దెయ్యం సినిమాలో మృణాల్.. మరి ఒప్పుకొంటుందా? | Mrunal Thakur Talks For Kanchana 4 Movie | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: ఆ హిట్ సిరీస్‌లో మృణాల్.. వర్కౌట్ అవుతుందా?

Jun 8 2024 9:55 PM | Updated on Jun 8 2024 9:55 PM

Mrunal Thakur Talks For Kanchana 4 Movie

చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ 'సీతారామం' మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకుర్. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ.. ప్రస్తుతం సౌత్‌తో పాటు హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో వరసగా రెండు హిట్లు కొట్టిన మృణాల్.. రీసెంట్‌గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' డిజాస్టర్ దెబ్బకు సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే ఓ హిందీ మూవీ చేస్తోంది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్)

ఇప్పుడు 'కాంచన' సినిమాల సిరీస్‌లో హీరోయిన్‌గా మృణాల్‌కి ఆఫర్ వచ్చిందట. ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని, ఈమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. 'ముని', 'కాంచన' చిత్రాలతో తనకంటూ సెపరేట్ ట్రెండ్ సెట్ చేసిన లారెన్స్.. వాటితో వరస హిట్స్ కొడుతున్నాడు. ఈ మూవీస్‌లో డ్యాన్సులు వేయడం, హీరో పక్కన అలా కనిపించడం తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం ఉండదు.

అయితే 'కాంచన 4' మూవీ కోసం మాత్రం లారెన్స్ డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. సెప్టెంబరు నుంచి షూటింగ్ మొదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మృణాల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆమె ఒ‍ప్పుకొంటుందా? లేదా అనేది చూడాలి? ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం మృణాల్‌కి తమిళ డెబ్యూ అవుతుంది!

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement