Lawrence
-
దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం
న్యూఢిల్లీ: ముంబైలో ఎస్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య దరిమిలా దీనివెనక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తముందనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌తో సహా పలువురు పేరుమోసిన గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఎ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక వివరాలున్నాయి.లారెన్స్ బిష్ణోయ్‌కు సంబంధించిన టెర్రర్ సిండికేట్ మునుపెన్నడూ లేని విధంగా విస్తరించిందని ఎన్ఐఏ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. దావూద్ ఇబ్రహీం 90వ దశకంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ, తన నెట్‌వర్క్‌ను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడో.. అదే మార్గాన్ని లారెన్స్ బిష్ణోయ్ కూడా అనుసరించాడు. దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ స్మగ్లింగ్, టార్గెట్ కిల్లింగ్, దోపిడీ రాకెట్లతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తర్వాత పాక్ ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకుని, తన నెట్వర్క్ విస్తరించాడు. కాగా దావూద్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన డి కంపెనీ మాదిరిగానే బిష్ణోయ్ గ్యాంగ్ చిన్న చిన్న నేరాలు చేస్తూ ఇప్పుడు ఆరు దేశాలకు విస్తరించింది.బిష్ణోయ్ గ్యాంగ్‌లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నారని, వారిలో 300 మంది పంజాబ్‌కు చెందినవారని ఎన్ఐఎ తెలిపింది. బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను విరివిగా వినియోగించుకుంలాయి. బిష్ణోయ్ ముఠా 2020-21 మధ్యకాలంలో దోపిడీల ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఆ డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించింది.ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం బిష్ణోయ్ గ్యాంగ్ ఒకప్పుడు పంజాబ్‌కు మాత్రమే పరిమితమైంది. ఆ తరువాత గోల్డీ బ్రార్‌తో జతకట్టి హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ముఠాలతో పొత్తు పెట్టుకుంది. బిష్ణోయ్ గ్యాంగ్ ప్రస్తుతం ఉత్తర భారతదేశం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్‌లలో విస్తరించింది. సామాజిక మాధ్యమాలు, ఇతర పద్ధతుల ద్వారా వీరు యువతను తమ ముఠాలో చేర్చుకుంటారు. ఈ ముఠా అమెరికా, అజర్బైజాన్, పోర్చుగల్, అరబ్, రష్యా వరకూ వ్యాపించింది.కొద్ది రోజుల క్రితం లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ సహా మొత్తం 16 మంది గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానిలోని వివరాల ప్రకారం గోల్డీ బ్రార్ కెనడా, పంజాబ్, ఢిల్లీలో ముఠాలను నిర్వహిస్తున్నాడు. రోహిత్ గోద్రా రాజస్థాన్, మధ్యప్రదేశ్, అరబ్ కంట్రీలోని ముఠాలను పర్యవేక్షిస్తుంటాడు. అన్మోల్ బిష్ణోయ్ పోర్చుగల్, అమెరికా, ఢిల్లీ , మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లకు కమాండ్‌గా ఉన్నాడు. ఈ ముఠాకు ఆయుధాలు మధ్యప్రదేశ్‌లోని మాల్వా, మీరట్, ముజఫర్‌నగర్, యూపీలోని అలీగఢ్, బీహార్‌లోని ముంగేర్, ఖగారియా నుంచి వచ్చి చేరుతుంటాయి. అలాగే పాక్‌లోని పంజాబ్ జిల్లాతో పాటు అమెరికా, రష్యా, కెనడా, నేపాల్ దేశాల నుంచి కూడా ఈ ముఠాకు ఆయుధాలు అందుతుంటాయని ఎన్ఐఏ గుర్తించింది.ఇది కూడా చదవండి: సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య? -
రూ. 25లక్షల ఒప్పందం.. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో అయిదుగురు నిందితులపై నవీ ముంబై పోలీసులు తాజాగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు కరుడుగట్టిన బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర బయటపడింది. కాగా గత ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరైన అనుజ్ థాపన్ అనే నిందితుడు మే 1న పోలీసు లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై తాజాగా 350 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. వీరిపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు.నిందితుల ముఠా ఏకేK-47, ఏకే-92, M16 రైఫిల్స్ వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు 2022లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్’ను కూడా తెప్పించేందుకు పథకం సిద్ధం చేసినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు.సల్మాన్ హత్య కుట్రలో భాగంగా సల్మాన్ పన్వెల్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్‌కు వెళ్లే గోరేగావ్ ఫిల్మ్ సిటీని బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు బాలుళ్లను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది.నిందిత మైనర్లు దాడి చేసేందుకు ఉత్తర అమెరికా నుంచి పనిచేస్తున్నట్లు భావిస్తున్న గ్యాంగులోని కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది. -
కాంచనలో మృణాల్?
‘సీతారామం, ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హిందీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మరోవైపు తమిళం నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. శివ కార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ తమిళ సినిమాలో తొలుత మృణాల్ ఠాకూర్‌నే హీరోయిన్గా అనుకున్నారు.అయితే ఈ చాన్స్ కన్నడ భామ రుక్మిణీ వసంత్ దక్కించుకున్నారు. ఇప్పుడు మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి. హారర్ హిట్ ఫ్రాంచైజీ ‘కాంచన’లో రానున్న ‘కాంచన 4’లో మృణాల్‌ని తీసుకున్నారట. రాఘవా లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా మృణాల్ నటించనున్నారని టాక్. మరి.. వార్తల్లో ఉన్నట్లు ‘కాంచన 5’లో మృణాల్ నటిస్తే తమిళంలో ఆమెకు ఇదే తొలి చిత్రం అవుతుంది. -
Singapore PM: మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్
సింగపూర్: సింగపూర్ ప్రధానిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన లీ సీయన్ లూంగ్(72) రిటైర్మెంట్ ప్రకటించారు. మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు లూంగ్ సోమవారం తెలిపారు. అదే రోజూన ఉప ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్(51) ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. సింగపూర్ మూడో ప్రధానిగా 2004లో లూంగ్ బాధ్యతలు చేపట్టారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి ఎంతో ముఖ్యమైన విషయమని ఆయన ఫేస్బుక్లో పేర్కొన్నారు. సింగపూర్‌కు మరింత ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వాంగ్ ప్రభుత్వానికి సహకారం అందించాల్సిందిగా ప్రజలను ఆయన కోరారు. -
లారెన్స్‌తో జోడీ?
హీరో లారెన్స్‌కి జోడీగా హీరోయిన్ శ్రుతీహాసన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ‘రైడ్, వీర, రాక్షసుడు, ఖిలాడి’ వంటి పలు చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు రమేష్ వర్మ. ఆయన దర్శకత్వంలో ఘవ లారెన్స్ హీరోగా ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞావవేల్ రాజా తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ నిర్మించనున్నారు.రా ఈ చిత్రానికి ‘శ్రీరామరక్ష’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. కాగా ఈ మూవీలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉందట. అందులో ఒక హీరోయిన్గా ఇప్పటికే నయనతార పేరు వినిపించింది.. మరో కథానాయికగా శ్రుతీహాసన్ నటిస్తారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో లారెన్స్‌కి జోడీగా ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటించనున్నారంటూ గత ఏడాది వార్తలు వచ్చినా, ఆ తర్వాత ఎలాంటి ప్రకటన లేదు. తాజాగా నయనతార, శ్రుతీహాసన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాక్. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో హారర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని భోగట్టా. -
లారెన్స్ సినిమా నుంచి వాకౌట్?
లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో పాటు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తుంటారు. దక్షిణాదిన సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న నయన ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో హిందీ పరిశ్రమలోనూ విజయవంతంగా కెరీర్ ఆరంభించారు. ఇక ప్రస్తుతం ‘ది టెస్ట్’ చిత్రంతో పాటు మరో చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు నయనతార. కాగా, రత్నకుమార్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా రూపొందనున్న చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్గా ఖరారయ్యారనే వార్త వినిపించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకున్నారని టాక్. డేట్స్ సర్దుబాటు చేయలేక నయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. -
ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్?
న్యూఢిల్లీ: కెనడాలో బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్‌వార్‌లో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె ప్రత్యర్ధులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ హత్యకు పూర్తి బాధ్యత తమదేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాదే బాధ్యత.. కెనడాలో జరిగిన ముఠా కాల్పుల్లో ఖలిస్థా ఉగ్రావది సుఖ దునెకె హత్యకు గురయ్యాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఈ హత్య తామే చేయించామని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ్యాంగ్స్టర్లు గుర్లాల్ బ్రార్, విక్కీ ముద్దుకేరా హత్యలతో సుఖ దునెకెకు సంబంధముందని వాడు మాదకద్రవ్యాలకు బానిసాయి ఫేక్ వీసా మీద కెనడా పారిపోయాడని వాడు చేసిన తప్పులకు శిక్ష పడిందని మా శత్రువులు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బ్రతకరని హెచ్చరించారు. లారెన్స్ పాత్రపై అనుమానాలు.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు ఆరోపణల్లో అహ్మదాబాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్వాలా హత్య కేసులో కూడా లారెన్స్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. సోషల్ మీడియా పోస్టును బట్టి ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత్ కెనడా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ హత్య జరగడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అక్కడి వారికి ట్రావెల్ అడ్వైజరీ మార్గదర్శకాలు చేసి వీసా సేవలను నిలిపివేసింది. చిలికి చిలికి.. భారత్ కెనడా మధ్య సంబంధాలు అంతకంతకు బలహీనపడుతున్నాయి. ఖలిస్థాన్ ఉద్యమం పేరిట ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ర్యాలీగా నిర్వహించి వివాదానికి తెరతీశాయి. ఆనాడు భారత దేశం ఆ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసినా తేలిగ్గా తీసుకున్న కెనడా తర్వాత జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ ఏజెంట్లు కారణమంటూ చేసిన వ్యాఖ్యలు తగువుకు ఆజ్యం పోశాయి. ఇంతలోనే మరో ఉగ్రవాది హత్య జరగడంతో కెనడా వీసాలను నిలిపివేసింది. BIG ⚡️Lawrence Bishnoi gang claims responsibility for K-terrorist Sukhdool Singh's killing in Canada pic.twitter.com/6ZN1T30pb4 — Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2023 ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో దూసుకెళ్తున్న భారతీయుడు -
'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్.. తెలిసే ఈ తప్పు చేశారా?
తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో గానీ కొన్ని సినిమాలు తీస్తున్న దర్శకనిర్మాతలు అడ్డంగా బుక్కైపోతున్నారు. ఫ్యాన్స్ తో బూతులు తిట్టించుకుంటున్నారు. మొన్న ప్రభాస్ 'కల్కి' విషయంలో ఇలానే జరగ్గా.. ఇప్పుడు లారెన్స్ 'చంద్రముఖి 2' చిత్రంపైనా అలాంటి విమర్శలే వస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!) సూపర్‌స్టార్ రజినీకాంత్ 'చంద్రముఖి' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90స్ జనరేషన్ కి ఈయన్ని బాగా పరిచయం చేసింది ఈ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి దాదాపు 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీస్తున్నారు. లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖిగా కంగనా రనౌత్ కనిపించనుంది. ఈ క్రమంలోనే సోమవారం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ప్రశంసలు బదులు ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్‌లో లారెన్స్ వెంకటపతి రాజు గెటప్‌లో కనిపించాడు. కాకపోతే తల పెద్దగా, శరీరం చిన్నగా, చేయి సన్నగా ఉండటం వింతగా అనిపించింది. దీన్ని చూసిన నెటిజన్స్.. తెలిసే ఈ తప్పు జరిగిందా? లేదంటే కావాలనే ఇలా చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు. మొన్నీ మధ్య ప్రభాస్ 'కల్కి' ఫస్ట్ లుక్ విషయంలో ఇలానే జరగ్గా, వెంటనే దాన్ని మార్చి మరో లుక్ విడుదల చేశారు. 'చంద్రముఖి 2' లుక్ ఏమైనా మార్చి రిలీజ్ చేస్తారా? అలానే వదిలేస్తారా అనేది చూడాలి. వినాయక చవితికి ఈ మూవీని థియేటర్లలో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. Thanks to Thalaivar Superstar @rajinikanth! Here’s presenting you the first look of #Vettaiyan 👑 I need all your blessings! Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🔥 #Chandramukhi2 🗝 pic.twitter.com/v4qYmkzeDh — Raghava Lawrence (@offl_Lawrence) July 31, 2023 (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
రాధికా శరత్‌కుమార్‌కు గోల్డ్ రింగ్ గిఫ్టుగా ఇచ్చిన లారెన్స్
కంగనా రనౌత్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న సినిమా చంద్రముఖి-2. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 17 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా చంద్రముఖి–2 సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి తొలిభాగం దర్శకత్వం వహించిన పి. వాసునే తెరకెక్కించారు. ఇందులో లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, వడివేలు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. చదవండి: హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్ ఇక ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ మాసంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్లో లారెన్స్ తనకు బంగారు ఉంగరంతో పాటు ఖరీదైన వాచీ గిఫ్టుగా ఇచ్చినట్లు నటి రాధికా శరత్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు లెరన్స్తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఖుషీ అయ్యారు. -
చంపుతామని బెదిరించినప్పుడు సల్మాన్ డబ్బులు ఆఫర్ చేశాడు:గ్యాంగ్‌స్టర్
ముంబై: గతేడాది మేలో జరిగిన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇది తమ పనేనంటు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో అతని పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే సిద్ధూ హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపుతామని ఓ బెదిరింపు లేఖ ఆయనకు చేరింది. సిద్దూ మూసేవాలను చంపినట్లే నిన్నూ హత్య చేస్తాం అని అందులో ఉంది. లేఖపై పేరు లేకపోయినప్పటికీ ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని అందరికీ అర్థమైంది. కొన్నేళ్ల క్రితమే కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని ఇతడు బెదిరించడం తీవ్ర దుమారం రేపింది. అయితే సల్మాన్‌ను చంపేందుకు రూ.4లక్షలు పెట్టి తుపాకీ కూడా కొన్నట్లు లారెన్స్ బిష్ణోయ్ చెప్పాడు. ఆయన తమ సమాజాన్ని అమమానించాడని, అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. లేదంటే సల్మాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అలాగే సల్మాన్‌ను బెదిరించినప్పుడు ఆయన తమకు భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశాడని, కానీ తాము తిరస్కరించామని తెలిపాడు. 'సల్మాన్ ఖాన్‌పై మా సమాజంలో తీవ్ర ఆగ్రహం ఉంది. ఆమన మమ్మల్ని అవమానించాడు. అతనిపై ఓ కేసు కూడా ఉంది. కానీ ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. ఇప్పటికీ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నాకు ఎవరి సాయం అవసరం లేదు. సల్మాన్‌పై నాకు చిన్నప్పటి నుంచే కోపం ఉంది. ఆయన అహాన్ని అతి త్వరలో లేదా ఆ తర్వాత దెబ్బతీస్తా. ఆయన మా పవిత్ర దేవాలయానికి వచ్చి క్షమాపణలు చెప్పాలి. అప్పుడు మా సమాజం క్షమిస్తే.. నేను ఏమీ అనను..' అని లారెన్స్ బిష్ణోయ్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ చెప్పాడు. WATCH | अपना नाम बड़ा करने के लिए सलमान खान को धमकी देता है लॉरेंस बिश्नोई ? जानिए क्या बोला @RubikaLiyaquat | @akhileshanandd | @jagwindrpatial LIVE - https://t.co/4StwkoboMD#OperationDurdantOnABPNews #LawrenceBishnoi #SalmanKhan pic.twitter.com/OaTqFxdNC9 — ABP News (@ABPNews) March 14, 2023 చదవండి: 'మేడం చాలా క్యూట్‌గా ఉన్నావ్..' అంటూ మహిళా పోలీస్‌ను వేధించిన ఆకతాయి.. -
చంద్రముఖి 2: లారెన్స్‌తో జతకట్టనున్న నయనతార?
తమిళసినిమా: నృత్య దర్శకుడు లారెన్స్ ఇప్పుడు కథానాయకుడిగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటిస్తున్న రుద్రన్ షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 14న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా పి.వాసు దర్శకత్వంలో నటిస్తున్న చంద్రముఖి–2 చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు అధికారం, జిగర్ తండా-2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా మరో నూతన చిత్రానికి కమిట్ అయినట్లు సమాచారం. లారెన్స్‌కు హర్రర్ కామెడీ జానర్ లక్కీ అనే చెప్పాలి. ఇంతకుముందు ఈయన నటించిన కాంచన చిత్రం సీక్వెల్ అన్నీ ఈ జానర్లో రూపొంది విజయం సాధించిన చిత్రాలే. అదేవిధంగా శివలింగ చిత్రం, ప్రస్తుతం నటిస్తున్న చంద్రముఖి 2 చిత్రం హర్రర్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రాలే. తాజాగా ఈయన అంగీకరించిన చిత్రం కూడా హర్రర్ కామెడీ కథా చిత్రమేనని సమాచారం. ఈ చిత్రాన్ని మేయాదమన్ చిత్రం ఫేమ్ రతన్‌కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. దీన్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో నయనతారను నాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సంచలన నటి హిందీలో షారూఖ్‌ఖాన్ సరసన నటిస్తున్న జవాన్ చిత్రం ఒక్కటే ఉంది. జయంరవి సరసన నటిస్తున్న ఇరైవన్ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. లారెన్స్ జతకట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
లారెన్స్‌కు గౌరవ డాక్టరేట్
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్‌కు గౌరవ డాక్టరేట్ వరించింది. సినీ గ్రూప్ డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించిన లారెన్స్ ఆ తర్వాత నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత అంటూ అంచలంచెలుగా ఎదిగారు. అయితే ఈయనలో సేవాభావం అనే మరో మానవతా కోణం కూడా ఉంది. ఎందరో అనాథలను వికలాంగులను చేరదీస్తూ వారికి కొండంత అండగా ఉండటంతో పాటు వారికోసం ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి అదే విధంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా వెంటనే స్పందించి సాయం అందిస్తుంటారు. ఆయన సేవలను గుర్తించిన అంతర్జాతీయ నేర నిరోధక సంస్థ, మానవ హక్కుల సంఘం కలిసి గౌరవ డాక్టరేట్ ప్రకటించాయి. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. రుద్రన్ చిత్ర షూటింగ్లో ఉన్న లారెన్స్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. బదులుగా ఆయన తల్లి హాజరై గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చదవండి: వైరల్.. వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్ స్టార్స్ -
సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్
సింగపూర్: సింగపూర్ కాబోయే ప్రధాన మంత్రిగా ఆ దేశ ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్ అధికార పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని లీ హిసీన్ లూంగ్ వారసుడిగా అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) అధ్యక్షుడిగా వాంగ్ గురువారం పార్టీ ఎంపిక చేసింది. అధికార పార్టీకి నాలుగో తరం అధినాయకుడిగా ఆయన వ్యవహరిస్తారు. -
చంద్రముఖి సీక్వెల్‌పై లారెన్స్ స్పందన
చైన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ బంపర్ హిట్ మూవీ ‘చంద్రముఖికి సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన చంద్రముఖి సినిమా అన్ని భాషలలో విజయవంతం సాధించింది. కాగా చంద్రముఖి సీక్వెల్ సినిమా వార్తను నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గతంలోనే చెప్పారు. అంతేకాదు, ‘చంద్రముఖి 2’లో తాను నటిస్తున్నట్టు లారెన్స్ ఇటీవలే ప్రకటించారు. గతంలో చంద్రముఖి సినిమాకి దర్శకత్వం వహించిన పి.వాసునే ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నట్టు చెప్పారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ నిర్మిస్తోందని తెలిపారు. లారెన్స్ ఈ సినిమా గురించి ప్రకటన చేసినప్పటి నుంచి రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమాలో ప్రధాన కథానాయిక గురించి రూమర్లు వచ్చాయి. హీరోయిన్గా జ్యోతిక అని ఒకసారి, సిమ్రన్ అని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ రూమర్లపై తాజాగా రాఘవ లారెన్స్ స్పందించారు. తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చారు. ‘చంద్రముఖి 2’ కథానాయిక గురించి చాలా రూమర్లు వస్తున్నాయి. జ్యోతిక మేడమ్, సిమ్రన్ మేడమ్ లీడ్ రోల్ చేస్తారని అంటున్నారు. కానీ, ఈ వార్తలన్నీ అసత్యాలు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అధికారికంగా చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు ప్రకటిస్తామని లారెన్స్ తెలిపారు. -
సినీ మువ్వల సివంగి
‘ఏక్ దో తీన్.. చార్ పాంచ్ ఛే సాత్’.... ‘తేజాబ్’కు ఆ పాట కలెక్షన్ల వరద సృష్టించింది. ‘కాటే నహి కట్ తే ఏ దిన్ ఏ రాత్’... ‘మిస్టర్ ఇండియా’ ఈ పాటతో శ్రీదేవిని టాప్ చైర్ మీద కూచోబెట్టింది. ‘నింబొడ నింబొడ నింబొడ’... ఏంటి.. ఐశ్వర్యా రాయ్ ఇంత బాగా డాన్స్ చేస్తుందా అనిపించింది. ‘ఏ కాలే కాలే ఆంఖే’... షారూక్‌ఖాన్ ఆమె ఆడమన్నట్టు ఆడాడు. ‘రాధా క్యూ న జలే’ ఆమిర్‌ఖాన్ ఆమె చెప్పినట్టు గెంతాడు. సరోజ్ ఖాన్. బాలీవుడ్‌ను సుదీర్ఘకాలం ఏలిన ఏకైక మహిళా కొరియోగ్రాఫర్. ప్రభుదేవా, లారెన్స్, ఫర్హా ఖాన్ల జేజమ్మ. మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ ఇన్ ఇండియా. సరోజ్ ఖాన్‌కు మూడేళ్ల వయసున్నప్పుడు గోడ మీద తన నీడను చూస్తూ డాన్స్ చేసేది. తల్లి అది చూసి భయపడింది. కూతురు పుట్టిందనుకుంటే పిచ్చి పిల్ల పుట్టిందేమిటా అని ఆఘమేఘాల మీద డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ‘ఇది పిచ్చేగాని డాన్స్ పిచ్చి. మీ పాపను చైల్డ్ ఆర్డిస్టును చేయండి. ఎలాగూ మీకు డబ్బులు అవసరం కదా’ అన్నాడు తెలిసిన డాక్టరు. అప్పటికి ముంబైలో నిరుపేద చాల్లో ఉంటున్న ఆ కుటుంబంలోని వారికి ఈ మాటలు నచ్చాయి. సరోజ్ ఖాన్‌కు ఐదారేళ్లు వచ్చేటప్పటికి చైల్డ్ ఆర్టిస్టును చేశారు. నాలుగైదు సినిమాలు చేసింది. ఆ తర్వాత వేషాలు రాలేదు. సరోజ్ ఖాన్‌కు పదేళ్లు వచ్చేసరికి తండ్రి చనిపోయాడు. తన తర్వాత ఇంకా నలుగురు తోబుట్టువులున్నారు. తల్లికి ఏమీ తెలియదు. కుటుంబాన్ని తనే నిలబెట్టాలి. సరోజ్ ఖాన్ గ్రూప్ డాన్సర్ అయ్యింది. హీరో హీరోయిన్ల వెనుక పరిగెత్తే పది మందిలో ఒకత్తి అయ్యింది. తిండికి ఎలాగో గడుస్తుంది. కాని ఇది చాలదు. ‘ఏక్ దో తీన్’ పాటలో మాధురీ దీక్షిత్ గురు పరిచయం అప్పటికి డాన్స్ మాస్టర్ బి.సోహన్‌లాల్ (సుప్రసిద్ధ డాన్స్ మాస్టర్ హీరాలాల్ పెద్దన్న) మద్రాసు (చెన్నై)లో పని చేస్తూ అప్పుడప్పుడు బాంబే (ముంబై) వచ్చి పాటలు చేసేవాడు. అతను గ్రూప్డాన్సర్స్లో చురుగ్గా ఉంటున్న సరోజ్ ఖాన్‌ను గమనించాడు. ఒకరోజు సెట్లో సరోజ్ ఖాన్ హెలెన్‌ను అనుకరిస్తూ స్టెప్స్ వేస్తుంటే ‘ఏదీ మొత్తం పాటకు చేసి చూపించు’ అని అడిగాడు. సరోజ్ ఖాన్ తొణక్కుండా అచ్చు హెలెన్లాగే డాన్స్ చేసి చూపించింది. అప్పటి దాకా సోహన్లాల్కు అసిస్టెంట్లు లేరు. పదమూడేళ్ల వయసున్న సరోజ్ ఖాన్‌ను అతడు అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు. ఆయనే ఆమెను తీర్చిదిద్దాడు. సోహన్‌లాల్ యూరప్‌కు షూటింగ్ కోసం వెళ్లినప్పుడు ఆయన చేయాల్సిన పాటను 13 ఏళ్ల వయసులో సరోజ్ కొరియోగ్రాఫ్ చేసింది. ఆ సినిమా ‘దిల్ హి తో హై’ (1963). అందులో రాజ్ కపూర్ హీరో. నూతన్ హీరోయిన్. వాళ్లిద్దరి మీద పాట– ‘నిగాహే మిలానే కో జీ చాహ్ తాహై’. కాని సరోజ్ ఖాన్ తొట్రు పడలేదు. చేసింది. ప్రయాణం మొదలైంది. ధక్ ధక్ కర్నే లగా’లో మాధురీ, అనిల్‌కపూర్ మగ ప్రపంచం సినిమా ప్రపంచం అంటే మగ ప్రపంచం. మగవారు పెత్తనం చేసే ప్రపంచం. సరోజ్ ఖాన్‌కు ఎంత ప్రతిభ ఉన్నా ఎంత బాగా పాటలు చేస్తున్నా గుర్తింపు ఇచ్చేవారు కాదు. అసలు టైటిల్స్‌లో పేరే ఉండేది కాదు. ఒకసారి షూటింగ్లో ఉంటే సీనియర్ నటుడు అశోక్ కుమార్ ఆమెను గమనించి పిలిచాడు. ‘నువ్వు ఇంత బాగా చేస్తున్నావు కదా. నీ పేరు స్క్రీన్ మీద ఎందుకు వేయరు?’ అని అడిగాడు. సరోజ్ ఖాన్ మౌనంగా ఉండిపోయింది. సరే.. ఈ సినిమాలో నీ పేరు వేయిస్తాను అని చెప్పి వేయించాడు. అలా ‘ఇంక్విలాబ్ కీ ఆగ్’ అనే సినిమాలో సరోజ్ ఖాన్ పేరు మొదటిసారిగా పడింది. కాని అప్పటికీ గుర్తింపు రాలేదు. సుభాష్ ఘాయ్ ‘హీరో’ (1983) సినిమాలో సరోజ్ ఖాన్‌ను కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నాడు. ‘హీరో’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సుభాష్ ఘాయ్ తీసుకున్నాడంటే ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది అని మిగిలిన నిర్మాత, దర్శకులు అనుకుని ఆమెను పిలవడం మొదలెట్టారు. టాలెంట్ ఎప్పటి నుంచో ఉంది. సుభాష్ ఘాయ్ లైట్ వేశాడంతే. ‘డోలారే డోలారే’లో మాధురీ, ఐశ్వర్యరాయ్ ఏక్.. దో... తీన్... ఎన్.చంద్ర ‘తేజాబ్’ (1988) తీశాడు. అందులో మాధురి దీక్షిత్ అనే కొత్త హీరోయిన్ని తీసుకున్నాడు. ఆమెకు ఒక మంచి పాట పెట్టాడు. ‘ఈ పాట వస్తున్నప్పుడు ప్రేక్షకులు సీట్లలో ఉండకూడదు. అంతే మీకు నేను చెప్పేది’ అన్నాడు సరోజ్‌ఖాన్‌తో. సరోజ్ ఖాన్ ఈ పాటను ఛాలెంజింగ్‌గా తీసుకుంది. మాధురి దీక్షిత్‌కు ఉన్న డాన్స్ టాలెంట్‌ను ఉపయోగించుకుంది. ‘ఏక్.. దో... తీన్.. చార్.. పాంచ్’... పాటను అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసింది. జనం సినిమా కోసం ఒకసారి, ఈ పాట కోసం ఒకసారి థియేటర్లకు వచ్చారు. మాధురి దీక్షిత్ రాత్రికి రాత్రి సూపర్‌స్టార్ అయ్యింది. ఫిల్మ్‌ఫేర్ వాళ్లు అప్పటివరకు కొరియోగ్రాఫర్‌కు అవార్డ్ పెట్టనేలేదు. ఈ సినిమా వచ్చాక ఆ అవార్డును ఇంట్రడ్యూస్ చేసి సగౌరవంగా సరోజ్ ఖాన్‌కు తొలి అవార్డు ఇప్పించారు. సరోజ్ ఖాన్ దేశంలోని సినిమా ఇండస్ట్రీలన్నీ తలెత్తి చూసే కొరియోగ్రాఫర్ అయ్యిందిప్పుడు. హిట్ల వరుస సరోజ్ ఖాన్ అక్షరాభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దేహ కవళికలతో పాటు ముఖ కవళికలు కూడా ముఖ్యం. వాటికోసం నటీ నటులను సానపెడుతుంది. అందుకే ఆ పాటలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. హిందీలో శ్రీదేవి సరైన హిట్ కోసం చూస్తున్నప్పుడు ‘మిస్టర్ ఇండియాలో’ నీలిరంగు చీర కట్టుకుని ఆమె వేసిన ‘కాటే నహి కట్ తే ఏ దిన్ ఏ రాత్’ పాట స్టెప్పులు ఆమెకు భారీ ఎట్రాక్షన్‌ను తీసుకొచ్చాయి. అదే సినిమాలోని ‘హవా హవాయి’ కూడా శ్రీదేవి మరణించే వరకు ప్రస్తావనకు వస్తూనే ఉండేది. వీటిని చేయించింది సరోజ్ ఖాన్. ‘చాందినీ’లో శ్రీదేవి చేసిన ‘మేరే హాతో మే నౌనౌ చూడియా’ పాట ఆ ఇద్దరికీ పేరు తెచ్చింది. ఇక మాధురి దీక్షిత్‌తో సరోజ్ ఖాన్ హిట్స్‌కు లెక్కే లేదు. ‘బేటా’లో ‘ధక్ ధక్ కర్ నే లగా’, ఖల్ నాయక్‌లో ‘చోళీ కే పీఛే క్యా హై’, యారానాలో ‘మేరా పియా ఘర్ ఆయా’... చాలా పెద్ద హిట్లు. ఇక సంజయ్ లీలా బన్సాలీ తీసిన ‘దేవదాస్’లో ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్ చేసిన ‘డోల రే డోలరే’ పాట సరోజ్ ఖాన్ ప్రతిభకు పతాక. శ్రీదేవితో... జాతీయ పురస్కారం సరోజ్ ఖాన్ అంటే ఎద విరుపులు, కటి కుదుపులు అనుకునే వారు కొందరు ఉండొచ్చు. కాని ఆమె తనకు వచ్చిన అవకాశాన్ని గౌరవించడమే తెలిసిన ప్రతిభాశాలి. దానికి నూరుశాతం న్యాయం చేయడం బాధ్యత అనుకుంటుంది. అయితే తమిళంలో వచ్చిన ‘శ్రింగారం’ (2005) అనే సినిమాకు ఆమె సమకూర్చిన భరతనాట్య నృత్యరీతులు ఆమెకు జాతీయ అవార్డును తెచ్చి పెట్టాయి. చెన్నైలోని సనాతన నృత్య సంస్థ ‘శ్రీకృష్ణ గానసభ’ ఆ సినిమాలో ఆమె చూపిన ప్రతిభను గౌరవించి మొదటిసారిగా ఒక సినిమా కొరియాగ్రాఫర్ని– సరోజ్ ఖాన్ని– పిలిచి సత్కరించుకుంది. అదీ సరోజ్ ఖాన్ ప్రతిభ. ముగింపు సరోజ్‌ఖాన్ స్థూలకాయురాలు. కాని ఆమె డాన్స్ చేయడం మొదలెడితే ఆ దేహం విల్లులా వొంగేది. ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నా ఆమె నృత్యం మానలేదు. ఆపలేదు. ఎందరో శిష్యులను సినిమా రంగానికి ఇచ్చింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మూడేళ్ల వయసు నుంచి నర్తిస్తున్న ఆమె పాదాలు 71వ ఏట శాశ్వత విశ్రాంతిని తీసుకున్నాయి. కాని భారతీయ వెండితెర మీద ఆమె వేసిన పాదముద్రలు మాత్రం బహుకాలం సజీవంగా ఉంటాయి. – సాక్షి ఫ్యామిలీ -
రంగస్థలం రీమేక్‌లో లారెన్స్?
రంగస్థలం చిత్రాన్ని రీమేక్ చేయడానికి నటుడు, నృత్యదర్శకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సన్నాహాలు చేస్తున్నారా?.. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. తెలుగులో రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. చిత్రంలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. ముఖ్యంగా నటి సమంతకు మంచి పేరు వచ్చింది. కాగా ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కులను రాఘవ లారెన్స్ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన నటించిన కాంచన–3 మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ చేస్తానని రాఘవ లారెన్స్ ప్రకటించారు. ప్రస్తుతం కాంచన చిత్రాన్ని అక్షయ్‌కుమార్ హీరోగా హిందీలో చేసే పనిలో బిజీగా ఉన్నారు. నటి కియారాఅద్వాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీబాంబ్ అనే పేరును నిర్ణయించారు. మరో విషయం ఏమిటంటే ఇంతకు ముందు తెలుగులో హిట్ అయిన పటాస్ చిత్ర తమిళ రీమేక్‌లో లారెన్స్ నటించారన్నది గమనార్హం. మొట్టశివ కెట్టశివ పేరుతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. తాజాగా రంగస్థలం చిత్ర రీమేక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారక ప్రకటన ఏదీ లేదన్నది గమనార్హం. ప్రస్తుతం హిందీ చిత్రం లక్ష్మీబాంబ్‌ను పూర్తిచేసే పనిలో లారెన్స్ బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాతే రంగస్థలం రీమేక్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. -
గ్రేట్ రైటర్: డి.హెచ్.లారెన్స్
డేవిడ్ హెర్బర్ట్ లారెన్స్ (1885–1930) ఆంగ్ల కవి, రచయిత. ఇంగ్లండ్‌లోని కార్మికుల ఇంట్లో పుట్టిన లారెన్స్ తన హృదయంలో నిలుపుకొన్న గ్రామసీమల గురించి రాశాడు. వాటిల్లో తీవ్రస్వరంతో లైంగికత, జీవశక్తి, ఉద్వేగ సంబంధ ఆరోగ్యం వ్యక్తమయ్యాయి. ఈ కారణంగా వివాదాస్పద రచయితగా ముద్రపడ్డాడు. తనకున్న విశేషమైన ప్రజ్ఞను బూతుచిత్తరువులు రాయడం కోసం వృథా చేసినవాడిగా అపఖ్యాతి పాలయ్యాడు. ఈ దాడిని తట్టుకోలేక స్వచ్ఛంద దేశ బహిష్కారం విధించుకున్నాడు. ఆరేళ్లు పెద్దదైన, ముగ్గురు పిల్లల తల్లి ఫ్రీడా వీక్లీతో కలిసి జర్మనీ పారిపోయాడు. ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియా, ఇటలీ, శ్రీలంక, అమెరికా, మెక్సికో లాంటి దేశాలు తిరుగుతూ తమ విహారేచ్ఛను సంతృప్తిపరుచుకున్నారు. అయితే జర్మనీ, ఫ్రాన్స్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు బ్రిటిష్ ఏజెంట్‌గా అనుమానాలు ఎదుర్కొన్నాడు. తల్లితో గాఢమైన అనుబంధం కలిగిన లారెన్స్, కేన్సర్‌తో ఆమె మరణించినప్పుడు కదిలిపోయాడు. ఆ సంవత్సరమంతా అనారోగ్య సంవత్సరంగానే గడిపాడు. నిమోనియా, మలేరియాతో తానూ చాలాసార్లు బాధపడ్డాడు. హోమోసెక్సువాలిటీ ఆలోచనలు కలిగినట్టుగా కనిపిస్తాడు. పైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గొప్పవాళ్లందరికీ అటువైపు మొగ్గుంటుంది అని వ్యాఖ్యానించాడు. అయితే లారెన్స్ విషయంలో ఒక ఆకర్షణగా అది కనబడినా, లైంగిక సంబంధం దాకా పోయినట్టుగా ఆధారాలు లేవు. క్షయ వ్యాధి కారణంగా 45 ఏళ్ల వయసులో మరణించాకగానీ లారెన్స్ రచనా విశిష్టతను సాహిత్యలోకం అంచనా కట్టలేకపోయింది. ‘సన్స్ అండ్ లవర్స్’, ‘ద రెయిన్బో’, ‘లేడీ ఛాటర్లీస్ లవర్’, ‘విమెన్ ఇన్ లవ్’ ఆయన ప్రసిద్ధ రచనలు. -
స్క్రీన్ ప్లే 16th July 2018
-
రజనీ, కమల్ కలిసి పనిచేయాలి : లారెన్స్
పెరంబూరు: నటులు రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లో కలిసి పని చేస్తే బాగుంటుందని నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ అన్నారు. ఇటీవల జల్లికట్టు క్రీడలో ప్రాణాలు కోల్పోయిన సేలానికి చెందిన యోగేశ్వరన్ కుటుంబానికి ఈయన ఇల్లు నిర్మించి ఇచ్చారు. బుధవారం ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సేలం వెళ్లిన లారెన్స్ మీడియాతో మాట్లాడారు. యేగేశ్వరన్ జల్లికట్టు పోటీల్లో ప్రాణాలు కోల్పోయాడన్న విషయం తెలిసి తాను అతని అంత్యక్రియలకు హాజరయ్యానన్నారు. ఆ సమయంలో యోగేశ్వరన్ తల్లిదండ్రుల కంటతడి తనను కదిలించదన్నారు. వారి పెద్ద కొడుకులా యోగేశ్వరన్ బాధ్యతలను నెరవేర్చుతానని వారికి మాట ఇచ్చానని చెప్పారు. ఆ ప్రకారం వారికి ఇల్లు నిర్మించి ఇచ్చినట్టు తెలిపారు. తాను రాజకీయాల్లోకి రావాలన్న కాంక్షతోనే ఇలాంటివి చేస్తున్నానని కొందరు అంటున్నారన్నారు. అయితే గత పదేళ్ల నుంచి తాను వివిధ రకాలుగా సేవలందిస్తున్నానన్నారు. వృద్ధ, అనాథ ఆశ్రమాలను నిర్వహణ, 142 మందికి గుండె శస్త్ర చికిత్సలకు సాయం చేశానని గుర్తు చేశారు. రాజకీయం అంటే సేవ అని మా అమ్మకు అర్థం అయ్యాకే తాను రాజకీయాల్లోకి వస్తానని లారెన్స్ వెల్లడించారు. నటుడు రజనీకాంత్ తన గురువన్నారు. రజనీకాంత్, కమలహాసన్ ప్రజలకు సేవ చేయాలన్న భావంతోనే రాజకీయరంగప్రవేశం చేశారన్నారు. -
ఇక్కడ రామ్‌చరణ్... అక్కడ లారెన్స్!
కాలభైరవ అంటే తెలుగులో అయితే వెంటనే హీరో రామ్‌చరణ్ గుర్తొస్తారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ సినిమా సెకండాఫ్‌లో రామ్‌చరణ్ క్యారెక్టర్ నేమ్ అదే. తమిళంలో మాత్రం కాలభైరవ అంటే ఇకపై రాఘవ లారెన్స్ గుర్తొస్తారేమో. ఎందుకంటే ఆయన నెక్ట్స్ చిత్రం టైటిల్ అదే. ‘‘మై డియర్ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్. నా నెక్ట్స్ సినిమా టైటిల్ ‘కాల భైరవ’. ప్రస్తుతం ‘కాంచన 3’ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ‘కాలభైరవ’ షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నాం. బహుశా ఏప్రిల్‌లో స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మరో రెండు సినిమాల గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అన్నీ కుదరితే మార్చిలోపు ఆ సినిమాల వివరాలు కూడా చెబుతాను’’ అని పేర్కొన్నారు లారెన్స్. ప్రస్తుతం లారెన్స్, ఓవియా, వేదిక నటిస్తున్న ‘కాంచన 3’ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఈ సినిమాలోని లేటెస్ట్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీరు చూస్తొన్న ఫోటో అదే. -
రజనీకాంత్‌కు బాడీగార్డుగా ఉంటా?
-
తప్పుకోలేదు!
ఓవియా తప్పుకోలేదు. వచ్చిన వార్తలే తప్పు అంటున్నారు ‘కాంచన–3’ చిత్రబృందం. ఓవియా గురించి ఈ చిత్రబృందం ఎందుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంటే.. ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆమె ఈ హారర్ మూవీ నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. సినిమా సగం పూర్తయింది. ఇప్పుడు హీరోయిన్ తప్పుకుందనే వార్త అంటే అనవసరమైన రచ్చే కదా. అందుకే, ‘నో నో.. ఓవియా ఈజ్ దేర్’ అన్నారు. హారర్ సినిమాల మాంత్రికుడు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న సినిమా ‘కాంచన–3’. లారెన్స్, ఓవియా, వేదిక కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ 55 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. ఇంతకీ ఈ ఓవియా ఎవరంటే.. తరుణ్ హీరోగా నటించిన ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాలో తనే కథానాయిక. అలాగే వేదిక తెలుగులో బాణం, విజయదశమి, దగ్గరగా దూరంగా వంటి చిత్రాల్లో నటించారు. 2006లో వచ్చిన ‘ముని’ ఫ్రాంచైజీ తొలి పార్ట్‌లో తనే కథానాయిక. మళ్లీ ఈ పార్ట్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో నైట్ షూట్ జరుగుతోంది. -
18లో ఒకటి... 19లో మరొకటి!
ఓ కథ 18వ శాతాబ్దంలో, మరో కథ 19వ శతాబ్దంలో జరుగుతుంది. ఈ రెండు కథలు కలిస్తే ఓ సినిమా వస్తుందట! విజయేంద్ర ప్రసాద్ ‘బాహుబలి’ కథ రాస్తే, ఆయన తనయుడు రాజమౌళి రెండు సినిమాలుగా తీశారు. ‘మిత్రుడు, జాగ్వార్’ సినిమాలు తీసిన రాజమౌళి శిష్యుడు మహదేవ్, ఇప్పుడాయన రాసిన రెండు కథలను ఓ సినిమాగా తీయనున్నారట. తెలుగు, తమి భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో రాఘవా లారెన్స్ హీరో. పీరియాడికల్ డ్రామాగా కమర్షియల్ ఫార్మాట్లో రూపొందనున్న ఈ సినిమాలో కొంత భాగం 18వ శతాబ్దంలో, మిగతాది 19వ శతాబ్దంలో జరుగుతుందని సమాచారం. దీనికి హీరోయిన్గా కాజల్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉందట. లారెన్స్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించబోయే సినిమా ఒకటి సెప్టెంబర్‌లో మొదలవుతుందట. ముందు ఆ సినిమాను పూర్తి చేసి, తర్వాత ఈ సినిమాను స్టార్ట్ చేస్తారట! -
దడ పుట్టిస్తా!
‘దడ పుట్టిస్తా.. నీకు దడ పుట్టిస్తా..’ అనే పాట చాలామందికి గుర్తుండే ఉంటుంది. లారెన్స్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘డాన్’లోని పాట ఇది. మరి.. ఈ పాట మహత్యమో ఏమో అప్పటి నుంచి మొన్నటి ‘శివలింగ’ వరకూ లారెన్స్ నిజంగానే దడ పుట్టిస్తున్నారు . ముని, కాంచన, గంగ, శివలింగ... ఇలా వరుసగా హారర్ థ్రిల్లర్స్ చేసి, ప్రేక్షకులకు దడ పుట్టిస్తున్నారు. ఈ చిత్రాలు వసూళ్ల సునామీతో బాక్సాఫీస్‌ని దడదడ లాడిస్తున్నాయి. ఇప్పుడు లారెన్స్ మరో హారర్ మూవీలో యాక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో లారెన్స్‌తో కలిసి కాజల్ అగర్వాల్ కూడా దడ పుట్టించనున్నారట. ఇటీవల ‘జాగ్వార్’ని తెరకెక్కించి న దర్శకుడు మహాదేవ్ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కిస్తారట. ఇప్పటివరకూ హారర్ చిత్రాల్లో నటించని కాజల్ ఈ చిత్రానికి అడగ్గానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. -
లారెన్స్‌తో కాజల్ సై అంటుందా?
ఒక క్రేజీ కాంబినేషన్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ కోలీవుడ్‌లో స్ప్రెడ్ అవుతోంది. బాహుబలి–2 చిత్ర వాడివేడి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ ఏ నోట విన్నా బాహుబలి–2 చిత్రం మాటే. సరే ఈ చిత్రానికి లారెన్స్, కాజల్‌అగర్వాల్‌ల తాజా చిత్రానికి ఏమిటి సంబంధం అనేగా మీ సందేహం. బాహుబలి–2 చిత్ర సృష్టికర్త రాజమౌళి శిష్యుడు మెగాఫోన్ పట్టనున్నారన్నే తాజా సమాచారం. మొట్టశివ కెట్టశివ, శివలింగ చిత్రాల తరువాత నటుడు లారెన్స్ స్వీయ దర్శకత్వంలో ముని4 చిత్రాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో ఉండగా రాజమౌళి శిష్యుడు చెప్పిన కథ నచ్చడంతో ముందు ఆయన దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారట. కాగా ఇందులో లారెన్స్ సరసన నటి కాజల్ అగర్వాల్‌ను నాయకిగా ఎంపిక చేసే పనిలో ఉన్నారట చిత్ర యూనిట్. మరి ప్రస్తుతం అజిత్‌తో వివేగం, విజయ్ 61వ చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ లారెన్స్‌తో జత కట్టడానికి రెడీ అంటుందా? అన్నది వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
అనుష్కకు చెల్లెలవుతున్న రితికా
కథానాయకి ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న కథాచిత్రాలు ఇటీవల కాస్త పెరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇద్దరు కథానాయికల సెంట్రిక్ కథా చిత్రాలు రావడం అరుదైన విషయమే. త్వరలో అలాంటి యాక్షన్ కథా చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఇందులో స్వీటీ అనుష్క, బ్యూటీ రితికాసింగ్ కలిసి నటించనున్నట్లు తెలిసింది. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు పేరుగాంచినది నటి అనుష్క అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అరుంధతి, రుద్రమదేవి చిత్రాలు తన నటనాచాతుర్యానికి నిదర్శనం. బాహుబలి చిత్రంలో దేవసేనగా పరిమిత పాత్రలో అయినా తన ఉనికిని చాటుకున్న అనుష్క దానికి సీక్కెల్ బాహుబలి–2లో మరో సారి కత్తిపట్టి విజృంభించనున్నారు. అదే విధంగా భాగమతి అనే మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న అనుష్క తాజాగా మరో నూతన చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఒక ఇరుదుచుట్రు చిత్రంతో ఒకేసారి హిందీ, తమిళ భాషల్లో పరిచయమైన రియల్ బాక్సర్ రితికాసింగ్ తొలి చిత్రంలోనే జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత నటించిన ఆండవన్ కట్టళై చిత్రం ఇటీవల ఇరుదుచుట్రుకు రీమేక్‌గా తెరకెక్కిన తెలుగు చిత్రం గురు చిత్రాలు తన ఖాతాలో సక్సెస్‌ఫుల్‌గా నిలిచాయి. ఇక లారెన్స్‌కు జంటగా నటించిన శివలింగ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. దీంతో రితికాసింగ్ కూడా తదుపరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అనుష్కకు చెల్లెలిగా నటించడానికి రెడీ అవుతున్నారట. ఇద్దరికీ ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో యాక్షన్ కథా చిత్రంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. -
నిక్కీ పాలసీ తెలుసా?
చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్న లక్కీ నాయకి నిక్కీగల్రాణి. డార్లింగ్ అంటూ కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీకి ఆ చిత్ర విజయం జోరును పెంచింది. లారెన్స్ తో రొమాన్స్ చేసిన మొట్టశివ కెట్టశివ సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో అమ్మడు మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం విక్రమ్ ప్రభుతో నెరుప్పుడా, గౌతమ్ కార్తీక్‌కు జంటగా హరహర మహేదేవకీ చిత్రాలతో పాటు మరగద నాణయం, కీ, పక్కా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటితో పాటు మలయాళంలో టీమ్–5 అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఆ చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తోందట. కారణం ఇందులో వివాదాస్పద క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్‌కు జంటగా నటించిందట. దీంతో టీమ్–5 చిత్రం కోసం మలయాళ చిత్ర పరిశ్రమే ఆసక్తిగా ఎదురు చూస్తోందని, తానూ ఈ చిత్రంతో మాలీవుడ్‌లో బలంగా చొచ్చుకుపోతాననే నమ్మకం ఉందని నిక్కీగల్రాణి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మడి పాలసీ ఏమిటో తెలుసా? తక్కువ పారితోషికం దారాళంగా అందాలారబోయడం. అందుకే అవకాశాలు వరుసగా తలుపు తడుతున్నాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అలాగే మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది నిక్కీ. ఇకపోతే ఈ బ్యూటీ శునక ప్రేమికురాలట. నటి త్రిష తరువాత అంతగా కుక్కల్ని పెంచుకుంటున్న నటి నిక్కీగల్రాణినేనట. షూటింగ్ లేని సమయాల్లో ఈ భామకు కాలక్షేపం తన పెట్టీ డాగ్సేనట. -
శ్రీమఠంలో సినీ నటుడు లారెన్స్
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ హీరో, దర్శకుడు రాఘవలారెన్స్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి మంత్రాలయం వచ్చారు. ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టారు. రాఘవేంద్రస్వామి మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రథయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు పంచముఖి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు తల్లి కల్మణి, తమ్ముడు ఎల్విన్విన్ పాల్గొన్నారు. లారెన్స్ మాట్లాడుతూ దాదాపు 420 చిత్రాలకు నృత్య దర్శకుడిగా, 10 చిత్రాలకు దర్శకుడిగా, 16 చిత్రాల్లో నటుడిగా పనిచేసినట్లు వెల్లడించారు. -
పోలీస్ ఆధికారిగా లారెన్స్
రాఘవ లారెన్స్ తొలిసారిగా పోలీస్ అధికారిగా నటించిన చిత్రం మొట్టశివ కెట్టశివ. అనేక విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్బీ.చౌదరి నిర్మించిన 88వ చిత్రం ఇది. యువ దర్శకుడు సాయిరమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్ ప్రధాన పాత్రను పోషించారు. నటి నిక్కీగల్రాణి నాయకిగా నటించిన ఈ చిత్రంలో నటి రాయ్‌లక్ష్మీ ఒక ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. ఇతర ముఖ్య పాత్రల్లో సతీష్, శ్రీమాన్, తంబిరామయ్య, మనోబాలా, నాన్ కడవుల్ రాజేంద్రన్, వీటీవీ.గణేశ్, దేవదర్శిని, సుకన్య, శ్యామ్, మయిల్సామి నటించారు.అశ్వంత్దోశ్రాణ, వంశీకృష్ణ, శరత్దీప్ ప్రతినాయకులుగా నటించిన ఈ చిత్రానికి అమ్రిష్ సంగీతాన్ని అందించారు. ఇది ఇద్దరు పోలీస్ అధికారుల మధ్య ఈగో ఎలాంటి సంఘటనలకు దారి తీసిందన్నదే చిత్ర కథ అని దర్శకుడు తెలిపారు. ఈ ఇద్దరి పోలీసుల మధ్య వివాదంతో లబ్ధిపొందాలనుకున్న సంఘ విద్రోహుల పాచికలు పారాయా?అన్న ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం మొట్టశివ కెట్టశివ అని చెప్పారు.రాఘవ లారెన్స్్ ను పోలీస్ అధికారిగా కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రం ఇదన్నారు. ఈ నెల 17న తెరపైకి రానున్న ఈ చిత్ర ఆడిమో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ ఆదివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో ఘనంగా నిర్వహించారు. -
నాకేం తక్కువ!
పొగరుబోతుగా పేరు తెచ్చుకున్న నటి నిత్యామీనన్ కు ఇప్పుడు చాలా బెంగ పట్టుకుందట. ఇంతకు ముందు అవకాశాలు లేకపోయినా పర్వాలేదు హాయిగా ఇంట్లో కూర్చుంటాను కానీ అందుకోసం ఎవరినీ అడగను అని బింకాలు తీసిన ఈ అమ్మడు ఇప్పుడు ఆ అవకాశాలు రాకపోవడంతో చాలా ఇదైపోతోందట. మార్కెట్ ఉన్నప్పుడు మాటలు వేరు, అది లేనప్పుడు మాటలు వేరని నిత్యామీనన్ ను చూస్తే అర్థం అవుతుంది కదూ. ఈ కేరళ కుట్టికి అవకాశాలు అడపాదడపా వస్తున్నా అవి రెండవ హీరోయిన్ పాత్రలే కావడంతో ఇందుకు కారణం ఏమిటని తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధ పడిపోతోందట. తనకు అందం తక్కువా? అభినయ ప్రతిభ లేదా? అంటూ వాపోతోందట. నిజం చెప్పాలంటే మణిరత్నం చిత్రం ఓ కాదల్ కణ్మణి తరువాత నిత్యామీనన్ సోలో నాయకిగా నటించిన చిత్రాలు లేవనే చెప్పాలి. చాలా మందికి చెప్పినట్లే తన గోడును కాంచన–2 చిత్రంలో వైవిధ్యభరిత పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించిన లారెన్స్ వద్ద చెప్పుకుందట. అందుకు ఆయన అన్న మాట ఇంత బొద్దుగా ఉంటే ఎవరు మాత్రం కథానాయకి అవకాశాలు ఇస్తారు? ముందు బరువు తగ్గే ప్రయత్నం చేయండి అని చెప్పారట. కథానాయికలకు శారీరక అందం చాలా ముఖ్యం అని, సన్నగా, నాజూగ్గా ఉంటేనే అవకాశాలు వస్తాయని అన్నారట. అంతే కాదు స్లిమ్‌గా, గ్లామరస్‌గా ఎలా తయారవ్వాల్లో హిందీ నటి అనుష్కాశర్మను అడిగి తెలుసుకోండి అని ఉచిత సలహా కూడా ఇచ్చారట. దీంతో అమ్మడు ఇప్పుడు బరువు తగ్గి అందాన్ని పెంచుకునే పనిలో పడ్డారట. -
మాట్లాడుతూ భోరుమన్న లారెన్స్!
చెన్నై: జల్లికట్టుకు మద్దతుగా మెరీనా బీచ్‌లో ఉద్యమిస్తున్న యువతను పోలీసులు బలవంతంగా తరలిస్తుండటంపై ప్రముఖ సినీ నటుడు లారెన్స్ ఆవేదనతో స్పందించారు. మెరీనా బీచ్‌లోని యువతతో చర్చలు జరుపాలని తాము నిన్నరాత్రే నిర్ణయించామని ఆయన తెలిపారు. ఇంతలోనే పోలీసులు మెరీనా బీచ్‌పై విరుచుకుపడి.. యువతను బలవంతంగా తరలిస్తుండటంతో అక్కడ భయాందోళన రేకెత్తించే వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరీనా బీచ్ నుంచి ఓ మహిళ తనకు ఫోన్ చేసి.. టీవీ చూడమని చెప్పిందని, టీవీ పెట్టి చూస్తే.. పోలీసుల వల్ల మెరీనా బీచ్‌లో ఉన్న యువత భయాందోళనకరంగా కనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే మెరీనా బీచ్ వెళ్లేందుకు ప్రయత్నించానని, తాను ఎంత వేడుకున్నా పోలీసులు అనుమతించలేదని తెలిపారు. గంటలోపు ఎట్టిపరిస్థితుల్లో, ఎలాగైనా మెరీనా బీచ్‌కు చేరుకునేందుకు తాను ప్రయత్నిస్తానని, అంతలోపు యువత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, భయాందోళనకు గురికావొద్దని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా సముద్రంలోకి దిగి యువత ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తుంటే.. గుండె తరుక్కుపోతున్నదని ఆయన కంటతడి పెడుతూ చెప్పారు. ఏది ఏమైనా మీ ప్రాణాలు అన్నింటికంటే ముఖ్యమైనవని, యువత ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. -
ఫిబ్రవరిలో లారెన్స్ శివలింగా
కొరియెగ్రాఫ్గా మంచి ఫాంలో ఉండగానే దర్శకుడిగా మారి తరువాత హీరోగానూ వరుస సక్సెస్‌లు సాధిస్తున్న నటుడు లారెన్స్. ముని సీరీస్‌తో సూపర్ హిట్ లు సాధించిన లారెన్స్ మరో హర్రర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గత చిత్రాలను తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ డాన్సింగ్ స్టార్ కొత్త సినిమాను ఓ సినీయర్ దర్శకుడితో చేస్తున్నాడు. కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన శివలింగా సినిమాను అదే పేరుతో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న లారెన్స్. ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్‌ను డైరెక్ట్ చేసిన పి.వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఇంటింటికీ ఉచితంగా మొక్కల సరఫరా
ఎవరైనా కోరితే ఇంటింటికీ ఉచితంగా మొక్కలు సరఫరా చేస్తానని నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్స్ తెలిపారు.సేవా కార్యక్రమాలకు ముందుండే ఈయన తాజాగా సమాజానికి ప్రయోజనం చేకూర్చే మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇటీవల వర్దా తుపా¯ŒS తమిళనాడును అతలాకుతలం చేసింది. లక్షలకు పైగా తరతరాలకు చెందిన వటవృక్షాలను వేళ్లతో సహా పెకలించి వేసింది. మరో పక్క నీటి ఎద్దడితో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. దీంతో వృక్షసంపదను పెంచే ప్రయత్నానికి నటుడు లారెన్స్ నడుంబిగించారు. తన ట్రస్ట్ ద్వారా గురువారం నుంచి చెన్నై నగరంలో మొక్కలు నాటడానికి సన్నద్ధం అవుతున్నారు. అదే విధంగా ఎవరైనా మొక్కలు కావాలని కోరితే వారి ఇంటికి వెళ్లి ఉచితంగా మొక్కలను అందిస్తానని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో లారెన్స్ పేర్కొన్నారు. -
సూపర్‌స్టార్ చిత్ర రీమేక్‌లో లారెన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం మూండ్రుముఖం. ఇందులో రజనీకాంత్ త్రిపాత్రాభినయంలో అదరగొట్టారు. ఈ చిత్ర రీమేక్‌లో నటించాలని ఇళయదళపతి విజయతో సహా పలువురు ఆకాంక్షను వ్యక్తం చేశారు. చివరికి ఆ అదృష్టం నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్సను వరించింది. ఈయన సూపర్‌స్టార్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. లారెన్స నటించనున్న మూండ్రుముఖం రీమేక్ చిత్రాన్ని శ్రీరాఘవేంద్ర ప్రొడక్షన్స సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందన్నది తాజా సమాచారం. సుమారు వంద కోట్లు వసూలు చేసిన కాంచన- 2 చిత్రం తరువాత లారెన్స మెట్టశివ కెట్టశివ, శివలింగ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలను పూర్తి చేసి మూండ్రుముఖం చిత్ర రీమేక్‌కు సిద్ధం అవుతారన్న మాట. ఇంకా పేరు నిర్ణరుుంచని ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్ర నిర్మాణంలో ఇంతకు ముందు తిగర్తండా వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శ్రీ మీనాక్షి క్రిమేషన్స అధినేత ఎం. కదిరేశన్ భాగం పంచుకోనున్నారు. -
రజనీ పాత్రలో లారెన్స్
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పాత్రలో మరో నటుడు కనిపించాలని నిర్ణయించుకోవటం సాహసమే. అయితే ఆ సాహసానికి రెడీ అవుతున్నాడు కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో లారెన్స్. ఇటీవల వరుసగా హర్రర్ సినిమాలతో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను భయపెడుతున్న లారెన్స్ ప్రస్తుతం పటాస్ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతున్న మొట్ట శివ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి తనకు బాగా కలిసొచ్చిన హర్రర్ జానర్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటి వరకు తన దర్శకత్వంలోనే హర్రర్ సినిమాలు చేసిన లారెన్స్, ఈ సారి చంద్రముఖి ఫేం పి.వాసు దర్శకత్వంలో నటిస్తున్నాడు. చంద్రముఖి సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈసినిమాను ముందుగా రజనీతోనే చేయాలని భావించినా.., రజనీకాంత్ ఇంట్రస్ట్ చూపించకపోవటంతో లారెన్స్‌కు ఫిక్స్ అయ్యారు. అనుష్క హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
హీరోగా బిజీ అవుతున్న డాన్స్ మాస్టర్
-
టాప్ హీరోయిన్ కాలేకపోయా..
పలు భాషల్లో నటించినా ప్రముఖ హీరోయిన్గా పేరు తెచ్చుకోలేకపోయానని నటి తాప్సీ వాపోతున్నారు. బహుభాషా నటిగా గుర్తింపు పొందిన మూడు పదుల వయసుకు చేరవలో ఉన్న ఈ ఢిల్లీ భామ తమిళంలో ధనుష్ సరసన ఆడుగళం చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత కూడా జీవా తదితర పలువురు యువ నటులకు జంటగా నటించారు. ఇటీవల కాంచన-2లో లారెన్స్‌తో నటించి విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా దిగుమతి అయ్యారు. ఇలా బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా టాప్ నాయికల వరుసలో చేరలేకపోయారు. ఇది తనకు బాధాకరమైన విషయమేనంటున్న తాప్సీ ప్రముఖ హీరోల సరసన నటిస్తేనే తగినంత ప్రాచుర్యం లభిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేకపోయినా హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్లో రాణించడం చాలా కష్టం అంటున్న తాప్సీకీ ఇప్పుడు బిగ్‌బీ అమితాబ్‌తో నటించే లక్కీ ఛాన్స్ లభించింది. అదే విధంగా అక్షయ్‌కుమార్‌తో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాలపై తను చాలా నమ్మకం పెట్టుకున్నారట. ఈ రెండు చిత్రాలు విడుదలైన తరువాత తన రేంజే మారిపోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కచ్చితంగా తానూ టాప్ హీరోయిన్ అనిపించుకుంటాననే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
బాలయ్యతో కాదు లారెన్స్‌తో..!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా శివలింగ. ఇటీవలే ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోగా ఆ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే అదే సమయంలో బాలకృష్ణ హీరోగా శివలింగ సినిమాను టాలీవుడ్లో రీమేక్ చేసే ఆలోచన ఉందన్న టాక్ వినిపించింది. అంతేకాదు చిత్ర దర్శకుడు పి వాసు కూడా శివ లింగ సినిమాను బాలయ్యతో రీమేక్ చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ప్రస్తుతం తన వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి పనుల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ, ఇప్పట్లో పి వాసుకు డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. అందుకే బాలకృష్ణతో అనుకున్న శివలింగ రీమేక్‌ను లారెన్స్ హీరోగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. లారెన్స్ హీరోగా నటిస్తే ఒకేసారి తెలుగు, తమిళలో రిలీజ్ చేయోచ్చేనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. -
జీవాతో రొమాన్స్‌కు నిక్కీ సై
మధ్య స్థాయి కథానాయకులకు లక్కీ నాయకిగా మారిన నటి నిక్కీగల్రాణి అని చెప్పవచ్చు. డార్లింగ్ చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత యాగవరాయన్ నాకాక్క చిత్రాల్లో నటించారు. ఇటీవల విష్ణువిశాల్‌తో రొమాన్స్ చేసిన వేల్లైన్ను వందుట్టా వెల్లైక్కారన్ చిత్రం అనూహ్య విజయంతో అమ్మడి క్రేజ్ అదే స్థాయిలో పెరిగిపోయింది. ప్రస్తుతం నాలుగు చిత్రాల వరకూ చేతిలో ఉన్నాయి. మరిన్ని కొత్త అవకాశాలు నిక్కీ కోసం ఎదురు చూస్తున్నాయి.విజయ్, అజిత్, విక్రమ్ వంటి స్టార్ హీరోల తరువాత స్థాయిలో రాణిస్తున్న జీవా, జీవీ.ప్రకాశ్, విక్రమ్‌ప్రభు లాంటి హీరోలకు నిక్కీగల్రాణి లక్కీ హీరోయిన్గా మారారని చెప్పవచ్చు. ప్రస్తుతం లారెన్స్ సరసన మొట్టశివ కెట్టశివ, జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రాల్లో నటిస్తున్న నిక్కీగల్రాణి త్వరలో విక్రమ్‌ప్రభుకు జంటగా నటించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా మరో అవకాశం నిక్కీని వరించింది. నటుడు జీవాతో డ్యూయెట్లు పాడే చాన్స్‌ను దక్కించుకుంది. నిజానికి కవలై వేండామ్ చిత్రంలోనే జీవాతో నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం మిస్ అయ్యింది. అందులో నటి కాజల్‌అగర్వాల్ నటిస్తున్నారు. జీవా మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ చిత్రానికి కీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నిక్కీగల్రాణి ఆయనకు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. దీనికి దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడు కాళీష్ దర్శకత్వం వహించనున్నారు. ఆర్జే.బాలాజీ ముఖ్య పాత్రను పోషించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నట్లు సమాచారం. -
‘చంద్రముఖి-2’లో...?
లక లక లక అంటూ ‘చంద్రముఖి’లో జ్యోతికను తమకంగా చూస్తూ, రజనీకాంత్ అనే డైలాగ్‌ను అంత సులువుగా మర్చిపోలేం. యాంటీ షేడ్స్ ఉన్న కింగ్‌గా ఆ డైలాగ్‌ని రజనీ అద్భుతంగా పలికితే, జ్యోతిక అంతే అద్భుతంగా నటించారు. పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి అందరికీ తెలుసు. దీనికి సీక్వెల్ చేయాలని వాసు అనుకున్నారు కానీ, కుదరలేదు. అందుకేనేమో తమిళంలో తాను చేయ నున్న తాజా చిత్రానికి ‘చంద్రముఖి-2’ అని పెట్టుకుని ఉంటారని చెన్నై చిత్రపరిశ్రమ వారు అంటున్నారు. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా ఇటీవల పి. వాసు ‘శివలింగ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్నే తమిళంలో రీమేక్ చేయాలను కుంటున్నారట. దీనికే ‘చంద్రముఖి-2’ అని టైటిల్ అనుకుంటున్నారట. తమిళంలో లారెన్స్, అనుష్క జంటగా ఈ చిత్రాన్ని రూపొందించాలను కుంటున్నారని సమాచారం. ‘చంద్రముఖి’లో సందడి చేసిన వడివేలు ఈ చిత్రంలో కూడా నటిస్తారని టాక్. -
ఈ ఆలయం తల్లులందరికీ అంకితం
సృష్టికి అమ్మ దైవం అయితే జగతికి తల్లే దైవం.అందుకే అమ్మ ను వించిన దైవం ఉండదు అంటారు. ఇది జగమెరిగిన సత్యం. అయినా ఇప్పుడు అమ్మను ప్రేమించేవారు,గౌరవించేవారు ఎందరుంటారు? అయితే నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ అమ్మను ప్రేమించడమే కాదు పూజిస్తున్నారు. తన మాతృమూర్తికి ఏకంగా ఒక గుడిని కట్టి ఆరాధించనున్నారు. తల్లి జీవించి ఉండగానే ఆమెకు గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ట చేయడం అన్నది తమిళనాడులోనే,ప్రపంచంలోనే తొలి ప్రయత్నం లారెన్స్దే అయ్యింటుంది.అమ్మను ఆరాధించేవారు ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించగలరు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధ్యుడైన లారె న్స్ ఆయనకు ఆల యాన్ని నిర్మించి నిత్యార్చనలు జరిపిస్తున్నారు. అమ్మను అమితంగా ప్రేమించే ఆయన ఇప్పుడు ఆ ఆలయం ఎదురుగా తల్లికి గుడి కట్టిస్తున్నారు. గుడి నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. మరో రెండు నెలల్లో ప్రారంభోత్సవం జరగనుంది.ఆ గర్భగుడిలో తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి లారెన్స్ సన్నాహాలు చేస్తున్నారు.తల్లి శిలారూపాన్ని రాజస్థాన్‌లో తయారు చేయిస్తున్నారు.ఆ శిలారూపం ఫొటోను మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం లారెన్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైనదంటారు. ఆ గాయత్రీదేవి ప్రతిమను అమ్మకు కట్టిస్తున్న గుడి లో ప్రతిష్టించి ఆ ప్రతిమ కింద అమ్మ కణ్మణి శిలావిగ్రహాన్ని నెలకొల్పనున్నాను.తన గర్భంలో తొమ్మిది నెలలు మోసి,పెంచి పోషించిన కన్నతల్లికి గుడి కటించాలన్నదే లక్ష్యంగా భావించాను. తల్లి ఘనతను ఈ లోకానికి చాటాలన్నదే ఈ గుడి కట్టించడంలో పరమార్థం. మా కోసం ఎంతగానో శ్రమించిన అమ్మకు గుడి కట్టించడం సంతోషంగా ఉంది. ఉదయం వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్న అమ్మకు నేను తయారు చేయిస్తున్న తన శిలారూపం ఫొటోను చూపించగా అమ్మ ఎంతగానో పరవశించారు.తమ్ముడు ఎల్లిన్ తదితరులలో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ మాతృదినోత్సవం సందర్భంగా మా అమ్మకు కట్టిస్తున్న గుడిని ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ అంకితం చేస్తున్నానన్నారు లారెన్స్. -
గుండె జారి గల్లంతయ్యిందే!
వెన్నెలింత వేడిగా.. ఎండ ఇంత చల్లగా... అనే పాట గురించి తెలిసే ఉంటుంది. ప్రేమలో ఫుల్‌గా మునిగిపోయి, వెంకీ, నయనతార ‘తులసి’లో పాడుకున్న పాట ఇది. ఇప్పుడు రాయ్ లక్ష్మి.. అదేనండి.. లక్ష్మీరాయ్ హాట్ హాట్ ఫొటోగ్రాఫులు చూసిన కుర్రకారు ఎండ ఏదో వెన్నెలేదో తెలియక తికమకపడిపోతున్నారు. ఆ రేంజ్లో ఉన్నాయి అమ్మడి ఫొటోలు. హిందీ చిత్రం ‘జూలీ-2’లో ఇంతకుముందు ఏ చిత్రంలోనూ కనిపించనంత హాట్‌గా కనిపించనున్నారు రాయ్ లక్ష్మి. ఆ ఫొటోలు చూసి, ఇంత హాట్‌గా కనిపిస్తే, మా గుండె జారి గల్లంతయిపోతుందని ఆమె ఫ్యాన్స్ తీపి బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్లో తనకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు రాయ్ లక్ష్మి. ఆ సంగతలా ఉంచితే.. ఒకవైపు కథానాయికగా నటిస్తూ, అడపా దడపా ఆమె ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ ‘బలుపు’, పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాల్లో ప్రత్యేకపాటలో కనువిందు చేశారు రాయ్‌లక్ష్మి. తాజాగా లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ‘మొట్ట శివ కెట్ట శివ’ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌లో మెరవబోతున్నట్లు సమాచారం. ఈ పాట చిత్రానికే హైలెట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నారు. -
లారెన్స్‌తో నయన్?
అగ్ర కథానాయకిగా నటి నయనతార హవా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పరిస్థితి వద్దంటే అవకాశాలు అన్నట్టుగా ఉంది. ప్రముఖ నటుల నుంచి యువ హీరోల వరకు నయనతారతో జత కట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారన్నది నిజం. విక్రమ్‌తో ఇరుముగం, కార్తీ కాష్మోరా లాంటి భారీ చిత్రాలతో పాటు జీవాతో తిరునాళ్, శివకార్తికేయన్‌తో నూతన చిత్రంతోపాటు ఈ కేరళ కుట్టి చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు తెలుగులో బాలకృష్ణ శత చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణితో హీరోయిన్ చాన్స్ నయనతారదేననే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మరిన్ని నూతన అవకాశాల ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి. తాజాగా ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌తో రొమాన్స్ చేసే అవకాశం నయనతార తలుపు తట్టిందన్నది కోలీవుడ్ వర్గాల టాక్. ఒక ప్రముఖ దర్శకుడు ఈ క్రేజీ జంట కలయికలో చిత్రం చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆయన దర్శకత్వంలో నటించడానికి వీరిద్దరూ సుముఖం వ్యక్తం చేశారట. అయితే నయనతార చిన్న నిబంధన విధించారని ఆ చిత్రం కాంచన చిత్రం తరహాలో హార్రర్ నేపథ్యం కలిగి ఉంటే బాగుంటుందని ఆ దర్శకుడి కి చెప్పినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అప్పుడు గాని ఎవరా ప్రముఖ దర్శకుడు, ఏమా కథ అన్న విషయాలు తెలుస్తాయన్నమాట. -
ఆ పాత్ర కోసం చాలా కసరత్తు చేశా..
ఆ పాత్ర కోసం చాలా కసరత్తు చేశానంటోంది నటి నిక్కీగల్రాణి. ఇంతకీ ఈ అమ్మడు చెప్పొచ్చేదేమిటనేగా మీ భావన. కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్లలో నిక్కీగల్రాణి ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. డార్లింగ్ అంటూ జీవీ ప్రకాశ్‌కుమార్‌తో రొమాన్స్ చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం మూడు, నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది. లారెన్స్‌కు జంటగా మొట్టశివ కెట్టశివ చిత్రంతో పాటు జీవీ ప్రకాశ్‌కుమార్‌తో రెండో సారి కడవుళ్ ఇరుక్కాన్ కుమారు చిత్రాన్ని పూర్తి చేశాననీ చెప్పింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ రెండు చిత్రాల్లోనూ తనకు నటనకు అవకాశం ఉన్న పాత్రలో లభించడం సంతోషంగా ఉందని అంది. ఒకే రకం మూస పాత్రలు చేయడం తనకు ఇష్టం ఉండదనీ, అదే విధంగా నటించిన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పకుంటేనే ఆ పాత్రలకు న్యాయం చేకూరుతుందనీ పేర్కొంది. తాను తదుపరి ఘట్టానికి చేరుకోవచ్చునని అంది. అందుకే తన చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాని చెప్పింది. ప్రస్తుతం వేలన్నువందుటా వెళ్లక్కారన్ చిత్రంలో నటిస్తున్నాననీ తెలిపింది. ఇందులో తాను పోలీస్ అధికారిగా నటిస్తున్నాననీ, ఇందు కోసం చాలా కసరత్తు చేశాననీ చెప్పింది.పోరాట సన్నివేశాలు ఉండడంతో ఫైట్స్‌లో శిక్షణ పొందాననీ, పోలీస్ గెటప్ కోసం తన శారీరక భాషను చాలానే మార్చుకున్నాననీ తెలిపింది. -
లారెన్స్‌కు జంటగా అనుష్క?
ఒక క్రేజీ కాంబినేషన్‌తో భారీ చిత్రానికి కోలీవుడ్‌లో అడుగులు పడుతున్నాయన్నది తాజా సమాచారం.డాన్సింగ్ కింగ్,సంచలన విజయాల దర్శక నటుడు, నిర్మాత రాఘవ లారెన్స్, అందాల ముద్దుగుమ్మ అనుష్క జంటగా ఒక భారీ చిత్ర నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.తమిళంలో మన్నన్, చంద్రముఖి వంటి పలు సూపర్‌హిట్ చిత్రాల సృష్టికర్త పి.వాసు ఈ మధ్య కన్నడం, తెలుగు చిత్రాలపై దృష్టి సారించారు. కన్నడంలో ఈయన రవిచంద్రన్ నవ్యానాయర్ జంటగా దృశ్యం చిత్రాన్ని రీమేక్ చేశారు. ఆ తరువాత శివరాజ్‌కుమార్ వేదిక హీరోహీరోయిన్లుగా శివలింగ చిత్రానికి దర్శకత్వం వహించారు. అది అక్కడ ఘన విజయం సాధించింది. దీన్ని తమిళ రీమేక్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయనకు దర్శకుడు పి.వాసు ప్రత్యేకంగా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి చూపించడంతో ఈ ప్రచారం జరిగింది. తాజా శివలింగ తమిళ రీమేక్‌లో లారెన్స్‌ను హీరోగానూ ఆయనకు జంటగా నటి అనుష్కను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. శివలింగ చిత్రం కన్నడంలో పెద్ద విజయం సాధించింది కనుక దాని రీమేక్‌లో నటించడానికి లారెన్స్,అనుష్క అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదని తెలుస్తోంది. దీనికి చంద్రముఖి-2 అని టైటిల్‌ను నిర్ణయించనున్నట్లు సమాచారం. అయితే లారెన్స్ ప్రస్తుతం మొట్టశివ కెట్టశివ చిత్రంలో నటిస్తున్నారు.నటి అనుష్క బాహుబలి-2, ఎస్-3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక శివలింగ చిత్ర రీమేక్ విషయం గురించి అధికారిక వార్త వెల్లడికాలేదన్నది గమనార్హం. -
పటాస్ పోలీస్‌గా లారెన్స్
2015లో టాలీవుడ్ ఘనవిజయం సాధించిన యాక్షన్ ఎంటర్టైనర్ పటాస్. కళ్యాణ్ రామ్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా మూవీ ఘనవిజయం సాధించింది. కళ్యాణ్ రామ్ కెరీర్‌ను టర్న్ చేసిన ఈ సినిమాను కన్నడ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్ హీరోగా నటిస్తుండగా, తమిళ్లో సూపర్ ఫాంలో ఉన్న లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే తమిళ వర్షన్ షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల తన ట్విట్టర్లో రిలీజ్ చేశాడు లారెన్స్. తెలుగు వర్షన్లో హీరో లుక్కు భిన్నంగా లారెన్స్ తన మార్క్ చూపించాడు. తెలుగు సినిమాలో క్యారెక్టరైజేషన్లో మాత్రమే రెండు షేడ్స్ చూపించగా, లారెన్స్ లుక్‌లో కూడా రెండు వెరియేషన్స్ చూపిస్తున్నాడు. పూర్తి మాస్ అప్పీల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'మొట్ట శివ కెట్ట శివ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సమ్మర్లోనే పటాస్ తమిళ్ రీమేక్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
డబ్బింగ్ రైట్స్‌కు 25 కోట్లు
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న బండ్ల గణేష్ కొన్నాళ్లుగా నిర్మాణ రంగానికి దూరంగా ఉంటున్నాడు. తిరిగి ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామని భావించినా స్టార్ హీరోల డేట్స్ లేకపోవటంతో విరమించుకున్నాడు. అయితే తాజాగా డబ్బింగ్, రీమేక్ సినిమాల మీద దృష్టిపెడ్డుతున్నాడు గణేష్. ఇప్పటికే మళయాల సూపర్ హిట్ సినిమా 'టు కంట్రీస్' రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న బండ్ల గణేష్, తెలుగులో ఓ స్టార్ హీరోతో ఆ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీంతోపాటు మరో తమిళ సినిమా డబ్బింగ్ రైట్స్‌ను కూడా భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు గణేష్. లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భైరవ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను 25 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నాడు. ముని, కాంచన, గంగ సినిమాలతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా మంచి విజయాలు నమోదు చేసిన లారెన్స్, అదే జానర్లో భైరవ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గంగ సినిమా తెలుగులో 18 కోట్లకు పైగా బిజినెస్ చేయటంతో నెక్ట్స్ సినిమాకు అంతకుమించి కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే భారీ మొత్తానికి ఈ సినిమా డబ్బింగ్ రైట్స్‌ను తీసుకున్నాడు. -
మరో ప్రయోగం చేస్తున్న లారెన్స్
కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా హీరోగా కూడా సూపర్ సక్సస్ అయిన సౌత్ సెలబ్రిటీ లారెన్స్. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మంచి ఫాంలో ఉండగానే డైరెక్టర్‌గా టర్న్ తీసుకున్న లారెన్స్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి విజయాలు సాధించాడు. ఆ తరువాత తానే హీరోగా మారి స్టైల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితం వచ్చిన హార్రర్ కామెడీ జానర్ సినిమాలను కాంచనతో మళ్లీ తెర మీదకు తీసుకువచ్చి వరుసగా మూడు బ్లాక్ బస్టర్లను సాధించాడు. అదే జోష్‌లో ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మొట్ట శివ, కొట్టే శివ పేరుతో కాంచన సీరీస్‌లో మరో సినిమాను తెరకెక్కిస్తున్న లారెన్స్, ఆ సినిమా పూర్తయిన తరువాత రెండు డిఫరెంట్ సినిమాలను ప్రారంభించనున్నాడు. నాగ, భైరవ పేరుతో తెరకెక్కనున్న ఈ రెండు సినిమాల్లో జంతువులే ప్రధాన పాత్రల్లో కనిపించనున్నాయట. 80లలో సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు కనిపించినా.. తరువాత తరువాత తగ్గిపోయాయి. ప్రస్తుతం జంతువుల రక్షణ కోసం అనేక సంఘాలు పని చేస్తున్న సమయంలో లారెన్స్ చేయాలనుకుంటున్న సినిమాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి లారెన్స్ జంతువులతోనే ఈ సినిమా తెరకెక్కిస్తాడా లేక పూర్తిగా గ్రాఫిక్స్ మీదే ఆధారపడతాడా చూడాలి. -
చైనా, కొరియా, థాయ్ భాషల్లో 'కాంచన'
సౌత్ ఇండస్ట్రీలో హర్రర్ కామెడీలతో భారీ వసూళ్లను రాబట్టవచ్చని ప్రూవ్ చేసిన సినిమా కాంచన. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ హర్రర్ మూవీ తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయం సాధించింది. తరువాత ఈ సినిమాకు గంగ పేరుతో సీక్వల్‌ను రూపొందించిన లారెన్స్ మరోసారి భారీ హిట్‌తో అలరించాడు. ఇప్పుడు మరో అరుదైన ఫీట్‌తో కాంచన సినిమా వార్తల్లోకి వచ్చింది. గతంలో ఏ సౌత్ సినిమాకూ దక్కని అరుదైన ఘనత కాంచన సినిమా సొంతం కానుంది. ఇటీవల సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన రామా సంస్థ కాంచన సినిమాను విదేశీ భాషల్లో రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది. సౌత్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న చైనాతో పాటు, కొరియా, థాయ్ భాషల్లోకి కాంచన సినిమా రీమేక్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ రీమేక్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ఇద్దరు విద్యార్థుల అదృశ్యం..
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని బెంగళూరు రోడ్డు సమీపంలో ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైయ్యారు. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు లారెన్స్, యశ్వంత్‌లు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చెన్నై ప్రజలకు సినీ ప్రముఖుల చేయూత
జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న భారీవర్షాల నుంచి చెన్నై ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ సామాన్య ప్రజలతో పాటు సినీ తారలు కూడా కోరుతున్నారు. తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించటంతో పాటు అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కోరుతున్నారు. సిద్దార్థ, లారెన్స్ లాంటి మరికొంత మంది ప్రత్యక్షంగా సాయం చేయడానికి రెడీ అవుతున్నారు. వర్షాలు, వరదలు కారణంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజానీకానికి సాయం చేయడానికి హీరో సిద్దార్ధ్ ముందుకు వచ్చాడు. ఆహార పొట్లాలను ఇవ్వదలచిన వారు తనకు ఫోన్ చేయాలంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన సిద్దార్థ్, సాయం చేసే ఉద్దేశం లేనివారు ఇంట్లోనే ఉండాలంటూ కోరాడు. అలాంటి వారు రోడ్ల మీదకు రావడం వల్ల సహాయ కార్యక్రమాలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ ట్వీట్ చేశాడు. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో పరిస్థితిని కూడా తన ట్విట్టర్లో తెలిపాడు సిద్దార్ధ్. మరో తమిళ స్టార్ లారెన్స్ కూడా చెన్నై వర్షాలపై స్పందించాడు. చాలాకాలంగా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న లారెన్స్.. చెన్నై వరద బాధితుల కోసం పదిలక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాడు. వీరితో పాటు కుష్బూ, ఐశ్వర్య ధనుష్, అనిరుధ్, సౌందర్య రజనీకాంత్, విశాల్, అమీజాక్సన్ లాంటి కోలీవుడ్ స్టార్స్, ఇంకా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా చెన్నై పరిస్థితి పై ట్విట్టర్లో స్పందించారు. If you can organise food packets in chennai please contact me. We will have it picked up and delivered. Batches of 50-100 packets. #TNflood — Siddharth (@Actor_Siddharth) December 2, 2015 If you are not part of relief work please stay indoors. People crowding bridges to see flood sights are a nuisance. Stay home. #TNflood — Siddharth (@Actor_Siddharth) December 2, 2015 Please help..#ChennaiFloods #ChennaiHelps https://t.co/c1IM7giwv6 — khushbusundar (@khushsundar) December 2, 2015 Food packets.relief materials all being distributed.if any affected areas r in need.pls lemme know.includin transport.step in n do yr bit.gb — Vishal (@VishalKOfficial) December 2, 2015 #ChennaiFloods #chennairains pic.twitter.com/Pq4M5A8CLJ — Aishwaryaa.R.Dhanush (@ash_r_dhanush) December 1, 2015 -
లారెన్స్‌తో జ్యోతిక?
లారెన్స్‌తో నటి జ్యోతిక నటించనున్నారా? దీనికి అలాంటి అవకాశం లేకపోలేదనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. కాంచన, కాంచన-2 చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న లారెన్స్ హర్రర్‌తో కూడిన వినోదభరిత చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టగా నిరూపించుకున్నారు. అంతేకాదు తాజాగా మొట్టశివ కెట్టశివ, నాగ అనే మరో రెండు భారీ హారర్ చిత్రాల నిర్మాణానికి ఇటీవలే శ్రీకారం చుట్టారు. ఈ రెండు చిత్రాల్లోనూ తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. కాగా మొట్టశివ కెట్టశివ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక నాగ చిత్రంలో హీరోయిన్ కోసం నటి జ్యోతిక పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. జ్యోతిక సుధీర్గ విరామం తరువాత 36 వయదినిలే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విడుదలై విజయం సాధించినా ఆమె మరో చిత్రం ఏదీ ఒప్పుకోలేదు. సూర్య జ్యోతిక జంటగా చిత్రాలు చేయడానికి పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు కథలు విన్న సూర్యను ఒక కథ ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. త్వరలో తన భర్త సూర్యతో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని సమీపకాలంలో సూర్యనే స్వయంగా వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో లారెన్స్ నాగ చిత్రంలో జ్యోతికను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. లరెన్స్ జ్యోతికకు కథ విపించినట్లు, త్వరలోనే ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాగ గ్రాఫిక్స్ మయంగా సాగే హర్రర్ కామెడీ కథా చిత్రంగా రూపొందనుంది. ఈ తర హా పాత్రలో జ్యోతికి చంద్రముఖి చిత్రంలో అదరగొట్టార న్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉండదనుకుంటా. బహుశ లారెన్స్ కూడా ఇలాంటి ఆలోచనతోనే ఆమెను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారేమో. -
అతనికి తిక్క రేగిందంటే...!
‘‘నాక్కొంచెం తిక్కుంది...కానీ దానికో లె క్కుంది’’అని ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో పవన్‌కల్యాణ్ అంటే... ఇప్పుడు ఆయన మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ తనకు తిక్క రేగితే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపిస్తానంటున్నారు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సునీల్ రెడ్డి దర్శక త్వంలో సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి జంటగా నటిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. నిర్మాత ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ వేడుకలో - రాజకీయ ప్రముఖులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, సినీ ప్రముఖులు నాగబాబు, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ- ‘‘ఇది నాకు నాలుగో సినిమా. ఏడాది క్రితం సునీల్రెడ్డిగారు ఈ కథ చెప్పారు. ఇందులో నా పేరు ఆదిత్య. హీరోయిన్ తో ఎంతో ఈజీగా ప్రేమలో పడతాను. కానీ అంతలోనే మా ఇద్దరికీ బ్రేకప్ అవుతుంది. దాంతో నాకు తిక్క రేగి మళ్లీ ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెల్చుకున్నానన్నదే ఈ సినిమా’’ అని తెలిపారు. సునీల్ రెడ్డి మాట్లాడుతూ- ‘‘ఎవరి లైఫ్‌కి వారే హీరో. కానీ ఈ సినిమాలో హీరో లైఫ్‌కి హీరోనే విలన్. అదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఫుల్ హిలేరియస్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాతగా తనకిది తొలి చిత్రమని, కథ విని ఎగ్టయిట్ అయ్యానని, ఈ నెల 10 నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని రోహిణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సహ నిర్మాత: ఆర్. కిరణ్. -
రాఘవేంద్రుని సందర్శించుకున్న లారెన్స్
మంత్రాలయం(కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని ప్రముఖ నృత్యదర్శకుడు రాఘవా లారెన్స్ దర్శించుకున్నారు. శనివారం మంత్రాలయం చేరుకున్న ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామి స్వర్ణరథోత్సవంతో ఆయన పాల్గొన్నారు. -
లారెన్స్‌కు నో చెప్పిన కాజల్
ప్రముఖ నృత్యదర్శకుడు లారెన్స్ ఇప్పుడు నటుడుగా, దర్శకుడుగా, నిర్మాత గానూ మంచి ఫామ్‌లో ఉన్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంచన, కాంచన-2 చిత్రాల విజయాలే అందుకు నిదర్శనం. అలాంటి లారెన్స్ చిత్రంలో నటించడానికి నటి కాజల్‌అగర్వాల్ నో చెప్పడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి కాజల్‌కు కోలీవుడ్‌లో సాధించిన విజయాల సంఖ్య వేళ్లలోనే. తొలి విజయాన్ని నాన్‌మహాన్ అల్ల చిత్రంతో చాలా పోరాటం తరువాత అందుకున్నారు. అయినా తమిళసినిమా ఈ అమ్మడిని దూరంగా పెట్టింది. అలా చాలా గ్యాప్ తరువాత విజయ్‌తో జత కట్టిన తుపాకీ, జిల్లా చిత్రాల విజయాలు కాజల్ ఖాతాలో పడ్డాయి. ఆ తరువాత మళ్లీ గ్యాప్. కారణం అధిక పారితోషికం డిమాండ్, చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనక పోవడం అన్నది కోలీవుడ్ వర్గాల వెర్షన్. కొంత కాలం తరువాత ఇటీవల రీఎంట్రీ అయ్యారు. ధనుష్ సరసన మారి, విశాల్‌కు జంటగా పాయంపులి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. త్వరలో విక్రమ్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరిగినా ఇప్పుడా చిత్రమే డ్రాప్ అంటున్నారు పరిశ్రమ వర్గాలు. సో కాజల్ డైరీ కోలీవుడ్‌లో నిల్ అన్నమాట. ఇలాంటి సమయంలో హిట్ చిత్రాల నటుడు,దర్శకుడు నిర్మాత లారెన్స్ నుంచి అవకాశం వస్తే కాజల్ అందుకోకపోవడం చర్చనీయాంశం అవడం సహజమేగా. ఇక్కడ విషయం ఏమిటంటే లారెన్స్ తన తమ్ముడు ఎల్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో ఒక చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నాయకి అయితే బాగుంటుందని కాజల్‌అగర్వాల్‌ను సంప్రదించారు. అయితే పెద్ద హీరోలతోనే నటించాలని నిర్ణయించుకున్నానన్న సాకుతో ఆమె నో చెప్పారట. పారితోషికం విషయంలో సంశయిస్తుందేమేన్న ఆలోచనతో లారెన్స్ రెండు కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధం అన్నా కాజల్ సారీ అన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
హీరోగా లారెన్స్ తమ్ముడు
వారసుల పట్టికలో మరో హీరో చేరనున్నారు. డాన్సర్ స్థాయి నుంచి నిరంతర శ్రమతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఎదిగి ఇటీవల విడుదలైన కాంచన-2 చిత్రంతో ఆల్‌టైం రికార్డు సాధించిన లారెన్స్ తాజాగా తన తమ్ముడు ఎల్విన్‌ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. ఎల్విన్ ఇప్పటికే కాంచన-2 చిత్రంలో సిల్లోట్ట పిల్లోట్ట అనే పాటలో తన అన్నయ్య లారెన్స్‌తో కలిసి ఆడి ప్రేక్షకుడి ప్రశంసలు పొందారు. ఇప్పుడు హీరోగా పరిచయం అవ్వడానికి రంగం సిద్ధమైంది. ఈయన కోసం లారెన్స్ పలువురు దర్శకుల నుంచి కథలు వింటున్నారు. త్వరలోనే ఎల్విన్ హీరోగా నటించే చిత్రం గురించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు లారెన్స్ తెలిపారు. అన్నట్టు ఎల్విన్ నృత్యంతో పాటు సిక్స్‌ప్యాక్ బాడీతో తయారయ్యారు. -
కన్న తల్లికి ఆలయం
అమ్మకు ఆలయం నిర్మించడం అన్నది అరుదైన విషయం. అయితే కన్నతల్లి జీవించి ఉండగానే ఆమెకు గుడి కట్టించడం అన్నది బహుశా ప్రపంచంలోనే ఎక్కడ జరిగి ఉండదు. అలాంటిది ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్స్ తనకు జన్మనిచ్చిన తల్లి కోసం గుడి కట్టించడానికి సిద్ధం అయ్యారు. ఒక దర్శకుడిగా, నటుడిగా సినీ కళామతల్లికి తన వంతు సేవ చేస్తున్న లారెన్స్ సామాజిక సేవలోనూ ముందున్నారు. ఎందరో అనాథలను చేరదీసి వారి భవిష్యత్తుకు బంగారుబాట వేస్తున్నారు. లారెన్స్‌లో దైవభక్తి అధికమే. శ్రీరాఘవేంద్రస్వామి పరమభక్తుడైన లారెన్స్ ఆయనకు స్థానిక అంబత్తూరులో ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ ఆలయం నిత్యం భక్తజన సందోహంతో దైవస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. ఆ ఆలయ సమీపంలో లారెన్స్ తన మాతృమూర్తి కోసం గుడి కట్టించడానికి సిద్ధమయ్యారు. ఈ గుడి నిర్మాణానికి మాతృదినోత్సవం పురస్కరించుకుని ఆదివారం తన తల్లి కణ్మణి సమక్షంలో శ్రీకారం చుట్టనున్నట్లు లారెన్స్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కన్నతల్లి జీవించి ఉండగానే ఆమెకు ఆలయం నిర్మిస్తున్న తొలి కొడుకు లారెన్స్ అని చెప్పవచ్చు. జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేనిది అంటారు లారెన్స్. -
లారెన్స్ డైరెక్షన్లో రజనీ..?
-
ఉత్త రిలీజులు
మే 1వ తేదీ... శుక్రవారం. ఉదయం 8.30 గంటలు... హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ-మ్యాక్స్ ప్రాంగణం... గుంపులుగా జనం... హీరో కమల్‌హాసన్ ‘ఉత్తమ విలన్’ను చూడడానికి ఉదయాన్నే సిద్ధమై వచ్చిన జనం... తమిళనాట వసూళ్ళ వర్షం కురిపిస్తూ... తెలుగులోకి లేట్ రిలీజైన లారెన్స్ ‘గంగ’ చూడాలని ఆసక్తిగా వచ్చిన ఆడియన్స్! తెలుగువాళ్ళు... తమిళులు... మలయాళీలు... భాషాభేదాలు లేకుండా సినిమా ఏకం చేసిన దాదాపు వెయ్యిమంది! ఎవరికి వారు పక్కవాళ్ళను విషయం అడుగుతూ, ఫోనుల్లో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. ‘సినిమా రాలేదట!’... ‘పడం వరలా’... ‘ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్!’... లాంగ్వేజ్ ఏదైనా డిస్కషన్ ఒకటే! ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని వచ్చినా, రీళ్ళ బాక్సులు (ఇప్పుడన్నీ డిజిటల్ ప్రింట్లే కాబట్టి, డిజిటల్ కోడ్లు) రాలేదని నిరుత్సాహం! ఒక్క హైదరాబాద్‌లోనే కాదు... తెలుగునేల అంతటా ఆ రోజు మధ్యాహ్నానికి కానీ, తెరపై ‘గంగ’ బొమ్మ పడలేదు. తెలుగుతో పాటు తమిళనేల మీదా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొన్న ‘ఉత్తమ విలన్’ అయితే శనివారం మధ్యాహ్నం తరువాత కానీ, ప్రేక్షకుల్ని పలకరించలేదు. ఇన్ని కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాలు... అదీ పేరున్న పెద్దవాళ్ళ సినిమాలు కూడా ఆఖరు క్షణంలో రిలీజ్ ఎందుకు ఆగినట్లు? సినిమాలు బాగున్నా - ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే...? సినిమా కష్టాలు... సినిమా రిలీజ్‌కు ముందు సవాలక్ష కష్టాలు... పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్‌కు తగ్గట్లు బిజినెస్ జరగడం లేదు! ఫలానా ఏరియాను ఫలానా మొత్తానికి కొంటామన్న బయ్యర్లు ఆఖరు క్షణంలో... అనుకున్న మొత్తం కన్నా తక్కువ డబ్బే తెస్తున్నారు! తమకు చెల్లించాల్సిన పాత ఫ్లాప్ సినిమాల అప్పుల సంగతేంటో తేల్చమంటూ నిర్మాతల మీద పడే ఫైనాన్షియర్లు! వెరసి ఒక సినిమా ఎంత ఖర్చుతో తీస్తున్నామనే దాని కన్నా, ఎంత సులువుగా రిలీజ్ చేసుకుంటామనేది సమస్యగా మారింది. ఈ కష్టాల కథేమిటో తెలుసుకోవాలంటే... ముందుగా సినీ వ్యాపారం ఏమిటో తెలుసుకోవాలి. అది ఏమిటంటే... గతంలో సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన - ఈ మూడు సెక్టార్ల కలెక్టివ్ రెస్పాన్స్‌బిలిటీ. సినిమా అంటే నిర్మాత, దర్శకుడు ఒక కథ అనుకొని, ప్రయత్నాలు మొదలుపెట్టేవారు. నిర్మాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాడు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లే కింగ్ మేకర్లు. చిత్ర నిర్మాణానికి డబ్బు వాళ్ళ నుంచి అందేది. ఆ మనీతో సినిమా తయారయ్యేది. పంపి ణీకి డిస్ట్రిబ్యూటర్లు... అద్దె లేదా నెట్ కలెక్షన్లలో పర్సంటేజ్ మీద తమ హాలులో సినిమా వేయడానికి ఎగ్జిబిటర్లు రెడీ. కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాతల మధ్య పంపిణీ అయ్యేది. సినిమా ఆడక తేడా వస్తే, అప్పటికి ఆ నష్టం డిస్ట్రిబ్యూటర్ భరించేవాడు. సదరు దర్శక, నిర్మాతల తరువాతి సినిమాలో ఎడ్జస్ట్ చేసేవాడు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. రిలీజ్ ముందు నిద్ర లేని రాత్రులు! డిస్ట్రిబ్యూటర్ల సిస్టమ్ పోయి, బయ్యర్లు వచ్చాక రిస్క్ ఫ్యాక్టరూ పెరిగింది. నిర్మాతలు క్రేజీ కాంబినేషన్స్ మాత్రం సెట్ చేసుకొంటారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో సినిమా స్టార్ట్ చేస్తారు. పదుల కోట్లు ఫైనాన్షియర్స్ నుంచి వడ్డీకి తెస్తారు. సినిమా సిద్ధమయ్యేవేళలో బయ్యర్లు క్రేజీ ఆఫర్లతో వస్తారు. కానీ, సినిమా కాస్త తేడాగా ఉందని ఏ మాత్రం ఉప్పందినా... వెంటనే ప్లేటు ఫిరాయిస్తారు. అనుకున్న దాని కన్నా తక్కువ రేటే ఇస్తారు. ఫలితం - నిర్మాతకు ఆశించిన బిజినెస్ కావడం లేదు. ఇప్పటికి ఈ సినిమా వరకు ప్రాఫిట్‌కే అమ్మినా, గత సినిమాలపై పేరుకున్న అప్పులు నిర్మాతను భూతంలా వెంటాడి వేధిస్త్తుంటాయి. ఉదాహరణకు, ఒక నవ యువ సామ్రాట్ మూడక్షరాల సినిమా ఏప్రిల్ చివరి వారంలో రూ. 10 కోట్ల దాకా బిజినెస్ కావాల్సింది. లాస్ట్‌మినిట్‌లో బయ్యర్లు 25 శాతం తగ్గించి, కట్టారు. వ్యాపారం తగ్గినా, నిర్మాత విధి లేక సినిమా రిలీజ్ చేశారు. ఇక, గత చిత్రాల లాస్‌లు తడిసి మోపెడై, నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ను ‘గంగ’ రిలీజ్లో ఇబ్బంది పెట్టాయి. ‘ఉత్తమ విలన్’ను సమర్పిస్తున్న తిరుపతి బ్రదర్స్‌కు పాత ఫ్లాప్ ‘అంజాన్’ (తెలుగులో ‘సికిందర్’) తాలూకు అప్పులు ఇప్పుడడ్డుపడ్డాయి. ‘‘అక్కడెవరో తీసిన సినిమాను ఇక్కడ నుంచి వెళ్ళి ఎగబడి కొంటున్నప్పుడు, వాళ్ళకున్న పాత అప్పులేంటో మనకు తెలీదుగా! చివరకు మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని, తమిళ, తెలుగు వెర్షన్ల నిర్మాతలు, సినీ సంఘాలు శ్రమిస్తే కానీ ‘ఉత్తమ విలన్’ ఒకటిన్నర రోజులు ఆలస్యంగా మన దేశంలో విడుదల కాలేకపోయింది’’ అని ‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. నిజానికి, ఇలా ఒక పెద్ద సినిమా రిలీజ్ ఒక్క రోజు ఆలస్యమైనా ఆ సినిమాకొచ్చే మొత్తం రెవెన్యూలో 20 నుంచి 25 శాతం మేర నష్టపోవాల్సి వస్తుంది. ఇక, ఆ రోజున సినిమా థియేటర్లో సైకిల్ స్టాండ్ మొదలు ఇతర అనుబంధ వ్యాపారాలకు కలిగే లాస్ దీనికి అదనం. నిజానికి, ఇది ఒక రోజుకో... ఒక సినిమాకో... పరిమితమైన సమస్య కాదు. కలెక్షన్స్‌లో ఇండస్ట్రీ హిట్ పవన్‌కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లాంటి బడా సినిమాల మొదలు ఛోటా నటుల చిన్న సినిమాల దాకా ఇదే పరిస్థితి. సినిమాల రిలీజ్ ముందు రోజు రాత్రి ల్యాబుల్లో, స్టార్ హోటళ్లలో ప్రైవేట్ ‘పంచాయతీ’లు మామూలే. కాకపోతే, కొన్ని బయటకొస్తాయి. చాలా మటుకు సినీ వ్యాపార వర్గాల ‘రహస్యాలు’గా మిగిలిపోతాయి. ‘‘ఇవాళ రెమ్యూనరేషన్స్‌తో సహా నిర్మాణవ్యయం 40 శాతం పెరిగింది. అదే సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల పర్చేజింగ్ పవర్ 30 నుంచి 40 శాతం తగ్గింది. వెరసి సినిమా వ్యాపారానికి 70 - 80 శాతం బొక్క పడింది’’ అని గుంటూరు డిస్ట్రిబ్యూటర్, చిత్ర నిర్మాణంలో అనుభవమున్న కొమ్మినేని వెంకటేశ్వరరావు వివరించారు. ఇలా కాస్ట్ పెరిగి, బిజినెస్ తగ్గి, పాత అప్పుల భారం తీరే మార్గంలేక, నిర్మాతలు రోడ్డున పడుతున్నారు. సినిమాల రిలీజ్లు లాస్ట్‌మినిట్‌లో లేట్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి ఇప్పుడో హిట్ కావాలి! కోట్ల ఖర్చుతో సినిమా తీసిన నిర్మాత... కోట్లు పారితోషికం తీసుకొనే హీరో... తెర ముందు కనిపించే షో ఇది. ఈ షోకు తెర వెనుక ఆర్థిక సూత్రధారులుగా ఫైనాన్షియర్లు, బయ్యర్లు, వీళ్ళకు డబ్బులు సమీకరించే ఎగ్జిబిటర్లు... సినిమా బిజినెస్ గ్లామర్ దీపం చుట్టూ శలభాలు. గత అయిదు నెలలుగా అన్నీ నష్టాలవడంతో బయ్యర్ల మొదలు ఫైనాన్షియర్స్ దాకా ఎవరికీ ఇప్పుడు చేతిలో డబ్బు ఆడని పరిస్థితి. ‘‘తక్షణమే కనీసం ఒక్క పెద్ద హిట్ రావాలి. అప్పుడు కానీ, డబ్బులు పెట్టే ఎగ్జిబిటర్లు, బయ్యర్లు ఈ ఫైనాన్షియల్ స్లంప్ నుంచి తేరుకోలేరు’’ అని ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘లయన్’ చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు అన్నారు. ‘‘మన దగ్గర రిలీజ్ ప్లానింగ్ లేదు. బయ్యర్ల నుంచి వస్తున్నదెంత, ఫైనాన్షియర్లకు తీర్చాల్సిన అప్పుల రూపంలో పోయేదెంత అనే లెక్క చూసుకోవడం లేదు. ఇవన్నీ సరిదిద్దుకోవాలి. నిర్మాతలంతా కూర్చొని, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి’’ అని సునీల్ నారంగ్ సూచించారు. అవును... అది నిజం. ఒకప్పుడు సినిమా... కేవలం కళ! ఆ తరువాత.... కళాత్మక వ్యాపారం! మరి ఇప్పుడు కాసుల చుట్టూ తిరిగే వ్యాపార కళ!! ఈ పరిస్థితుల్లో సినిమా బిజినెస్ ప్రతి వారం టేబుల్స్ టర్న్ చేసే చిత్రమైన ‘ధందా’! ఈ వ్యాపారంలో ఆర్థిక కష్టాలను తట్టుకొని, హాలులోని జనం దాకా సినిమా రావడం... ప్రతి శుక్రవారం ఒక సెల్యులాయిడ్ సిజేరియన్ డెలివరీ! - రెంటాల జయదేవ నష్టాల్లో... అయిదు నెలలు ‘డిసెంబర్ నుంచి ఈ 5 నెలల్లో తెలుగులో వచ్చిన సినిమాల్లో నికరంగా డబ్బులు చేసుకున్నది ఒక్కటీ లేదు. కల్యాణ్‌రామ్ ‘పటాస్’ ఒక్కటే రీజనబుల్‌గా పే చేసింది. పెద్ద స్టార్ల ‘లింగ’, ‘గోపాల గోపాల’ నుంచి లేటెస్ట్ సమ్మర్ రిలీజ్‌ల దాకా అన్నీ లాసే. బయ్యర్లను పోటు పొడిచినవే.’’ - సుధాకర్ నాయుడు, ఎస్.వి.ఎస్. ఫిల్మ్స్ అధినేత - బయ్యర్, కర్నూలు ‘‘తమిళనాట ఎవరో తీస్తున్న సినిమాను మనం ఎగబడి వెళ్ళి కొనుక్కోవడంలో ఎంత ఇబ్బంది ఉందో అర్థమైంది. అక్కడ వాళ్ళకున్న అప్పులేమిటో తెలియదుగా! 53 సినిమాలు నిర్మించినా రిలీజ్ డేట్ నాడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఇప్పుడు 54వ సినిమా ‘ఉత్తమ విలన్’కు తొలిసారి అది నాకు అనుభవమైంది.’’ - సి. కల్యాణ్ ‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ నిర్మాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేటెస్టయినా లేట్‌గా వచ్చిన కొన్ని! శంకర్ - విక్రమ్‌ల ‘ఐ’ నాని నటించిన ‘జెండా పై కపిరాజు’ వై.వి.ఎస్. - సాయిధరమ్ తేజ్‌ల ‘రేయ్’ కమలహాసన్ ‘ఉత్తమ విలన్’ లారెన్స్ ‘గంగ’ షూటింగ్ ఫినిష్! రిలీజ్‌కే వెయిటింగ్!! నితిన్ ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ కమల్ దర్శకత్వంలోని ‘విశ్వరూపమ్ 2’ రాజశేఖర్ నటించిన ‘వందకు వంద’ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ ‘పట్టపగలు’ ....................................................................... సెన్సారైంది..! రిలీజ్ ఆగింది! విజయశాంతి నటించిన ‘శివాని’ రాఘవేంద్రరావు ‘ఇంటింటా అన్నమయ్య’ -
లారెన్స్ దర్శకత్వంలో సూపర్‌స్టార్..?
గాసిప్ లారెన్స్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ చిత్రంలో నటించనున్నారా? తమిళ పరిశ్రమ ఔననే అంటోంది. ఇటీవల విడుదలైన లారెన్స్ ‘కాంచన 2’ని చూసి, లారెన్స్‌ని రజనీ అభినందించారట. అప్పుడు, ఆయన హీరోగా ఓ సినిమా చేయాలని ఉందని లారెన్స్ చెప్పారనీ, అందుకు రజనీకాంత్ సుముఖత వ్యక్తం చేశారనీ కోలీవుడ్ టాక్. -
కాంచన-2లో ప్రమోట్ సాంగ్
ప్రస్తుతం ఏ,బీ,సీ అంటూ వ్యత్యాసం లేకుండా అన్ని ఏరియాల్లోనూ కాంచన-2 విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాంచన వంటి హిట్ చిత్రం తరువాత దానికి కొనసాగింపుగా లారెన్స్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం కాంచన-2. తాప్సీ, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ హార్రర్ థ్రిల్లర్ చిత్రం కోసం తాజాగా లారెన్స్ ఒక ప్రమోషన్ సాంగ్‌ను చిత్రీకరిస్తుండడం విశేషం. చిత్రంలో చోటు చేసుకున్న సిల్టా పిల్లాట్ట అనే తొలి పాటను లారెన్స్, తాప్సీ, నిత్యామీనన్‌లపై చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ పాట ప్రచారానికే ఉపయోగించనున్నట్లు చిత్రంలో చోటు చేసుకోదని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ పాట చిత్రీకరణను మంగళవారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించడానికి లారెన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
ప్రత్యేక గీతంలో రాయ్‌లక్ష్మి
కథానాయికలు ఐటమ్ సాంగ్స్ చేయడంలో కొత్తేమీ లేదు. కాజల్, శ్రుతిహాసన్, తమన్న లాంటి ప్రముఖ నాయికలే సింగిల్ సాంగ్స్‌కు ఓకే అంటున్నారు. అయితే రాయ్‌లక్ష్మి నూతన తారలు నటిస్తున్న చిత్రంలో స్పెషల్ సాంగ్ కు చిందేయడం విశేషం. ఈ సంచలన తార ఇంతకుముందు కొన్ని చిత్రాలలో ప్రత్యేక గీతాల్లో ఆడింది. ఆ మధ్య తెలుగులో రవితేజ హీరోగా నటించిన పవర్ చిత్రంలో రాయ్‌లక్ష్మి ఐటమ్‌సాంగ్‌లో అదరగొట్టేసింది. తాజాగా తమిళంలో ప్రముఖ నృత్య దర్శకుడు, దర్శకుడు లారెన్స్ తెరకెక్కిస్తున్న ఒరు టికెట్టుల రెండు సినిమా చిత్రంలో వైవిధ్యపాత్రలో నటిస్తోంది. అదే విధంగా కాదల్ పండిగై అనే చిత్రంలో ఈ బ్యూటి ప్రత్యేక గీతంలో నటించనుందట. విషయం ఏమిటంటే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లలతో సహా అందరూ నూతన తారలే నటిస్తున్నారట. నూతన దర్శకుడు నవమణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. చిత్రంలో అందరూ కొత్తవారు నటిస్తుండంతో రాయ్‌లక్ష్మి లాంటి పాపులర్ నటి ప్రత్యేక గీతంలో ఆడితే చిత్రానికి కమర్షియల్ లుక్ వస్తుందని భావించిన దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారట. పాట, పారితోషికం తదితర అంశాలు నచ్చడంతో రాయ్ లక్ష్మి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గ్లామర్ విషయంలో దుమ్ము రేపే అమ్మడు ఈ చిత్రంలో ఒంటినిండా చీరతో చిందులేయనుందట. ఇది ఉత్సవ పాట కావడంతో రాయ్‌లక్ష్మి చీర సింగారంతో ఆడనున్నారని సమాచారం. -
సినీ దర్శకుడు లారెన్స్‌పై చీటింగ్ కేసు
హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ రాఘవ, అతని వ్యక్తిగత కార్యదర్శి రాజ్‌కుమార్ పై గురువారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకరాం ప్రభాస్, తమన్నా జంటగా నటించిన రెబల్ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమాకు భగవాన్, పుల్లారావు నిర్మాతలు. సినిమా ప్రారంభానికి ముందే లారెన్స్ నిర్మాతల మధ్య సినిమా ఖర్చు విషయంలో ఒప్పందం కుదిరింది. రూ.23 కోట్లతో సినిమాను పూర్తి చేస్తానని, అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే తానే భరిస్తానని లారెన్స్ ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించి నిర్మాతలు దర్శకుడికి మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఈ సినిమాకు అనుకున్న దానికంటే రూ.5కోట్లు ఎక్కువ ఖర్చు చేశారు. ఇంత మొత్తాన్ని తాము భరించలేమని ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అదనంగా ఖర్చు చేసిన రూ.5 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్మాతలు లారెన్స్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే ఒక్కపైసా కూడా ఇచ్చేది లేదని లారెన్స్ మొండికేశారు. జవాబు కూడా చెప్పడం మానేశాడు. దీంతో బాధిత నిర్మాతలు కోర్టును ఆశ్రయించగా... లారెన్స్ పైన, అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మధ్యవర్తిగా ఉన్న అతని వ్యక్తిగత కార్యదర్శి రాజ్కుమార్పైన కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో ఈ ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 406,420 కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు లారెన్స్ కోసం గాలింపు చేపట్టారు. -
డిసెంబర్లో ముని 3
ప్రయోగాలు చేసే దర్శకులలో నృత్య దర్శకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఒకరు. ముని, ముని-2గా కాంచన చిత్రాలను తెరకెక్కించి హారర్ చిత్రాల ట్రెండ్‌కు సరికొత్త ఊపు తీసుకొచ్చిన లారెన్స్ తాజాగా ముని-3గా గంగ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాప్సీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఒరు టిక్కెటిల్ రెండు సినిమా ఒండ్రు కిళవన్ ఒండ్రు కరుప్పుదురై అనే వైవిధ్య భరిత చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రం గురించి బుధవారం విలేకరుల సమావేశంలో రాఘవ లారెన్స్ వెల్లడిస్తూ ఈ చిత్రాన్ని రెండు కథలుగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. చిత్రం తొలి భాగంలో తనకు జోడిగా ఆండ్రియూ నటించనుండగా రెండో భాగంలో నటి రాయ్‌లక్ష్మి నటించనున్నారని వివరించారు. తమిళ వెర్షన్‌కు గీత రచయిత వివేక్ సంభాషణలందిస్తున్నారని తెలిపారు. -
వంకాయ కూరలో రుచి ఉందా?
లారెన్సు ఒకచోట రాస్తున్నాడు ఒకరికి... ‘నన్ను నువ్వు నలుగురిలో తిడుతున్నావని నాకు తెలుసు. ఆ తిట్టే అవసరం నేను అర్థం చేసుకోగలను. నీ గొప్పదనం కోసం నన్ను తిట్టాల్సి వొస్తుంది నువ్వు. నన్ను తిడుతున్నావని నాకు తెలిసి, నేను కోపగించుకుంటున్నానని నాతో స్నేహం మానెయ్యకు. నాకు కోపం లేదు. ఎందుకంటే ఆ తిట్ల వెనుక అసలు నీకు నా మీద వుండే ఇష్టాన్ని నేనెరుగుదును’ గొప్పవాడు కదూ! అతన్ని ఇంగ్లండు బాధించి వెళ్ళగొట్టింది. ఇంగ్లీష్వాడనే పేరు ఎత్తవద్దంటాడు చివరికి. అది పోనీండి. ఒక ప్రకృతి దృశ్యం ఉంది. దాన్ని గొప్ప ఫొటోగ్రాఫర్ తీస్తాడు. అసలు ఆ దృశ్యాన్ని చూస్తే ఆ ఫొటోలో వున్న అందం కనబడదు మసుషులకి. మరి ఆ అందం ఎక్కడ వుంది? అసలు దృశ్యంలో ఉందా? ఫొటోలో ఉందా? ఇట్లాంటి ప్రశ్నలు నాలో వస్తే నేను రచయితగా చెడిపోయానన్నారు. వంకాయకూరలో రుచి అసలు వుందా? లేదా? ‘‘చాలా రుచి’’ అన్నవాడు మోసపోతున్నాడా? లేదన్నవాడు నాలిక రుచి లేని అంధుడా? అది తేలిందా- ఈ ప్రపంచ రహస్యమే తేలిపోతుంది. - చలం, 16-11-1950, అరుణాచలం. (‘మహాస్తాన్’ నుంచి)