నిక్కీ పాలసీ తెలుసా? | Nikki Galrani busy with movies | Sakshi
Sakshi News home page

నిక్కీ పాలసీ తెలుసా?

Published Fri, Mar 10 2017 2:07 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

నిక్కీ పాలసీ తెలుసా?

నిక్కీ పాలసీ తెలుసా?

చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్న లక్కీ నాయకి నిక్కీగల్రాణి. డార్లింగ్‌ అంటూ కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీకి ఆ చిత్ర విజయం జోరును పెంచింది. లారెన్స్ తో రొమాన్స్  చేసిన మొట్టశివ కెట్టశివ సక్సెస్‌ టాక్‌ను సొంతం చేసుకోవడంతో అమ్మడు మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం విక్రమ్‌ ప్రభుతో నెరుప్పుడా, గౌతమ్‌ కార్తీక్‌కు జంటగా హరహర మహేదేవకీ చిత్రాలతో పాటు మరగద నాణయం, కీ, పక్కా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటితో పాటు మలయాళంలో టీమ్‌–5 అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఆ చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తోందట. కారణం ఇందులో వివాదాస్పద క్రికెట్‌ క్రీడాకారుడు శ్రీశాంత్‌కు జంటగా నటించిందట.

దీంతో టీమ్‌–5 చిత్రం కోసం మలయాళ చిత్ర పరిశ్రమే ఆసక్తిగా ఎదురు చూస్తోందని, తానూ ఈ చిత్రంతో మాలీవుడ్‌లో బలంగా చొచ్చుకుపోతాననే నమ్మకం ఉందని నిక్కీగల్రాణి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మడి పాలసీ ఏమిటో తెలుసా? తక్కువ పారితోషికం దారాళంగా అందాలారబోయడం. అందుకే అవకాశాలు వరుసగా తలుపు తడుతున్నాయంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు. అలాగే మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది నిక్కీ. ఇకపోతే ఈ బ్యూటీ శునక ప్రేమికురాలట. నటి త్రిష తరువాత అంతగా కుక్కల్ని పెంచుకుంటున్న నటి నిక్కీగల్రాణినేనట. షూటింగ్‌ లేని సమయాల్లో ఈ భామకు కాలక్షేపం తన పెట్టీ డాగ్సేనట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement