మంటల్లో బస్సు.. వరద బాధితుల సజీవ దహనం | Bus Catches Fire On Pak Karachi Highway Kills Flood Victims | Sakshi
Sakshi News home page

మంటల్లో బస్సు.. వరద బాధితుల సజీవ దహనం

Published Thu, Oct 13 2022 8:04 AM | Last Updated on Thu, Oct 13 2022 8:04 AM

Bus Catches Fire On Pak Karachi Highway Kills Flood Victims - Sakshi

వరద బాధితులను తిరిగి స్వస్థలానికి తరలించే క్రమంలో బస్సుకు మంటలు అంటుకుని.. 

కరాచీ: పాకిస్తాన్‌ పోర్ట్‌ సిటీ కరాచీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి సమయంలో ఓ రన్నింగ్‌ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే సజీవ దహనం  అయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా వరద బాధితులుగా నిర్ధారణ అయ్యింది.

సింధ్‌ ప్రావిన్స్‌ కరాచీ-హైదరాబాద్‌-జామ్‌షోరో నగరాలను కలుపుతూ ఉన్న ఎం-9 మోటర్‌వేపై ఈ ఘోరం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 17 మంది అక్కడికక్కడే చనిపోయారని, మరో పది మంది కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు హెల్త్‌ సెక్రెటరీ సిరాజ్‌ ఖ్వాసిం వెల్లడించారు. 

దాదూ జిల్లాకు చెందిన వరద బాధితులకు వేరే చోట తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో వాళ్లను తిరిగి స్వస్థలానికి ప్రైవేట్‌ బస్సులో తీసుకొస్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement