పోలీస్‌ ఆధికారిగా లారెన్స్ | raghava lawrence Police officer in mottasiva kettasiva | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ఆధికారిగా లారెన్స్

Published Mon, Feb 6 2017 1:32 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

పోలీస్‌ ఆధికారిగా లారెన్స్ - Sakshi

పోలీస్‌ ఆధికారిగా లారెన్స్

రాఘవ లారెన్స్  తొలిసారిగా పోలీస్‌ అధికారిగా నటించిన చిత్రం మొట్టశివ కెట్టశివ. అనేక విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆర్‌బీ.చౌదరి నిర్మించిన 88వ చిత్రం ఇది. యువ దర్శకుడు సాయిరమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్‌ ప్రధాన పాత్రను పోషించారు. నటి నిక్కీగల్రాణి నాయకిగా నటించిన ఈ చిత్రంలో నటి రాయ్‌లక్ష్మీ ఒక ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. ఇతర ముఖ్య పాత్రల్లో సతీష్, శ్రీమాన్, తంబిరామయ్య, మనోబాలా, నాన్ కడవుల్‌ రాజేంద్రన్, వీటీవీ.గణేశ్, దేవదర్శిని, సుకన్య, శ్యామ్, మయిల్‌సామి నటించారు.అశ్వంత్‌దోశ్రాణ, వంశీకృష్ణ, శరత్‌దీప్‌ ప్రతినాయకులుగా నటించిన ఈ చిత్రానికి అమ్రిష్‌ సంగీతాన్ని అందించారు.

ఇది ఇద్దరు పోలీస్‌ అధికారుల మధ్య ఈగో ఎలాంటి సంఘటనలకు దారి తీసిందన్నదే చిత్ర కథ అని దర్శకుడు తెలిపారు. ఈ ఇద్దరి పోలీసుల మధ్య వివాదంతో లబ్ధిపొందాలనుకున్న సంఘ విద్రోహుల పాచికలు పారాయా?అన్న ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం మొట్టశివ కెట్టశివ అని చెప్పారు.రాఘవ లారెన్స్్ ను పోలీస్‌ అధికారిగా కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రం ఇదన్నారు. ఈ నెల 17న తెరపైకి రానున్న ఈ చిత్ర ఆడిమో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్‌ ఆదివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్‌లో ఘనంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement