కాంచనలో మృణాల్‌? | Mrunal Thakur Talks For Kanchana 4 Movie | Sakshi
Sakshi News home page

కాంచనలో మృణాల్‌?

Published Sun, Jun 9 2024 12:07 AM | Last Updated on Sun, Jun 9 2024 12:07 AM

Mrunal Thakur Talks For Kanchana 4 Movie

‘సీతారామం, ఫ్యామిలీ స్టార్‌’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హిందీ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌. మరోవైపు తమిళం నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. శివ కార్తికేయన్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ తమిళ సినిమాలో తొలుత మృణాల్‌ ఠాకూర్‌నే హీరోయిన్‌గా అనుకున్నారు.

అయితే ఈ చాన్స్‌ కన్నడ భామ రుక్మిణీ వసంత్‌ దక్కించుకున్నారు. ఇప్పుడు మృణాల్‌ కోలీవుడ్‌ ఎంట్రీ గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి. హారర్‌ హిట్‌ ఫ్రాంచైజీ ‘కాంచన’లో రానున్న ‘కాంచన 4’లో మృణాల్‌ని తీసుకున్నారట. రాఘవా లారెన్స్‌ నటించి, దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా మృణాల్‌ నటించనున్నారని టాక్‌. మరి.. వార్తల్లో ఉన్నట్లు ‘కాంచన 5’లో మృణాల్‌ నటిస్తే తమిళంలో ఆమెకు ఇదే తొలి చిత్రం అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement