రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన సంచలన వ్యాఖ్యలు | Senior Actress Kanchana Shocking Comments On SS Rajamouli | Sakshi
Sakshi News home page

Senior Actress Kanchana: రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన సంచలన వ్యాఖ్యలు

Mar 21 2023 3:31 PM | Updated on Mar 21 2023 4:21 PM

Senior Actress Kanchana Shocking Comments On SS Rajamouli - Sakshi

అలనాటి అందాల తార, సీనియర్‌ నటి కాంచన ఇప్పటితరం ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలే. అప్పట్లో ఓ స్టార్‌ హీరోయిన్‌గా  ఓ వెలుగు వెలిగిన ఆమె భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఎన్నో వందల చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఆడపదడపా పాత్రలు చేస్తున్న ఆమె అర్జున్ రెడ్డిలో విజయ్‌ దేవరకొండకు బామ్మగా కనిపించారు. అందాల నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన కాంచన తాజాగా దర్శక ధీరుడు రాజమౌళిపై సంచలన కామెంట్స్‌ చేశారు.

చదవండి: ఆస్కార్‌కు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారా? నిర్మాత దానయ్య ఏమన్నాడంటే..

తనని రాజమౌళి అవమానించారని ఆరోపించారు. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ ‘బాహుబలి’ సినిమా సమయంలో చోటుచేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు కాంచన మాట్లాడుతూ.. ‘బాహుబలి సినిమా కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. రెండు రోజులు షూటింగ్‌కి నా డేట్స్‌ అడిగారు. నేను రూ. 5 లక్షల పారితోషికం అడిగాను. నాకు అంత ఇవ్వడానికి ఆయన చాలా ఆలోచించారు. నా పాత్రకు అది ఎక్కువ అన్నారు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పి నన్ను వద్దనుకున్నారు’ అని వాపోయారు. 

చదవండి: మోహన్‌ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా?

అనంతరం మాట్లాడుతూ.. ఐదు లక్షలు తనకు పెద్ద అమౌంట్‌ కాదని, తనలాంటి వాళ్లకు ఇస్తే సేవలు చేసుకుంటాము కదా అని  కాంచన పేర్కొన్నారు.. ‘రాజమౌళిలాంటి స్టార్‌ డైరెక్టర్‌కి అది పెద్ద అమౌంట్‌ కాదు. నాకు ఆ డబ్బు పెద్ద విషయమే కాదు. కానీ, నా లాంటి వారికి ఇస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అదే ముసలి హీరోలకు మాత్రం ఇస్తారా? నేను మిమల్ని విమర్శించడం లేదు. నాలాంటి ఆర్టిస్టుల కష్టాలను ఉద్దేశించి ఈ కామెంట్స్‌ చేస్తున్నా’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  కాగా అకాడమీ అవార్డు వేడుక నేపథ్యంలో మూడు నెలలుగా అమెరికా పర్యటనలో ఉన్న జక్కన్న నాటు నాటు ఆస్కార్‌ గెలిచిన అనంతరం రీసెంట్‌గా ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement