డివైడర్‌ను ఢీకొట్టిన కారు | car hit the divider | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొట్టిన కారు

Published Sun, Sep 10 2017 12:11 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

car hit the divider

నలుగురికి గాయాలు
 జాతీయ రహదారిపై ఖండవల్లి వద్ద ఘటన
పెరవలి : వాహనాన్ని తప్పించబోయిన కారు డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనలో జాతీయ రహదారిపై శనివారం ఖండవల్లి వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. యానానికి చెందిన గుండుబోగుల నాగేశ్వరరావు, కడిసి లోగనాథం, ఉదయకుమార్‌ ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు టాటా ఇండికా కారులో యానాం నుంచి పాండిచ్చేరి బయలుదేరారు. మధ్యాహ్నం సమయంలో కారు పెరవలి మండలం ఖండవల్లి వద్దకు వచ్చేసరికి వేరే వాహనాన్ని తప్పించబోయి నక్కల కాలువ వంతెన డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. కారు ముందు భాగం నుజ్జైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ నీతినాథంకు కాళ్లు, తల భాగానికి తీవ్రగాయాలయ్యాయి. కారు ముందు సీటులో కూర్చున్న ఉదయ్‌కుమార్‌ నడుముకి, కాళ్లకు, తలకు బలమైన గాయాలవడంతో లేవలేని స్థితిలో ఉండిపోయాడు. వెనుక కూర్చున్న మిగిలిన ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టిన వెంటనే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు పరుగున వచ్చి గాయపడిన వారిని కారులో నుంచి బయటకు తీసి సపర్యలు చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చారు. క్షతగాత్రులను 108 వాహనంలో తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెరవలి ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement