బస్‌ ఛార్జీలు తగ్గించండి: జీవీ ప్రకాశ్‌ | government should review on bus fares hike | Sakshi
Sakshi News home page

బస్‌ ఛార్జీలు తగ్గించండి: జీవీ ప్రకాశ్‌

Published Tue, Jan 23 2018 7:58 PM | Last Updated on Tue, Jan 23 2018 8:08 PM

government should review on bus fares hike - Sakshi

చెన్నై : తమిళనాడులో సౌత్‌ హీరోలు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వగా, ఇక ప్రకాశ్‌ రాజ్‌, విశాల్‌ వంటి  వారు కూడా రాజకీయాలపై స్పందిస్తున్నారు. అవసరం అయితే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధం అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. తాజాగా  యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కూడా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై స్పందించారు.

పెంచిన బస్సు ఛార్జీలు తగ్గించాలంటూ అతడు  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. బస్సు ఛార్జీల ధరల పెంపుపై ఇప్పటికే సామాన్య ప్రజలతో పాటు విపక్షాలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో జీవీ ప్రకాశ్‌... బస్సు ఛార్జీల పెంపుపై ప్రభుత్వం మరోసారి సమీక్ష నిర్వహించాలని కోరారు. ధరల పెంపు సామాన్య ప్రజలతో పాటు పేదలపై పెను భారం పడుతోందంటూ అతడు తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నాడు. కాగా తమిళనాడు ప్రభుత్వం ఒక్కసారిగా బస్సు ఛార్జీలను 67శాతం పెంచేసిన విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement