కాంచన-4లో టాలీవుడ్‌ హీరోయిన్.. రాఘవ లారెన్స్‌ క్లారిటీ! | Raghava Lawrence Gives Clarity Mrunal Thakur Has Been Cast In Kanchana 4, Deets Inside | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: కాంచన-4లో టాలీవుడ్‌ హీరోయిన్.. రాఘవ లారెన్స్‌ ట్వీట్‌ వైరల్!

Published Sun, Jun 9 2024 5:13 PM | Last Updated on Sun, Jun 9 2024 6:54 PM

Raghava Lawrence Clarity Mrunal Thakur has been cast in Kanchana 4

ప్రస్తుతం సీతారామం బ్యూటీ మృణాల్‌ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీస్టార్‌లో మెరిసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. మృణాల్ త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు లేటేస్ట్‌ టాక్‌ నడుస్తోంది. రాఘవ లారెన్స్‌ తెరకెక్కించనున్న కామెడీ హారర్‌ కాంచన-4లో మృణాల్ ఠాకుర్‌ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతోంది.

అయితే ఈ వార్తలపై కోలీవుడ్ స్టార్‌ రాఘవ లారెన్స్ స్పందించారు. ఈ విషయంపై రాఘవ లారెన్స్‌ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కాంచన-4 సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపికపై వస్తున్న వార్తలు వాస్తవం కాదని ట్వీట్‌ చేశారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని.. ఏదైనా ఉంటే రాఘవేంద్ర ప్రొడక్షన్‌ ద్వారా అధికారికంగానే ప్రకటిస్తామని పోస్ట్ చేశారు. అయితే ఇది చూసిన కొందరు మృణాల్ ఠాకూర్‌ తీసుకోండంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా.. గతంలో వచ్చిన ముని, ముని-2 (కాంచన), కాంచన-2, కాంచన-3 చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అదే సిరీస్‌లో ప్రస్తుతం కాంచన-4 తెరకెక్కునుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమాలు తెరకెక్కించారు. కాగా.. మృణాల్ ప్రస్తుతం హిందీలో పూజా మేరీ జాన్‌లో కనిపించనుంది. మరోవైపు రాఘవ చివరిసారిగా జిగర్తాండ డబుల్ ఎక్స్‌ చిత్రంలో కనిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement