ఒక రోజు ముందే కడవుల్ ఇరుక్కాన్ కుమారూ | Kadavul Irukan Kumaru movie release one day before | Sakshi
Sakshi News home page

ఒక రోజు ముందే కడవుల్ ఇరుక్కాన్ కుమారూ

Published Tue, Nov 8 2016 3:40 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

ఒక రోజు ముందే కడవుల్ ఇరుక్కాన్ కుమారూ

ఒక రోజు ముందే కడవుల్ ఇరుక్కాన్ కుమారూ

కడువుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందే తెరపైకి రానుంది. నిజానికి ఈ చిత్రం అనుకున్న సమయంలో విడుదలవుతుందా?అన్న సందేహం నెలకొంది.అందుకు కారణం చిత్రం కోర్టులో పిటిషన్ దాఖలు కావడమే. వివరాల్లోకెళ్లితే జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించిన చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ. ఆనంది, నిక్కీగల్రాణి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎం.రాజేశ్ దర్శకత్వంలో అమ్మా క్రియేషన్‌‌స టి.శివ నిర్మించారు. చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 11న విడుదలకు సిద్ధమైంది. సాధారణంగా చిత్రాలను శుక్రవారం రోజు విడుదల చేస్తుండడం ఆనవాయితీ.

అయితే కొన్ని చిత్రాలను అదనంగా కలెక్షన్లను వసూలు చేసుకోవడానికి ఒక రోజు ముందే విడుదల చేస్తుంటారు.అలా కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రాన్ని ఒక రోజు ముందే అంటే 10వ తేదీనే విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదలపై నిషేధం విధించాలంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై ఈ నెల10 తేదీన విచారించనున్నట్లు నాయస్థానం వెల్లడించింది.దీంతో ఈ చిత్రానికి సంబంధించిన కేసును ఈ రోజే అంటే సోమవారం విచారించాలని పిటిషన్‌దారుడు మరో పిటిషన్ దాఖలు చేశారు.అయితే పిటిషన్‌దారుడి కోరికను తిరస్కరించిన కోర్టు 10వ తేదీనే విచారించనున్నట్లు ప్రకటించారు.దీంతో కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం ఆ నెల 10వ తేదీనే తెరపైకి రానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement