ఆటో - లారీ ఢీ: 8 మందికి గాయాలు | 8 injured in road accident, west godavari district | Sakshi
Sakshi News home page

ఆటో - లారీ ఢీ: 8 మందికి గాయాలు

Published Sat, Apr 11 2015 8:55 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

8 injured in road accident, west godavari district

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కడింపాడు వద్ద జాతీయ రహదాపై శనివారం ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను అధిక వేగంతో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement