
లారెన్స్‌తో నయన్?
అగ్ర కథానాయకిగా నటి నయనతార హవా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పరిస్థితి వద్దంటే అవకాశాలు అన్నట్టుగా ఉంది. ప్రముఖ నటుల నుంచి యువ హీరోల వరకు నయనతారతో జత కట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారన్నది నిజం. విక్రమ్‌తో ఇరుముగం, కార్తీ కాష్మోరా లాంటి భారీ చిత్రాలతో పాటు జీవాతో తిరునాళ్, శివకార్తికేయన్‌తో నూతన చిత్రంతోపాటు ఈ కేరళ కుట్టి చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు తెలుగులో బాలకృష్ణ శత చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణితో హీరోయిన్ చాన్స్ నయనతారదేననే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మరిన్ని నూతన అవకాశాల ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి.
తాజాగా ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌తో రొమాన్స్ చేసే అవకాశం నయనతార తలుపు తట్టిందన్నది కోలీవుడ్ వర్గాల టాక్. ఒక ప్రముఖ దర్శకుడు ఈ క్రేజీ జంట కలయికలో చిత్రం చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆయన దర్శకత్వంలో నటించడానికి వీరిద్దరూ సుముఖం వ్యక్తం చేశారట. అయితే నయనతార చిన్న నిబంధన విధించారని ఆ చిత్రం కాంచన చిత్రం తరహాలో హార్రర్ నేపథ్యం కలిగి ఉంటే బాగుంటుందని ఆ దర్శకుడి కి చెప్పినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అప్పుడు గాని ఎవరా ప్రముఖ దర్శకుడు, ఏమా కథ అన్న విషయాలు తెలుస్తాయన్నమాట.