మాట నిలబెట్టుకున్న లారెన్స్‌! | Raghava Lawrence Builds House as Promised | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్న లారెన్స్‌!

Published Sun, May 19 2019 4:00 PM | Last Updated on Sun, May 19 2019 4:00 PM

Raghava Lawrence Builds House as Promised - Sakshi

డాన్స్‌ మాస్టర్‌గా, హీరోగా, దర్శకుడిగా సౌత్‌లో స్టార్ ఇమేజ్‌ అందుకున్న రాఘవ లారెన్స్‌, తన మంచి మనసుతోనూ అంతే పేరు తెచ్చుకున్నా. ఎవరైనా కష్టాల్లో ఉన్నట్టుగా తన దృష్టికి వస్తే సాయానికి తానే ముందుంటాడు లారెన్స్‌. గత ఏడాది గజా తుఫాన్‌ తమిళనాడు, కేరళ రాష్ర్టాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.

ఆ తుఫానులో ఇళ్లు పొగొట్టుకున్న ఓ పెద్దావిడ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న లారెన్స్ ఆమె బాధ్యతను తీసుకొని ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చాడు. తాజాగా తన సొంత ఖర్చుతో ఆ పెద్దావిడకు ఇళ్లు కట్టించిన లారెన్స్ స్వయంగా ఆమెతో కలిసి పూజలు చేసి గృహప్రవేశం చేయించాడు.

ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తన అభిమానులతో పంచుకున్న లారెన్స్‌, ఆమె పరిస్థితిని తన దృష్టికి తీసుకువచ్చిన యువతకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇటీవల కాంచన 3 సినిమాతో మరో సూపర్‌ హిట్ తన ఖాతాలో వేసుకున్న లారెన్స్‌, కాంచన 2ను బాలీవుడ్లో రీమేక్‌ను ప్రారంభించాడు. అయితే అక్కడి చిత్రయూనిట్‌తో వచ్చిన ఇబ్బందుల కారణంగా కాంచన రీమేక్‌ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు లారెన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement