laxmi bomb
-
రికార్డులను షేక్ చేస్తున్న బాలీవుడ్ ‘లక్ష్మీ'
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, రాఘవ లారెన్స్ కాంబినేషన్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘లక్ష్మీ' రికార్డులను షేక్ చేస్తోంది. ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌పై బ్లాక్‌బస్టర్ రేటింగ్‌ను నమోదు చేసిన అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. 2.51 కోట్లకు పైగా వ్యూయర్ షిప్‌తో అతిపెద్ద ప్రీమియర్ రికార్డును కొట్టేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దూసుకుపోతూ 2.50 కోట్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అత్యధిక ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ఇంప్రెషన్స్ సాధించిన మూవీగా ‘లక్ష్మీ' నిలవడంపై సంతోషంగా ఉందని రాఘవ లారెన్స్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అక్షయ్‌కు, రాఘవేంద్రస్వామికి ధన్యవాదాలు తెలిపాడు. (టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల) హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘లక్ష్మీ’ ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌కు ప్రేక్షకుల నుంచి దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా మార్చి 21 న స్టార్ గోల్డ్‌లో రిలీజైన ఈ మూవీకి టెలివిజన్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో బాలీవుడ్ చిత్రాల చరిత్రను తిరగరాసింది రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన తొలి హిందీ మూవీ ఇది. రాఘవ లారెన్స్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో సౌత్‌లో హిట్టైయిన ‘కాంచన’ సినిమాను హిందీలో అక్షయ్ కమార్, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా ‘లక్ష్మీ’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. This is huge #Laxmii clocking 2.51cr impressions on first run is just outstanding, beating #Housefull4 numbers is itself a big task but Laxmii has gone way ahead of it.. congrats @akshaykumar @advani_kiara & @offl_Lawrence & lord @farhad_samji 🤗 pic.twitter.com/SqYJnHbMFD — Ajju 🎭 (@The_EvilGuy) April 2, 2021 More the Social Media negativity more will be the support by neutral audience for @akshaykumar ❤#Laxmii breaks all the previous Television records Yes!!! Highest impression any Bollywood movie has ever got🔥#AkshayKumar pic.twitter.com/3j1FSxiImt — AKSHAY KUMAR FAN B.T.💫 (@Akkians_BT) April 2, 2021 Happy to share, #Laxmii world tv premiere impression is 2.51 crore. One of the Highest World Television Premier Impression for a Bollywood Movie Thanking @akshaykumar Sir & Ragavendra Swamy at this moment.@advani_kiara @Shabinaa_Ent @tusshkapoor @foxstarhindi @ZeeMusicCompany pic.twitter.com/pITG503yuH — Raghava Lawrence (@offl_Lawrence) April 3, 2021 -
టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన హర్రర్- కామెడీ చిత్రం ‘లక్ష్మీ’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు. షూటింగ్ అంతా పూర్తి చేస్తున్న ఈ సినిమా ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా లక్ష్మీ బాంబ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తీరా సమయానికి టైటిల్లో లక్ష్మీ అనే పేరు ఉందని, లక్ష్మీ అంటే పవిత్రమైన పేరు అని దానిని కించపరిచేలా ఉందని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన సినిమా యూనిట్‌కు నోటీసులు పంపింది. దీంతో టైటిల్ మార్చేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. ఈ క్రమంలో లక్ష్మి బాంబ్ సినిమా పేరును బాంబ్ తొలగించి లక్ష్మీ అనే పేరుగా మార్చారు. చదవండి: అక్షయ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్లు..తీరు మార్చుకోరా? తాజాగా హాలోవీన్ సందర్భంగా అక్షయ్ కుమార్ సినిమా టైటిల్లో మార్పులు చేసిన అనంతరం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మధ్యలో కియారా అద్వానీ ఉండగా వెనక అక్షయ్ కనిపిస్తున్నారు. ‘నవంబర్ 9న లక్ష్మీతో మీ ఇంటికి వస్తున్నాం. సిద్ధంగా ఉండండి’ ఇంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 9న ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళంలో మంచి విజయం సొంతం చేసుకున్న కాంచనకు రీమేక్. హిందీలో డైరెక్టర్‌గా రాఘవా లారెన్స్‌కు ఇది మొదటి చిత్రం. View this post on Instagram Ab harr ghar mein aayegi #Laxmii! Ghar waalon ke saath taiyaar rehna 9th November ko!🤩 #FoxStarStudios #DisneyPlusHotstarMultiplex #YehDiwaliLaxmiiWali @kiaraaliaadvani @offl_lawrence @shabskofficial @tusshark89 @foxstarhindi @disneyplushotstarvip #CapeOfGoodFilms #ShabinaaEntertainment #TussharEntertainmentHouse @zeemusiccompany A post shared by Akshay Kumar (@akshaykumar) on Oct 30, 2020 at 10:29pm PDT -
అక్షయ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్లు..తీరు మార్చుకోరా?
అక్షయ్ కుమార్..చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న నటుడు. టాయిలెట్స్, ప్యాడ్, మిషల్ మంగల్ వంటి సందేశాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. 2012లో పరేష్ రావల్ రూపొందించిన ఓ మై గాడ్ చిత్రంలో కృష్టుడిగా నటించినప్పడు అక్షయ్‌ను పొగిడిన వాళ్లే ప్రస్తుతం అతన్ని విమర్శిస్తున్నారు. మతాన్ని అపహాస్యం చేసేలా అక్షయ్ కొత్త సినిమా 'లక్ష్మీబాంబ్' ఉందంటూ సినిమా విడుదలకు ముందే వీళ్లంతా ఓ డిక్లరేషన్ ఇచ్చేశారు. కాంచన రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ట్రాన్‌జెండర్ పాత్రలో కనిపించనున్న అక్షయ్‌పై సోషల్ మీడియా వేదికగా కొందరు విషం చిమ్ముతున్నారు. భారతీయులు అత్యంత పవిత్రంగా కొలిచే ఆరాధ్య దేవత లక్ష్మీదేవిని అక్షయ్.. తన తాజా చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో దేవిని ఎగతాళి చేస్తున్నాడంటూ ట్విట్టర్లో రచ్చ చేస్తున్నారు. సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ చేస్తున్నారు. (‘ఆ సినిమా లక్ష్మీదేవిని అపహాస్యం చేసేలా ఉంది’ ) ఒకప్పడు దేవుని పాత్రలో నటించిన అక్షయ్‌ను ఆరాధించిన ఓ వర్గం ప్రజలే ఇప్పుడు అక్షయ్‌ను టార్గెట్ చేశారు. లవ్ జిహాదీని ప్రోత్సహించేలా, హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ సినిమాపై విషం చిమ్ముతున్నారు. మొన్నటికి మొన్న ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ తనిష్క్ రూపిందించిన లేటెస్ట్ యాడ్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ముస్లిం కుటుంబంలో అడుగుపెట్టిన హిందూ కోడలి సీమంతం థీమ్‌తో రూపొందించిన ఈ ప్రకటన, లవ్ జీహాదీని ప్రోత్సహించేవిధంగా ఉందంటూ నెటిజన్లు #BoycottTanishq ట్రెండ్ చేయడంతో ఈ యాడ్‌ను తొలగిస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. భిన్న వర్గాల ప్రజలు, కుటుంబాలను ఒక్కచోట చేరుస్తూ, అందరూ కలిసి ఉంటే కలిగే ఆనందాన్ని సెలబ్రేట్ చేయడమే తమ ఏకత్వం(ఈ పేరుతోనే కొత్త కలెక్షన్ ప్రవేశపెట్టింది) క్యాంపెయిన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం’’ అని వివరణ ఇచ్చింది. అయినా కొందరు నిరసనకారులు మాత్రం ఈ వీడియో తొలగించినంత మాత్రాన, చేసిన తప్పు ఒప్పైపోదని, ఇకపై తనిష్క్ జువెలరీ కొనే ప్రసక్తే లేదంటూ మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. అంటే ఓ సినిమా కానీ యాడ్‌లో కానీ మనకు నచ్చని విషయాలు ఉంటే చాలు విషం చిమ్మడమే పని అన్నట్లు కొందరు ప్రవర్తిస్తున్న తీరు వారి మానసిక స్థితికి అద్దం పడుతోంది. మంచి,ఎడు అనే తారతమ్యం మరిచి కేవలం మతం, కులం అనే ప్రాతిపదికపైనే ఎక్కువ మమకారం చూపిస్తున్నారు. సోషల్ మీడియా అనే వేదికపై పిచ్చి రాతలు,అసభ్యకర పదజాలంతో దూషణలకు దిగుతూ రక్షాసానందాన్ని పొందుతున్నారు. (యాడ్ దుమారం : తనిష్క్ స్టోర్‌కు బెదిరింపులు ) View this post on Instagram Navratri is about bowing to the inner goddess and celebrating your limitless strength. On this auspicious occasion, I am sharing with you my look as Laxmmi. A character I am both excited and nervous about... but then life begins at the end of our comfort zone... isn’t it? #LaxmmiBomb A post shared by Akshay Kumar (@akshaykumar) on Oct 2, 2019 at 10:30pm PDT -
అక్షయ్ సినిమాను బాయ్‌కాట్ చేయాలి: కేఆర్కే
ముంబై: తరచూ సహా నటులు, సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూంటాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు, సినీ విమర్శకుడు కమల్ రషిద్ ఖాన్ అలియాస్ కేఆర్కే. తాజాగా అతడు బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌ను టార్గెట్ చేశాడు. అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ‘లక్ష్మీ బాంబ్’.. హిందువుల ఆరాధ్య దేవత లక్ష్మీదేవిని అపహాస్యం చేసేల ఉందని, ఈ సిమాను తప్పనిసరిగా బహిష్కరించాలని కేఆర్కే మంగళవారం ట్విటర్ వేదికగా పిలుపునిచ్చాడు. (చదవండి: ఒక లక్ష్మి.. ఇంకొక లక్ష్మికి ప్రశంస) 🙏 #Laxami is a Goddess, Devi and #AkshayKumar is mocking her by his film #LaxmiBomb! Public must boycott it to teach him a lesson, So that he doesn’t do such a big blunder in the future. It’s India not Canada. Yahan Devi Devtaon Ki puja Ki Jati Hai Mazaak Nahi Banaya Jata! — KRK (@kamaalrkhan) October 12, 2020 కమల్ రషీద్ ట్వీట్ చేస్తూ.. ‘లక్ష్మీ అంటే భారతీయులు అత్యంత పవిత్రంగా కొలిచే ఆరాధ్య దేవత. కానీ అక్షయ్.. తన తాజా చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో దేవిని ఎగతాళి చేస్తున్నాడు. వెంటనే ఈ సిమాను బాయ్‌కాట్ చేయాలి. ఈ సినిమాను బహిష్కరించడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి తప్పులు పునరావృతం కావు. ఇది భారతదేశం.. కెనడా కాదు. ఇక్కడ దేవతలను ఆరాధిస్తారు కానీ.. అపహాస్యం చేయరు’ అంటూ కేఆర్కే తన ట్వీట్లో రాసుకొచ్చాడు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రానికి లాఘవ లారెన్స్ దర్శకుడిగా వ్వవహరిస్తున్నాడు. దక్షిణాన బ్లక్‌బస్టర్‌గా నిలిచిన ‘కాంచన’ మూవీని హిందీలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. (చదవండి: కామెడీతో నవ్విస్తూనే భయపెట్టేశాడు..) -
ట్రాన్స్ జెండర్‌కు అక్షయ్ థాంక్స్
మనుషులు అందరూ ఒకలా ఉండనట్లే, అందరి దగ్గరగా ఒకేలా ఉండరు. తమ కన్నా పైనున్న వాళ్ల దగ్గర ఒక మెట్టు కిందికి దిగి నిలబడతారు. తమకన్నా కింద ఉన్నవాళ్ల దగ్గర ఒక మెట్టు పైకి ఎక్కి కుర్చుంటారు. మనిషి స్వభావం. తన మెట్టు ఒకటి ఉంటుంది కదా, అక్కడైతే ఎప్పుడూ ఉండడు మనిషి. అభినందనలు స్వీకరించడంలో కూడా ఎక్కడం దిగడం ఉంటుంది. స్వీకరించడానికి మెట్లను చూసుకోనక్కర్లేదు. ఐనా కానీ పైనున్న వాళ్ల అభినందన మోయలేని పూలగుచ్ఛమై వెన్ను సంతోషంగా కృంగిపోతుంది. కింద ఉన్న వాళ్ల అభినందన చూసి కూడా కాళ్లతో తొక్కేసుకుంటూ వెళ్లిన పువ్వు అవుతుంది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టభద్రుడు మనిషి పుట్టుకతోనే! డాన్ బాస్కో హై స్కూల్లో చదివి గురునానక్ కాలేజ్‌లో చదవలేక మానేసిన అక్షయ్ కుమార్ లా మెట్టు ఎక్కకుండా, మెట్టు దిగకుండా ఒకే చోట మనిషిలా ఉండిపోయే మనుషులు కూడా కొందరు ఉంటారు. శుక్రవారం అక్షయ్ కొత్త సినిమా ‘లక్ష్మీ బాంబ్’ ట్రైలర్ రిలీజ్ అయింది. లారెన్స్ డైరెక్టర్. పిక్చర్ నవంబర్ 9 న డిస్నీ హాట్ స్టార్‌లో వస్తోంది. బాంబులా పేలింది ట్రైలర్. హార్రర్ క్యామెడీ. ‘ఎక్స్‌ప్లోజివ్’ అని లక్ష్మీ నారాయణ త్రిపాఠీ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లక్ష్మి ట్రాన్స్‌జెండర్ ఉమన్. అక్షయ్‌కి, అక్షయ్ టీమ్‌కి ఆమె అభినందనలు, ధన్యవాదాలు రెండూ తెలిపారు. అక్షయ్ ముఖం ఇంతయింది. అసలే ఎప్పుడూ ఇంతయింది ఉంటుంది, అది కొంచెం మరికొంత అయింది. ఏ గట్టునున్నాడో, ఏ మెట్టునున్నాడో చూసుకోకుండా.. ‘మీ అభినందన మాకు ఎంతగానో అవసరం అయినది. ఒక లక్ష్మి చేతుల మీదుగా ఇంకొక లక్ష్మికి ప్రశంసల హారం’ అంటూ తనూ ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో అక్షయ్‌కి దయ్యం పడుతుంది. జీవితంలో ఎప్పుడూ ఆయనకు ఎక్కువ తక్కువల దెయ్యం పట్టలేదు. మోదీతో ఎలా ఉన్నారో, ముంబై మురికివాడల్లోని వాళ్లతోనూ అంతే గౌరవంగా, మర్యాదగా ప్రతిస్పందితుడై ఉన్నారు. -
కామెడీతో నవ్విస్తూనే భయపెట్టేశాడు..
ముంబై: బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లక్ష్మీ బాంబ్' ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్లో అక్షయ్ హార్రర్-కామెడీ చేస్తూ తన నటనతో అందరిని ఫిదా చేశాడు. దీంతో ఆ సినిమాపై బీ-టౌన్ ప్రేక్షకులు అంచనాలు మరింత పెరిగయాని సోషల్ మీడియాలో ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తే అర్థం అవుతోంది. ఒకవైపు లక్ష్మణ్‌గా కామెడీ పిండిస్తూ.. మరోవైపు లక్ష్మీగా హార్రర్‌తో భయపెడుతు అక్కి అద్బుతంగా నటించాడు. దక్షిణాదిన సూపర్ హిట్‌గా నిలిచిన ‘కాంచన’ను హిందీలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో రాఘవ లారెన్స్ రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నారు. తెలుగులో ట్రాన్స్ జెండర్‌గా సినీయర్ నటుడు శరత్ కుమార్ నటించగా.. హీరోగా రాఘవ లారెన్స్ నటించారు. కానీ ‘లక్ష్మీ బాంబ్’లో మాత్రం అక్షయ్ ద్విపాత్రలలో నటించాడు. లక్ష్మణ్ పేరుతో లవర్ బాయ్‌గా... ట్రాన్స్ జెండర్ లక్ష్మీగా భయపెడుతూ తన నటనతో ఆకట్టుకున్నాడు. (చదవండి: రికార్టు సృష్టించిన ‘లక్ష్మిబాంబ్’ మోషన్ పోస్టర్) Jahan kahi bhi hain, wahi ruk jaayyein aur taiyyaar ho jaayyein dekhne #LaxmmiBomb ka trailer, kyunki barasne aa rahi hai Laxmmi! #LaxmmiBombTrailer out now. #YeDiwaliLaxmmiBombWali! 💥 #FoxStarStudios #DisneyPlusHotstarMultiplex @advani_kiara @offl_Lawrence pic.twitter.com/oJM6YljkBX — Akshay Kumar (@akshaykumar) October 9, 2020 అయితే రాఘవ లారెన్స్ దర్వకత్వం వస్తున్న ఈ సినిమాకు తనీష్ బాగ్చీ, శశీ-ఖుషీ, అనూప్ కుమార్‌లు సంగీతం అందించారు. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవల సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో లక్ష్మీ బాంబు షూటింగ్ పూర్తి చేసుకుని దిపావళికి సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. దిపావళికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైంలో ఈ సినిమా విడుదల కానుంది. రూ. 120 కోట్లకు ఆమెజాన్ ఈ సినిమా హక్కులను కొనుక్కుంది. అలాగే ఈ నెల 15 నుంచి థీయోటర్లు తిరిగి తెరుచుకోవడానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో సినిమాను థీయోటర్లలో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు స్ఫష్టత లేదు. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో రికార్డు సృష్టిస్తోంది. విడుదల చేసిన 24 గంటల్లోనే 21 మిలియన్ వ్యూస్‌ను సంపాదించింది. (చదవండి: ‘బెల్ బాటమ్’ టీజర్ విడుదల చేసిన అక్షయ్) -
మహిళలపై గౌరవం పెరుగుతోంది
‘లక్ష్మీ బాంబ్’ సినిమాలో అక్షయ్ కుమార్‌ను ట్రాన్స్‌జెండర్ ఆత్మ ఆవహిస్తుంది. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మే 22న విడుదల అనుకున్నారు. ఆ సినిమాలో అక్షయ్ చీర కట్టుకోవాలి. కట్టుకుని ఊరికే స్టిల్ ఇవ్వడం కాదు. కొన్ని సన్నివేశాలలో యాక్ట్ చెయ్యాలి. చేశాడు!! పైగా ఈజీగా. చీర కట్టుకుని నటించడం తనకేం ఇబ్బందిగా అనిపించదలేని అంటాడు. క్యారెక్టర్ కష్టం అయింది కానీ, చీర కట్టుకున్నందు వల్ల కష్టం అవలేదట. ‘‘ఇలాంటి ‘ట్రికీ స్టఫ్’ని చేయడం నాకు ఇష్టం. చీర కట్టుకున్నంత మాత్రాన స్త్రీ అయిపోము. స్త్రీలా అనిపించాలి. అందుకు మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది’’ అన్నాడు అప్డేట్స్ మీట్లో. అక్షయ్ కొంతకాలంగా అన్నీ భిన్నమైన పాత్రలు ఎంచుకుంటున్నారు. భిన్నమైన పనులు కూడా చేస్తున్నారు. ఈ మధ్య పురిటినొప్పులు ఎలా ఉంటాయో తెలుసుకోడానికి తనపై చిన్న ప్రయోగం కూడా చేయించుకున్నాడు. డాక్టర్లు అక్షయ్ ఒంటికి వైర్లు పెట్టి నొప్పుల తీవ్రతను పెంచుతూ పోయినప్పుడు హాహాకారాలు చేశాడు. అది లేబర్ పెయిన్ టెస్ట్. ఆ టెస్ట్ అయిన వెంటనే ‘బతుకు జీవుడా’ అంటూ.. బల్ల మీద నుంచి కిందికి ఎగిరి దూకి బయటికి వచ్చాడు. ‘ఇంత నొప్పిని భరించిన అమ్మలందరికీ వందనాలు. మహిళలపై నాకు గౌరవం పెరుగుతోంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో దండాలు పెట్టాడు. అమ్మాయిలపై అసూయ కలుగుతోంది నీనా గుప్త! కాస్త పెద్దావిడ. 60 ఏళ్లుంటాయి. వయసు కారణంగా పెద్దావిడ కాదు. బాలీవుడ్ నటిగా, టీవీ దర్శకురాలిగా నీనాకు గుర్తింపు, గౌరవం ఉన్నాయి. పెద్ద స్టార్డమ్, జాతీయస్థాయి వచ్చాయి. ఇటీవలి ‘బధాయీ హో’, ‘ముల్క్’, ‘వీరె ది వెడ్డింగ్’ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు చూస్తే ఎవరికైనా అసూయ కలుగుతుంది. కెరీర్లో సంతృప్తినిచ్చే పాత్రలు అవి. ఇక చాలు సినిమాలు మానేయొచ్చు అనుకునేంతవి కూడా. అయితే నీనానే ఇప్పుడు.. ఇప్పటి అమ్మాయిల్ని చూసి అసూయ పడుతున్నారు. ‘కొత్తవాళ్లకు మంచి మంచి పాత్రలు ఉన్న సినిమాలు వస్తున్నాయి. నేనూ చిన్నదాన్నైపోయి అంటువంటి పాత్రల్లో నటిస్తే బాగుండుననిపిస్తోంది. సినిమాల్లోకి వస్తున్న ఈ తరం అమ్మాయిలు ఎంతైనా అదృష్టవంతులు’’ అని నీనా అంటున్నారు. ‘అసూయ కలుగుతోంది’ అని నీనా ఊరికే అన్నారు కానీ.. ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న అమ్మాయిల్లో ఉత్సాహం నింపడం అది. -
నేను చీరలో కంఫర్ట్‌గానే ఉన్నా: హీరో
చీరలోనే తనకు సౌకర్యంగా ఉందంటున్నాడు బాలీవుడ్ ‘కిలాడి’ అక్షయ్ కుమార్. 2019 ఏడాదిలో విడుదలైన అక్షయ్ సినిమాలు బీ- టౌన్ బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు రాబట్టాయి. ఇక ఇటీవల విడుదలైన తన ‘గుడ్‌న్యూస్’ మూవీ విజయంతో జోష్ మీదున్న అక్కీ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో తన అప్‌కమింగ్ మూవీ ‘లక్ష్మీ బాంబ్’లో పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. చీరతో చేసే షూటింగ్ షాట్స్ తనకు సౌకర్యంగా అనిపించాయన్నాడు. ‘చీరతో షూటింగ్లో పాల్గొనడానికి నాకు ఎలాంటి సమస్య లేదు. చెప్పాలంటే చీరలోనే చాలా సౌకర్యంగా ఉంది. భిన్నమైన పాత్రలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. నేను పోషించిన కష్టమైన పాత్రల్లో ఇది ఒకటి. చీరతో అభిమానులను మెప్పించాలంటే దానికి అనుగుణంగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది’ అని అక్కీ పేర్కొన్నాడు కాగా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘కాంచన’ సినిమాను హిందీలో ‘లక్ష్మీ బాంబ్’గా రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు రాఘవ లారెన్స్. ఇందులో అక్షయ్ ట్రాన్స్ జెండర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను గతంలో షేర్ చేసింది మూవీ యూనిట్. ఇందులో అక్షయ్ ఎరుపు రంగు చీర, నుదుటిన తిలకం పెట్టుకుని.. దేవీమాత విగ్రహం ముందు నిలుచుని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. -
రీమేక్ కుమార్
ఏడాదికి మూడు సినిమాలతో హిందీ ప్రేక్షకులను పలకరిస్తారు అక్షయ్ కుమార్. దేశభక్తి, యాక్షన్, సోషల్ మెసేజ్, మల్టీస్టారర్ కామెడీ జానర్లలో ఎక్కువగా సినిమాలు చేస్తుంటారాయన. అప్పుడప్పుడు రీమేక్ సినిమాల్లోనూ మెరుస్తుంటారు. కానీ, ఇటీవల అక్షయ్ కుమార్ సినిమాల ఎంపిక చూస్తుంటే... ఆయన ఆసక్తి రీమేక్స్ మీదకు మళ్లినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అక్షయ్ చేతిలో ఉన్న 5 సినిమాల్లో 3 రీమేక్సే కావడం విశేషం. తమిళంలో హిట్ అయిన ‘వీరమ్’ ఆధారంగా ‘బచ్చన్ పాండే’ సినిమా చేస్తున్నారు. సౌత్ ఆడియన్స్‌ను భయపెట్టిన ‘కాంచన’ను ‘లక్ష్మీబాంబ్’గా చుడుతున్నారు. తాజాగా ‘బెల్ బాటమ్’ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా అధికారికంగా ‘బెల్‌బాటమ్’ చిత్రానికి రీమేక్ కాకపోయినా, ఆ సినిమా స్ఫూర్తిగా సాగనుందని టాక్. ఆ చిత్ర విశేషాలేంటో చదువుదాం. లక్ష్మీ బాంబ్ హారర్–కామెడీ సినిమాల్లో ‘కాంచన’ సిరీస్ సౌత్‌లో సూపర్ సక్సెస్ఫుల్. అన్యాయంగా హత్య చేయబడ్డ ఓ వ్యక్తి ఆత్మ రాఘవ లారెన్స్ శరీరంలోకి ప్రవేశించి తన పగను తీర్చుకోవడం అనేది ఈ సిరీస్‌లోని సినిమాల కథ. అన్యాయానికి గురై హత్య చేయబడ్డ ఓ హిజ్రా ఆత్మగా మారి ఎలా పగ తీర్చకుందనేది ‘కాంచన 2’ సినిమా కథ. ‘కాంచన’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్ ‘లక్ష్మీ బాంబ్’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్లో లారెన్స్‌కి ఇదే తొలి సినిమా. 2020 జూన్ నెలాఖరులో ‘లక్ష్మీ బాంబ్’ థియేటర్స్‌లో పేలనుంది. వీరమ్– బచ్చన్ పాండే ఒక ఊరిలో పంచ పాండవుల్లాంటి అన్నదమ్ములు. నలుగురు తమ్ముళ్లంటే అన్నయ్యకు వల్లమాలిన ప్రేమ. పెళ్లి చేసుకుంటే అన్మదమ్ముల అనుబంధం దెబ్బతింటుందేమోనని వద్దనుకుంటాడు. తమ్ముళ్లను కూడా అదే ఫాలో అవ్వమంటాడు. అన్న చాటుగా పెరిగిన తమ్ముళ్లు అన్నకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు నడుపుతారు. తమ ప్రేమలకు గ్రీన్ సిగ్నల్ పడాలంటే అన్నయ్య కూడా ప్రేమలో పడాలని తమ్ముళ్లు ప్రయత్నాలు మొదలుపెడతారు. అందరూ కలసి అన్న మనసు మార్చారా? లేదా? తర్వాత ఏం జరిగింది? అన్నది ‘వీరమ్’ కథాంశం. అజిత్ హీరోగా శివ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్‌గా నిలిచింది. తెలుగులో ‘కాటమరాయుడు’ టైటిల్‌తో పవన్ కల్యాణ్ రీమేక్ చేశారు. ఈ చిత్ర హిందీ రీమేక్ ‘బచ్చన్ పాండే’ 2020 క్రిస్మస్కు విడుదల కానుంది. బెల్ బాటమ్ జేమ్స్‌బాండ్ సినిమాలు, డిటెక్టివ్ సినిమాలు విపరీతంగా చూసి, క్రైమ్ నవలలు బాగా చదివి డిటెక్టివ్‌ల మీద ఒకలాంటి ఇష్టం ఏర్పరచుకుంటాడు హీరో. వృత్తికి కానిస్టేబుల్ అయినా డిటెక్టివ్‌గా ఫీల్ అవుతాడు. ఓ మర్డర్ మిస్టరీని అవలీలగా పరిష్కరిస్తాడు. దీంతో ఓ భారీ దొంగతనం కేసును పరిష్కరించే బాధ్యతని హీరోకి అప్పచెబుతుంది ప్రభుత్వం. ఈ కేసులో ప్రమేయం ఉన్న వాళ్లని ఎలా పట్టుకున్నాడన్నదే ‘బెల్ బాటమ్’ కథాంశం. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను జయ తీర్థ తెరకెక్కించారు. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘బెల్ బాటమ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు అక్షయ్. 2021 జనవరిలో ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది. బాలీవుడ్‌కు కథలు అవసరమున్నప్పుడల్లా సౌత్ ఇండస్ట్రీ సూపర్ హిట్ కథలు ఇస్తూ వస్తోంది. సల్మాన్ ఖాన్ సెకండ్ ఇన్నింగ్స్‌కు సక్సెస్‌పుల్ స్టార్ట్ (తెలుగు ‘పోకిరి’ చిత్రాన్ని ‘వాంటెడ్’గా రీమేక్ చేశారు) ఇచ్చింది రీమేకే. బాలీవుడ్‌కు తొలి వంద కోట్ల గ్రాసర్‌ని ఇచ్చింది (గజిని) సౌత్ రీమేకే. కథ కావాల్సినప్పుడల్లా బాలీవుడ్‌ను పలకరించే దక్షిణాది బంధువు రీమేకే. గత రీమేక్‌లు అక్షయ్ కుమార్ గతంలో తెలుగు ‘విక్రమార్కుడు’ సినిమాని ‘రౌడీ రాథోడ్’గా, తమిళ ‘రమణ’ చిత్రాన్ని ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’గా, తమిళ ‘తుపాకి’ చిత్రాన్ని ‘హాలిడే’గా, మలయాళ ‘మణిచిత్రతాళ్’ సినిమాను ‘భూల్ బులయ్య’గా, మలయాళ ‘రామ్‌జీ రావ్ స్పీకింగ్’ను ‘హేరా ఫేరీ’గా రీమేక్ చేశారు. కత్తి పట్టనున్నారు ఏఆర్ మురగదాస్, విజయ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘కత్తి’. మల్టీనేషనల్ కంపెనీల ప్రభావం సామాన్య రైతుల మీద ఎలా పడుతోంది అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తారని తెలిసింది. ఏఆర్ మురగదాస్ దగ్గర పనిచేసిన జగన్ శక్తి ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారట. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. -
విలక్ష్మీణమైన పాత్ర
‘‘మనం చాలా సులువైన పనులు కాకుండా కష్టతరమైనవి చేస్తున్న క్షణం నుంచే ఓ కొత్త జీవితం ప్రారంభం అవుతుంది’’ అంటున్నారు అక్షయ్ కుమార్. యాక్షన్, కామెడీ జానర్లలో ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్షయ్ బాలీవుడ్లో ఆకట్టకుంటుంటారు. ప్రస్తుతం లక్ష్మీ అనే అమ్మాయిగా ‘లక్ష్మీ బాంబ్’ సినిమాలో నటిస్తున్నారు. తెలుగు , తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కాంచన’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. ‘కాంచన’ చిత్రాన్ని రూపొందించిన రాఘవ లారెన్స్ ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులోని లక్ష్మీ పాత్ర లుక్‌ను అక్షయ్ షేర్ చేస్తూ – ‘‘నవరాత్రి అంటే మనలో దేవతకు తలవంచుతూ, మన అసాధారణ శక్తి సామర్థ్యాలను సెలబ్రేట్ చేసుకోవడమే. ఈ సందర్భంగా నేను చేస్తున్న లక్ష్మీ లుక్‌ను పంచుకుంటున్నాను. చాలా ఉద్వేగంగా, కొంచెం టెన్షన్‌గా ఉంది’’ అని ట్వీట్ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 5న రిలీజ్ కానుంది. -
ఇలా ఏ దర్శకుడికీ జరగకూడదు
‘లక్ష్మీబాంబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతే నాకు తెలియదు. దర్శకుడిగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాను’ అంటూ బాంబ్ పేల్చారు రాఘవ లారెన్స్. ‘కాంచన’ చిత్రం అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ విషయం తనకు తెలియదన్నారు లారెన్స్. దీని గురించి లారెన్స్ మాట్లాడుతూ– ‘‘గౌరవం లేని ఇంట్లో అడుగుపెట్టకూడదు’ అని తమిళంలో ఓ సామెత ఉంది. ఈ ప్రపంచంలో డబ్బు, ఫేమ్ కంటే కూడా ఆత్మాభిమానం అనేది మనిషికి ముఖ్య గుణం అయ్యుండాలి. ‘కాంచన’ రీమేక్ నుంచి తప్పుకోవడానికి కారణం ఇదీ అని చెప్పలేను. ఎందుకంటే చాలా కారణాలున్నాయి. శనివారం ‘లక్ష్మీ బాంబ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అన్న సంగతే నాకు తెలియదు. తన సినిమా అప్డేట్స్ మూడో మనిషి ద్వారా దర్శకుడికి తెలియడం చాలా బాధాకరం. ఒక క్రియేటర్‌గా ఆ పోస్టర్పట్ల సంతృప్తిగా లేను. ఇలా ఏ దర్శకుడికీ జరగకూడదు. నేను ఎటువంటి అగ్రిమెంట్ సైన్ చేయలేదు కాబట్టి స్క్రిప్ట్‌ను నాతోనే ఉంచుకోవచ్చు. కానీ నేనలా చేయను. అక్షయ్ కుమార్‌గారి మీద ఉన్న గౌరవంతో ఆ స్క్రిప్ట్ ఇచ్చేయదలచుకున్నాను. త్వరలోనే అక్షయ్గారిని కలిసి ఈ ప్రాజెక్ట్ నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటాను. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. -
‘లక్ష్మీబాంబ్’ కాల్చొద్దు.. ఇది మనకు అవమానం
సాక్షి, భోపాల్: హిందూ దేవుళ్ల చిత్రాలున్న పటాసులు కాల్చి మన దేవుళ్లను అవమానించవద్దని మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. ఈ దీపావళికి ఫైర్ క్రాకర్స్ కాల్చకుండా పర్యావరణాన్ని రక్షిద్దామని ప్రజలను కోరుతున్నారు. లక్ష్మీబాంబ్, గణేష్ చక్రా వంటి బాంబులు కాల్చడంతో మన దేవుళ్ల చిత్రాలను మనమే కాల్చివేసినట్లవుతుందని, మరుసటి రోజు దేవుళ్ల చిత్రాలు ముక్కలు, ముక్కలుగా రొడ్లపై చిందరవందరగా పడుంటాయన్నారు. ఇది మన దేవుళ్లకు, మనకు అవమానకరమని చంద్రశేఖర్ తివారీ అనే హిందూ సామాజిక కార్యకర్త అన్నారు. దీనికోసం 6,500 మందితో ఓ గ్రూప్‌ను రూపోందించి దేవుళ్ల చిత్రాలతో ఉన్న పటాసులు కొనవద్దని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అయితే ఈ విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని భోపాల్ ఫైర్ క్రాకర్స్ అసోసియేషన్ తెలిపింది. ఫైర్ క్రాకర్స్ సరుకు ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తుందని, హిందూ దేవుళ్ల చిత్రాలతో కూడిన పటాసులు రాలేదన్నారు. -
లక్ష్మీ బాంబ్ ఆడియో లాంచ్