6,7 తేదీల్లో హుబ్లీలో పనస మేళా.. | Panasa Is A High Yielding Drought Tolerant Tree | Sakshi
Sakshi News home page

6,7 తేదీల్లో హుబ్లీలో పనస మేళా..

Published Tue, Jul 2 2024 8:13 AM | Last Updated on Tue, Jul 2 2024 8:13 AM

Panasa Is A High Yielding Drought Tolerant Tree

7,8 తేదీల్లో అనంతపురం జిల్లాలో డా. ఖాదర్‌ సభలు..

సిరిధాన్యాలతో జీవన సిరి’పై 3 రోజుల శిబిరం..

కరువును తట్టుకొని చక్కని ఫలసాయాన్నిచ్చే పండ్ల చెట్టు పనస. ఈ నెల 6,7 తేదీల్లో కర్ణాటకలోని హుబ్లీ నగరంలో మూడు వేల మఠాల ఆవరణలో పనస మేళా జరగనుంది. సరికొత్త ‘శంకర ఎర్ర పనస’ రకం ఈ మేళాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అత్యంత రుచికరంగా ఉండటం, ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పాటు జిగట తక్కువగా ఉండటం దీని ప్రత్యేకతలు.

హుబ్లీ మేళాలో ‘శంకర ఎర్ర పనస’తో పాటు సిద్ధు, వియత్నాం ఎర్లీ, లాల్‌బాగ్‌ మథుర, భైరచంద్ర, రుద్రాక్షి వంటి అనేక పనస రకాల పండ్లను ప్రదర్శించటంతో పాటు మొక్కలను కూడా మేళాలో విక్రయిస్తారు. ‘శంకర ఎర్ర పనస’ రకం ప్లాంట్‌ బ్రీడ్‌ కన్సర్వేషన్‌ అథారిటీలో కూడా రిజిస్టర్‌ అయ్యింది. దీన్ని అభివృద్ధి చేసి, మొక్కల్ని విక్రయిస్తున్న రైతు శాస్త్రవేత్త పేరు కెంపరాజు (76767 80559).

7,8 తేదీల్లో అనంతపురం జిల్లాలో డా. ఖాదర్‌ సభలు..
స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌ వలి ఈ నెల 7,8 తేదీల్లో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంప్రాంతంలో జరిగే వివిధ సభల్లో ప్రసంగిస్తారు. సిరిధాన్యాల ఆహారం ద్వారా ఆరోగ్యం, సిరిధాన్యాల సాగు, గ్రామాల్లోనేప్రాసెసింగ్‌ పద్ధతులు, తద్వారా మహిళల ఆదాయం పెంచుకోవటం.. వంటి అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారు. 7 (ఆదివారం)న కళ్యాణదుర్గం సమీపంలోని గుడ్డిళ్లలోని రాధాసామి సత్సంగంలో ప్రసంగిస్తారు.

8 (సోమవారం)న ఉ. 9 గంటలకు కోట గుడ్డెమ్‌ గ్రామంలో, 10.30 గంటలకు చెన్నంపల్లిలో, మధ్యాహ్నం 12 గంటలకు పేరూరులో జరిగే సమావేశాల్లో డా. ఖారద్‌ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కుళ్లాయిస్వామి (92464 77103), రామప్ప (94411 65281) రైతులకు చిరుధాన్యాల విత్తనాలు పంపిణీ చేస్తారు. 8న మధ్యాహ్నం 3 గంటలకు కురుగుంటలోని పుడమిసిరి మిల్లెట్స్‌ హోటల్‌ ప్రాంగణంలో మా భూమి మహిళా రైతు సమాఖ్య చిరుధాన్య ఉత్పత్తుల ప్రదర్శనప్రారంభోత్సవంలో డా. ఖాదర్‌ ప్రసంగిస్తారు. నిర్వాహకులు భానూజ (94400 17188) ఆధ్వర్యంలో విత్తన వితరణ జరుగుతుంది. అనంతపురం జిల్లా కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ అతిథిగా పాల్గొంటారు.

సిరిధాన్యాలతో జీవన సిరి’పై 3 రోజుల శిబిరం..
గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్  రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 12,13,14 తేదీల్లో చిరు (సిరి)ధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై డా. ఖాదర్‌ వలి, డా. సరళా ఖాదర్‌ ద్వారా ప్రత్యేక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ఆధునిక రోగాల నుంచి విముక్తి పొందే మార్గాల గురించి, రోగరహితంగా జీవనాన్ని కొనసాగించే సిరి జీవన శైలిపై పూర్తి అవగాహన కల్పిస్తారన్నారు. రిజిస్ట్రేషన్‌ వివరాలకు.. 97053 83666, 95538 25532.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement