అక్షయ్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలి: కేఆర్‌కే | KRK Slams Akshay Kumar New Movie Laxmmi Bomb | Sakshi
Sakshi News home page

‘ఆ సినిమా లక్ష్మీదేవిని అపహాస్యం చేసేలా ఉంది’

Published Tue, Oct 13 2020 2:42 PM | Last Updated on Tue, Oct 13 2020 3:44 PM

KRK Slams Akshay Kumar New Movie Laxmmi Bomb - Sakshi

ముంబై: తరచూ సహా నటులు, సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూంటాడు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, సినీ విమర్శకుడు కమల్‌ రషిద్‌ ఖాన్‌ అలియాస్‌ కేఆర్‌కే. తాజాగా అతడు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ను టార్గెట్‌ చేశాడు. అక్షయ్ కుమార్‌‌ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్‌ ‘లక్ష్మీ బాంబ్’‌.. హిందువుల ఆరాధ్య దేవత లక్ష్మీదేవిని అపహాస్యం చేసేల ఉందని, ఈ సిమాను తప్పనిసరిగా బహిష్కరించాలని కేఆర్‌కే మంగళవారం ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చాడు. (చదవండి: ఒక లక్ష్మి.. ఇంకొక లక్ష్మికి ప్రశంస)

కమల్‌ రషీద్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘లక్ష్మీ అంటే భారతీయులు అత్యంత పవిత్రంగా కొలిచే ఆరాధ్య దేవత. కానీ అక్షయ్‌.. తన తాజా చిత్రం ‘లక్ష్మీ బాంబ్‌’ పేరుతో దేవిని ఎగతాళి చేస్తున్నాడు. వెంటనే ఈ సిమాను బాయ్‌కాట్‌ చేయాలి. ఈ సినిమాను బహిష్కరించడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి తప్పులు పునరావృతం కావు. ఇది భారతదేశం.. కెనడా కాదు. ఇక్కడ దేవతలను ఆరాధిస్తారు కానీ.. అపహాస్యం చేయరు’ అంటూ కేఆర్‌కే తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అక్షయ్‌ కుమార్‌, కియారా అద్వానీ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రానికి లాఘవ లారెన్స్‌ దర్శకుడిగా వ్వవహరిస్తున్నాడు. దక్షిణాన బ్లక్‌బస్టర్‌గా నిలిచిన ‘కాంచన’ మూవీని హిందీలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో‌ రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. (చదవండి: కామెడీతో నవ్విస్తూనే భయపెట్టేశాడు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement