సాక్షి, చెన్నై: బోనస్, వేతన సవరణలపై ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ చెన్నై నగర ప్రభుత్వ రవాణా సంస్థ ఉద్యోగులు ఆకస్మిక సమ్మెకు దిగారు. రవాణా సంస్థ ఉద్యోగులు ఉదయం నుంచి సమ్మెకు పిలుపునివ్వటంతో నగరవ్యాప్తంగా తిరిగే 4000 బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
కార్యాలయాలు, వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండులలో పడిగాపులు కాస్తూ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇదే అదనుగా ఆటోవాలాలు అందినకాడికి దండుకుంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించమని రవాణా సంస్థ ఉద్యోగులు కరాఖండిగా చెప్పటంతో ప్రయణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment