G.V Prakash Kumar
-
ఐశ్వర్య రాజేష్ సినిమాలో ఇండియన్ స్టార్ క్రికెటర్
నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్, నటి ఐశ్యర్య రాజేశ్ జంటగా నటించిన చిత్రం డియర్. నటి రోహిణి, ఇళవరసు, తలైవాసల్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నట్‌మగ్ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిఫేక్ రామిశెట్టి, జీ.పృధ్వీరాజ్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చే సుకుని, ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది. టీమిండియా స్టార్ ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలిసారిగా ఈ సినిమాలో భాగమయ్యారు. క్రికెట్లో స్పిన్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న అశ్విన్.. ఇప్పుడు వెండితెరపై కూడా కనిపించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. తమిళంలో వస్తున్న 'డియర్' సినిమాలో అతిథి పాత్రలో అశ్విన్ నటించారట. ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది. కానీ సినిమాలో ఆయన లుక్ రివీల్ చేయలేదు. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు క్రికెటర్ అశ్విన్ స్వయంగా తన ఎక్స్ పేజీలో వెల్లడించారు. అశ్విన్‌తో హీరోయిన్ ఐశ్వర్యకు ఇదే తొలి చిత్రం. ఈ చిత్రాన్ని ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న విడుదల కానున్న డియర్ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేయగా దానిని అశ్విన్ కూడా తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. అశ్విన్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'డియర్' చిత్రంలో దీపిక, అర్జున్ పాత్రలలో ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ నటించారు. కొత్తగా పెళ్లయిన జంట మధ్య జరిగే సమస్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమా గురించి జీవీ.ప్రకాశ్‌కుమార్ మాట్లాడుతూ నటి ఐశ్వర్యరాజేశ్ ఒకసారి విమానంలో కలిసినప్పుడు ఒక మంచి కథ ఉంది చే స్తారా? అని అడిగారన్నారు. ఆ చిత్రంలో ఈమె నటిస్తున్నారంటే తన పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదని భావించానన్నారు. అయినప్పుటికీ అందులో తను నటించకూడదనే భావనతోనే దర్శకుడిని కథ చెప్పమని అడిగానన్నారు. ఆ తరువాత దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ తనను కలిసి కథ చెప్పడంతో చాలా ఇంట్రస్ట్‌గా ఉందని పించిందన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం ఎంతగానో ఆకట్టుకోవడంతో తాను నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. Excited to unveil the #DeAr trailer!🎉 Happy to have played a small part in it 😁. Check it out and let me know what you think ❤️ ▶️ https://t.co/bqvULPCmRi#DeArTrailer #DeArFromApril11 @NutmegProd @tvaroon #AbhishekRamisetty #PruthvirajGK @mynameisraahul #RomeoPictures… pic.twitter.com/tB1S6KXYUI — Ashwin 🇮🇳 (@ashwinravi99) April 5, 2024 -
బస్ ఛార్జీలు తగ్గించండి: జీవీ ప్రకాశ్
చెన్నై : తమిళనాడులో సౌత్ హీరోలు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కమల్ హాసన్, రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వగా, ఇక ప్రకాశ్ రాజ్, విశాల్ వంటి వారు కూడా రాజకీయాలపై స్పందిస్తున్నారు. అవసరం అయితే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధం అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాజాగా యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కూడా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై స్పందించారు. పెంచిన బస్సు ఛార్జీలు తగ్గించాలంటూ అతడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. బస్సు ఛార్జీల ధరల పెంపుపై ఇప్పటికే సామాన్య ప్రజలతో పాటు విపక్షాలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవీ ప్రకాశ్... బస్సు ఛార్జీల పెంపుపై ప్రభుత్వం మరోసారి సమీక్ష నిర్వహించాలని కోరారు. ధరల పెంపు సామాన్య ప్రజలతో పాటు పేదలపై పెను భారం పడుతోందంటూ అతడు తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నాడు. కాగా తమిళనాడు ప్రభుత్వం ఒక్కసారిగా బస్సు ఛార్జీలను 67శాతం పెంచేసిన విషయం విదితమే. -
ఒక రోజు ముందే కడవుల్ ఇరుక్కాన్ కుమారూ
కడువుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందే తెరపైకి రానుంది. నిజానికి ఈ చిత్రం అనుకున్న సమయంలో విడుదలవుతుందా?అన్న సందేహం నెలకొంది.అందుకు కారణం చిత్రం కోర్టులో పిటిషన్ దాఖలు కావడమే. వివరాల్లోకెళ్లితే జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించిన చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ. ఆనంది, నిక్కీగల్రాణి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎం.రాజేశ్ దర్శకత్వంలో అమ్మా క్రియేషన్స టి.శివ నిర్మించారు. చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 11న విడుదలకు సిద్ధమైంది. సాధారణంగా చిత్రాలను శుక్రవారం రోజు విడుదల చేస్తుండడం ఆనవాయితీ. అయితే కొన్ని చిత్రాలను అదనంగా కలెక్షన్లను వసూలు చేసుకోవడానికి ఒక రోజు ముందే విడుదల చేస్తుంటారు.అలా కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రాన్ని ఒక రోజు ముందే అంటే 10వ తేదీనే విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదలపై నిషేధం విధించాలంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై ఈ నెల10 తేదీన విచారించనున్నట్లు నాయస్థానం వెల్లడించింది.దీంతో ఈ చిత్రానికి సంబంధించిన కేసును ఈ రోజే అంటే సోమవారం విచారించాలని పిటిషన్‌దారుడు మరో పిటిషన్ దాఖలు చేశారు.అయితే పిటిషన్‌దారుడి కోరికను తిరస్కరించిన కోర్టు 10వ తేదీనే విచారించనున్నట్లు ప్రకటించారు.దీంతో కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం ఆ నెల 10వ తేదీనే తెరపైకి రానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. -
‘జెండాపై కపిరాజు’ ఆడియో