nikkigalrani
-
తుది దశలో చార్లీచాప్లిన్–2
తమిళసినిమా: ఇంతకుముందు ప్రభు, ప్రభుదేవా కలిసి నటించిన పూర్తి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టెయినర్ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో తాజాగా ఆ చిత్ర దర్శకుడు శక్తి చిదంబరంనే దానికి సీక్వెల్‌గా చార్లీచాప్లిన్–2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్వకత్వంలో పార్టీ అనే కలర్‌ఫుల్ చిత్రాన్ని నిర్మిస్తున్న అమ్మా క్రియేషన్స్ శివనే ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోనూ ప్రభుదేవా, ప్రభు కలిసి నటిస్తుండడం విశేషం. ఇక హీరోయిన్లుగా గ్లామర్ డాల్స్ నిక్కీగల్రాణి, బాలీవుడ్ భామ ఆదాశర్మ నటిస్తున్నారు. ఆదాశర్మకు ఇదే తోలి తమిళ చిత్రం అవుతుంది. ఇతర ముఖ్య పాత్రల్లో రవిమరియ, సెంథిల్, ఆకాశ్, వివేక్ ప్రసన్న,శామ్స్, శాంత, కావ్య, మగధీర చిత్ర ఫేమ్ దేవ్‌సింగ్, ముంబై విలన్ సమీర్ కోచ్, కోవమల్శర్మ, అమీత్, నట్పుకాగ వైభన్ నటిస్తున్నారు. అమ్రేశ్ సంగీతాన్ని, సౌందర్‌రాజన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీనికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను అందిస్తున్న శక్తిచిదంబరం చిత్ర వివరాలను తెలుపుతూ చార్లీచాప్లిన్–2 పూర్తిగా కమర్శియల్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం తుది ఘట్ట చిత్రీకరణ జరుపుకుంటోందదని తెలిపారు. -
రియల్ పెళ్లి కాదండోయ్.. రీల్ పెళ్లి తతంగం !
తిరుపతిలో ప్రభుదేవా, నిక్కీగల్రాణిల పెళ్లి జరగనుందట. ఏమిటీ నమ్మశక్యంగా లేదా ? ప్రభుదేవా, నయనతారల ప్రేమ పెళ్లి వరకూ ఆగిపోయిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివతో ప్రేమలో పడి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా చాలా కాలంగానే జరుగుతోంది. అయితే ప్రభుదేవా మాత్రం ఒంటరిగానే జీవిస్తున్నారు. తాజాగా నిక్కీగల్రాణితో పెళ్లికి సిద్ధం అయ్యారనే ప్రచారం జోరందుకుంది. తిరుపతిలో బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇది రియల్ పెళ్లి కాదండోయ్. రీల్ పెళ్లి తతంగం. ఇదన్నా సవ్యంగా జరుగుతుందా? ఏమో చెప్పలేం ఎందుకంటే ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఆదాశర్మ కూడా నటిస్తోంది. ఇంతకు ముందు ప్రభు, ప్రభుదేవా కలిసి నటించిన చార్లీచాప్లిన్‌కు స్వీకెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిక్కీగల్రాణి, ఆదాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమ్మా క్రియేషన్స్ టి. శివ నిస్తున్న ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకుడు. ఈయన చిత్రాలంటే హాస్యంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయి. చార్లీచాప్లిన్-2 గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ప్రభుదేవా, నిక్కీగల్రాణి పెళ్లి కోసం ఇద్దరి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లేటప్పుడు, ఆ తర్వాత జరిగే సంఘటనలే చార్లీచాప్లిన్-2 చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం అమ్నేశ్, ఛాయాగ్రహణను సౌందర్‌రాజన్‌లు అందిస్తున్నారు. -
నాపై గాసిప్స్ ఎందుకు వస్తాయ్?
నా గురించి గాసిప్స్ ఎందుకు వస్తాయి అంటోంది నటి నిక్కీగల్రాణి. ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో బిజీ కథానాయకి. త్వరలో తమిళనాడు కోడలు అయినా అవుతానంటున్న నిక్కీగల్రాణికి ఇక్కడ చేతినిండా చిత్రాలున్నాయి. దీంతో ఇతర భాషల్లో నటించాల్సిన అవసరం కూడా లేదంటోంది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న తన మనోభావాలను, తాజా చిత్రాల వివరాలను పంచుకున్నారు. అవేమిటో చూసేద్దామా. ప్ర: ఈ ఏడాది మీ టైం బాగున్నట్టుందే? జ: అవునండి. ఏడాది ప్రారంభంలో మొట్టశివ కెట్టశివ విడుదలై మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత మరగత నాణియం, నెరుప్పుడా వరుసగా సక్సెస్ఫుల్ చిత్రాలుగా నిలిచాయి. ఈ మూడు చిత్రాల్లోనూ నా పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. షూటింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మహిళాభిమానులు ఎంతో ప్రేమతో హగ్ చేసుకుని అభినందిస్తున్నారు. ప్ర: సరే ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల వివరాలను చెప్పండి? జ: మళ్లీ నెరుప్పుడా చిత్ర హీరో విక్రమ్‌ప్రభుకు జంటగా పక్కా చిత్రంలో నటిస్తున్నాను. అదే విధంగా జీవాకు జంటగా కీ చిత్రం లో నటిస్తున్నాను. గౌతమ్ కార్తీక్ సరసన నటించిన హరహర మహాదేవకీ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్ర: అడల్ట్ చిత్రంగా చెప్పుకుంటున్న హరహర మహాదేవకి చిత్రంలో నటించడానికి ఎందుకు అంగీకరించారనే ప్రశ్న ఎదురవుతోందే? జ: మొదట కథ చెప్పినప్పుడు నా పాత్ర బాగుందనిపించడంతో నటించడానికి సమ్మతించాను. హరహర మహాదేవకీ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే నాకు సంబంధించిన సన్నివేశాల్లో కూడా అడల్ట్ కామెడీ ఉంటుంది. అయితే అవి చాలా నాగరికంగా జాలీగా నవ్వుకునేలా ఉంటాయి. ప్ర: తమిళ చిత్రాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇతర భాషల్లో అవకాశాలు రావడం లేదా? జ: నేను ఇప్పటికే కన్నడం, తెలుగు అంటూ అన్ని భాషల్లోనూ ఒక రౌండ్ కొట్టేశాను. ప్రస్తుతం నా దృష్టి అంతా తమిళ చిత్రాలపైనే పెడుతున్నాను. ప్ర: సమీప కాలంలో మీ గురించి ఎలాంటి గాసిప్స్ రావడం లేదు. ఏం మాయ చేస్తున్నారు? జ: నా గురించి గాసిప్స్ రాకపోవడం మంచి విషయమేగా. అందుకు నేనేం మాయా మంత్రాలు చేస్తాను. షూటింగ్ ముగియగానే నేరుగా ఇంటికి వెళ్లి పోతాను. ఇంకొకరి గురించి అనవసరంగా కామెంట్స్ కూడా చేయను. ఎలాంటి గొడవలకూ వెళ్లను. అలాంటిది నా గురించి ఎందుకు గాసిప్స్ ప్రచారం అవుతాయి? ప్ర: చెన్నైలో సెటిల్ అయ్యి తమిళ ప్రేక్షకుల డార్లింగ్ అయ్యిపోయారు. భవిష్యత్‌లో తమి ళింటి కోడలయ్యే అవకాశం ఉందా? జ: నా పెళ్లి గురించి అడుగుతున్నారన్న విషయం అర్థమైంది. అయితే సినిమాల్లో నేనింకా సాధించాల్సింది చాలా ఉంది. భవిష్యత్తులో నేను తమిళింటి కోడలిని అవ్వనూవచ్చు. ఆ విషయాన్ని జరిగినప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతం సినిమా గురించే చెప్పుకుందాం. ప్ర: ఇటీవల సినిమా రంగంలో నటీమణులకు రక్షణ కరువైందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ స్పందన ఏమిటి? జ: ఈ విషయంలో సినిమా రంగం అని విడదీసి చెప్పకూడదు. మన దేశంలోనే మహిళలకు సరైన రక్షణ లేదు. సడన్‌గా నలుగురు మగవారు నన్ను అడ్డగిస్తే వారి నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. నేను సినిమాల్లోనే ఫైట్స్ చేసేదాన్ని అమ్మాయిని కాను. నిజజీవితంలోనూ నా తడాఖా చూపిస్తాను. -
అలా ఉండడం నా వల్ల కాదు
కామ్‌గా ఉండడం నా వల్ల కాదు అంటోంది నటి నిక్కీగల్రాణి. డార్లింగ్ చిత్రంతో కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నిక్కీగల్రాణి విక్రమ్‌ప్రభుకు జంటగా నటించిన నెరుప్పుడా చిత్రం గత శుక్రవారం తెరపైకి విచ్చి సక్సెస్‌ఫుల్‌గా పరిగెడుతోంది. గౌతమ్ కార్తీక్ సరసన నటించిన హర హర మహాదేవకి చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న నిక్కీగల్రాణి మాటామంతి.. – తమిళసినిమా ప్ర: నెరుప్పుడా చిత్రంలో మీ పాత్ర గురించి? జ: ఈ చిత్రంలో వైద్యవిద్యార్థినిగా నటించాను. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పాత్రను పోషించలేదు. చాలా వైవిధ్యం కలిగిన పాత్ర. ఇందులో నా పాత్ర నిప్పుల్లో నుంచే ప్రారంభం అవుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా రిస్క్ తీసుకుని నటించాను. మరో విషయం ఏమిటంటే నేను డాక్టరు కావాలన్నది మా అమ్మ ఆశ. అలా వైద్యవిద్యను చదివిన నేను దిశ మారి సినిమా రంగంలోకి ప్రవేశించాను. ఇదీ మంచికే అనుకుంటున్నాను. ప్ర: విక్రమ్‌ప్రభుతో నటించిన అనుభవం? జ: చాలా మంచి అనుభవం. విక్రమ్‌ప్రభు సెట్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. నెరుప్పుడా చిత్రానికి ఆయనే నిర్మాత. అయినా ఎలాంటి టెన్షన్ పడ్డట్టు నేను చూడలేదు. ఇక మర్యాద, ప్రేమ విషయాల్లో విక్రమ్‌ప్రభు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్ర: చిత్రాల ఎంపికలో మీరు తీసుకునే జాగ్రత్తలు? జ: అందర్నీ ఆలోచింపజేసే కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటించాలన్నదే నా కోరిక. అలాంటి పాత్రలను చాలెంజింగ్‌గా తీసుకుని నటిస్తాను. ఒక సారి నటించిన పాత్రలో మళ్లీ నటించకుండా వైవిధ్యంగా ఉండే పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. అందుకే సక్సెస్ఫుల్ నటిగా కొనసాగిస్తున్నాను. ప్ర: ఇంత సక్సెస్ఫుల్ నటిగా రాణిస్తారని ముందుగా ఊహించారా? జ: నిజం చెప్పాలంటే నేను నటినవుతానని ఊహించలేదు. నటి అయిన తరువాత ఇంతగా నిలదొక్కుకుంటానని అనుకోలేదు. నాలుగు తమిళ చిత్రాలు, రెండు మలయాళం, తెలుగు అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ప్ర: సంగీతదర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ మిమ్మల్ని చూసి భయపడతారట? జ: షూటింగ్ సెట్లో గానీ, బయట గానీ కామ్‌గా ఉండడం అన్నది నా వల్ల కాని పని. సరదాగా మాట్లాడుతూ సందడి చేస్తుంటాను. అందుకు విరుద్ధంగా జీవీ.ప్రకాశ్‌కుమార్ ప్రశాంతంగా ఉంటే నేనేం చేయను. -
8న నిప్పురా అంటున్న విక్రమ్‌ప్రభు
తమిళసినిమా: యువ నటుడు విక్రమ్‌ప్రభుకు ఇప్పుడో హిట్ చాలా అవసరం. నటుడిగా ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవకపోయినా, ఇటీవల తను నటించిన చిత్రాలు అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయాయన్నది మాత్రం వాస్తవం. అయితే నటుడిగా తానేమిటో తొలి చిత్రం కుంకీతోనే నిరూపించుకున్నారు. కాగా మరోసారి తన సత్తా చాటడానికి నెరుప్పడా(నిప్పురా) అంటూ రానున్నారు.విశేషం ఏమిటంటే ఈ చిత్రంతో నిర్మాతగా తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. విక్రమ్‌ప్రభు నిర్మాతగా ఫస్ట్ ఆర్టిస్ట్ బ్యానర్‌ను ప్రారంభించి నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం నెరుప్పుడా. సూపర్‌స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రంలోని నెరుప్పుడా పాట ప్రపంచం మొత్తం పాపులర్ అయ్యిందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా అలాంటి పవర్ఫుల్ టైటిల్‌కు ఆయన అనుమతి పొంది నిర్మించిన ఇందులో సక్సెస్ఫుల్ హీరోయిన్ నిక్కీగల్రాణి విక్రమ్‌ప్రభుకు జంటగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో వరుణ్, నాన్కడవుల్రాజేంద్రన్, నాగిరెడ్డి, ఆడుగళం నరేన్ నటించిన ఈ చిత్రాన్ని శ్యాన్ రోనాల్డ్ సంగీతం అందించారు. నవ దర్శకుడు ఏ.అశోక్‌కుమార్ దర్శకత్వం వహించిన ఇందులో విక్రమ్‌ప్రభు ఫైర్‌మ్యాన్‌గా పవర్ఫుల్ పాత్రలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్తో నెరుప్పుడా చిత్రం సెప్టెంబర్ 8వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. -
నిక్కీ పాలసీ తెలుసా?
చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్న లక్కీ నాయకి నిక్కీగల్రాణి. డార్లింగ్ అంటూ కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీకి ఆ చిత్ర విజయం జోరును పెంచింది. లారెన్స్ తో రొమాన్స్ చేసిన మొట్టశివ కెట్టశివ సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో అమ్మడు మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం విక్రమ్ ప్రభుతో నెరుప్పుడా, గౌతమ్ కార్తీక్‌కు జంటగా హరహర మహేదేవకీ చిత్రాలతో పాటు మరగద నాణయం, కీ, పక్కా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటితో పాటు మలయాళంలో టీమ్–5 అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఆ చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తోందట. కారణం ఇందులో వివాదాస్పద క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్‌కు జంటగా నటించిందట. దీంతో టీమ్–5 చిత్రం కోసం మలయాళ చిత్ర పరిశ్రమే ఆసక్తిగా ఎదురు చూస్తోందని, తానూ ఈ చిత్రంతో మాలీవుడ్‌లో బలంగా చొచ్చుకుపోతాననే నమ్మకం ఉందని నిక్కీగల్రాణి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మడి పాలసీ ఏమిటో తెలుసా? తక్కువ పారితోషికం దారాళంగా అందాలారబోయడం. అందుకే అవకాశాలు వరుసగా తలుపు తడుతున్నాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అలాగే మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది నిక్కీ. ఇకపోతే ఈ బ్యూటీ శునక ప్రేమికురాలట. నటి త్రిష తరువాత అంతగా కుక్కల్ని పెంచుకుంటున్న నటి నిక్కీగల్రాణినేనట. షూటింగ్ లేని సమయాల్లో ఈ భామకు కాలక్షేపం తన పెట్టీ డాగ్సేనట. -
నాకు నేనే పోటీ
ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తనకు తానే పోటీ కానున్నారు. నిజమే లారెన్స్ హీరోగా నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండూ బయటి నిర్మాతలకు ఇతర దర్శకులతో చేసిన చిత్రాలు. అందులో ఒకటి మొట్టశివ కెట్టశివ. ఇది తెలుగులో మంచి విజయాన్ని సాధించిన పటాస్ చిత్రానికి రీమేక్. నటి నిక్కీగల్రాణి నాయకిగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో సత్యరాజ్, రానా, వంశీకృష్ట, కోవైసరళ, సీమాన్ నటించిన ఈ చిత్రానికి సీనియర్ నటి జయచిత్ర వారసుడు అమ్రేష్ గణేశ్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్బీ.చౌదరి నిర్మించిన పటాస్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల ఐదవ తేదీన నిర్వహించనున్నట్లు చిత్రా వర్గాలు వెల్లడించారు. అదే విధంగా చిత్రాన్ని ఈ నెల17న విడుదల చేయనున్నట్లు ప్రకటనను విడుదల చేశారు. ఇక లారెన్స్ నటించిన మరో చిత్రం శివగంగ. ఇది కన్నడంలో హిట్ అయిన చిత్రానికి రీమేక్. ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వం వహించిన ఇందులో లారెన్స్ కు జంటగా నటి రితికాసింగ్ నటించారు.శక్తివాసు, వడివేలు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మించారు. ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన శివగంగ చిత్రాన్ని ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటనల ద్వారా ప్రచారాన్ని మొదలెట్టారు.దీంతో లారెన్స్ చిత్రానికి ఆయన మరో చిత్రమే పోటీ కానుంది.అయితే ప్రకటించినట్లుగా ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలవుతాయా? లేక ఏదో ఒకటి పోటీ నుంచి విరమించుకుంటుందా? అన్నది వేచి చూడాలి. -
విక్రమ్‌ప్రభుతో మరోసారి..
యువ నటుడు విక్రమ్‌ప్రభుతో వరుసగా రొమాన్స్ చేయడానికి నటి నిక్కీగల్రాణి సై అన్నారు. చేతినిండా చిత్రాలన్న యువ నటీమణుల్లో నిక్కీగల్రాణి ఒకరు. యాగవరాయనుం నాకాక్క చిత్రం ద్వారా కోలీవుడ్ చిత్రంలో నటించడానికి ఎంపికైన ఈ ఉత్తరాది భామ తొలుత తెరపైకి కనిపించింది మాత్రం డార్లింగ్ చిత్రంతోనే. జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని చవి చూడడంతో అమ్మడికి అవకాశాలు వరుసగా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం మొట్టశివ కెట్టశివ, నెరుప్పుడా, కీ, మరగద నాణయం, హరహర మహాదేవిక చిత్రాల్లో నటిస్తున్న నిక్కీగల్రాణికి తాజాగా మరో అవకాశం వచ్చింది. నెరుప్పుడా చిత్రంలో విక్రమ్‌ప్రభుతో జత కడుతున్న ఈ అమ్మడు అదే హీరోతో మరో చిత్రంలో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. నవ దర్శకుడు సూర్య మెగాఫోన్ పట్టనున్న ఈ చిత్రానికి పక్కా అనే టైటిల్‌ను నిర్ణయించారు. విశేషం ఏమిటంటే ఇది నిక్కీగల్రాణికి 25వ చిత్రం అవుతుంది. ఇందులో ఆ బ్యూటీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమానిగా నటించనున్నారట. పక్కా చిత్రం పూర్తి ఎంటర్టెయిన్ మెంట్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కనుందని సమాచారం. నెరుప్పుడా, పక్కా చిత్రాల్లో నటుడు విక్రమ్‌ప్రభుతో వరుసగా రొమాన్స్ చేస్తున్నారన్న మాట నిక్కీగల్రాణి. ఇక విక్రమ్‌ప్రభు నటిస్తున్న తాజా చిత్రం క్షత్రియన్ త్వరలో విడుదలకు ముస్తాబవుతోందన్నది గమనార్హం. -
ఆదిని కొత్తగా ఆవిష్కరించే మరగద నాణయం
యువ నటుడు ఆదిని కొత్త డైమన్సన్‌లో ఆవిష్కరించే చిత్రంగా మరగద నాణయం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు ఏఆర్కే.శరవణన్ అంటున్నారు. యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జి.ఢిల్లీబాబు నిర్మిస్తున్న చిత్రం మరగదనాణయం. ఆది కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా నిక్కీగల్రాణి నటిస్తున్నారు.ఇతర పాత్రల్లో ఆనంద్‌రాజ్, మునీష్కాంత్, కాళీవెంకట్, అరుణ్‌రాజ్ కామరాజ్, డానీ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎంఎస్.భాస్కర్, మైన్ గోపి నటిస్తున్నారు. దిబునినన్ థామస్ సంగీతాన్ని, పీవీ.శంకర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం వివరాలను బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు తెలుపుతూ ఇది ఎడ్వెంచర్, ఫాంటసీ, కామెడీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర కథ, కథనాలు ఇంతకు ముందెప్పుడూ ప్రేక్షకులు చూడనటువంటివిగా ఉంటాయని తెలిపారు. నటుడు ఆది ఇంతకు ముందు యాక్షన్ కథా చిత్రాల్లో నటించినా, ఈ చిత్రం ఆయన్ని కొత్త కోణంలో ఆవిష్కరించేదిగా ఉంటుందన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్న నిర్మాత ఢిల్లీబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.కథా బలం ఉన్న చిత్రాలనే నిర్మించాలన్నది యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ లక్ష్యం అని నిర్మాత తెలిపారు. 90 కథల్లో ఎంపిక చేసిన కథ ఇదని చెప్పారు. విభిన్న కథా చిత్రంలో నటిస్తునందుకు చాలా సంతోషంగా ఉందని హీరో ఆది పేర్కొన్నారు. -
ఆ చిత్రాల్లో అందాలారబోసి రెచ్చిపోయా!
ఆ చిత్రాల్లో గ్లామర్‌తో రెచ్చిపోయి నటించాను. అభిమానులకు అందాలమోతేనటోంది నటి నిక్కీగల్రాణి. డార్లింగ్ చిత్రంలో కథానాయకుడిని ప్రేమించే యువతిగానూ, దెయ్యంగానూ రెండు కోణాల్లో తనదైన నటనను ప్రదర్శించి కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తరువాత యాగవరాయనుం నాకాక్క, కో 2, వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్ తదితర చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో ఐదారు చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. నిక్కీగల్రాణి లారె న్‌సతో నటించిన మొట్టశివ కెట్టశివ, విక్రమ్‌ప్రభుతో జత కట్టిన నెరుప్పుడా, జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో రొమా న్స చేసిన కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ మూడు చిత్రాలూ తనకు చాలా స్పెషల్ అం టోందీ బ్యూటీ. దీని గురించి నిక్కీగల్రాణి తెలుపుతూ స హజంగా తాను చాలా చలాకీ అమ్మాయినని చెప్పుకొచ్చింది. ఎప్పుడూ ఏదో ఇక పనిచేస్తూనే ఉం టానని, అదీకాకపోతే ఎవరైనా కనిపిస్తే వా రితో గలగలా మాట్లాడడం తన స్వభావం అని చెప్పిం ది. ఇక తాను నటిస్తున్న పై మూడు చిత్రాల్లోనూ తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలేనని తెలిపింది. దీంతో కథను కూడా సహజసిద్ధంగా నటించేశానని చెప్పింది. ఇవి తాను ఇంతకు ముందు నటించిన చిత్రాల్లోని పాత్రలకు చాలా భిన్నంగా ఉంటాయని, అభినయంతో పాటు అందాలారబోతలోనూ ఇరగదీశానని చెప్పుకొచ్చింది.అంతేకాదు ఈ చిత్రాలు తెరపైకి వచ్చిన తరువాత తాను తన అభిమానులకు మరింత నచ్చేస్తానని అంటోంది. -
గౌతమ్‌కార్తీక్‌తో నిక్కీ రెడీ
యువ నటుడు గౌతమ్‌కార్తీక్‌తో జత కట్టడానికి నటి నిక్కీగల్రాణి రెడీ అవుతున్నారు. ఈ డార్లింగ్ నాయకి నటించి తెరపైకి వచ్చిన చివరి చిత్రం వేలైన్ను వందుట్టా వెళ్లక్కారన్. అయితే లారెన్సతో నటిస్తున్న మొట్టశివ కెట్టశివ, జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా ఒక చిత్రం అంటూ నిక్కీగల్రాణి బిజీగా ఉన్నారు. తాజాగా గౌతమ్కార్తీక్కు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని తంగం సినిమాస్ పతాకంపై ఎం.తంగరాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సంతోష్ పీటర్ జయకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి హరహర మహాదేవకి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో ఇతర పాత్రల్లో సతీశ్, మొటై రాజేంద్రన్, రవిమరియ, నమో నారాయణన్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.ఈ చిత్రానికి పాల్-మురళిబాలు ద్వయం సంగీతాన్ని, సెల్వకుమార్ చాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆదివారం ప్రారంభమైంది. చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 23 నుంచి చెన్నైలో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ చిత్ర విడుదల హక్కుల్ని స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా పొందడం విశేషం. ప్రస్తుతం ఈయన సూర్య హీరోగా సీ-3(ఎస్-3) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న సీ-3 చిత్ర టీజర్‌ను డిసెంబర్ 16న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.అదే విధంగా సూర్య కథానాయకుడిగా విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో తానాసేర్న్‌ద కూటం చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. -
ఒక రోజు ముందే కడవుల్ ఇరుక్కాన్ కుమారూ
కడువుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందే తెరపైకి రానుంది. నిజానికి ఈ చిత్రం అనుకున్న సమయంలో విడుదలవుతుందా?అన్న సందేహం నెలకొంది.అందుకు కారణం చిత్రం కోర్టులో పిటిషన్ దాఖలు కావడమే. వివరాల్లోకెళ్లితే జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించిన చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ. ఆనంది, నిక్కీగల్రాణి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎం.రాజేశ్ దర్శకత్వంలో అమ్మా క్రియేషన్స టి.శివ నిర్మించారు. చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 11న విడుదలకు సిద్ధమైంది. సాధారణంగా చిత్రాలను శుక్రవారం రోజు విడుదల చేస్తుండడం ఆనవాయితీ. అయితే కొన్ని చిత్రాలను అదనంగా కలెక్షన్లను వసూలు చేసుకోవడానికి ఒక రోజు ముందే విడుదల చేస్తుంటారు.అలా కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రాన్ని ఒక రోజు ముందే అంటే 10వ తేదీనే విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదలపై నిషేధం విధించాలంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై ఈ నెల10 తేదీన విచారించనున్నట్లు నాయస్థానం వెల్లడించింది.దీంతో ఈ చిత్రానికి సంబంధించిన కేసును ఈ రోజే అంటే సోమవారం విచారించాలని పిటిషన్‌దారుడు మరో పిటిషన్ దాఖలు చేశారు.అయితే పిటిషన్‌దారుడి కోరికను తిరస్కరించిన కోర్టు 10వ తేదీనే విచారించనున్నట్లు ప్రకటించారు.దీంతో కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం ఆ నెల 10వ తేదీనే తెరపైకి రానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు.