mottasiva kettasiva
-
నిక్కీ పాలసీ తెలుసా?
చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్న లక్కీ నాయకి నిక్కీగల్రాణి. డార్లింగ్ అంటూ కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీకి ఆ చిత్ర విజయం జోరును పెంచింది. లారెన్స్ తో రొమాన్స్ చేసిన మొట్టశివ కెట్టశివ సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో అమ్మడు మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం విక్రమ్ ప్రభుతో నెరుప్పుడా, గౌతమ్ కార్తీక్‌కు జంటగా హరహర మహేదేవకీ చిత్రాలతో పాటు మరగద నాణయం, కీ, పక్కా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటితో పాటు మలయాళంలో టీమ్–5 అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఆ చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తోందట. కారణం ఇందులో వివాదాస్పద క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్‌కు జంటగా నటించిందట. దీంతో టీమ్–5 చిత్రం కోసం మలయాళ చిత్ర పరిశ్రమే ఆసక్తిగా ఎదురు చూస్తోందని, తానూ ఈ చిత్రంతో మాలీవుడ్‌లో బలంగా చొచ్చుకుపోతాననే నమ్మకం ఉందని నిక్కీగల్రాణి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మడి పాలసీ ఏమిటో తెలుసా? తక్కువ పారితోషికం దారాళంగా అందాలారబోయడం. అందుకే అవకాశాలు వరుసగా తలుపు తడుతున్నాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అలాగే మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది నిక్కీ. ఇకపోతే ఈ బ్యూటీ శునక ప్రేమికురాలట. నటి త్రిష తరువాత అంతగా కుక్కల్ని పెంచుకుంటున్న నటి నిక్కీగల్రాణినేనట. షూటింగ్ లేని సమయాల్లో ఈ భామకు కాలక్షేపం తన పెట్టీ డాగ్సేనట. -
పోలీస్ ఆధికారిగా లారెన్స్
రాఘవ లారెన్స్ తొలిసారిగా పోలీస్ అధికారిగా నటించిన చిత్రం మొట్టశివ కెట్టశివ. అనేక విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్బీ.చౌదరి నిర్మించిన 88వ చిత్రం ఇది. యువ దర్శకుడు సాయిరమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్ ప్రధాన పాత్రను పోషించారు. నటి నిక్కీగల్రాణి నాయకిగా నటించిన ఈ చిత్రంలో నటి రాయ్‌లక్ష్మీ ఒక ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. ఇతర ముఖ్య పాత్రల్లో సతీష్, శ్రీమాన్, తంబిరామయ్య, మనోబాలా, నాన్ కడవుల్ రాజేంద్రన్, వీటీవీ.గణేశ్, దేవదర్శిని, సుకన్య, శ్యామ్, మయిల్సామి నటించారు.అశ్వంత్దోశ్రాణ, వంశీకృష్ణ, శరత్దీప్ ప్రతినాయకులుగా నటించిన ఈ చిత్రానికి అమ్రిష్ సంగీతాన్ని అందించారు. ఇది ఇద్దరు పోలీస్ అధికారుల మధ్య ఈగో ఎలాంటి సంఘటనలకు దారి తీసిందన్నదే చిత్ర కథ అని దర్శకుడు తెలిపారు. ఈ ఇద్దరి పోలీసుల మధ్య వివాదంతో లబ్ధిపొందాలనుకున్న సంఘ విద్రోహుల పాచికలు పారాయా?అన్న ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం మొట్టశివ కెట్టశివ అని చెప్పారు.రాఘవ లారెన్స్్ ను పోలీస్ అధికారిగా కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రం ఇదన్నారు. ఈ నెల 17న తెరపైకి రానున్న ఈ చిత్ర ఆడిమో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ ఆదివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో ఘనంగా నిర్వహించారు. -
నాకు నేనే పోటీ
ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తనకు తానే పోటీ కానున్నారు. నిజమే లారెన్స్ హీరోగా నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండూ బయటి నిర్మాతలకు ఇతర దర్శకులతో చేసిన చిత్రాలు. అందులో ఒకటి మొట్టశివ కెట్టశివ. ఇది తెలుగులో మంచి విజయాన్ని సాధించిన పటాస్ చిత్రానికి రీమేక్. నటి నిక్కీగల్రాణి నాయకిగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో సత్యరాజ్, రానా, వంశీకృష్ట, కోవైసరళ, సీమాన్ నటించిన ఈ చిత్రానికి సీనియర్ నటి జయచిత్ర వారసుడు అమ్రేష్ గణేశ్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్బీ.చౌదరి నిర్మించిన పటాస్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల ఐదవ తేదీన నిర్వహించనున్నట్లు చిత్రా వర్గాలు వెల్లడించారు. అదే విధంగా చిత్రాన్ని ఈ నెల17న విడుదల చేయనున్నట్లు ప్రకటనను విడుదల చేశారు. ఇక లారెన్స్ నటించిన మరో చిత్రం శివగంగ. ఇది కన్నడంలో హిట్ అయిన చిత్రానికి రీమేక్. ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వం వహించిన ఇందులో లారెన్స్ కు జంటగా నటి రితికాసింగ్ నటించారు.శక్తివాసు, వడివేలు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మించారు. ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన శివగంగ చిత్రాన్ని ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటనల ద్వారా ప్రచారాన్ని మొదలెట్టారు.దీంతో లారెన్స్ చిత్రానికి ఆయన మరో చిత్రమే పోటీ కానుంది.అయితే ప్రకటించినట్లుగా ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలవుతాయా? లేక ఏదో ఒకటి పోటీ నుంచి విరమించుకుంటుందా? అన్నది వేచి చూడాలి.