదైన దేవాలయాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది. –వెలవలపల్లి విశ్వనాథం, అర్చకులు, అన్నవరప్పాడు -
మద్యం ఎంతైనా తాగండి, కానీ.. : డిప్యూటీ సీఎం
పెరవలి: మద్యం ఎంతైనా తాగండి అది మీఇష్టం, కానీ రోడ్డుపైకి వస్తే మాత్రం కేసులు పెడతాం అని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెరవలిలో రూ.68 లక్షలతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని శనివారం ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్రం లో శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలంటే ఇటువంటి కేసులు తప్పవన్నారు. మద్యం తాగి వాహనాలు నడపటం వలన ప్రమాదాల బారిని పడుతున్నారని, వీటి నివారణ కోసమే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు వంటివి నిర్వహిస్తున్నారన్నారు. వాహనదారులు తప్పని సరిగా హెల్మ్‌ట్ వాడాలని అది మీ రక్షణకేగానీ మా గురించి కాదన్నారు. ఈ నాలుగేళ్లలో 40 పోలీస్ స్టేషన్లకు భ వనాలు నిర్మించామని, అందులో పెరవలి పోలీస్ స్టేషన్ ఒకటన్నారు. నేరాలను అరికట్టేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ఇది మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. యువత పెడదోవ పట్టటానికి సెల్ఫోన్లు కారణమని వారికి అవి అందకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదేన్నారు. జిల్లాకు పోలీసుల కొరత: మంత్రి పితాని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు సిబ్బంది తక్కువగా ఉన్నారని, వెంటనే భర్తీ చేయాలని కోరారు. హోం మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రం మొత్తం మీద 6వేల పోస్టులు భర్తీ చేయగా అందులో జిల్లాకు 350 మందిని కేటాయించామన్నారు. అవసరమైతే మరింత మందిని పెంచుతామన్నారు. ఇంటికి తీసుకెళ్లి తాగండి : మంత్రి జవహర్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా చేశామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు. మద్యం తాగొద్దని తాము చెప్పబోమని, ఇంటికి తీసుకెళ్లి తాగాలని చూచించారు. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ప్రసంగించారు. పోలీస్ స్టేషన్ ఆ వరణలో మొక్కలు నాటారు. మంత్రులు రాజప్ప, పితాని, జవహర్, ఎస్పీ రవిప్రకాశ్‌లను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరావు, సీఐ అప్పలస్వామి, ఎస్సై పి. నాగరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు అతికాల కుసుమాంజలిరమ్యశ్రీ, ఎంపీపీ నల్లి శిరీష, సర్పంచ్ సలాది సత్యవతి, ఎంపీటీసీ సభ్యురాలు ఆగిర్తి స్వరూపారాణి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
నోరు'ఊరు'
ఆ ఊరు పేరు చెప్పగానే నోరు ఊరుతుంది. పచ్చళ్ల తయారీకి అంతగా ప్రసిద్ధి చెందింది జిల్లాలోని పెరవలి మండలం ఉసులుమర్రు. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ కొత్త పచ్చళ్ల తయారీ ఊపందుకుంటుంది. ఈ కాలంలోనే అన్ని రకాల పచ్చళ్లు పట్టి నిల్వ చేస్తారు. ఈ గ్రామంలో 2,400 మంది జనాభా ఉంటే పచ్చళ్ల తయారీపై 1,600 మంది ఆధారపడి జీవిస్తున్నారు. పెరవలి : ఏడాది పొడవునా ఉసులుమర్రులో పచ్చళ్ల అమ్మకాలు సాగిస్తారు. టమాట, ఉసిరి, అల్లం, మాగాయి, ఆవకాయ, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ, దబ్బ వంటి పచ్చళ్లకు ఈ గ్రామం పెట్టింది పేరు. ఇక్కడ తయారైన పచ్చళ్లను పట్టుకుని మగవారు హైదరాబాద్, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తిరుపతి, ఒంగోలు ప్రాంతాలకు అమ్మేందుకు బయలుదేరతారు. ఏడాదిలో 10 నెలలు వారు ఇతర ప్రాంతాల్లోనే ఉంటారు. వేసవి రెండు నెలలు మాత్రమే వారు ఇళ్ల వద్ద ఉంటారు. ఈ సమయంలో ఏడాదికి సరిపడా పచ్చళ్లు పడతారు. రుచిలో.. ఆవకాయదే అగ్రతాంబూలం పచ్చళ్లలో ఎన్ని రకాలు ఉన్నా ఆవకాయ పచ్చడి రుచి వేరు. ఈ పచ్చడి పట్టడానికి నాణ్యమైన ముదురు మామిడి కాయలు కావాలి. టెంక పట్టి ఉండాలి. దీనిని సరి సమానంగా చిన్నచిన్న ముక్కలు కోసి అందులో జీడిని తీసి ఆరబెట్టాలి. ఆ తరువాత మెత్తగా కొట్టిన ఆవపిండి, నాణ్యమైన మెంతులు, ఎర్రటి పచ్చడి కారం, వేరుశెనగ నూనె లేక నువ్వుల నూనె కావాలి. ముందుగా కారం, ఆవపిండి, మెంతులు, మెత్తని ఉప్పు కలపాలి. ఆ తర్వాత మామిడి ముక్కలను నూనెలో ముంచి ఈ కారం కలిపిన మిశ్రమంలో వేసి ముక్కకు కారం పట్టేలా చూచి జాడీలో కానీ డ్రమ్ములో గానీ వేయాలి. ఇలా వేసిన తర్వాత నూనె వేసి మూత పెట్టాలి, మూడు రోజుల తరువాత పచ్చడిని కలపాలి. అన్ని పచ్చళ్ల కంటే పండుమిరప పచ్చడి పట్టడం ఎంతో ఇబ్బంది అని గ్రామస్తులు తెలిపారు. ఒక డ్రమ్ పచ్చడి తయారవ్వాలంటే రూ.10 వేల పెట్టుబడి అవసరమని చెప్పారు. గతంలో పండుమిరప పచ్చడిని రుబ్బేవారమని, కూలీలు ఈ పనికి రాకపోవడంతో ఇప్పుడు మెషీన్‌లోనే ఆడించి కలుపుతున్నట్టు తెలిపారు. ధరలు మండిపోతున్నాయ్ గతంలో ఒక డ్రమ్ము పచ్చడికి రూ.10 వేలు సరిపోయేదని, నేడు రూ.20 వేలు అవుతోందని గ్రామంలోని తయారీదారులు చెప్పారు. నేడు మార్కెట్లో కిలో చింతపండు నాణ్యతను బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు ఉందని, అలాగే పండు మిరపకాయలు గతంలో కిలో రూ.50 ఉంటే నేడు రూ.100 ఉందని, మామిడి కాయలు టన్ను గతంలో రూ.6 వేలు ఉంటే నేడు రూ.10 వేలు అన్నా లేవన్నారు. ఆవాలు 50 కిలోల బస్తా గతంలో రూ.2 వేలు ఉంటే, నేడు రూ.2,500 అని, ఆయిల్ గతంలో కిలో రూ.70 ఉంటే నేడు రూ.100 ఉందని, వెళ్లుళ్లి పాయలు కిలో రూ.20 ఉంటే నేడు రూ.40 అని, మెంతులు కిలో రూ.40 ఉంటే నేడు రూ.60 అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల పచ్చళ్లు పట్టాలంటే రూ.రెండు లక్షల పెట్టుబడి అవసరం అని, కాలం కలసి వస్తే ఖర్చులు పోను రూ.40 వేల నుంచి రూ.50 వేలు మిగులుతుందని ఒక కుటుంబం వారు తెలిపారు. కేవలం నాణ్యతే తమ గ్రామ వ్యాపార సూత్రమని చెప్పారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు
నలుగురికి గాయాలు జాతీయ రహదారిపై ఖండవల్లి వద్ద ఘటన పెరవలి : వాహనాన్ని తప్పించబోయిన కారు డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనలో జాతీయ రహదారిపై శనివారం ఖండవల్లి వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. యానానికి చెందిన గుండుబోగుల నాగేశ్వరరావు, కడిసి లోగనాథం, ఉదయకుమార్ ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు టాటా ఇండికా కారులో యానాం నుంచి పాండిచ్చేరి బయలుదేరారు. మధ్యాహ్నం సమయంలో కారు పెరవలి మండలం ఖండవల్లి వద్దకు వచ్చేసరికి వేరే వాహనాన్ని తప్పించబోయి నక్కల కాలువ వంతెన డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. కారు ముందు భాగం నుజ్జైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నీతినాథంకు కాళ్లు, తల భాగానికి తీవ్రగాయాలయ్యాయి. కారు ముందు సీటులో కూర్చున్న ఉదయ్‌కుమార్ నడుముకి, కాళ్లకు, తలకు బలమైన గాయాలవడంతో లేవలేని స్థితిలో ఉండిపోయాడు. వెనుక కూర్చున్న మిగిలిన ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టిన వెంటనే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు పరుగున వచ్చి గాయపడిన వారిని కారులో నుంచి బయటకు తీసి సపర్యలు చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చారు. క్షతగాత్రులను 108 వాహనంలో తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెరవలి ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
విలేకరిపై ఇసుక మాఫియా హత్యాయత్నం
పశ్చిమ గోదావరి జిల్లా : తమ అక్రమాలపై కథనం ప్రసారం చేశారన్న కక్షతో ఐ న్యూస్ చానల్ విలేకరిపై ఇసుక మాఫియా హత్యాయత్నానికి తెగబడింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పిట్టల వేమవరంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ దాడిలో విలేకరితో పాటు అతని తల్లికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. సిద్ధాంతం, నడిపూడి గ్రామాల మధ్య అక్రమంగా ఇసుక ర్యాంప్ వేసి పగటిపూట మట్టిని.. రాత్రివేళ ఇసుకను కొందరు తరలిస్తున్నారు. దీనిపై ఈ నెల 1న ఐ న్యూస్‌లో కథనం ప్రసారమైంది. దీంతో ఇసుక మాఫియా రామారెడ్డిని హతమార్చేందుకు గుర్తు తెలియని నలుగురు వ్యక్తులను రంగంలోకి దించింది. వారు బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో రామారెడ్డి ఇంటికి వెళ్లారు. ఓ వ్యక్తి రామారెడ్డి ఇంటి తలుపు కొట్టి.. సిద్ధాంతంలో గొడవ జరుగుతోందని, వెంటనే రావాలని పిలిచాడు. మరికొందరు బయట ఉన్నారని చెప్పాడు. అనుమానం వచ్చిన రామారెడ్డి.. ఆ వ్యక్తిని ఇంటి లోపలి నుంచే ఫొటో తీశాడు. అనంతరం తలుపు తీయగా.. ముసుగులు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇనుప రాడ్లతో విలేకరిపై దాడి చేశారు. రెండు కాళ్లను రాడ్లతో చితక్కొట్టారు. మరో దుండగుడు రామారెడ్డి తలపై రాడ్డుతో బాదాడు. దీంతో అతను కిందపడిపోగా.. అతణ్ని గదిలోకి లాక్కెళ్లి దారుణంగా కొట్టారు. అడ్డువెళ్లిన అతని తల్లి వరలక్ష్మిపైనా దాడి చేశారు. ఇంతలో చుట్టుపక్కల వారు బయటకు రాగా.. వారిని బెదిరించి పంపేశారు. అనంతరం ఘటనాస్థలికి వచ్చిన స్థానికులు తీవ్రంగా గాయపడిన రామారెడ్డిని తణుకులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారమందుకున్న పెరవలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. -
పెళ్లి మండపం కట్టి వస్తూ పరలోకాలకు..
పెరవలి : పెళ్లి మండపం కట్టి వస్తూ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పూలవ్యాపారి మృతిచెందిన ఘటన జాతీయ రహదారిపై పెరవలి రామకృష్ణ రైస్ మిల్లు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పెరవలి మండలం కాకరపర్రు గ్రామానికి చెందిన టెక్కలి శివకుమార్ (48) పూల వ్యాపారి. వ్యాపారం నిమిత్తం తణుకులో పెళ్లి మండపం కట్టి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మోటార్‌సైకిల్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. పెరవలిలో రామకృష్ణ రైస్ మిల్లు సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు పోలీసులకు, ఎన్‌హెచ్ అం బులెన్స్‌కు సమాచారం ఇచ్చి శివకుమార్‌ను తణుకు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు పెరవలి ఎస్సై అప్పగించారు. కాకరపర్రులో విషాదఛాయలు శివకుమార్ మృతి వార్త తెలియడంతో కాకరపర్రు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శివకుమార్ అందరితో కలివిడిగా ఉండేవాడని తోటి వ్యాపారులు అన్నారు. స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడిని రోదించారు. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శివకుమార్‌కు భార్య కృష్ణవేణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల కుమార్తెకు పెళ్లి చేశాడని గ్రామస్తులు చెప్పారు. -
అంతర పంట.. లాభాల బాట
పెరవలి: కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఆ అభ్యుదయ రైతుకు అక్షరాలా సరి పోతుంది. పట్టుదల, కృషి, నమ్మకం ఉం టే పుడమితల్లి ఆదుకుంటుందని నమ్మి లాభాలను ఆర్జిస్తున్నారు పెరవలి మండ లం ముక్కామలకు చెందిన కౌలు రైతు మాకే వీరబాబు. నాలుగెకరాల కొబ్బరి తోటలో పసుపు సాగు చేపట్టి లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాగులో మెళకువలు ఆయన మాటల్లోనే.. పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మూడేళ్ల క్రితం నాలుగు ఎకరాల కొబ్బరి తోటను ఏడాదికి రూ.30 వేలు చొప్పున కౌలుకు తీసుకుని పసుపు సాగు చేపట్టాను. దిగుబడి ఆశించిన విధంగా ఉన్నప్పటికీ మార్కెట్టులో గిట్టుబాటు ధర లభించక రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. దీంతో పసుపు సాగుకు ముందు ఆకుకూరలను పండించాను. సీజన్ రాగానే పసుపు సాగు చేశాను. ఆకుకూరల ఆదాయం పెట్టుబడికి సరిపోయింది. పుట్టు పసుపు రూ.3 వేలు పసుపు ఊరటానికి ముందు చేలో మూడుసార్లు దుక్కులు దున్నాను. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 10 టన్నులు వేసి, నీరు పెట్టి విత్తనం నాటాం. అధికారులు సూచనలతో ఎరువులు వినియోగించాం. గతేడాది ఎకరానికి 50 పుట్టుల (పుట్టు అనగా 236 కిలోలు) పసుపు ఊరింది. పచ్చిపసుపు పుట్టు రూ.3 వేలు చొప్పున అమ్మాను. నష్టాలను పూడ్చుకోగలిగాను. ప్రస్తుతం పసుపు సాగు చేపట్టాం. కొబ్బరితోటల్లో అనువైన విత్తనం గోదావరి జిల్లాల్లో కస్తూరి రకం పసుపు సాగు చేస్తారు. నేను దుగ్గిరాల పసుపు వే శాను. ఈ పసుపు దిగుబడితో పాటు మార్కెట్టులో మంచి ధర లభిస్తుంది. గతేడాది పుట్టు విత్తనం పసుపు రూ.5 వేలకు కొనుగోలు చేశాను. కొబ్బరితోటల్లో దుగ్గిరాల పసుపు సాగుకు అనుకూలం. ఈ పంటకు నీడ అవసరం. ప్రస్తుతం 4 ఎకరాల్లో పసుపు సాగుకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాను. వాతారవణం అనుకూలిస్తే ఈ ఏడాది లాభాలు వస్తాయి. ఖర్చుతక్కువ లాభం ఎక్కువ కొబ్బరి తోటలో పసుపు సాగుకు పెట్టుబడి తక్కువ. చేలల్లో బోదెలు తవ్వాలి. చచ్చు ఎక్కేయాలి. ఎరువులు ఎక్కువగా వినియోగించాలి. కొబ్బరి తోటలో పసుపుకి బోదెలు, చచ్చు ఎక్కేయటం వంటి పనులుండవు. దీంతో ఎకరానికి రూ.15 వేలు వరకు ఖర్చు ఆదా అవుతుంది. ఎరువుల ఖర్చుకూడా తగ్గుతుంది. చీడపీడల సమస్య పెద్దగా ఉండదు. ఈ తోటల్లో వేసే పసుపుకి రసాయనిక ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులను ఎక్కువ వినియోగిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. -
అంతర పంట.. లాభాల బాట
పెరవలి: కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఆ అభ్యుదయ రైతుకు అక్షరాలా సరి పోతుంది. పట్టుదల, కృషి, నమ్మకం ఉం టే పుడమితల్లి ఆదుకుంటుందని నమ్మి లాభాలను ఆర్జిస్తున్నారు పెరవలి మండ లం ముక్కామలకు చెందిన కౌలు రైతు మాకే వీరబాబు. నాలుగెకరాల కొబ్బరి తోటలో పసుపు సాగు చేపట్టి లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాగులో మెళకువలు ఆయన మాటల్లోనే.. పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మూడేళ్ల క్రితం నాలుగు ఎకరాల కొబ్బరి తోటను ఏడాదికి రూ.30 వేలు చొప్పున కౌలుకు తీసుకుని పసుపు సాగు చేపట్టాను. దిగుబడి ఆశించిన విధంగా ఉన్నప్పటికీ మార్కెట్టులో గిట్టుబాటు ధర లభించక రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. దీంతో పసుపు సాగుకు ముందు ఆకుకూరలను పండించాను. సీజన్ రాగానే పసుపు సాగు చేశాను. ఆకుకూరల ఆదాయం పెట్టుబడికి సరిపోయింది. పుట్టు పసుపు రూ.3 వేలు పసుపు ఊరటానికి ముందు చేలో మూడుసార్లు దుక్కులు దున్నాను. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 10 టన్నులు వేసి, నీరు పెట్టి విత్తనం నాటాం. అధికారులు సూచనలతో ఎరువులు వినియోగించాం. గతేడాది ఎకరానికి 50 పుట్టుల (పుట్టు అనగా 236 కిలోలు) పసుపు ఊరింది. పచ్చిపసుపు పుట్టు రూ.3 వేలు చొప్పున అమ్మాను. నష్టాలను పూడ్చుకోగలిగాను. ప్రస్తుతం పసుపు సాగు చేపట్టాం. కొబ్బరితోటల్లో అనువైన విత్తనం గోదావరి జిల్లాల్లో కస్తూరి రకం పసుపు సాగు చేస్తారు. నేను దుగ్గిరాల పసుపు వే శాను. ఈ పసుపు దిగుబడితో పాటు మార్కెట్టులో మంచి ధర లభిస్తుంది. గతేడాది పుట్టు విత్తనం పసుపు రూ.5 వేలకు కొనుగోలు చేశాను. కొబ్బరితోటల్లో దుగ్గిరాల పసుపు సాగుకు అనుకూలం. ఈ పంటకు నీడ అవసరం. ప్రస్తుతం 4 ఎకరాల్లో పసుపు సాగుకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాను. వాతారవణం అనుకూలిస్తే ఈ ఏడాది లాభాలు వస్తాయి. ఖర్చుతక్కువ లాభం ఎక్కువ కొబ్బరి తోటలో పసుపు సాగుకు పెట్టుబడి తక్కువ. చేలల్లో బోదెలు తవ్వాలి. చచ్చు ఎక్కేయాలి. ఎరువులు ఎక్కువగా వినియోగించాలి. కొబ్బరి తోటలో పసుపుకి బోదెలు, చచ్చు ఎక్కేయటం వంటి పనులుండవు. దీంతో ఎకరానికి రూ.15 వేలు వరకు ఖర్చు ఆదా అవుతుంది. ఎరువుల ఖర్చుకూడా తగ్గుతుంది. చీడపీడల సమస్య పెద్దగా ఉండదు. ఈ తోటల్లో వేసే పసుపుకి రసాయనిక ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులను ఎక్కువ వినియోగిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. -
కాలువలో దూకి దంపతుల ఆత్మహత్యాయత్నం
పెరవలి (పశ్చిమ గోదావరి): పంట కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలోని బ్యాంకు కెనాల్లో దూకి ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతూ పోలీసులకు సమాచారం అదించారు. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
బెల్టుషాపులో వ్యక్తి అనుమానాస్పద మృతి
పెరవలి : బెల్టుషాపు వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పెరవలిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెరవలి జాతీయ రహదారి పక్కన ఉన్న మద్యం దుకాణానికి గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు పెరవలికి చెందిన మానేపల్లిచంద్రశేఖర్(45) వచ్చాడు. మద్యం కొని తాగి అక్కడే ఉన్న బల్లపై పడుకున్నాడు. కొద్దిసేపు అటుఇటు దొర్లి, కిందపడ్డాడు. అయినా దుకాణ సిబ్బంది పట్టించుకోలేదు. నిద్రపోయాడనుకుని సిబ్బంది వెళ్లిపోయారు. మళ్లీ ఉదయం వచ్చి చూసేసరికి అక్కడే బల్ల వద్ద చంద్రశేఖర్ పడి ఉండడంతో అనుమానం వచ్చిన వారు అతడిని లేపగా లేవలేదు. దీంతో చనిపోయాడని నిర్ధారించుకుని పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న బంధువులు మృతదేహాన్ని చూసి కొట్టి చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కొద్దిసేపు బెల్టుషాపు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. నిర్వాహకులు తమకేమీ సంబంధం లేదని, మద్యం ఇవ్వబోమని చెప్పినా.. వినలేదని, తప్పక ఇచ్చామని చెప్పారు. పోలీసులు ఇరువర్గాల వాదనలు విన్నారు. దీంతో షాపు వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బెల్టుషాపు నిర్వాహకులు, మృతుడి బంధువులు గ్రామ పెద్దల వద్దకు వెళ్లి ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. బెల్టుషాపునకు అనుమతి లేకున్నా.. యథేచ్ఛగా నిర్వహించడం, అర్ధరాత్రి మద్యం అమ్మకూడదని నిబంధన ఉన్నా.. పాటించకపోవడం నేరమని పెరవలి ఎస్సై పి.నాగరాజు చెప్పారు. చంద్రశేఖర్ ఎలా చనిపోయాడనేది పోస్టుమార్టం నివేదికలో తేలుతుందని వివరించారు. బెల్టుషాపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బెల్టుషాపులను నియంత్రించాలి : డయల్ యువర్ ఎస్పీలో పలువురి వినతి ఏలూరు అర్బన్ : జిల్లాలో బెల్టుషాపులను నియంత్రించాలని పలువురు ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను కోరారు. శుక్రవారం డయల్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన జిల్లా వాసులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి ప్రజలు ఫోన్ చేసి బెల్టుషాపుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటిని నియంత్రించాలని కోరారు. దీనికి స్పందించిన ఎస్పీ ఎక్సైజ్ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి ఆ షాపులను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. ఇంకొందరు గణపతి lనిమజ్జనాలకు ఏర్పాట్లు బాగా చేశారని ఎస్పీని అభినందించారు. ఏలూరు నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి స్థానిక ఫత్తేబాదలో రోడ్డుపై భవన నిర్మాణ సామగ్రి నిలువ వల్ల రాకపోకలకు ఇబ్బందులు çకలుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులపై జంగారెడ్డిగూడెం నుంచి మరొకరు ఫిర్యాదు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కావడం లేదని గణపవరం వాసి చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 25 మంది ఫోన్ చేసి వారి సమస్యలు విన్నవించారు. -
జాతీయ రహదారిపై మూడు ఫ్లైఓవర్లు
ఉంగుటూరు : జాతీయ రహదారిపై జిల్లాలో మూడు చోట్ల ఫ్లైఓవర్లు (వంతెనలు) నిర్మించేందుకు హైవే అధికారులు కసరత్తు చేస్తున్నారు. కైకరం, తేతలి, పెరవలి గ్రామాలను ప్రమాదాల జోన్లుగా (బ్లాక్ స్పాట్) గుర్తించారు. దీనిపై అధికారులు ఆయా ప్రాంతాల్లో సర్వే చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటీకే జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణ కోసం సోలార్ వింకర్లును ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏలూరు కాలువ గట్టు వెంబడి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు కసరుత్తు చేస్తున్నారు. ఇప్పటికే తణుకు నుంచి ఉంగుటూరు నియోజకవర్గంలోని గుండుగొలను వరకు ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు నోటీసులు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా బ్లాక్‌స్పాట్‌గా గుర్తించిన మూడు గ్రామాల వద్ద ఫ్లైఓవర్లు నిర్మించాలని నిర్ణయించినట్టు సమాచారం. -
జలయుద్ధం !
పెరవలి/పెనుగొండ : ‘గోదావరిలో నిండుగా నీరున్నా.. వరదనీరు సముద్రం పాలవుతున్నా.. సాగునీరు అందక జిల్లాలో నారుమళ్లు ఎండిపోతున్నాయి. ముందస్తు సాగు అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం సాగునీరు అందించడం లేదని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు’ అంటూ ఎమ్మెల్యేలు, నీటి సంఘాల అధ్యక్షులు అధికారులపై ధ్వజమెత్తారు. పంట విరామానికి సైతం రైతులు సిద్ధపడుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో సాగునీరందక రైతులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన వరుస కథనాలకు అధికార యంత్రాంగం కదిలింది. కలెక్టర్ కాంటంనేని భాస్కర్ గతంలో ఎన్నడూలేనివిధంగా హడావుడిగా పెరవలి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నీటిపారుదల సలహా సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిడదవోలు, పాల కొల్లు, తణుకు, నరసాపురం ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, నిమ్మలరామానాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణ, బండారుమాధవ నాయుడు పాల్గొన్నారు. వీరి మధ్య పరోక్షంగా అభిప్రాయభేదాలు పొడచూపాయి. ఇవి నీటి యుద్ధానికి తెరలేపాయి. అధికారుల తీరుపైనా ఎమ్మెల్యేలు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. డెల్టా ప్రాంత ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు, ఆరుమిల్లి రాధాకృష్ణ తమ నియోజకవర్గాల్లోని పొలాలకు నీరు అందట్లేదని ధ్వజమెత్తారు. నిడవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తమ ప్రాంతంలోని కాలువల్లో నీళ్లు పొంగిపొర్లుతున్నాయని గట్లు తెగిపోతాయేమోనని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా దాళ్వాలో సాగునీటి ఇబ్బందులు ఉంటాయని, ఈ సారి అధికారుల ప్రణాళికా, సమన్వయ లోపాల వల్ల సార్వాలోనూ కష్టాలు తప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీలో ఉన్నందున రోడ్డెక్కలేకపోతున్నామని, చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వస్తోందని, రైతులకు ఎలా సమాధానం చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరూరా తిరిగి ముందస్తు సాగు చేయాలని ఆర్భాటంగా ప్రచారం చేశామని, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో ఏరువాక ప్రారంభించారని, చివరకు ఇలా అభాసుపాలు కావాల్సి వచ్చిందని బాధను వెళ్లగక్కారు. నారుమడులు వేసి 30 రోజులు దాటుతున్నా.. నాట్లు వేయలేని దుస్థితిలో రైతులు ఉన్నారని ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ దశలో రైతులను ఆదుకోకపోతే ఎమ్మెల్యేలుగా కొనసాగడం అర్థరహితమని పేర్కొన్నారు. పాఠాలు నేర్పుతున్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. తమకూ రైతుగా అనుభవం ఉందని, అయినా అధికారులు పాఠాలు నేర్పుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రధాన కాలువలోనీటి మట్టం గతంలో ఎన్నడూ లేనంతగా 6.6 అడుగుల ఎఫ్ఎస్ఎల్ కొనసాగిస్తున్నామంటూ అధికారులు చెప్పడాన్ని ఆయన ఖండించారు. పంటకాలువలకు నీరు ఇవ్వకుండా నీటి మట్టాన్ని నిలబెడితే ఉపయోగమేమిటని ప్రశ్నించారు. దాళ్వాలోనే పాలకొల్లు నియోజకవర్గంలో 8 వేల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారని, వారికి సార్వాలోనూ నీరివ్వకుంటే తాము గ్రామాల్లో తిరగలేమని స్పష్టం చేశారు. నర్సాపురం కాలువ పరిధిలోని జిన్నూరు చానల్‌కు 180 క్యూసెక్కులు ఇవ్వాల్సి ఉండగా.. 140 క్యూసెక్కులు, చించినాడకు 170 క్యూసెక్కులకు గాను 100 క్యూసెక్కులు, దిగమర్రుకు 150 క్యూసెక్కులకు గాను 90 క్యూసెక్కులు నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారని వివరించారు. ఏమిటీ నియామకాలు నీటి పారుదల శాఖలో అధికారుల నియామకాలపై తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ విరుచుకుపడ్డారు. అనుభవంలేని అధికారులను డెల్టాలో నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేని అధికారులను ఇక్కడ నియమించారని మండిపడ్డారు. అత్తిలి, రాపాక చానల్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. మూడురోజుల్లో పరిష్కారం సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ.. అధికారుల సమన్వయలోపంతోపాటు జిల్లాలో ముందస్తు సాగుకు ఒకేసారి రైతులందరూ సిద్ధం కావడం వల్లే సాగునీటి సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. గతంలో ఖరీఫ్ సాగు రెండు భాగాలుగా జరిగేదని, డెల్టాకు, అప్లాండ్ ప్రాంతానికి కనీసం 20 నుంచి 30 రోజుల కాలవ్యవధి ఉండేదని వివరించారు. అయితే.. నవంబరులో వచ్చే తుపాన్ల బెడద నుంచి రైతులను తప్పించాలనే ఉద్దేశంతో ముందస్తు సాగు విధానాన్ని ప్రచారం చేశామని, రైతులందరూ ఒకేసారి సాగుకు సిద్ధం కావడం ఈ మధ్యలో 15 రోజులపాటు వర్షాలు లేకపోవడంతో నీటి ఎద్దడి తలెత్తిందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడురోజుల్లో సమస్యను పరిష్కారిస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రానివ్వనని స్పష్టం చేశారు. సమీక్షకు దూరంగా ఎమ్మెల్యే పితాని సమీక్ష సమావేశానికి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఇటీవల పితాని తన నియోజకవర్గ ఇరిగేషన్ అధికారులతో సమావేశమై నీటి సమస్యపై చర్చించినా పరిష్కారం కాలేదు. దీనివల్లే ఆయన ప్రస్తుత జిల్లా సమావేశానికి గైర్హాజరయ్యారని తెలుస్తోంది. పైగా ముందస్తు సాగుకు తగ్గట్టుగా ప్రణాళిక వేయడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న భావనతో ఆయన దూరంగా ఉన్నట్టు సమాచారం. క్యాలెండరు ప్రకారం పనులు నిర్వహించాలి కాగా, కాలువల నిర్వహణపై ప్రభుత్వం, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలకు నీటిని నిలుపుదల చేసిన సమయంలో పనులు చేపట్టకుండా కాలువలకు నీటిని వదిలే సమయంలో పనులుచేపట్టి మధ్యలో నిలిపివేస్తూ నిధులు దండుకొంటున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి క్యాలెండరు ప్రకారం పనులు నిర్వహించాలని పలువురు డిమాండ్ చేశారు. లాకులు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యా నరసాపురం ప్రధాన కాలువ పరిధిలోని ఎమ్మెల్యేల మధ్య జల జగడం రేగింది. ఎగువ ప్రాంత ఎమ్మెల్యేలు దిగువకు నీరు రాకుండా అడ్డుపడుతున్నారని, దీంతో పాలకొల్లు లాకులు బద్దలు కొట్టడానికి వెయ్యి మంది రైతులతో కలిసి సిద్ధమయ్యాయని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సమావేశంలో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలను బహిర్గతం చేసింది. తన నియోజకవర్గంలోని మొగల్తూరు మండలం కొత్తపాలెం, ఖాళీపట్నంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల్లో నీటి మట్టాలు లేకపోవడంతో ఉన్న నీటిలో ఉప్పుశాతం పెరిగిపోయిందని వివరించారు. బూరుగుపల్లితో రైతుల వాగ్వాదం నిడదవోలు నియోజకవర్గంలోని కాలువల్లో నీళ్లు పొంగిపొర్లుతున్నాయని, దీనివల్ల చేలు మునిగిపోతున్నాయని అక్కడి ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు చెప్పారు. దిగువ రైతుల శ్రేయస్సు కోసం తమ రైతులు త్యాగాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో పాలకొల్లు నియోజకవర్గ నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు శేషారావుతో వాగ్వాదానికి దిగారు. పెరవలిలో లాకుల వద్ద రెండు అడ్డంకులు ఉన్నందునే దిగువ ప్రాంతాల రైతులకు నీళ్లు అందడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు ఎస్ఈ కె.శ్రీనివాసులు, సీఈ ఎస్హరిబాబు, ఈఈ జి.శ్రీనివాసరావు, జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, ఆర్డీవో బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అంతా మా ఇష్టం..
అధికారం మాది..ర్యాంపు వేసి తీరుతాం టీడీపీ నాయకుల ధీమా కేసు పెట్టినా తగ్గని వైనం ఉసులుమర్రు(పెరవలి) : అంతా మా ఇష్టం.. అధికారం మాది. మేం ఏదైనా చేస్తాం. ఎవరడ్డొచ్చినా ఉసులుపర్రు వద్ద ర్యాంపు ఏర్పాటు చేసి తీరతాం అనే ధోరణిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉసులుపర్రు వద్ద గోదావరి ఏటిగట్టును ధ్వంసం చేసి ఇసుక ర్యాంపునకు బాట వేసేందుకు పనిని మొదలుపెట్టిన వారు గోదావరి కన్వర్జన్సీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆగలేదు. 11 మందిపై కేసు పెట్టినా ర్యాంపునకు బాట వేసే పనిని ఆపలేదు. గత రెండురోజులుగా ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇవి పూర్తయితే శుక్రవారం నుంచి లేదా శనివారం నుంచి ఇసుక ఎగుమతులకు టీడీపీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. వీరికి స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉండడం వల్లే వారు జంకూగొంకూ లేకుండా పనులు చేసుకుపోతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి సిఫారసు వల్లే ఏటిగట్టును ధ్వంసం చేసిన ఘటనలో చట్టప్రకారం నాన్‌బెయిలబుల్ కేసులు నమోదుచేయాల్సి ఉండగా, పోలీసులు సాదాసీదాగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఏటిగట్టును ధ్వంసం చేయడం వల్ల వరదలు వస్తే పెనుప్రమాదం సంభవిస్తుందని తెలిసినా.. నాయకులు స్వార్థంతో ర్యాంపు ఏర్పాటును ఆపడం లేదు. కలెక్టర్ భాస్కర్ బుధవారం జిల్లాలో 10 రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. మిగతా చోట్ల ఇసుక తవ్వితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను కూడా స్థానిక టీడీపీ నాయకులు ఖాతరు చేయడం లేదు. కలెక్టర్ చెప్పిన ప్రకారం.. మండలంలోని కానూరు ర్యాంపునకు మాత్రమే అనుమతులు ఉన్నట్టు తెలుస్తోంది. తీపర్రు ర్యాంపునకు కూడా అనుమతులు లేవని, అలాంటిది ఉసులుమర్రు వద్ద ర్యాంపు ఏర్పాటు చేయడం ప్రమాదకరమని స్థానికులతోపాటు అధికారులూ చెబుతున్నారు. అయినా టీడీపీ నాయకులు ఏమాత్రం పట్టించుకోకుండా బాట పనులు చేయిస్తున్నారు. దీనిపై గోదావరి కన్వర్జన్సీ ఏఈ ఎన్.వి.సత్యనారాయణరాజును వివరణ కోరగా ముందు ఇచ్చిన ఫిర్యాదుతోపాటు పోలీసులకు తాజాగా మరో ఫిర్యాదు కూడా ఇచ్చామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామని వెల్లడించారు. -
మహిళ దారుణ హత్య
మద్దికెర(కర్నూలు జిల్లా): మద్దికెర మండలం పెరవలి గ్రామం బీసీ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన ఎరుకల దుర్గమ్మ(45) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో - లారీ ఢీ: 8 మందికి గాయాలు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కడింపాడు వద్ద జాతీయ రహదాపై శనివారం ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను అధిక వేగంతో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
రైతు నెత్తిన వడ్డీ భారం
పెరవలి:రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ విషయూన్ని ఏటూ తేల్చకపోవడంతో రైతులకు అసలుకే మోసం వస్తోంది. వడ్డీలేని రుణాలు తీసుకున్న అన్నదాత లకు ఇప్పుడు ఆ మొత్తాలపై 7 శాతం వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి దాపురించింది. దీర్ఘకాలిక (ఎల్టీ) రుణాలపై 16 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోవడం వల్ల రైతులు రాయితీ కోల్పోవడంతోపాటు తీసుకున్న మొత్తంపై వడ్డీతోపాటు అపరాధ వడ్డీ, ఇతర చార్జీలు చెల్లించక తప్పదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు అందుతున్న నోటీసులు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిం చాయి. రైతులంతా బ్యాంకర్లను నిలదీయడంతో నోటీసులు ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేసి రైతుల సెల్ఫోన్లకు మెసేజిలు పంపిస్తున్నారు. హడలిపోతున్న అన్నదాతలు వ్యవసాయ రుణాలకు సంబంధించి వడ్డీలు, ఇతర చార్జీలతో కలిపి ఎంతకట్టాలనే విషయూన్ని తెలుసుకుంటున్న రైతులు హడలి పోతున్నారు. జిల్లాలో వ్యవసాయ అవసరాల కోసం సుమారు 14లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. వీరిలో సుమారు 5లక్షల మంది పంట రుణాలు (క్రాప్ లోన్లు) తీసుకోగా, మరో 3 లక్షల మంది దీర్ఘకాలిక (ఎల్టీ) రుణాలు పొందారు. మిగిలిన 6 లక్షల మంది బంగార నగలను తనఖాపెట్టి రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం పూటకో ప్రకటన.. రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తూ రైతులను అయోమయంలోకి నెట్టేస్తోంది. ఈ పరిస్థితుల్లో పాత రుణాలు కట్టలేక.. కొత్త రుణాలు దక్కక రైతులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. రుణమాఫీ సంగతి దేవుడెరుగు ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ రాయితీ కూడా కోల్పోవాల్సి రావడంతో గగ్గోలు పెడుతున్నారు. వడ్డీలేని వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు ఆ మొత్తాలను గడచిన మే 1వ తేదీలోపు చెల్లించాల్సి ఉంది. రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో నేటికీ ఆ మొత్తాలను చెల్లించలేకపోయూరు. వారంతా ఇప్పుడు 7.50 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉందని బ్యాంకుల నుంచి నోటీసులు, మెసేజిలు వస్తున్నాయి. రుణం తీసుకున్న ఏడాదిలోపు ఆ మొత్తాన్ని చెల్లిస్తే 6 శాతం వడ్డీ రాయితీ లభించేది. దీనివల్ల రైతులు తీసుకున్న అప్పు మొత్తం చెల్లిస్తే సరిపోయేది. అలా చేయకపోవడంతో 7.50 శాతం వడ్డీతోపాటు నోటీసు ఖర్చులు, ఈపీ (జప్తు నోటీసు) ఖర్చుల రూపంలో వెరుు్యకి రూ.10 చొప్పున అదనంగా చెల్లించాల్సి వస్తోంది. రైతులపై ఇప్పటికిప్పుడు రూ.175.40 కోట్ల భారం జిల్లాలో డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా రూ.1,030.84 కోట్లను వ్యవసాయ రుణాలుగా ఇవ్వగా, వాణిజ్య బ్యాంకులు రూ.600 కోట్ల మేర రుణాలిచ్చాయి. మరోవైపు సహకార సంఘాల ద్వారా గేదెలు, మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లు వంటివి కొనుగోలు చేసేందుకు రైతులు తీసుకున్న దీర్ఘకాలిక (ఎల్టీ) రుణాలు జిల్లాలో రూ.360.98 కోట్ల మేర ఉన్నాయి. ఈ మొత్తాలను ఇప్పటికిప్పుడు చెల్లిస్తే వడ్డీ, అపరాధ రుసుం రూపంలో జిల్లా రైతులు కనీసం రూ.175.40 కోట్ల అదనపు భారం మోయూల్సి వస్తుందని అంచనా. దీనికి నోటీసు ఖర్చులు, జప్తు నోటీసు ఖర్చులు అదనం. వడ్డీతో కట్టాలని నోటీస్ వచ్చింది వ్యవసాయ పెట్టుబడుల కోసం సొసైటీలో లోన్ తీసుకున్నాను. ఏటా సకాలంలో కట్టేవాణ్ణి. దీనివల్ల వడ్డీ భారం ఉండేది కాదు. రుణమాఫీ చేస్తారనే ఉద్దేశంతో ఈ ఏడాది రుణం కట్టకుండా మానేశాను. ఇప్పుడు 7.50 శాతం వడ్డీతో అప్పు మొత్తం కట్టాలని బ్యాంకు నుంచి నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడేం చేయూలో అర్థం కావడం లేదు. చంద్రబాబును నమ్మడం వల్ల వడ్డీలేని రుణానికి ఇప్పుడు వడ్డీ కట్టాల్సి వస్తోంది. - యాండ్ర నరసింహమూర్తి, రైతు, కడింపాడు గోరుచుట్టుపై రోకలి పోటులా... గత ఏడాది సొసైటీలో రూ.లక్ష రుణం తీసుకున్నాను. రుణమాఫీ చేస్తే అప్పులు తీరతాయని ఆశపడ్డాను. కానీ మాఫీ కాలేదు. వెంటనే అప్పు మొత్తం వడ్డీతో కలిపి కట్టాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈసారి వడ్డీ రారుుతీ ఉండదని, అపరాధ వడ్డీతో కలిపి రుణం మొత్తం కట్టాలంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. కొత్త అప్పు పుట్టడం లేదు. పాత అప్పు తీర్చే పరిస్థితి కనిపించడం లేదు. - మద్దిపాటి సత్యం, రైతు, ముక్కామల సబ్సిడీ పోయి వడ్డీ తగిలింది చంద్రబాబు మాట నమ్మి రుణం కట్టలేదు. ఎల్టీ రుణంగా రూ.లక్ష తీసుకున్నాను. ఏటా వాయిదా కట్టేవాణ్ణి. మాఫీ అవుతుం దనే ధీమాతో రుణం కట్టకపోవడంతో ఇప్పుడు వడ్డీతోపాటు ఈ రుణంపై ఇచ్చే సబ్సిడీ కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఎన్నికల సమయంలో ఓట్లకోసం మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. అసలుతోపాటు సబ్సిడీ కూడా పోరుు వడ్డీ తగిలిందన్నట్టుగా ఉంది మా పరిస్థితి. ఏం చేయాలో తెలియడం లేదు. -గండేపల్లి రామకృష్ణ, రైతు, ముక్కామల నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు మూడేళ్లుగా వరదలు, తుపాన్లతో పంటలు కోల్పోయాను. బ్యాంకులో రూ.లక్ష రుణం తీసుకున్నాను. మాఫీ అవుతుం దనే నమ్మకంతో ఉన్నాను. పరిస్థితుల్ని చూస్తుంటే రుణం మాఫీ అయ్యేలా లేదు. కొత్త అప్పు పుట్టడం లేదు. పంటలు వేయడానికి చేతిలో దమ్మిడీ కూడా లేక అవస్థలు పడుతున్నాం. మాయమాటలకు మోసపోయామని అనిపిస్తోంది. ఇంత నమ్మక ద్రోహం చేస్తారని కలలో కూడా ఊహించలేదు. -పులపర్తి సూర్యనారాయణ, రైతు, అన్నవరప్పాడు -
జాడ లేని హర్యానా గేదెలు
పెరవలి, న్యూస్‌లైన్ : ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటంలో ఉన్న ఉత్సాహం ఆచరణలో ఉండడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. అధిక పాలనిచ్చే హర్యానా గేదెలను సబ్సిడీపై అందిస్తామని చెప్పి సొమ్ములు కట్టించుకుని రెండు నెలలు గడుస్తున్నా వాటిని తీసుకురాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రెండు నెలల క్రితం ఈ పథకం గురించి వ్యవసాయ అధికారులు, సిబ్బంది ఊదరగొట్టడంతో సుమారు 170 మంది రైతులు ఒక్కో గేదెకు రూ. 20 వేల చొప్పున డీడీలు తీసి పశుసంవర్థక శాఖ అధికారులకు అందించారు. 15 రోజుల్లో గేదెలు వస్తాయని చెప్పిన అధికారులు రెండు నెలలు గడిచినా వాటి గురించి పట్టించుకోకపోవడంతో రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సొమ్ములు వసూలు చేసే వరకు నానా హంగామా చేసిన అధికారులు డీడీలు చేతికొచ్చిన తరువాత గేదెల గురించి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. హర్యానా నుంచి గేదెలు తీసుకురావడానికి శీతాకాలమే అనువైన సమయమని, వేసవిలో తీసుకువచ్చేందుకు వాతావరణం అనుకూలం కాదని, అవి తట్టుకోలేవని రైతులకు వివరించి మరీ అధికారులు వారిచే డీడీలు తీయించారు. శీతాకాలం పూర్తవుతున్నా హర్యానా గేదెలు జిల్లాకు చేరకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. దీంతో వారు స్థానిక పశువైద్యాధికారులను నిలదీస్తున్నారు. అధికారులు చెప్పిన మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉండని రైతులు జక్కంశెట్టి సుబ్బయ్య, చోడపునీడి బల రాముడు, సి.వెంకటేశ్వరరావు ‘న్యూస్‌లైన్’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి రూ.20 వేలు డీడీలు కట్టామని 15 రోజుల్లో గేదెలు వస్తాయని చెబితే నమ్మామని ఇప్పటి వరకు ఆ మాటేలేదని తెలిపారు. అప్పుకు వడ్డీ పెరుగుతోంది తప్ప గేదెలు మాత్రం నేటికీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
కానిస్టేబుల్‌పై ఇనపరాడ్డుతో దాడి
పెరవలి, న్యూస్‌లైన్ : పెరవలి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌పై గురువారం అర్థరాత్రి ఒంటిగంటకు ఓ ఫిర్యాదీ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వివరాలు ఇవి.. కాపవరం గ్రామానికి చెందిన మేడిద ముత్యాలరావు(50) ఇంట్లో భార్య, కుమారుడితో గొడవ పడి గురువారం రాత్రి 11 గంటలకు పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తన భార్య, కుమారుడు తనను చంపేయడానికి ప్రయత్నిస్తున్నారని, వెంటనే చర్య తీసుకోమని కోరాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఎ.మోహన్‌రావు ఫిర్యాదు రాసివ్వమని కాగితం ఇచ్చాడు. ఇంతలో అతని భార్య, కుమారుడు స్టేషన్‌కు వచ్చి ముత్యాలరావు తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని, రక్షణ కల్పించమని కోరారు. వారికి కూడా ఫిర్యాదు రాసిఇవ్వమని కాగితం ఇచ్చాడు మోహనరావు. తాము చదువుకోలేదని ఫిర్యాదు రేపు ఇస్తామని చెప్పి వారు వెళ్లిపోయారు. ముత్యాలరావు మాత్రం కాగితం మీద సంతకం పెడుతున్నానని, నీ ఇష్టం వచ్చింది రాసుకుని వారిపై చర్య తీసుకోమని కానిస్టేబుల్‌కు చెప్పాడు. రేపు ఉదయం రమ్మని అతనికి నచ్చజెప్పి పంపేశాడు. అర్థరాత్రి ఒంటి గంటకు ముత్యాలరావు ఇనుపరాడ్డుతో స్టేషన్‌కు వచ్చాడు. మళ్లీ ఎందుకు వచ్చావని మోహనరావు ప్రశ్నించగా ఇందాక ఇచ్చిన ఫిర్యాదుపై చర్య తీసుకోలేదేంటి? నువ్వేం చేస్తున్నావు? నా సంగతి నీకు తెలియదు అని హెచ్చరించాడు. అదే సమయంలో ఫోన్ రావడంతో మోహనరావు ఫోన్ మాట్లాడుతుండగా తలుపు తీసుకుని వచ్చిన ముత్యాలరావు ఇనుపరాడ్డుతో అతని తలపై కొట్టబోయాడు. మోహనరావు పక్కకు తప్పుకోవటంతో ఆ దెబ్బ భుజంపై పడింది. రెండో దెబ్బ వేస్తుండగా చేతిని అడ్డుపెట్టుకోవటంతో చేతిలో ఉన్న సెల్‌ఫోన్ ముక్కలైంది. మూడోసారి వేసినప్పుడు ఇనుపరాడ్డును పట్టుకున్నాడు. ఈ గలాటాకు స్టేషన్ ఎదురుగా ఉన్న ఇంట్లో వ్యక్తి స్టేషన్‌కు వెళ్ళగా కానిస్టేబుల్ ఎస్సైకి ఫోన్ చేయమని చెప్పడంతో అతను ఫోన్ చేశాడు. గస్తీకి వెళ్ళిన ఎస్సై ఎంవీఎస్ఎస్ మూర్తి వెంటనే స్టేషన్‌కు వచ్చి ముత్యాలరావును పట్టుకొనే లోపు అంద ర్ని నెట్టేసి అతను పారిపోయాడు. మోహన్‌రావును వెంటనే ప్రభుత్వాసపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి కేసు నమోదుచేశామని ఎస్సై తెలిపారు. మోహన్‌రావు యువకుడు, బలిష్టంగా ఉండటం వల్ల ఇనుపరాడ్డు దెబ్బలకు తట్టుకోగలిగాడని, తలపై తగిలి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదోనని చెప్పారు.