panasakaya
-
బ్రెడ్‌ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?
బ్రెడ్‌ఫ్రూట్ (ఆర్టోకార్పస్ ఆల్టిలిస్) చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. పనస, బ్రెడ్నట్, అంజీర, మల్బరీలకు దగ్గరి జాతికి చెందినదే. తెలుగులో ‘సీమ పనస’, ‘కూర పనస’ అంటారు. ఫిలిప్పీన్స్, న్యూగినియా, మలుకు దీవులు, కరిబియన్ దీవుల ప్రాంతం దీని పుట్టిల్లు. ఇప్పుడు దక్షిణాసియా, ఈశాన్య ఆసియా, పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలు, కరిబియన్, సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో సాగవుతోంది. ఈ చెట్లకు కాచే కాయలు లేత ఆకుపచ్చని రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కాయలనే (పండుగా కాదు) అనేక రూపాల్లో తింటూ ఉంటారు. పసిఫిక్ దీవుల్లోని ప్రజలు అనాదిగా దీన్ని బ్రెడ్ లేదా బంగాళ దుంపల మాదిరిగా దైనందిన ఆహారంగా తింటున్నారు. బ్రెడ్‌ఫ్రూట్ చెట్లలో విత్తనాలు ఉన్న, లేని రెండు రకాలున్నాయి. ఈ చెట్టు 26 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. అదే చెట్టుకు ఆడ, మగ పూలు పూస్తాయి. లేతగా ఉన్నప్పు లేత ఆకుపచ్చగా, పండినప్పుడు ముదురు పసుపు రంగులో దీని కాయలు ఉంటాయి. తొక్కపైన చిన్నపాటి బుడిపెలు ఉంటాయి. లోపలి గుజ్జు లేత గోధుమ రంగులో చక్కని వాసనతో కొంచెం తియ్యగా ఉంటుంది. దీని కాయలు కిలో నుంచి 5 కిలోల వరకు బరువు పెరుగుతాయి. పోషక విలువలుబ్రెడ్ఫ్రూట్ తినగానే జీర్ణమైపోయేది కాదు. నెమ్మదిగా అరుగుతుంది. దీనిలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు, జీర్ణమయ్యే పీచుపదార్థం, ముఖ్యమైన విటమిన్లు, విటమిన్ సి, పొటాషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లకు కూడా ఇది నెలవు. ఉత్పాదకత, సుస్థిరతఎదిగిన ఒక బ్రెడ్‌ఫ్రూట్ చెట్టు ఏడాదికి 200 కిలోలకు పైగా కాయలు కాస్తుంది. నాటిన తర్వాత వేరూనుకొని బతికితే చాలు. తర్వాత ఢోకా ఉండదు. మొండిగా పెరిగి, కాయలనిస్తుంది. ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని, నిస్సారమైన భూముల్లోనూ బతుకుతుంది. అందువల్లే ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రజలకు కరువు కాలాల్లో కూడా సుస్థిరంగా ఆహారాన్ని అందిస్తుంది. ఎన్నో రకాలుగా తినొచ్చుబ్రెడ్ఫ్రూట్ను పచ్చిగా, లేతగా, పండుగా.. ఇలా ఏ దశలోనైనా తినొచ్చు. పూర్తిగా మగ్గిన పండుకు బంగాళ దుంప రుచి వస్తుంది కాబట్టి అనేక వంటకాలు చేసుకోవచ్చు. పెరిగిన కాయను ఉడకబెట్టుకొని, కుమ్ములో పెట్టుకొని, వేపుకొని, కాల్చుకొని తినొచ్చు. పచ్చి బ్రెడ్‌ఫ్రూట్ కాయలను పిండి చేసి పెట్టుకొని, బేకరీ ఉత్పత్తుల్లో కూడా కలుపుకోవచ్చు. ఇందులో గ్లుటెన్ ఉండదు కాబట్టి సెలియాక్ జబ్బు ఉన్న వారు కూడా తినొచ్చు. తీపి పదార్ధాల్లో, రుచికరమైన ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవచ్చు. పోషక విలువలుబ్రెడ్ఫ్రూట్లో పోషకవిలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉన్నాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడే ముఖ్యమైన అమినోయాసిడ్లు, ప్రొటీన్లు, పీచుపదార్థం ఇందులో ఉంటాయి. విటమిన్ సి, బి1, బి5తో పాటు పొటాషియం, రాగి వంటి మినరల్స్ ఉన్నాయి.చదవండి: వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ.. ఆదాయం ఎంతో తెలుసా?ఈ కాయలో కొవ్వు, సోడియం స్వల్పంగా, పీచుపదార్థం అధికంగా ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్‌ఫ్రూట్ ముక్కల్లో 4.4 మిల్లీ గ్రాముల సోడియం, 60 గ్రాముల పిండిపదార్థాలు, 2.4 గ్రాముల మాంసకృత్తులు, 227 కేలరీల శక్తి, 24.2 గ్రాముల చక్కెర, 0.5 గ్రామలు కొవ్వు, 10.8 మిల్లీ గ్రాముల పీచు పదార్థం ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్‌ఫ్రూట్ ముక్కలు తింటే ఆ రోజుకు సరిపోయే పొటాషియంలో 23% లభించినట్లే. రోగనిరోధక శక్తిపుష్కలంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను అందించటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించటం, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచగలగటం బ్రెడ్‌ఫ్రూట్ ప్రత్యేకత. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను నిర్మూలించటం, దీర్ఘరోగాల బెడదను తగ్గించటంతో పాటు దేహం బరువును తగ్గించుకోవటానికి ఉపకరిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముక పుష్టికి దోహదపడుతుంది. విటమిన్ ఎ ఉండటం వల్ల కంటి చూపునకు కూడా మంచిదే. వెంటనే అరిగిపోకుండా క్రమంగా శక్తినిస్తుంది కాబట్టి రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. -
6,7 తేదీల్లో హుబ్లీలో పనస మేళా..
కరువును తట్టుకొని చక్కని ఫలసాయాన్నిచ్చే పండ్ల చెట్టు పనస. ఈ నెల 6,7 తేదీల్లో కర్ణాటకలోని హుబ్లీ నగరంలో మూడు వేల మఠాల ఆవరణలో పనస మేళా జరగనుంది. సరికొత్త ‘శంకర ఎర్ర పనస’ రకం ఈ మేళాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అత్యంత రుచికరంగా ఉండటం, ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పాటు జిగట తక్కువగా ఉండటం దీని ప్రత్యేకతలు.హుబ్లీ మేళాలో ‘శంకర ఎర్ర పనస’తో పాటు సిద్ధు, వియత్నాం ఎర్లీ, లాల్బాగ్ మథుర, భైరచంద్ర, రుద్రాక్షి వంటి అనేక పనస రకాల పండ్లను ప్రదర్శించటంతో పాటు మొక్కలను కూడా మేళాలో విక్రయిస్తారు. ‘శంకర ఎర్ర పనస’ రకం ప్లాంట్ బ్రీడ్ కన్సర్వేషన్ అథారిటీలో కూడా రిజిస్టర్ అయ్యింది. దీన్ని అభివృద్ధి చేసి, మొక్కల్ని విక్రయిస్తున్న రైతు శాస్త్రవేత్త పేరు కెంపరాజు (76767 80559).7,8 తేదీల్లో అనంతపురం జిల్లాలో డా. ఖాదర్ సభలు..స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్ వలి ఈ నెల 7,8 తేదీల్లో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంప్రాంతంలో జరిగే వివిధ సభల్లో ప్రసంగిస్తారు. సిరిధాన్యాల ఆహారం ద్వారా ఆరోగ్యం, సిరిధాన్యాల సాగు, గ్రామాల్లోనేప్రాసెసింగ్ పద్ధతులు, తద్వారా మహిళల ఆదాయం పెంచుకోవటం.. వంటి అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారు. 7 (ఆదివారం)న కళ్యాణదుర్గం సమీపంలోని గుడ్డిళ్లలోని రాధాసామి సత్సంగంలో ప్రసంగిస్తారు.8 (సోమవారం)న ఉ. 9 గంటలకు కోట గుడ్డెమ్ గ్రామంలో, 10.30 గంటలకు చెన్నంపల్లిలో, మధ్యాహ్నం 12 గంటలకు పేరూరులో జరిగే సమావేశాల్లో డా. ఖారద్ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కుళ్లాయిస్వామి (92464 77103), రామప్ప (94411 65281) రైతులకు చిరుధాన్యాల విత్తనాలు పంపిణీ చేస్తారు. 8న మధ్యాహ్నం 3 గంటలకు కురుగుంటలోని పుడమిసిరి మిల్లెట్స్ హోటల్ ప్రాంగణంలో మా భూమి మహిళా రైతు సమాఖ్య చిరుధాన్య ఉత్పత్తుల ప్రదర్శనప్రారంభోత్సవంలో డా. ఖాదర్ ప్రసంగిస్తారు. నిర్వాహకులు భానూజ (94400 17188) ఆధ్వర్యంలో విత్తన వితరణ జరుగుతుంది. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అతిథిగా పాల్గొంటారు.సిరిధాన్యాలతో జీవన సిరి’పై 3 రోజుల శిబిరం..గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 12,13,14 తేదీల్లో చిరు (సిరి)ధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై డా. ఖాదర్ వలి, డా. సరళా ఖాదర్ ద్వారా ప్రత్యేక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ఆధునిక రోగాల నుంచి విముక్తి పొందే మార్గాల గురించి, రోగరహితంగా జీవనాన్ని కొనసాగించే సిరి జీవన శైలిపై పూర్తి అవగాహన కల్పిస్తారన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 97053 83666, 95538 25532. -
కోనసీమ పనసకు గిరాకీ
సాక్షి అమలాపురం: చూడగానే నోరూరించే పనస పంటకు కోనసీమ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తేనెలూరే రుచి ఉండే ఈ పనస తొనలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి, అరటి తరువాత కోనసీమలో పండే విలువైన పంటల్లో పనస ఒకటి. ఈ కారణంగా తూర్పు, పశ్చిమ ఏజెన్సీలలో పండే పనసకన్నా కోనసీమలో పండే పనసకు మంచి డిమాండ్ ఉంది. 79.36 ఎకరాల్లో సాగు వేసవి వచ్చి0దంటే చాలు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పనస కాయల ఎగుమతులు జోరందుకుంటాయి. జిల్లాలో డెల్టా ప్రాంతంతోపాటు గోదావరి లంక గ్రామాల్లో కొబ్బరి తోటల్లో పనస చెట్లను పెంచడం రైతులకు ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతుంది. ఇక్కడ కొబ్బరి తోటల్లో మధ్యన, గట్ల మీద, సరిహద్దుల్లో పనసను రైతులు పెంచుతుంటారు. పనస మీద వచ్చే ఆదాయానికి తోడు ఏళ్ల పాటు చెట్టును పెంచితే టేకు, మద్ది కర్రతో సమానంగా ఆదాయం వస్తున్నది. దీని వల్ల డెల్టా, గోదావరి లంకల్లో పనస చెట్లు గణనీయంగా ఉంటాయి. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం జిల్లాలో 79.36 ఎకరాల్లో పనస సాగు జరుగుతున్నది.కానీ వాస్తవంగా కొబ్బరి తోటలు, రోడ్లు, పంట కాలువల వెంబడి చెట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇందుకు రెండుమూడు రెట్లు సాగు జరుగుతున్నదని అంచనా. ఏజెన్సీతో పోల్చుకుంటే డెల్టా, గోదావరి లంకల్లో పెరిగే పనస తొనల రుచి అధికం. అందుకే జిల్లా నుంచి వచ్చే పనసను కోనసీమ పనసగా చెప్పి ఇతర పట్టణాల్లో అమ్ముతుంటారు. సీజన్లో రూ.ఐదు కోట్ల ఎగుమతులు వేసవి సీజన్లో జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున పనస కాయలు రవాణా అవుతుంటాయి. కొబ్బరి తరహాలోనే పనసకు సైతం అంబాజీపేట అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్. రోజుకు 500కు పైగా పనస కాయలు వస్తాయని అంచనా.కాగా, జిల్లా నుంచి రోజుకు 800 నుంచి వేయి కాయల వరకు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి పనస ఎగుమతి అవుతున్నది. మార్చి నుంచి జూలై నెల వరకు ఒక్క అంబాజీపేట నుంచే రూ.5 కోట్ల విలువైన పనస ఎగుమతి అవుతున్నదని అంచనా. మొత్తం జిల్లావ్యాప్తంగా రూ.7 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నదని తెలుస్తున్నది. దిగుబడి పెరిగి.. ధర తగ్గింది.. గత నాలుగైదు ఏళ్ల కన్నా ఈ ఏడాది దిగుబడి అధికంగా ఉంది. చెట్టుకు సగటున 10 నుంచి 15 కాయల వరకు వస్తుంటాయి. ఈసారి 25 కాయలకు పైబడి దిగుబడిగా వస్తోంది. దీనివల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. కాయ సైజు, బరువును బట్టి రూ.100 నుంచి రూ.400 వరకు ధర ఉంటున్నది. ఏడాది పొడవునా పనస పొట్టు కూరల్లో వినియోగించే పనస పొట్టు ఏడాది పొడవునా కోనసీమలో దొరుకుతున్నది. ఇది కూడా ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా జరుగుతున్నది. కేజీ పనస పొట్టు ధర రూ.175 నుంచి రూ.200 వరకు ఉంది. ఇది డిసెంబర్ నుంచి జూలై వరకు స్థానికంగా లభ్యమవుతున్నది. పెరిగిన ఎగుమతులుగతంలో కన్నా గత ఐదేళ్లుగా అంబాజీపేట మార్కెట్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, తెనాలికి పనస కాయల ఎగుమతి జరుగుతున్నది. ఈ ఏడాది కాయల దిగుబడి అధికంగా ఉంది. అయితే ఎగుమతులు పెరగడం వల్ల సరుకు నిల్వ ఉండడం లేదు. మా దుకాణాల వద్ద రిటైల్ అమ్మకాలు కూడా పెరిగాయి. – కుంపట్ల నాగేశ్వరరావు, వ్యాపారి, అంబాజీపేట -
పనస కాయలు రూ.4.33 లక్షలు
యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ మూలరపట్ల మసీదులోని ఒక పనస చెట్టుకు కాసిన కాయలు ఏకంగా రూ.4.33 లక్షలు పలికి అందరినీ ఆశ్చర్య పరిచాయి. మూలరపట్లకు చెందిన సీరాజుద్దీన్ ఖాసిమి పత్తనాపురం మసీదులో కాసిన పనస చెట్టుకు కాసిన పండ్లను వేలం వేశారు. ఇందులో అజాజ్, లతీఫ్ అనే ఇద్దరు వ్యక్తులు పోటీ పడగా లతీఫ్ రూ.4.33 లక్షలకు వేలం దక్కించుకున్నాడు. పనస కాయలను వేలం వేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. పెద్ద మొత్తంలో పనస కాయలు వేలంలో పలకటంపై ఆశ్చర్యం కలిగిస్తోంది. వచ్చిన ఆదాయాన్ని మసీదు ఖాతాలో జమ చేస్తామని మసీదు నిర్వాహకులు తెలిపారు. -
పనసకాయ.. షుగర్ ఆటకట్టు!
సాక్షి, హైదరాబాద్: మధుమేహ చికిత్సలో ప్రభావవంతమైన వైద్య పోషకాహార చికిత్సగా పచ్చి పనసపొట్టు పిండి పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ అధ్యయనం నిరూపించింది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థలో జరిగిన ఈ అధ్యయనంలో పచ్చి పనసపొట్టు పిండి ప్రయోజనాలను గుర్తించారు. పచ్చి పనసపొట్టు పిండికి మధుమేహ రోగుల్లో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించే శక్తి ఉందని నిర్ధారించారు. ఈ అధ్యయన ఫలితాలను ‘జాక్‌ఫ్రూట్365’ సంస్థ వ్యవస్థాపకుడు జేమ్స్ జోసెఫ్ పలువురు వైద్య నిపుణులతో కలసి శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిత్యం తగిన మోతాదులో పచ్చి పనసపొట్టు పిండిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటున్నట్లు వైద్య బృందం సైతం నిర్ధారించిందన్నారు. రోజుకు 30 గ్రాముల పచ్చి పనసపొట్టు తీసుకుంటే.. ‘జాక్‌ఫ్రూట్365’ సంస్థ వ్యవస్థాపకుడు జేమ్స్ జోసెఫ్ పేర్కొన్న వివరాల ప్రకారం... ఈ అధ్యయనం కోసం షుగర్ మాత్రలు వాడుతున్న 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మొత్తం 40 మంది టైప్–2 మధుమేహ రోగులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్‌లోని రోగులకు మూడు టేబుల్స్పూన్లకు సమానమైన 30 గ్రాముల పచ్చి పనసపొట్టు పిండిని 12 వారాలపాటు అందించారు. అలాగే మరో గ్రూప్‌లోని రోగులకు అంతే పరిమాణంలో పిండి తరహా పదార్థాన్ని అందించారు. ఈ అధ్యయన కాలంలో మధుమేహ రోగుల్లోని హెచ్‌బీఏ1సీ స్థాయిల్లో మార్పులతోపాటు ఫాస్టింగ్ ప్లాస్మా, గ్లూకోజ్, పోస్ట్ ప్రాండియల్ ప్లాస్మా గ్లూకోజ్ (పీపీజీ), లిపిడ్ ప్రొఫైల్, శరీర బరువును పరీక్షించారు. అలాగే గ్రీన్ జాక్‌ఫ్రూట్ ఫ్లోర్‌ను రోగుల రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించారు. వాటి ఫలితాల ప్రకారం పచ్చి పనసపొట్టు పిండి తీసుకున్న రోగుల్లో హెచ్‌బీఏ1సీ, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ (పీపీజీ)లో గణనీయంగా క్షీణత కనిపించింది. అధ్యయన ఫలితాలు ప్రోత్సాహకరం: వైద్య నిపుణులు ఈ అధ్యయనాన్ని మధుమేహ రోగులకు ప్రోత్సాహకరమైన వార్తగా ఫెర్నాండేజ్ ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూట్రిషియనిస్ట్ డాక్టర్ లతా శశి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివర్ణించారు. అహ్మదాబాద్‌కు చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ వినోద్ అభిచందానీ వర్చువల్ పద్ధతిలో మాట్లాడుతూ పచ్చి పనసపొట్టు పిండిని తన రోగులు వినియోగించడం ద్వారా వారు ఆరోగ్య ప్రయోజాలను పొందారన్నారు. ఇదే తరహా సూచనలను అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ సైతం చేసిందన్నారు. పచ్చి పనసపొట్టు పిండిలో పీచు పదార్థాలు అధికంగా లభిస్తాయని, దీనివల్ల తీసుకొనే కేలరీలు తగ్గడంతోపాటు గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉంటుందన్నారు. జాక్‌ఫ్రూట్365 సంస్థ అందించే గ్రీన్ జాక్‌ఫ్రూట్ ఫ్లోర్‌ను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో ప్రతిరోజూ భోజన సమయంలో వినియోగించడం వల్ల కార్బోహైడ్రేట్లు, కేలరీల స్వీకరణ తగ్గుతుందన్నారు. మెడికల్ న్యూట్రిషన్ థెరఫీలో పచ్చి పనసపొట్టు పిండి సామర్ధ్యంపై క్లినికల్ అధ్యయనం చేసేందుకు శ్రీకాకుళం మెడికల్ కాలేజీని తాము ఎంచుకున్నట్లు డాక్టర్ అంతర్యామి మహారాణా చెప్పారు. -
Recipe: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి!
పనస గింజల వడల తయారీ విధానం తెలుసా? పనస గింజల వడల తయారీకి కావలసినవి: ►పనస గింజలు – ఒకటిన్నర కప్పులు (పైతొక్క తీసి, మెత్తగా ఉడికించుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి) ►ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (చిన్నచిన్నగా తరగాలి) ►పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ (చిన్నగా తరిగినవి) ►కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము – అర టేబుల్ స్పూన్ చొప్పున ►అల్లం పేస్ట్, మిరియాల పొడి, వాము – అర టీ స్పూన్ చొప్పున ►కారం, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా పనస గింజల వడల తయారీ విధానం ►ముందుగా ఒక బౌల్లో పనస గింజల గుజ్జు వేయాలి ►దానిలో.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ►అందులో కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, అల్లం పేస్ట్, మిరియాల పొడి, వాము అన్నీ కలిపి బాగా ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని.. వేళ్లతో గట్టిగా ఒత్తి, పలుచగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Singori Sweet Recipe: కోవా... పంచదార.. పచ్చి కొబ్బరి.. నోరూరించే స్వీట్ తయారీ ఇలా! ఇవన్నీ కలిపి బోన్‌లెస్ చికెన్ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే! మరిన్ని రెసిపీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Jack Fruit: నోరూరించే పనస పండ్లు.. తింటే ఎన్ని లాభాలో తెలుసా?
అంబాజీపేట(కోనసీమ జిల్లా): చెట్లకు సాధారణంగా పువ్వు నుంచి పిందె, పిందె నుంచి కాయ వచ్చి అది పండుగా మారుతుంది. కాని పనస పండు పుట్టిక మాత్రం అలా జరగదు. ఈ చెట్టు కాండం నుంచే పిందెలు దిగి అవి కాయులు, పండ్లుగా తయారవుతాయి. కనుకనే పనస చెట్టు మొదలు నుంచి చివరి వరకూ కాండంపై కాయలు నిండి ఉంటాయి. సువాసనలు వెదజల్లుతూ నోరూరించే పనసపండు అంటే అందరికీ ఇష్టమే. పనసపండులో శరీరానికి అవసరమైన పలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును ఆంగ్లంలో జాక్‌ఫ్రూట్ అంటారు. దీని వృక్షశాస్త్ర నామ థేయం ఎట్రోకార్పస్ ఇంటి గ్రిఫోలియా. ఏటా మార్చి నుంచి జూలై వరకూ పనస పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఒక్కొక్క చెట్టుకు 100 వరకూ కాయలు దిగుబడులు వస్తాయి. ఒక్కొక్క కాయ 10 నుంచి 20 కేజీల బరువు ఉంటాయి. కాగా కాయ ఎంత బరువున్నా అందులో 30 శాతం మాత్రమే తినడానికి ఉపయోగపడుతుంది. కాగా అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో దొరకే పనస పండ్లకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. పనసలో పలు రకాలు బంగారు పనస, కొబ్బరి పనస, ఖర్జూర పనస, వేరు పనస, చిన్నకోల పనస, గుండ్రు పనస, గులాబి పనస, కర్ణపనస, తేనెపనస అనే రకాలు ఉన్నాయి. వివాహాది శుభ కార్యాలయాల్లో పనసకాయ కూర చేస్తారు. పనసకాయను పొట్టుగా కొట్టి కూర వండితే తినతివారు ఉండరు. అంతేకాకుండా లేత పనస కాయలను చిన్న ముక్కలుగా తరిగి మషాలా కూరల్లో ఉపయోగిస్తారు. పోషకాలు ఇలా.. పనస పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయని, ఏడాదికి ఒకసారైనా కచ్చితంగా పనసపండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. పనస పండులో మాంసకృతులు 1.9 శాతం, చక్కెర 19.8 శాతం, కొవ్వులు 0.1 శాతం, కెరోటిన్ 175 మైక్రో గ్రాములు, థియోమిన్ 0.3 మిల్లీ గ్రాములు, విటమిన్ సి 7 మిల్లీ గ్రాములు, పీచు పదార్థం 1.1 శాతం, సున్నం 20.0 మిల్లీ గ్రాములు, ఇనుము 0.56 మిల్లీ గ్రాములు ఉంటాయి. -
పనసపై మనసు
ఓ పెళ్లిని పనస బిర్యానీ పదే పదే గుర్తు చేస్తుంది. ఇంకో శుభ కార్యానికి పనస గూన పులుసు ప్రత్యేకత తీసుకువస్తుంది. మరో ఇంటిలోని విందు పనస పొట్టు కూర వల్లనే పది కాలాలు గుర్తుంటుంది. ఉత్తరాంధ్రలో.. ప్రత్యేకించి ఉద్దానంలో పనసపై మనసు పడని వారు లేరు. తొనలు తీసి తిన్నా, ముక్కలు కొట్టి రుచిగా కూర వండినా, ఘుమఘుమలాడే బిర్యానీ చేసినా దీని రుచికి సాటి లేదంతే. ఊరు అదిరిపోయేలా డీజే మోగనీ.. వీధి మెరిసిపోయేలా లైటు సెట్టింగులు ఎన్ని పెట్టనీ.. ఊరేగింపు పక్క ఊరి వరకు జరగనీ.. ఎన్ని అట్టహాసాలైనా ఉండనివ్వండి.. ఆ వేడుక పది తరాలు గుర్తుంచుకోవాలంటే మాత్రం ఆ బాధ్యత పనసదే. అంతటి ఘనమైనది కాబట్టే ‘పనస పొట్టులో ఆవ పెట్టుకుని.. తరతరాలుగా తిన్నారు..’ అని ఎస్పీ బాలు ఇష్టంగా పాడారు. – ఇచ్ఛాపురం రూరల్ తెలుగు వారికి ప్రతి సీజన్‌కు ఓ ప్రత్యేకమైన కూర ఉంటుంది. అందులోనూ మన ఉత్తరాంధ్ర వారి జిహ్వ చాపల్యం ఎవరికీ తీసిపోదు కదా. వేసవి వస్తే ఉద్దానం వారు పనస కోసం పనిగట్టుకుని వెతుకుతారు. దీని తొనల రుచి అందరికీ తెలిసిందే. కానీ కాయను ఎన్ని రకాలుగా వండవచ్చో సిక్కోలుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. విస్తట్లో ఎన్ని కూరలు వడ్డించినా పనస కూర పడనిదే మనసు నిండదు మరి. అంతేకాదు పనస పండ్లు సీజన్లో మిత్రులకు, బంధువులకు, అధికారులకు ఉద్దానం ప్రాంతీయులు బహుమతులుగా ఇచ్చే సంప్రదా యం ఇప్పటికీ కొనసాగుతోంది. దీని సీజన్ వచ్చేసింది. పచ్చటి తోరణాలు కట్టిన ఇళ్లలో ఇప్పటికే పనస కాయలు కొలువుదీరి ఉన్నాయి. రకరకాలు.. కేవలం మండు వేసవి ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఈ పండు దొరుకుతుంది. జిల్లాలో కర్జూరం, కర్పూరం, బురద, నిత్య వంటి రకాలున్నాయి. వీటిలో కర్జూరం రుచి చూసి తీరాల్సిందే. కర్పూరం, బురద, నిత్య రకాలను పిందె దశలోనే విక్రయిస్తారు. ఇవి కూరలకి మహత్తరంగా ఉంటాయి. దళారులు చెట్టు వద్దే వీటిని కొనేస్తారు. పనస పండిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అయితే 11 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచితే 3 నుంచి 6 వారాల వర కు ఉంటాయి. పండ్లతో పాటు పనసకా య పైతొక్క తీసి లోపలి భాగాన్ని చిన్నచిన్న ముక్కులు గా కోసి కూర చేస్తా రు. దీన్ని పనస పొట్టు కూర అంటారు. ఇండియాతో పాటు నేపా ల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా, కంబోడియా వియత్నాం దేశాల వారు పనసను వంటల్లో విరివిగా వాడతారు. విందు.. పసందు పనస పిందెలుగా ఉన్న సమయంలో పనస పొట్టుతో వివిధ రకాలైన వంటకాలకు ఉపయోగిస్తారు. పనస ముక్కల బిర్యానీ, పనస పొట్టు కూర, çపనస హల్వా, పనస పకోడీ, పనస గూన చారు, పనస చిల్లీ, పనస కుర్మా, పచ్చడి ఎవరికైనా తెగ నచ్చేస్తాయి. వీటి పిక్కలను కూడా నిప్పుల మీద కాల్చుకుని తినడం మనవారికి అలవాటే. వీటి తొనలు తీపిగా ఉన్నా ఇంటిలో సుగర్ లెవెల్స్ పెంచవు. విటమిన్ ఎ,సిలు సమృద్ధిగా ఉంటాయి. పనస కలపతో వీణలు, మద్దెలు కూడా చేస్తుంటారు. పనసతో కూరొండితే.. సాధారణంగా పనస మార్చి, ఏప్రిల్ నెలల్లో పిందె దశలో ఉండటంతో వీటిని కూరలకు, వివిధ ఆహార పదార్థాలకు విరివి గా ఉపయోగిస్తుంటాం. ఈ నెలల్లో అధికంగా శుభకార్యాలు ఉండటంతో గూనచారు, పనస పకోడీ, పనస కూరలు తయారు చేస్తాం. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఒడిశా ప్రాంతంలో పనస పొట్టుతో హల్వా, కుర్మా, పచ్చళ్లు తయారు చేస్తారు. వీటిని చాలా ఇష్టంగా తింటారు. – దుర్యోధన పండిత్, వంట మాస్టారు, ఇచ్ఛాపురం -
పనసల పదనిస.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 250 కాయలు
ఇంట్లో పనస పండు ఉంటే ఎంత దాచి పెట్టినా అందరికీ తెలిసిపోతుంది. దాని ఘుమఘుమ అలాంటిది. ఇక పనస తొనల మాధుర్యం చెప్పనలవే కాదు. అటువంటి పనస పండు ఇంట్లో ఒకటుంటేనే ఎంతో సంతోషం. అవే వందల సంఖ్యలో కనిపిస్తే ఆ ఆనందమే వేరు. పనస చెట్టుకు కాయలు కాయడం సాధారణమే. అలా కాకుండా ఆరు నుంచి ఎనిమిది కాయలతో గుత్తులు గుత్తులుగా కాస్తే నిజంగా విశేషమే! పెరవలి మండలం ఖండవల్లిలో రాజు గారి చేను వద్ద రోడ్డు పక్కన ఈ పనస చెట్టు ఉంది. ఇది ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 250 కాయలు కాసింది. చెట్టు మొదలు నుంచి గుత్తులుగుత్తులుగా పై వరకూ ఉన్న కాయలు కాసిన ఈ చెట్టును అటుగా వెళ్తున్న వారు కన్నార్పకుండా చూసి, ఆనందిస్తున్నారు. ఇంతలా కాయలు కాసిన పనస చెట్టును చూడటం ఇదే మొదటిసారంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చెట్టు ఏటా కాపు కాస్తుందని, ఈ ఏడాది ఇంతలా గుత్తులుగుత్తులుగా కాయటం విశేషమేనని రైతు రాజు చెప్పారు. – పెరవలి(తూర్పుగోదావరి) చదవండి: Seshachalam Hills: మాట వినం..తాట తీస్తాం! -
పనసకాయలో జ్యోతిర్లింగం
అమరాపురం (మడకశిర) : పనసకాయలో జ్యోతిర్లింగం ఉద్భవించింది. శివరాత్రి పండుగరోజు ఇలా కనిపించడం అద్భుతమని భక్తులు పనసచెట్టుకు పూజలు నిర్వహించారు. ఈదృశ్యం అమరాపురం మండలంలోని తమ్మడేపల్లి గ్రామానికి చెందిన నాగేగౌడ్, నరేంద్రగౌడ్ తోటలో శుక్రవారం కనిపించింది.