
ఆత్మలకి ప్రేతాత్మలకీ వైరం పెట్టాడు. దెయ్యాల్లో మంచివి కూడా ఉంటాయనీ, వాటికి దేవుడి అండ ఉంటుందన్న కాన్సెప్ట్‌ను చూపించాడు. ఇలా కొత్త రకం ఘోస్ట్ స్టోరీలను తెరపైకి తెచ్చి హిట్స్ కొట్టేస్తున్నారు లారెన్స్. ‘ముని’, ‘కాంచన’, ‘కాంచన 2’ వంటి చిత్రాలతో ఆయన ప్రేక్షకులను భయపెట్టారు. ఇప్పుడు మరోసారి...భయపడ్డానికి రెడీనా? అంటూ కొత్త ఘోస్ట్ కాన్సెప్ట్‌తో ‘కాంచన 3’ షూట్‌ను స్టార్ట్ చేశారాయన.
లారెన్స్, వేదిక, ఓవియా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది. నైట్ సీన్స్ తీస్తున్నారు. ‘హలో హర్రర్. చెన్నైలో ‘కాంచన 3 ’నైట్ షూట్ చేస్తున్నాం’ అని వేదిక పేర్కొన్నారు. అన్నట్లు లారెన్స్ ఫస్ట్ హర్రర్ మూవీ ‘ముని’లో హీరోయిన్‌గా వేదిక చేశారు. ఇన్నేళ్ల తర్వాత లారెన్స్ సినిమాలో ఆమె మళ్లీ నటిస్తున్నారు. ‘విజయదశమి’, ‘బాణం’, ‘దగ్గరగా.. దూరంగా’ వంటి తెలుగు చిత్రాల్లోనూ మెరిసారామె.
Comments
Please login to add a commentAdd a comment