
సాక్షి, భోపాల్: హిందూ దేవుళ్ల చిత్రాలున్న పటాసులు కాల్చి మన దేవుళ్లను అవమానించవద్దని మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. ఈ దీపావళికి ఫైర్ క్రాకర్స్ కాల్చకుండా పర్యావరణాన్ని రక్షిద్దామని ప్రజలను కోరుతున్నారు.
లక్ష్మీబాంబ్, గణేష్ చక్రా వంటి బాంబులు కాల్చడంతో మన దేవుళ్ల చిత్రాలను మనమే కాల్చివేసినట్లవుతుందని, మరుసటి రోజు దేవుళ్ల చిత్రాలు ముక్కలు, ముక్కలుగా రొడ్లపై చిందరవందరగా పడుంటాయన్నారు. ఇది మన దేవుళ్లకు, మనకు అవమానకరమని చంద్రశేఖర్ తివారీ అనే హిందూ సామాజిక కార్యకర్త అన్నారు. దీనికోసం 6,500 మందితో ఓ గ్రూప్‌ను రూపోందించి దేవుళ్ల చిత్రాలతో ఉన్న పటాసులు కొనవద్దని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అయితే ఈ విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని భోపాల్ ఫైర్ క్రాకర్స్ అసోసియేషన్ తెలిపింది. ఫైర్ క్రాకర్స్ సరుకు ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తుందని, హిందూ దేవుళ్ల చిత్రాలతో కూడిన పటాసులు రాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment