ఐశ్వర్య రాజేష్ సినిమాలో ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌ | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య రాజేష్ సినిమాలో ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌

Published Sat, Apr 6 2024 2:08 PM

Indian Cricketer In Aishwarya Rajesh New Movie - Sakshi

నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌, నటి ఐశ్యర్య రాజేశ్‌ జంటగా నటించిన చిత్రం డియర్‌. నటి రోహిణి, ఇళవరసు, తలైవాసల్‌ విజయ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నట్‌మగ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వరుణ్‌ త్రిపురనేని, అభిఫేక్‌ రామిశెట్టి, జీ.పృధ్వీరాజ్‌ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చే సుకుని, ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది.

టీమిండియా స్టార్ ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలిసారిగా ఈ సినిమాలో భాగమయ్యారు. క్రికెట్‌లో  స్పిన్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న అశ్విన్.. ఇప్పుడు వెండితెరపై కూడా కనిపించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. తమిళంలో వస్తున్న 'డియర్' సినిమాలో అతిథి పాత్రలో అశ్విన్‌ నటించారట. ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది. కానీ సినిమాలో ఆయన లుక్‌ రివీల్‌ చేయలేదు.

ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు క్రికెటర్‌ అశ్విన్ స్వయంగా తన ఎక్స్‌ పేజీలో వెల్లడించారు. అశ్విన్‌తో హీరోయిన్‌ ఐశ్వర్యకు ఇదే తొలి చిత్రం. ఈ చిత్రాన్ని ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.  ఏప్రిల్ 11న విడుదల కానున్న డియర్‌ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్‌ విడుదల చేయగా దానిని  అశ్విన్‌ కూడా తన ఎక్స్‌ పేజీలో షేర్‌ చేశారు. అశ్విన్‌ వాయిస్‌తో ‍ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది. 'డియర్' చిత్రంలో దీపిక, అర్జున్  పాత్రలలో ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ నటించారు. కొత్తగా పెళ్లయిన జంట మధ్య జరిగే సమస్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

ఈ సినిమా గురించి జీవీ.ప్రకాశ్‌కుమార్‌ మాట్లాడుతూ నటి ఐశ్వర్యరాజేశ్‌ ఒకసారి విమానంలో కలిసినప్పుడు ఒక మంచి కథ ఉంది చే స్తారా? అని అడిగారన్నారు. ఆ చిత్రంలో ఈమె నటిస్తున్నారంటే తన పాత్రకు పెద్దగా స్కోప్‌ ఉండదని భావించానన్నారు. అయినప్పుటికీ అందులో తను నటించకూడదనే భావనతోనే దర్శకుడిని కథ చెప్పమని అడిగానన్నారు. ఆ తరువాత దర్శకుడు ఆనంద్‌ రవిచంద్రన్‌ తనను కలిసి కథ చెప్పడంతో చాలా ఇంట్రస్ట్‌గా ఉందని పించిందన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ సన్నివేశం ఎంతగానో ఆకట్టుకోవడంతో తాను నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement