ఇలా ఏ దర్శకుడికీ జరగకూడదు | Akshay Kumar's first look released from the movie laxmi bomb | Sakshi
Sakshi News home page

– లారెన్స్‌

Published Sun, May 19 2019 4:02 AM | Last Updated on Sun, May 19 2019 4:02 AM

Akshay Kumar's first look released from the movie laxmi bomb - Sakshi

‘లక్ష్మీబాంబ్‌’ ఫస్ట్‌లుక్‌లో అక్షయ్‌ కుమార్‌, రాఘవ లారెన్స్‌

‘లక్ష్మీబాంబ్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయిన సంగతే నాకు తెలియదు. దర్శకుడిగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాను’ అంటూ బాంబ్‌ పేల్చారు రాఘవ లారెన్స్‌. ‘కాంచన’ చిత్రం అక్షయ్‌ కుమార్‌ హీరోగా లారెన్స్‌ దర్శకత్వంలో ‘లక్ష్మీ బాంబ్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ అవుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను శనివారం రిలీజ్‌ చేశారు. ఈ విషయం తనకు తెలియదన్నారు లారెన్స్‌. దీని గురించి లారెన్స్‌ మాట్లాడుతూ– ‘‘గౌరవం లేని ఇంట్లో అడుగుపెట్టకూడదు’ అని తమిళంలో ఓ సామెత ఉంది. ఈ ప్రపంచంలో డబ్బు, ఫేమ్‌ కంటే కూడా ఆత్మాభిమానం అనేది మనిషికి ముఖ్య గుణం అయ్యుండాలి.

‘కాంచన’ రీమేక్‌ నుంచి తప్పుకోవడానికి కారణం ఇదీ అని చెప్పలేను. ఎందుకంటే చాలా కారణాలున్నాయి. శనివారం ‘లక్ష్మీ బాంబ్‌’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అన్న సంగతే నాకు తెలియదు. తన సినిమా అప్‌డేట్స్‌ మూడో మనిషి ద్వారా దర్శకుడికి తెలియడం చాలా బాధాకరం. ఒక క్రియేటర్‌గా ఆ పోస్టర్‌పట్ల సంతృప్తిగా లేను. ఇలా ఏ దర్శకుడికీ జరగకూడదు. నేను ఎటువంటి అగ్రిమెంట్‌ సైన్‌ చేయలేదు కాబట్టి స్క్రిప్ట్‌ను నాతోనే ఉంచుకోవచ్చు. కానీ నేనలా చేయను. అక్షయ్‌ కుమార్‌గారి మీద ఉన్న గౌరవంతో ఆ స్క్రిప్ట్‌ ఇచ్చేయదలచుకున్నాను. త్వరలోనే అక్షయ్‌గారిని కలిసి ఈ ప్రాజెక్ట్‌ నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటాను. టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement