kanchana
-
కాంచన4 పై పుష్పరాజ్ ఎఫెక్ట్..?
-
లీక్డ్ వీడియోతో ఒవియా వైరల్.. బిగ్ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో
ఒవియా హెలెన్.. కొద్దిరోజులుగా ఈ బ్యూటీ పేరు సౌత్ ఇండియాలో భారీగా ట్రెండ్ అవుతుంది. కేరళకు చెందిన ఒవియా తమిళ చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో పాల్గొని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆమెకు సంబంధింఇచన లీక్డ్ వీడియో అంటూ ఒకటి నెట్టింట షేర్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఒవియా ఫోటోను లారెన్స్ షేర్ చేస్తూ సినిమా ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంచన' ప్రాంచైజీ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 3 చిత్రాలు విడుదలయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అయితే, 'కాంచన 4' ప్రాజెక్ట్‌ను త్వరలో లారెన్స్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో ఒవియాకు కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంచన 3 షూటింగ్ సమయంలో వారిద్దరూ కలిసి తీసుకున్న ఒక ఫోటోను తాజాగా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం తీవ్రంగా ట్రోల్‌కు గురౌతున్న ఒవియాకు లారెన్స్ మరో సినిమా ఛాన్స్ ఇచ్చారంటూ ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు. కాంచన బొట్టుతో ఉన్న ఒవియా ఫోటో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది. లారెన్స్ దర్శకత్వంలో 2011లో విడుదలైన 'కాంచన' భారీ విజయాన్ని సాధించింది. హారర్ కామెడీ జానర్లో ట్రెండ్‌ని సెట్ చేసిన ఈ సినిమా 2015లో రెండో పార్ట్‌ను రిలీజ్ చేశారు. అది కూడా మంచి సూపర్ హిట్ కావడంతో 2019లో 'కాంచన-3'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మళ్లీ భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం ఈ నవంబర్‌లో నాలుగో భాగం షూటింగ్ ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, అదికారికంగా మాత్రం ప్రకటన వెలువడలేదు. మూడు భాగాల్లో లారెన్స్ ప్రధానపాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు. కోవై సరళ, శరత్‌కుమార్ గత మూడు చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Raghava Lawrence Fans (@raghavalawrenceoffl) -
కాంచన-4లో టాలీవుడ్ హీరోయిన్.. రాఘవ లారెన్స్ క్లారిటీ!
ప్రస్తుతం సీతారామం బ్యూటీ మృణాల్ టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీస్టార్‌లో మెరిసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. మృణాల్ త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు లేటేస్ట్ టాక్ నడుస్తోంది. రాఘవ లారెన్స్ తెరకెక్కించనున్న కామెడీ హారర్ కాంచన-4లో మృణాల్ ఠాకుర్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతోంది.అయితే ఈ వార్తలపై కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ స్పందించారు. ఈ విషయంపై రాఘవ లారెన్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కాంచన-4 సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపికపై వస్తున్న వార్తలు వాస్తవం కాదని ట్వీట్ చేశారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని.. ఏదైనా ఉంటే రాఘవేంద్ర ప్రొడక్షన్ ద్వారా అధికారికంగానే ప్రకటిస్తామని పోస్ట్ చేశారు. అయితే ఇది చూసిన కొందరు మృణాల్ ఠాకూర్ తీసుకోండంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. గతంలో వచ్చిన ముని, ముని-2 (కాంచన), కాంచన-2, కాంచన-3 చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అదే సిరీస్‌లో ప్రస్తుతం కాంచన-4 తెరకెక్కునుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమాలు తెరకెక్కించారు. కాగా.. మృణాల్ ప్రస్తుతం హిందీలో పూజా మేరీ జాన్‌లో కనిపించనుంది. మరోవైపు రాఘవ చివరిసారిగా జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కనిపించారు. Hi friends and fans, All the information regarding Kanchana 4 and casting that are circulating around social media are just rumors. Official announcement will be made through Ragavendra Production. Coming soon! pic.twitter.com/T46gcYyjAN— Raghava Lawrence (@offl_Lawrence) June 9, 2024 -
కాంచనలో మృణాల్?
‘సీతారామం, ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హిందీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మరోవైపు తమిళం నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. శివ కార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ తమిళ సినిమాలో తొలుత మృణాల్ ఠాకూర్‌నే హీరోయిన్గా అనుకున్నారు.అయితే ఈ చాన్స్ కన్నడ భామ రుక్మిణీ వసంత్ దక్కించుకున్నారు. ఇప్పుడు మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి. హారర్ హిట్ ఫ్రాంచైజీ ‘కాంచన’లో రానున్న ‘కాంచన 4’లో మృణాల్‌ని తీసుకున్నారట. రాఘవా లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా మృణాల్ నటించనున్నారని టాక్. మరి.. వార్తల్లో ఉన్నట్లు ‘కాంచన 5’లో మృణాల్ నటిస్తే తమిళంలో ఆమెకు ఇదే తొలి చిత్రం అవుతుంది. -
దెయ్యం సినిమాలో మృణాల్.. మరి ఒప్పుకొంటుందా?
చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ 'సీతారామం' మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకుర్. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ.. ప్రస్తుతం సౌత్‌తో పాటు హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో వరసగా రెండు హిట్లు కొట్టిన మృణాల్.. రీసెంట్గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' డిజాస్టర్ దెబ్బకు సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే ఓ హిందీ మూవీ చేస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్)ఇప్పుడు 'కాంచన' సినిమాల సిరీస్‌లో హీరోయిన్గా మృణాల్‌కి ఆఫర్ వచ్చిందట. ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని, ఈమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. 'ముని', 'కాంచన' చిత్రాలతో తనకంటూ సెపరేట్ ట్రెండ్ సెట్ చేసిన లారెన్స్.. వాటితో వరస హిట్స్ కొడుతున్నాడు. ఈ మూవీస్‌లో డ్యాన్సులు వేయడం, హీరో పక్కన అలా కనిపించడం తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం ఉండదు.అయితే 'కాంచన 4' మూవీ కోసం మాత్రం లారెన్స్ డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. సెప్టెంబరు నుంచి షూటింగ్ మొదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మృణాల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆమె ఒప్పుకొంటుందా? లేదా అనేది చూడాలి? ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం మృణాల్‌కి తమిళ డెబ్యూ అవుతుంది!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్
ఇటీవలే చంద్రముఖి-2 సినిమాతో ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఎస్జే సూర్యతో కలిసి జగిర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రాఘవ లారెన్స్ మాట్లాడారు. చంద్రముఖి- 2 ఫ్లాప్ గురించి ఆయన స్పందించారు. (ఇది చదవండి: మరో సక్సెస్ఫుల్ హీరో వచ్చాడు – హీరో నాని ) రాఘవ మాట్లాడుతూ..'చంద్రముఖి -2 సినిమాకు నా డబ్బులు నాకు వచ్చేశాయి. జీవితంలో అన్నీ మనమే గెలవాలని లేదు కదా. గ్రూప్ డ్యాన్సర్ నుంచి డ్యాన్సర్ మాస్టర్ అయితే చాలని భావించా. అక్కడి నుంచే దర్శకుడిని, హీరోను అయ్యాను. నా గ్లామర్‌కు హీరో అవకాశాలు ఇవ్వడమే దేవుడిచ్చిన పెద్ద వరం. మళ్లీ అందులో ఫ్లాప్, హిట్ గురించి అస్సలు ఆలోచించకూడదు. 'జిగిర్తాండ డబుల్ ఎక్స్' డబ్బింగ్ పూర్తయ్యాక చూశా. ఇందులో మంచి స్టోరీ ఉంది. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఎంత పెద్ద హీరో సినిమా చేసినా, డ్యాన్స్ చేసినా కథ లేకపోతే సినిమా ఆడదు. కంటెంట్ బలంగా ఉండాలంటే దర్శకుడు కూడా అంతే బలంగా ఉండాలి. కార్తీక్ సుబ్బరాజు విషయంలో నాకు ఎలాంటి డౌట్స్ లేవు.' అని అన్నారు. (ఇది చదవండి: అమర్‌దీప్‌కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?) అయితే కాంచన-4 ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. అన్ని దెయ్యాల సినిమాలు తీసి మనశ్శాంతిగా ఉండటం లేదు. రాత్రి కూడా కలలో అవే గుర్తుకొస్తున్నాయి. దీంతో నా మైండ్ కాస్తా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. కానీ ఏదో ఒక రోజు ఆ సినిమాను తప్పకుండా చేస్తా' అని అన్నారు. Any Muni Fans here ?🙋🏻🔥 #RaghavaLawrence pic.twitter.com/LEqbZCq2r1 — Anchor_Karthik (@Karthikk_7) October 10, 2023 -
కేవలం రూ.7 కోట్ల సినిమా.. బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది!
తమిళ స్టార్ రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంచన(ముని-2). 2007లో రిలీజైన ముని సిరీస్‌లో వచ్చిన రెండో చిత్రమే కాంచన. 2011లో విడుదలైన బాక్సాఫీస్ బరిలో నిలిచిన ఈ చిత్రం ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. శరత్ కుమార్, కోవై సరళ, లక్ష్మీ రాయ్, దేవదర్శిని, శ్రీమాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. హార్రర్- కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే దాదాపు 12 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి అప్పట్లోనే రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. (ఇది చదవండి: అందుకే నా ట్రస్ట్‌కి విరాళాలు వద్దని చెప్పా: లారెన్స్) కాంచన కథ మొత్తం లారెన్స్ చుట్టే తిరుగుతుంది. అతను ఒక దుష్ట ఆత్మతో బాధపడుతుంటూ ఉంటారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు భయానకంగా అనిపిస్తాయి. కాగా.. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏ(A) సర్టిఫికేట్ ఇచ్చింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం అప్పట్లోనే రుజువు చేసిన చిత్రంగా కాంచన నిలిచింది. పలు భాషల్లో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్ల వసూళ్లు రాబట్టింది. చిన్న చిత్రంగా వచ్చిన వంద కోట్ల మార్కును దాటేసిన కాంచనకు మొదట ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కాగా.. 2020లో విడుదలైన అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రం కాంచన చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆమె ఒక స్టార్ హీరోయిన్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ) మిమి కూడా.. 2021లో ఇటీవల పంకజ్ త్రిపాఠి, కృతి సనన్ల చిత్రం మిమీ సైతం వసూళ్లపరంగా దుమ్ములేపింది. కేవం రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.298 కోట్ల రూపాయలు రాబట్టింది. తక్కువ బడ్జెట్ చిత్రమైన కలెక్షన్ల పరంగా అద్భుత విజయం సాధించింది. -
కాంచన 4 వచ్చేస్తుంది.. క్లారిటీ ఇచ్చిన రాఘవ లారెన్స్
-
రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన సంచలన వ్యాఖ్యలు
అలనాటి అందాల తార, సీనియర్ నటి కాంచన ఇప్పటితరం ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలే. అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఆమె భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఎన్నో వందల చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఆడపదడపా పాత్రలు చేస్తున్న ఆమె అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండకు బామ్మగా కనిపించారు. అందాల నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన కాంచన తాజాగా దర్శక ధీరుడు రాజమౌళిపై సంచలన కామెంట్స్ చేశారు. చదవండి: ఆస్కార్‌కు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారా? నిర్మాత దానయ్య ఏమన్నాడంటే.. తనని రాజమౌళి అవమానించారని ఆరోపించారు. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ ‘బాహుబలి’ సినిమా సమయంలో చోటుచేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు కాంచన మాట్లాడుతూ.. ‘బాహుబలి సినిమా కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. రెండు రోజులు షూటింగ్‌కి నా డేట్స్ అడిగారు. నేను రూ. 5 లక్షల పారితోషికం అడిగాను. నాకు అంత ఇవ్వడానికి ఆయన చాలా ఆలోచించారు. నా పాత్రకు అది ఎక్కువ అన్నారు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పి నన్ను వద్దనుకున్నారు’ అని వాపోయారు. చదవండి: మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా? అనంతరం మాట్లాడుతూ.. ఐదు లక్షలు తనకు పెద్ద అమౌంట్ కాదని, తనలాంటి వాళ్లకు ఇస్తే సేవలు చేసుకుంటాము కదా అని కాంచన పేర్కొన్నారు.. ‘రాజమౌళిలాంటి స్టార్ డైరెక్టర్‌కి అది పెద్ద అమౌంట్ కాదు. నాకు ఆ డబ్బు పెద్ద విషయమే కాదు. కానీ, నా లాంటి వారికి ఇస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అదే ముసలి హీరోలకు మాత్రం ఇస్తారా? నేను మిమల్ని విమర్శించడం లేదు. నాలాంటి ఆర్టిస్టుల కష్టాలను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేస్తున్నా’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అకాడమీ అవార్డు వేడుక నేపథ్యంలో మూడు నెలలుగా అమెరికా పర్యటనలో ఉన్న జక్కన్న నాటు నాటు ఆస్కార్ గెలిచిన అనంతరం రీసెంట్గా ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. -
నా తల్లిదండ్రులే నన్ను మోసం చేశారు: కన్నీళ్లు పెట్టుకున్న కాంచన
60, 70వ దశకంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది కాంచన. ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేసే ఆమె సినిమాల దిశగా అడుగులు వేసి సక్సెస్ అయింది. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె పలువురు స్టార్ హీరోలతో జోడీ కట్టింది. హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా అసలు పేరు వసుంధర. సినిమాల్లోకి వచ్చాక కాంచన అని మార్చారు. నా చిన్నతనంలో మా ఇంట్లో లక్ష్మీ తాండవం అడేది. కానీ రానురానూ ఐశ్వర్యం అంతా ఐపోయింది. నాన్న అప్పులపాలయ్యాడు. ఆ సమయంలో నాకు ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం వచ్చింది. వెంటనే జాయిన్ అయ్యాను. నెలకు రూ.600 జీతం ఇచ్చేవారు. తర్వాత సినిమాలకూ వెళ్లాను. సినిమాల్లో ఎలా ఉన్నా సరే ఇంటికి వచ్చాక మాత్రం పద్ధతిగానే ఉంటాను. సాంప్రదాయ దుస్తులనే కంఫర్ట్‌గా ఫీలయ్యేదాన్ని. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రీలోని స్టార్ నటులు ఎంతోమంది వెయిట్ చేశారు. కింగ్ ఆఫ్ సైప్రస్ ఉన్న చార్టెడ్ ఫ్లైట్‌లో ఓసారి నేను వెళ్లాను. అతడు కూడా నన్ను అలాగే చూస్తూ ఉండిపోయాడు. కానీ నేను మాత్రం దేనికీ చలించేదాన్ని కాదు. జీవితంలో ఎన్నో పరుగులు తీశాను.. చివరికి ఒంటరిదాన్నయ్యాను. నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారు. వాడు చెప్పినట్లు అమ్మానాన్న ఆడేవారు. వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు. ఇప్పటికే చాలావరకు వాడుకున్నాడు. 1996 డిసెంబర్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా. అమ్మానాన్న మారుతారేమోనని ఎదురుచూశా. కానీ వాడిని నమ్మి నన్నే మోసం చేశారు. 12 ఏళ్లుగా ఇప్పటికీ కోర్టులో పోరాడుతూనే ఉన్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడను. నాకు భగవంతుడు తోడున్నాడు' అని కన్నీళ్లు పెట్టుకుంది కాంచన. చదవండి: బాక్సాఫీస్ వద్ద స్టార్ వార్.. విజయ్, అజిత్ సినిమాల కలెక్షన్స్ ఎంతంటే? -
‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి..
‘కాంచన 3’ మూవీ హీరోయిన్, రష్యన్ నటి అలెగ్జాండ్రా జావి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. గోవాలో ఆమె అద్దెకు ఉంటున్న అపార్ట్మెంటు గదిలో శుక్రవారం ఉరివేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్యన్ మోడల్, నటి అయిన అలెగ్జాండ్రా.. రాఘవ లారెన్స్ నటించిన ‘కాంచన 3’లో పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో కనిపించించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గోవాలో తను నివసిస్తున్న అపార్టుమెంటులో మృతి చెందడం సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. అకస్మాత్తుగా ఆమె మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: హీరోయిన్ రకుల్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా? ఆమె చనిపోవడం ఏంటని, అది కూడా మూడు రోజుల తర్వాత ఈ విషయం బయటకు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా అలెగ్జాండ్రా కొద్దిరోజుల కిందట తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి విడిపోయినట్లుగా సినీవర్గాల నుంచి సమచారం. ఆ కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో గోవా పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా చెన్నైలోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేరిన అలెగ్జాండ్రా ఇటీవల అక్కడి ఫొటోగ్రాఫర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలెగ్జాండ్రా ప్రియుడితో పాటు ఫొటో గ్రాఫర్‌ను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: సీక్రెట్‌గా హీరో కార్తికేయ ఎంగేజ్మెంట్.. ఫోటో వైరల్ -
చెరిగిపోని పచ్చబొట్టు పవిత్రబంధం
కథలోని ప్రధాన పాత్రలకు ఏదో దెబ్బ తగిలి, గతం మర్చిపోవడం ఎప్పుడూ ఓ మంచి వెండితెర కమర్షియల్ పాయింట్. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటి దాకా ఈ పాయింట్‌తో అల్లుకున్న కథలు అనేకం. మన అగ్ర హీరోల్లో దాదాపు అందరూ ఈ పాయింట్ ఆధారంగా సినిమాలు చేశారు. సక్సెస్ అందుకున్నారు. కలర్ చిత్రాల జోరు మొదలైన రోజుల్లో దర్శకుడు వి. మధుసూదనరావు, హీరో అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో ఈ పాయింట్‌తో వచ్చిన సక్సెస్ఫుల్ బ్లాక్ అండ్ వైట్ చిత్రం ‘పవిత్రబంధం’. బిగువైన కథ, పాటలు, హీరోయిన్లు కాంచన, వాణిశ్రీ అందచందాలతో సరిగ్గా 50 ఏళ్ళ క్రితం వచ్చిన ‘పవిత్రబంధం’ ఆ తరానికి ఓ తీపి గుర్తు. ఆ సినిమాలోని ‘గాంధి పుట్టిన దేశమా ఇది’, ‘పచ్చబొట్టూ చెరిగీపోదులే’ లాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అందాల తారలతో... ఒక్కో హీరోకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో సినిమాకు ఒక్కో యు.ఎస్.పి. ఉంటుంది. ‘దేవదాసు’ ఫేమ్ అక్కినేనికి కెరీర్ తొలి రోజుల నుంచీ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఎక్కువ. ఒకరికి ఇద్దరు నాయికలతో అలాంటి ప్రేమలు, పెళ్ళిళ్ళ కథలు తెరపై పండించడంలో ఆయనదో ప్రత్యేక ముద్ర. అందుకే, 1950లలో, ’60లలో అలాంటి కుటుంబకథలతో ఆయన తన రేంజ్‌నూ, ఇమేజ్‌నూ పెంచుకుంటూ వచ్చారు. కలర్ సినీశకం మొదలయ్యాక కూడా ఆయన ఆ మార్గం వీడలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల చివరలో అక్కినేని చేసిన అలాంటి ఓ గమ్మతై ్తన ప్రేమ, పెళ్ళి కథ – ‘పవిత్రబంధం’. ‘‘ప్రేమించిన ప్రియురాలు! పెళ్ళాడిన ఇల్లాలు!! ఎవరి అనుబంధం – తరతరాల పవిత్రబంధం?’’ ఒక్కముక్కలో ఇదీ ఈ సినిమా కాన్సెప్ట్. అప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అందాల నటి కాంచన, సావిత్రి తరువాత అప్పుడప్పుడే స్టార్ హోదాకు ఎదుగుతున్న వాణిశ్రీ ఇందులో అక్కినేని సరసన హీరోయిన్లు. శృంగారాభినయానికి ఒకరు, సెంటిమెంటుకు మరొకరు. ఇక, 1970ల ద్వితీయార్ధానికి హీరోగా స్థిరపడ్డ కృష్ణంరాజు నెగటివ్ రోల్ చేశారు. ఆకట్టుకొనే కథ... కథనం... ‘పవిత్రబంధం’లో ‘‘కల్లకపటాలు లేని పల్లెటూరి వలపులు, అల్లకల్లోలమైన పట్నవాసపు తలపులు’’ చూపారు. అశోక్ మూవీస్ పతాకంపై టి. గోవిందరాజన్ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వి. మధుసూదనరావు పక్కా కమర్షియల్ మీటర్లో తీర్చిదిద్దారు. మెదడుకు దెబ్బ తగిలి, కథలోని ప్రధానపాత్ర పాత జ్ఞాపకాలను మర్చిపోవడమనే ఫార్ములాను లేడీస్ సెంటిమెంట్‌కు ముడిపెట్టి, హాస్య, శృంగార రసాలకు ప్రాముఖ్యమిస్తూ అల్లుకున్నారు. అనుకోని విధంగా జీవితంలో ఇద్దరు అమ్మాయిలకు ప్రేమను పంచవలసి వచ్చిన హీరో కథ ఇది. అనాథాశ్రమంలో పెరిగి, ఉన్నత విద్య చదివి, ఉద్యోగం దొరకక పట్నంలో తిరుగుతూ, ఓ పాడైపోయిన బస్సులో నివసిస్తుంటాడు హీరో (అక్కినేని). అతి గారాబంతో పంజరంలా మారిన ఇంట్లో నుంచి బయటపడి, తానెవరో చెప్పని ఓ కల వారింటి అమ్మా యి (కాంచన)ను ప్రేమి స్తాడు. ఇంతలో ఓ కారు ప్రమాదం. హీరో గతాన్ని మర్చిపోతాడు. ఓ పల్లెటూరు చేరతాడు. అనుకోకుండా అక్కడో పల్లెటూరి అమ్మాయి (వాణిశ్రీ)ని కాపాడి, ఆమె ప్రేమ దక్కించుకొని, పెళ్ళి చేసుకొంటాడు. పండంటి పిల్లాడికి తండ్రి అవుతాడు. రైతుగా జీవితం గడుపుతుంటాడు. పట్నానికి పని మీద వెళతాడు. తీరా అప్పుడు రెండోసారి ప్రమాదం. మళ్ళీ మెదడుకు దెబ్బ. ఈ రెండు యాక్సిడెంట్లకు మధ్య జరిగిన కథను హీరో మర్చిపోతాడు. మొదటి యాక్సిడెంట్‌కు ముందు పెద్దింటి అమ్మాయితో జరిపిన పాత ప్రేమకథ మాత్రం గుర్తొచ్చి, పెళ్ళికి సిద్ధమవుతాడు. కనిపించని భర్త కోసం వెతుక్కుంటూ పట్నం వస్తుంది పల్లెటూరి భార్య. అక్కడ హీరో కోసం ఇద్దరు హీరోయిన్ల మధ్య అంతః సంఘర్షణ. ‘పచ్చబొట్టు’ పాట, కన్నకొడుకు (బేబీ డాలీ) జ్ఞాపకాలతో హీరోకు తన పల్లెటూరి పెళ్ళికథా గుర్తొస్తుంది. చివరకు ప్రేమ కన్నా, తాళి కట్టిన అమ్మాయిదే పవిత్రబంధం అనే మహిళా సెంటిమెంటుకే సినిమా జై కొడుతుంది. ఒకమ్మాయి త్యాగంతో మరో అమ్మాయి సంసారం చక్కబడుతుంది. మనిషి, మనసు, డబ్బు– వీటి మధ్య బంధం ఏమిటి? హీరో కథలో పట్నంలో జరిపిన ప్రేమా, పల్లెటూరిలోని పెళ్ళా– ఏది గొప్ప? ఇలా పాత్రల ఘర్షణ, అనుబంధాల పవిత్రత చూపుతుందీ సినిమా. ఆరుద్ర కలం... పాటల బలం... ఈ సినిమాకు ఆరుద్ర రాసిన ‘అట్ల తద్దోయ్ ఆరట్లోయ్..’ (గానం పి. సుశీల బృందం), ‘ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నిజం నిజం’ (సుశీల – ఘంటసాల), సంతోష – విషాద సందర్భాలు రెంటిలోనూ వచ్చే ‘పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా’ పాటలు మోస్ట్ పాపులర్. జనపదం మెచ్చే పాటల రచయిత కొసరాజు కలంలోని ‘ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి..’ (సుశీల – స్వర్ణలత) హుషారు రేపింది. అప్పట్లో మంచి మ్యూజికల్ ఆల్బమ్‌గా నిలిచిన ‘పవిత్రబంధం’ సక్సెస్‌కు తారల అభినయంతో పాటు ఈ ఎవర్ గ్రీన్ పాటలూ తోడయ్యాయి. ఈ సినిమాకు ప్రధాన బలమైన పాటలతో పాటు మాటలూ ఆరుద్రే రాశారు. ఆ అసిస్టెంట్లు ఇప్పుడు ఫేమస్! సర్వసాధారణంగా తెలుగునాట సినిమాలన్నీ డిస్ట్రిబ్యూటర్ల ముందస్తు పెట్టుబడితో తయారవుతూ వచ్చిన కాలం అది. అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ ‘నవయుగ ఫిలిమ్స్’ సహకారంతో ‘పవిత్రబంధం’ తయారైంది. సహజంగానే, ‘నవయుగ ఫిలిమ్స్’ వారే సినిమాకు ప్రధాన పంపిణీదారులు. చిత్రం ఏమిటంటే, ఆ తరువాతి కాలంలో సుప్రసిద్ధులైన ఓ దర్శకుడు, ఓ నిర్మాత అప్పట్లో ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. వారెవరంటే – దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, నిర్మాత ‘యువచిత్ర’ కె. మురారి. అప్పట్లో దర్శకుడు వి. మధుసూదనరావు దగ్గర సహాయకులుగా పనిచేసిన ఈ ఇద్దరూ కాలక్రమంలో చెరొక శాఖలో స్థిరపడ్డారు. కోదండరామిరెడ్డి తమ గురువులానే పలు కమర్షియల్ హిట్స్ అందించి, దర్శకుడిగా 100 చిత్రాల మార్కుకు కాస్త దూరంలో ఆగారు. ఇక, ‘నవయుగ ఫిలిమ్స్’ అధినేతలైన కాట్రగడ్డ కుటుంబానికే చెందిన మురారి దర్శకత్వం కన్నా నిర్మాణం తన అభిరుచికి సరిపోతుందని అటు మళ్ళారు. ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’ మొదలు ‘నారీ నారీ నడుమ మురారి’ దాకా పలు మ్యూజికల్ హిట్స్ నిర్మించారు. అలా ‘పవిత్రబంధం’ అసిస్టెంట్ డైరెక్టర్లిద్దరూ తర్వాత ఫేమసయ్యారు. విజయవాడ విశ్లేషణకు పెద్ద పీట! ఓ సినిమా రిలీజయ్యాక ఆ చిత్ర యూనిట్ ఆంధ్రదేశంలోని ప్రధాన రిలీజు కేంద్రాలకు వెళ్ళడం, విజయయాత్రలు చేయడం, పత్రికా రచయితలతో సంభాషించడం అప్పట్లో ఓ ఆనవాయితీ. సినీ వ్యాపార, పంపిణీరంగ రాజధాని విజయవాడలో ప్రతి సినిమాకూ అవి తప్పనిసరిగా జరిగేవి. ‘పవిత్రబంధం’కి కూడా ఆ ఆనవాయితీ పాటించారు. విజయవాడలో నవయుగ ఫిలిమ్స్ నిర్వహణ బాధ్యతలతో అప్పటికే తల పండిన ప్రముఖ సినీ వ్యాపార, ప్రచార రంగ నిపుణుడు కాట్రగడ్డ నరసయ్య ఎప్పటికప్పుడు వినూత్న ప్రచార వ్యూహాలతో సినిమాకు ప్రచారం కల్పించేవారు. ‘పవిత్రబంధం’ రిలీజయ్యాక తొలి వారంలోనే ఆయన వినూత్నంగా స్థానిక రచయితలతో చిత్ర యూనిట్ ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు. దర్శకుడు వి. మధుసూదనరావు, నిర్మాత టి. గోవిందరాజన్ పాల్గొన్న ఈ ఇష్టాగోష్ఠిలో రావూరి సత్యనారాయణరావు, రెంటాల గోపాల కృష్ణ, వాసిరెడ్డి సీతాదేవి, తుర్లపాటి కుటుంబరావు లాంటి ఆ తరం ప్రముఖ రచయితలు, జర్నలిస్టులు సినిమాపై తమ అభిప్రాయాలను వివరించడం విశేషం. విజయవాడలో తరచూ రచయితలతో సమావేశాలు జరపడం, వారి అభిప్రాయాలనూ, విశ్లేషణలనూ తెలుసుకోవడం సినిమా పురోగతికి మేలు చేస్తుందని సాక్షాత్తూ దర్శకుడు వి. మధుసూదనరావు అభిప్రాయపడ్డారు. ఆ ఒరవడి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పెను మార్పులు వచ్చిన 1990ల చివరి దాకా కొనసాగడం విశేషం. మొత్తం మీద అక్కినేని, మధుసూదనరావుల కాంబినేషన్ లోని ‘పవిత్రబంధం’ ఓ పాపులర్ చిత్రంగా నిలిచింది. అప్పట్లో రేడియోలో పదే పదే వినిపించిన పాపులర్ పాటలతో ఇప్పటికీ జనానికి గుర్తుండిపోయింది. ఆరుద్ర రాసిన ‘గాంధి పుట్టిన దేశమా ఇది..’ పాట యాభయ్యేళ్ళు గడిచిపోయినా, నేటి సమకాలీన సమాజానికీ వర్తించడం ఓ విశేషం. మారని మన వ్యవస్థకు అద్దం పట్టే ఓ విషాదం. బాక్సాఫీస్ విజయాల లెక్కల కన్నా ఈ బాధామయ పరిస్థితులు, నిరుద్యోగిగా – రైతుగా – ఎస్టేటు యజమానిగా మూడు పార్శా్వలలో అక్కినేని నటన, ఘంటసాల గానం – అన్నీ ఈ సినిమాను చిరస్మరణీయం చేశాయి. కలర్ అక్కినేని వర్సెస్ బ్లాక్ అండ్ వైట్ అక్కినేని! ఓ మాస్ హిట్ సినిమా థియేటర్లలో నడుస్తుండగా... ఆ పక్కనే మరెంత బాగున్న సినిమా మరొకటి వచ్చినా బాక్సాఫీస్ ఎదురీత తప్పదు. అక్కినేని ‘పవిత్రబంధం’కి అలాంటి పరిస్థితే ఎదురైంది. కలర్ చిత్రాలు ఊపందుకుంటున్న సమయంలో వచ్చిన కలర్‌ఫుల్ మాస్ హిట్ అక్కినేని ‘దసరా బుల్లోడు’ (1971 జనవరి 13). ఆ తరువాత సరిగ్గా 6 వారాలకే ‘పవిత్రబంధం’ వచ్చింది. దానికి ‘దసరా బుల్లోడు’ ఊహించని ప్రత్యర్థి అయి కూర్చుంది. సినిమా, తీసుకున్న పాయింట్, తీసిన విధానం, నటీనటులు, పాటలు – ఇలా అన్నీ బాగున్నా, రంగుల చిత్రం ‘దసరా బుల్లోడు’ వెల్లువ నలుపు తెలుపుల ‘పవిత్ర బంధం’ని బాక్సాఫీస్ వద్ద ముంచెత్తింది. కానీ, అంత గట్టి పోటీలోనూ ‘పవిత్రబంధం’ జనాదరణ పొందింది. బెజవాడలో శతదినోత్సవమూ చేసుకుంది. అక్కినేని కథతో... రాఘవేంద్రుడి ముద్దుల ప్రియుడు గమ్మత్తేమిటంటే, విజయవంతమైన చిత్రాలతో విక్టరీ మధుసూదనరావుగా పేరు తెచ్చుకున్న వి. మధుసూదనరావు దగ్గర తొలి రోజుల్లో పనిచేసిన తరువాతి తరం కమర్షియల్ చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు అచ్చంగా ఇదే కథను రంగుల్లో తెరకెక్కించారు. ‘పవిత్ర బంధం’ రిలీజైన 23 ఏళ్ళ తరువాత రాఘవేంద్రరావు తీసిన ‘ముద్దుల ప్రియుడు’ (1994) చూస్తే – బేసిక్‌గా రెండు కథలూ ఒకటే అని అర్థమవుతుంది. బ్లాక్ అండ్ వైట్ అక్కినేని, వాణిశ్రీ, కాంచన స్థానంలో రెండు దశాబ్దాల తరువాత రంగుల్లో వెంకటేశ్, రంభ, రమ్యకృష్ణ వచ్చారు. కొత్త తరం ప్రేక్షకులకు కావాల్సిన మసాలాలు దట్టిస్తూ, మార్పులూ చేశారు. అప్పటి ‘పవిత్ర బంధం’లానే ఇప్పటి ‘ముద్దుల ప్రియుడు’లోనూ కొన్ని పాటలు (వేటూరి రచనలు ‘వసంతంలా వచ్చిపోవా ఇలా...’, ‘సిరి చందనపు చెక్క లాంటి భామ...’, సిరివెన్నెల రచన ‘నాకే గనక నీతోనే గనక పెళ్ళయితే గనక...’) పదే పదే వినిపించాయి. కీరవాణి మార్కు సంగీతానికి, రాఘవేంద్రరావు మార్కు పూలు – పండ్ల చిత్రీకరణ శైలి, రమ్యకృష్ణ అందం తోడై పాటలు రేడియోలో, టేప్రికార్డర్లలో మారు మోగాయి. కానీ, సినిమా మాత్రం ఆశించిన బాక్సాఫీస్ రిజల్ట్ అందుకోలేకపోయింది. స్వీయ నిర్మాణ సంస్థ ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్‌పై నిర్మించిన రాఘవేంద్రరావుకు నిరాశే మిగిలింది. ఎవర్ గ్రీన్ సాంగ్స్ అక్కినేని సినీ కెరీర్ లో సూపర్ హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అందులోనూ, సామాజిక పరిస్థితులకు సరిపడేలా నిత్యనూతనంగా నిలిచిన పాటలూ అనేకం. అలాంటి పాటలనగానే ఎవరికైనా – అక్కినేని ‘వెలుగు నీడలు’ చిత్రంలో పెండ్యాల సంగీతంలో ఘంటసాల పాడిన శ్రీశ్రీ రచన ‘పాడవోయి భారతీయుడా..’ గుర్తొస్తుంది. ‘స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోద’నీ, ‘అవినీతి – బంధుప్రీతి – చీకటి బజారు అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు’ననీ అక్కినేని పాత్ర నోట రచయిత పలికిన మాట దురదృష్టవశాత్తూ ఇవాళ్టికీ వర్తించే మాట! ప్రతి స్వాతంత్య్ర దినోత్సవాన జనాన్ని ఆలోచింపజేస్తున్న పాట!! సరిగ్గా అదే పద్ధతిలో చిరస్మరణీయ గీతమైంది – ‘పవిత్రబంధం’లో ఎస్. రాజేశ్వరరావు సంగీతంలో, ఆరుద్ర రాయగా, ఘంటసాల గళంలో, తెరపై హీరో అక్కినేని నోట వచ్చే ‘గాంధి పుట్టిన దేశమా ఇది.’ ఆ పాటలో ‘ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు’, ‘ఉన్నది మనకు ఓటు – బ్రతుకు తెరువుకే లోటు’ అంటూ సాగే నిరుద్యోగ నాయక పాత్ర ఆవేదన నేటి పరిస్థితులకీ అన్వయిస్తుంది. ‘పేరుకు ప్రజలదే రాజ్యం – పెత్తందార్లకే భోజ్యం’ అంటూ కవి క్రాంతదర్శి అయ్యాడు. – రెంటాల జయదేవ -
టీచర్, బ్యాంకు ఉద్యోగాలు వదిలేసి ఇప్పుడీ స్థాయిలో..
కాంచన్ పరులేకర్.. వయసు 70... బ్యాంకు మేనేజర్ ఉద్యోగం... కెరీర్లో ఉన్నతస్థాయి పదవి. ఆ పదవిని వద్దనుకున్నారు. నలుగురికీ ఉపయోగపడాలనుకున్నారు. ఒక మహిళగా పేదరికాన్ని, అడ్డంకులను దాటుకుంటూ, టీచర్ స్థాయి నుంచి బ్యాంక్ మేనేజర్ స్థాయికి ఎదిగిన కాంచన్ చిన్నతనం నుంచి ఏదో ఒకటి సాధించాలని కలగన్నారు. మహిళలకు చేయూత ఇవ్వాలనుకున్నారు. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనుకున్నారు. తన కలను సాకారం చేసుకోవటం కష్టమని తెలిసినా, చిన్న విషయంగానే భావించిన కాంచన్ ప్రయాణం... 1950–60 ప్రాంతంలో... కాంచన్ తల్లిదండ్రులు సాంఘిక సంస్కరణలు చేపట్టడంలో ముందుండేవారు. వారిది మహారాష్ట్రలోని కొల్హాపూర్. కాంచన్ తల్లి టైలర్, తండ్రి సామాజికవేత్త. తల్లిదండ్రుల వారసత్వం అందుకున్న కాంచన్, తన పదకొండవ ఏటే ఒక పబ్లిక్ మీటింగ్‌లో ఉపన్యాసం ఇచ్చారు. ఆమె ఉపన్యాసానికి ముగ్ధులైన ప్రముఖ సంఘ సేవకుడు, ‘స్వయం సిద్ధ’ సంస్థ వ్యవస్థాపకుడు డా. వి. టి. పాటిల్ కాంచన్‌ను చేరదీసి చదివించారు. పాటిల్ మరణించాక ఆయన ఆశయాలను కొనసాగించాలనుకున్నారు కాంచన్. ఆ సంస్థ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలనుకున్నారు. గత 30 సంవత్సరాలుగా 6500 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా చేసి, తన కలను, తన తల్లిదండ్రుల ఆశయాలను, తనను పెంచిన తండ్రి ఆశలను సాకారం చేయగలిగారు కాంచన్. డబ్బు విలువ తెలుసు... తన చుట్టూ మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నవారు, నిరుపేదలు, నిరక్షరాస్యులను కూడా చూసిన కాంచన్ మనసు కలత చెందింది. ‘‘బడుగు బలహీన వర్గాల వారు పేదరికం కారణంగా, కనీస అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారు. ఇందుకు వ్యతిరేకంగా మా తల్లిదండ్రులు పోరాటం చేశారు. నేను కూడా వారి మార్గంలోనే నడుస్తూ, ఇటువంటి అభాగ్యులకు సరైన న్యాయం జరిగేవరకు పోరాటం చేయాలనుకుంటున్నాను. సెకండ్ హ్యాండ్ పుస్తకాలతో చదువు పూర్తి చేసిన నాకు డబ్బు విలువ బాగా తెలుసు’’ అంటారు కాంచన్. బ్యాంకు ఉద్యోగం వదిలేసి... తల్లిదండ్రులతో పాటు మీటింగులకి, ర్యాలీలకి వెళ్తూనే కాంచన్, ఎం. ఏ. డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. పది సంవత్సరాల పాటు టీచర్‌గా పనిచేశాక, బ్యాంకులో ఉద్యోగం రావటంతో అక్కడికి మారారు. అక్కడ 14 సంవత్సరాలు పనిచేశాక, బ్యాంకు మేనేజర్ స్థాయికి ఎదిగారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు వారు నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలలో కాంచన్ పాల్గొనేవారు. అయినప్పటికీ ఇంకా తన సేవలు అవసరంలో ఉన్నవారికి విస్తృతంగా అందించాలనుకున్నారు. చేస్తున్న బ్యాంకు ఉద్యోగం విడిచిపెట్టేసి, 1992లో స్వయంసిద్ధలో పనిచేయటానికి పూనుకున్నారు. రెండు చోట్లా రెండు రకాలుగా.. కాంచన్‌కు ఇప్పుడు రెండు విభాగాలలో పనిచేయాల్సిన అవసరం కనిపించింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు. నగరాలలో నివసించే మహిళలు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు డబ్బు కట్టవలసి ఉంటుంది, గ్రామీణులకు ఉచితంగా నేర్పుతారు. కాంచన్ వార్తాపత్రికలో, ‘ఇంటి దగ్గర ఉండే మహిళలు ఆర్థిక స్వాతంత్య్రంతో జీవించండి’ అంటూ ప్రకటన వేశారు. ఆ ప్రకటన చూసి 130 మంది మహిళలు కాంచన్‌ను కలిశారు. వారికి ఏయే రంగాలలో ఆసక్తి ఉందో అడిగి తెలుసుకున్నారు. ‘‘ఆహారం దగ్గర నుంచి హస్త కళల వరకు వివిధ రంగాలలో వారికి ఉన్న ఆసక్తి కనపరిచారు. వారి అభిరుచికి తగ్గట్టుగా శిక్షణ ఇచ్చాం. ఒక సంవత్సరం తరవాత ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాలలో కూడా అమలుచేశాం.. కాని అక్కడ వారికి ఉచితంగానే శిక్షణ ఇచ్చాం. కోల్హాపూర్ జిల్లాలోని చిన్న చిన్న గ్రామాలలో కోళ్ల ఫారమ్, తేనెటీగల పెంపకం, సేంద్రియ వ్యవసాయం వంటివి నేర్పించాం. మహిళలకు ఋణసదుపాయం కూడా కల్పించాం’’ అంటారు కాంచన్. వ్యాపారం కూడా తెలియదు.. ‘‘బేకరీల నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు, బ్యాగుల తయారీ యూనిట్స్ నుంచి బ్యూటీ పార్లర్లు, హస్త కళల వరకు అన్ని వ్యాపారాలను మహిళలు ప్రారంభించారు. మహిళలు వారి సొంత సంస్థలు స్థాపించుకునేవరకు వారికి శిక్షణ ఇస్తుంటాం. వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుంటాం. కిందటి సంవత్సరం 3.5 కోట్ల బిజినెస్ చేశాం’’ అంటారు కాంచన్. ఇందులో చాలామంది మహిళలకు ఏ విధంగా వ్యాపారం చేయాలో కూడా తెలియదు. అందుకనే ‘స్వయం సిద్ధ’లో ‘స్వయం ప్రేరక’ అనే సహకార సంస్థను స్థాపించి, వారం వారం నిర్వహించే సంతలో ప్రదర్శన పెట్టి, ఆ వస్తువులను విక్రయించటం అలవాటు చేశారు. ‘‘ఇలా ఎంతో మంది మహిళలు, ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. స్వయంగా వారిని వారు ముందకు తీసుకువెళ్తున్నారు. నెలకు అరవై వేలు సంపాదించుకునేంత ఎత్తుకు ఎదుగుతున్నారు’’ అంటూ ఆనందంగా చెబుతారు కాంచన్. -
నేను చీరలో కంఫర్ట్‌గానే ఉన్నా: హీరో
చీరలోనే తనకు సౌకర్యంగా ఉందంటున్నాడు బాలీవుడ్ ‘కిలాడి’ అక్షయ్ కుమార్. 2019 ఏడాదిలో విడుదలైన అక్షయ్ సినిమాలు బీ- టౌన్ బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు రాబట్టాయి. ఇక ఇటీవల విడుదలైన తన ‘గుడ్‌న్యూస్’ మూవీ విజయంతో జోష్ మీదున్న అక్కీ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో తన అప్‌కమింగ్ మూవీ ‘లక్ష్మీ బాంబ్’లో పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. చీరతో చేసే షూటింగ్ షాట్స్ తనకు సౌకర్యంగా అనిపించాయన్నాడు. ‘చీరతో షూటింగ్లో పాల్గొనడానికి నాకు ఎలాంటి సమస్య లేదు. చెప్పాలంటే చీరలోనే చాలా సౌకర్యంగా ఉంది. భిన్నమైన పాత్రలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. నేను పోషించిన కష్టమైన పాత్రల్లో ఇది ఒకటి. చీరతో అభిమానులను మెప్పించాలంటే దానికి అనుగుణంగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది’ అని అక్కీ పేర్కొన్నాడు కాగా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘కాంచన’ సినిమాను హిందీలో ‘లక్ష్మీ బాంబ్’గా రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు రాఘవ లారెన్స్. ఇందులో అక్షయ్ ట్రాన్స్ జెండర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను గతంలో షేర్ చేసింది మూవీ యూనిట్. ఇందులో అక్షయ్ ఎరుపు రంగు చీర, నుదుటిన తిలకం పెట్టుకుని.. దేవీమాత విగ్రహం ముందు నిలుచుని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. -
విలక్ష్మీణమైన పాత్ర
‘‘మనం చాలా సులువైన పనులు కాకుండా కష్టతరమైనవి చేస్తున్న క్షణం నుంచే ఓ కొత్త జీవితం ప్రారంభం అవుతుంది’’ అంటున్నారు అక్షయ్ కుమార్. యాక్షన్, కామెడీ జానర్లలో ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్షయ్ బాలీవుడ్లో ఆకట్టకుంటుంటారు. ప్రస్తుతం లక్ష్మీ అనే అమ్మాయిగా ‘లక్ష్మీ బాంబ్’ సినిమాలో నటిస్తున్నారు. తెలుగు , తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కాంచన’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. ‘కాంచన’ చిత్రాన్ని రూపొందించిన రాఘవ లారెన్స్ ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులోని లక్ష్మీ పాత్ర లుక్‌ను అక్షయ్ షేర్ చేస్తూ – ‘‘నవరాత్రి అంటే మనలో దేవతకు తలవంచుతూ, మన అసాధారణ శక్తి సామర్థ్యాలను సెలబ్రేట్ చేసుకోవడమే. ఈ సందర్భంగా నేను చేస్తున్న లక్ష్మీ లుక్‌ను పంచుకుంటున్నాను. చాలా ఉద్వేగంగా, కొంచెం టెన్షన్‌గా ఉంది’’ అని ట్వీట్ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 5న రిలీజ్ కానుంది. -
మాట నిలబెట్టుకున్న లారెన్స్!
డాన్స్ మాస్టర్‌గా, హీరోగా, దర్శకుడిగా సౌత్‌లో స్టార్ ఇమేజ్ అందుకున్న రాఘవ లారెన్స్, తన మంచి మనసుతోనూ అంతే పేరు తెచ్చుకున్నా. ఎవరైనా కష్టాల్లో ఉన్నట్టుగా తన దృష్టికి వస్తే సాయానికి తానే ముందుంటాడు లారెన్స్. గత ఏడాది గజా తుఫాన్ తమిళనాడు, కేరళ రాష్ర్టాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆ తుఫానులో ఇళ్లు పొగొట్టుకున్న ఓ పెద్దావిడ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న లారెన్స్ ఆమె బాధ్యతను తీసుకొని ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చాడు. తాజాగా తన సొంత ఖర్చుతో ఆ పెద్దావిడకు ఇళ్లు కట్టించిన లారెన్స్ స్వయంగా ఆమెతో కలిసి పూజలు చేసి గృహప్రవేశం చేయించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్న లారెన్స్, ఆమె పరిస్థితిని తన దృష్టికి తీసుకువచ్చిన యువతకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇటీవల కాంచన 3 సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న లారెన్స్, కాంచన 2ను బాలీవుడ్లో రీమేక్‌ను ప్రారంభించాడు. అయితే అక్కడి చిత్రయూనిట్‌తో వచ్చిన ఇబ్బందుల కారణంగా కాంచన రీమేక్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు లారెన్స్. Hi dear Friend and Fans..! Happy to share this pic with you all. Many people requested me to help this amma since Gaja cyclone. I’m very happy that the construction is completed. My heartfull Thanks to the boys for bringing this to my knowledge. “Happy to serve Mother’s” pic.twitter.com/KEgR6WEZjM — Raghava Lawrence (@offl_Lawrence) 19 May 2019 -
ఇలా ఏ దర్శకుడికీ జరగకూడదు
‘లక్ష్మీబాంబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతే నాకు తెలియదు. దర్శకుడిగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాను’ అంటూ బాంబ్ పేల్చారు రాఘవ లారెన్స్. ‘కాంచన’ చిత్రం అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ విషయం తనకు తెలియదన్నారు లారెన్స్. దీని గురించి లారెన్స్ మాట్లాడుతూ– ‘‘గౌరవం లేని ఇంట్లో అడుగుపెట్టకూడదు’ అని తమిళంలో ఓ సామెత ఉంది. ఈ ప్రపంచంలో డబ్బు, ఫేమ్ కంటే కూడా ఆత్మాభిమానం అనేది మనిషికి ముఖ్య గుణం అయ్యుండాలి. ‘కాంచన’ రీమేక్ నుంచి తప్పుకోవడానికి కారణం ఇదీ అని చెప్పలేను. ఎందుకంటే చాలా కారణాలున్నాయి. శనివారం ‘లక్ష్మీ బాంబ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అన్న సంగతే నాకు తెలియదు. తన సినిమా అప్డేట్స్ మూడో మనిషి ద్వారా దర్శకుడికి తెలియడం చాలా బాధాకరం. ఒక క్రియేటర్‌గా ఆ పోస్టర్పట్ల సంతృప్తిగా లేను. ఇలా ఏ దర్శకుడికీ జరగకూడదు. నేను ఎటువంటి అగ్రిమెంట్ సైన్ చేయలేదు కాబట్టి స్క్రిప్ట్‌ను నాతోనే ఉంచుకోవచ్చు. కానీ నేనలా చేయను. అక్షయ్ కుమార్‌గారి మీద ఉన్న గౌరవంతో ఆ స్క్రిప్ట్ ఇచ్చేయదలచుకున్నాను. త్వరలోనే అక్షయ్గారిని కలిసి ఈ ప్రాజెక్ట్ నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటాను. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. -
బిగ్ బీ.. కబీ నహీ కియా
‘హోరుగాలిలాగ వచ్చెరా.. ఆడా మగా కలసి వచ్చెరా... నిన్ను నరికి పోగులెట్ట వచ్చెరా. రేయ్ రేయ్.. విళయప్రళయ మూర్తి వచ్చింది.. చూడు కాంచన..’ ఈ పాట వినగానే 2011 హారర్ కామెడీ ‘కాంచన ’సినిమా గుర్తురాక మానదు. ‘కాంచన’ సిరీస్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా కొనసాగటానికి ఈ సినిమా పెద్ద బూస్ట్. ఇప్పుడీ సూపర్ హిట్ హారర్ కామెడీను బాలీవుడ్‌కు తీసుకెళ్తున్నారు రాఘవ లారెన్స్. అక్షయ్ కుమార్ హీరోగా ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కియారా అద్వానీ కథానాయిక. ‘కాంచన’ సినిమాలో హిజ్రా పాత్ర చాలా కీలకం. తమిళ ‘కాంచన’లో శరత్‌కుమార్ ఈ పాత్ర చేయగా, హిందీలో ఈ పాత్రను ఎవరు చేయబోతున్నారంటే.. అమితాబ్ బచ్చన్ అని తెలిసింది. 50 ఏళ్ల సినీ కెరీర్లో దాదాపు అన్ని పాత్రలను టచ్ చేశారు బిగ్ బి. కానీ ఈ పాత్రను ఇప్పటి వరకు కబీ నహీ కియా (ఎప్పుడూ చేయలేదు). ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ∙షూటింగ్లో త్వరలోనే అమితాబ్ జాయిన్ అవుతారట. బాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్‌కు మ్యాచ్ అయ్యే మార్పులు చేసి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారట లారెన్స్. -
వంద కోట్లు కలెక్ట్ చేసిన ‘కాంచన3’
హారర్ సినిమాలతో హిట్లు కొట్టి కాంచన ఫ్రాంచైజీలను రిలీజ్ చేస్తూ వస్తోన్న లారెన్స్‌కు మరో హిట్ పడింది. గతవారం విడుదలైన కాంచన3 సినిమా మాస్కు విపరీతంగా ఎక్కేసింది. బీ,సీ సెంటర్స్‌లో హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేసిన ఈ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఇదే ఊపులో లారెన్స్ కాంచన4ను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో లారెన్స్ సరసన వేదిక .. ఓవియా.. నిక్కీ తంబోలి కథానాయికలుగా నటించారు. -
‘కాంచన 3’ గ్రాండ్ సక్సెస్‌మీట్
-
కాంచన నటికి లైంగిక వేధింపులు
చెన్నై, పెరంబూరు: రష్యన్ నటిని వేధింపులకు గురి చేసిన నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. రష్యాకు చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్త పిల్లలతో కలిసి 10 ఏళ్ల క్రితం చెన్నైకి వచ్చింది. స్థానిక ఎంఆర్సీ నగర్లో నివసిస్తూ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఇటీవల లారెన్స్ నటించి, తెరకెక్కించిన కాంచన 3 చిత్రంలో నటించారు. బుధవారం ఆమె తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆమెతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన రుబేశ్కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు తనకు పరిచయం అయ్యాడని పేర్కొంది. అతను తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పలు భంగి మల్లో ఫొటోలు తీశాడని తెలిపింది. అనంతరం ఆ ఫొటోలను తన వాట్సాప్‌కు పంపాడనీ, ఆ తరువాత తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, లేని పక్షంలో ఆ ఫొటోలను ఇంటర్నెట్లో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో తెలిపింది. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ దురై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రుబేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు మాధవరం, పొన్నియమ్మన్మేడు ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. అవకాశాల పేరుతో ఫొటోలు తీస్తానని వచ్చే వారితో జాగరూకత వహించాలని పోలీసులు హితవు పలికారు. -
కాంచన 4 ఉంటుంది
‘‘కాంచన 3’ కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డాను. ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అని నేను 100 సార్లు సినిమా చూసుంటాను. ఇప్పుడు ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని రాఘవ లారెన్స్ అన్నారు. రాఘవ లారెన్స్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంచన 3’. వేదిక, నిక్కీ తంబోలి కథానాయికలు. రాఘవ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో లైట్‌హౌస్ మూవీ మేకర్స్ బేనర్‌పై ‘ఠాగూర్’ మధు ఈనెల 19న విడుదల చేశారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన గ్రాండ్ సక్సెస్‌మీట్‌లో లారెన్స్ మాట్లాడుతూ– ‘‘కాంచన 3’తో డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీ. ఈ సినిమాతో మధుగారికి మంచి పేరు వచ్చినందుకు సంతోషం. డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెంటనే ‘కాంచన 4’ స్టార్ట్ చేయమని చెబుతున్నారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే మెయిన్ పాయింట్ కోసం రీసెర్చ్ చేస్తున్నాను. మంచి పాయింట్ దొరికితే త్వరగా స్టార్ట్ చేయాలని నాకూ ఉంది. నేను నెలకొల్పిన ట్రస్ట్ బాగా నడుస్తోంది. హైదరాబాద్‌లో స్టార్ట్ చేయడానికి అన్నయ్య చిరంజీవిగారు 10 లక్షలు సహాయం చేశారు. ‘కాంచన 3’ నుంచి 50 లక్షలు ఇచ్చాను. ‘కాంచన’ హిందీ రీమేక్‌ని హీరో అక్షయ్ కుమార్‌తో చేస్తున్నాను. రెండు వారాలు షూటింగ్ అయిపోగానే నా ట్రస్ట్‌కి సహాయం కోసం వచ్చినవారిని నేనే స్వయంగా కలుసుకొని వారికి తగిన సహాయం చేస్తాను. ‘కాంచన 2’ కూడా 100 కోట్లు వసూలు చేసింది. అప్పటి నుండి ఒక భయం ఏర్పడింది. ఇప్పుడు ‘కాంచన 3’ చిత్రం 10 రోజుల్లోనే 100 కోట్లకుపైగా వసూలు చేయడానికి రెడీగా ఉంది. దీనంతటికీ కారణం మా అమ్మ ఆశీర్వాదం, ఆ రాఘవేంద్ర స్వామి దయ. ‘జెర్సీ’ సినిమా చూశాను. చాలా బాగుంది. అందరూ చూడండి’’ అన్నారు. ‘‘కాంచన 3’ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 75 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండు, మూడు రోజుల్లో 100 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసి, ‘కాంచన 2’ వసూళ్లను దాటబోతోంది’’ అని ‘ఠాగూర్’ మధు అన్నారు. నిర్మాత బి.ఎ. రాజు, డిస్ట్రిబ్యూటర్స్ భరత్‌చౌదరి, వీర్నినాయుడు, హీరోయిన్లు వేదిక, నిక్కీ తంబోలి తదితరులు మాట్లాడారు. -
ప్లీజ్.. అలాంటివి చేయొద్దు: లారెన్స్
చెన్నై: అభిమానుల అత్యుత్సాహంపై నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కలత చెందారు. తన కోసం ఎటువంటి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాంచన 3 సినిమా విడుదల సందర్భంగా అభిమానులు లారెన్స్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఓ అభిమాని ఏకంగా హుక్కులతో క్రేన్‌కు వేళాడుతూ లారెన్స్ కటౌట్‌కు పూలదండ వేసి, పాలతో అభిషేకించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసి లారెన్స్ స్పందించారు. తన కోసం ఇలాంటి రిస్క్‌లు చేయొద్దని అభిమానులను కోరారు. తనపై అభిమానాన్ని చూపడానికి సాహసాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటివి చేసే ముందు అభిమానులు తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని హితవు పలికారు. ‘నా మీద మీకున్న ప్రేమను చూపాలనుకుంటే స్కూల్ ఫీజు, పుస్తకాలు అవసరమైన పిల్లలకు సహాయం చేయండి. చాలా మంది వృద్ధులు అన్నం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి సాయపడండి. ఇలాంటివి చేస్తే నేనెంతో ఆనందిస్తాను, గర్వపడతాను. అంతేకాని మీ జీవితాన్ని ప్రమాదంలో పడేసే సాహస కార్యాలను ప్రోత్సహించను. మీ ప్రాణాలు ఎంతో విలువైనవని గుర్తించండి. దయచేసి మరోసారి ఇలాంటి సాహసాలు చేయొద్ద’ని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. View this post on Instagram Fans Extreme Devotion For #Lawrence During #Kanchana3 FDFS Celebrations ! #Kanchana3 Fever & More Expectations For Next Part ! #BlockBusterKanchana3 ! . . Follow @thecinebytes A post shared by Cinema_StaLL (@cinemastall) on Apr 21, 2019 at 1:07am PDT -
‘కాంచన 3’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
నేను డబుల్ మాస్
‘నాకేమైనా అయినా వదిలేస్తా.. మా వాళ్లకేమైనా అయితే నరికి పారేస్తాన్రా’ అని హీరో అంటే, ‘నువ్వు ఉన్న చోటు తెలియకుండా అంతం చేసేస్తా’ అని విలన్ అంటాడు. ‘నిప్పుని కూడా తాకొచ్చురా నలుపుని తాకొద్దు’ అని హీరో రాఘవ లారెన్స్ డైలాగ్ చెబితే, ‘నువ్వు నా మాస్ తెలీకుండా మాట్లాడుతున్నావ్’ అని విలన్ వార్నింగ్ ఇస్తాడు. ‘నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్’ అని లారెన్స్ చెబుతున్న డైలాగ్‌తో ‘కాంచన 3’ ట్రైలర్ సాగుతుంది. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంచన 3’. ఓవియా, వేదిక కథానాయికలుగా నటించారు. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది. తెలుగులో లైట్‌హౌస్ మూవీ మేకర్స్ ఎల్ఎల్పీ పతాకంపై ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై రాఘవ లారెన్స్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం రిలీజ్ చేశారు. ‘‘కాంచన సిరీస్‌లో మూడు భాగాలను హిట్ చేశారు. ఇప్పుడు ‘కాంచన 3’ని కూడా ఆదరిస్తే ఓ పది భాగాలు తీయాలని ఉంది. నన్ను పెద్ద డ్యాన్స్ మాస్టర్ని చేసిన చిరంజీవిగారు హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది. అలాగే నన్ను దర్శకుడిని చేసిన నాగార్జునగారితో మళ్లీ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు లారెన్స్.