Hindu gods
-
లక్ష్మీబాంబులు కొనొద్దు.. కాల్చొద్దు: ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ వేళ.. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పటాకులపై హిందూ దేవతల బొమ్మలు ఉంచడం పెద్ద కుట్ర అని, అలాంటి వాటిని బహిష్కరించాలని ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. ‘‘హిందూ దేవతల బొమ్మలు ఉంటే పటాకులు కాల్చొద్దు. లక్ష్మీదేవి బొమ్మ ఉంటే కొనద్దు. ఇది హిందువుల దేవుళ్లను హిందువుల చేతే కాల్చివేసే కుట్ర’’ అంటూ దీపావళి ఆయన సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. అలాగే..ఈ దీపావళి నుంచి ఒక సంకల్పం తీసుకోవాలని, మన దేవుడి బొమ్మలు ఉన్న పటాకులు మనం కాల్చకుండా ఉంటే.. వచ్చే సంవత్సరం అలాంటి పటాకులు ఎవరూ అమ్మకుండా ఉంటారని, దయచేసి అందరూ ఇది పాటించాలని విజ్ఞప్తి చేశారు. పండుగ రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తామని, పిల్లలను తల్లిదండ్రులు దగ్గరుండి పటాకులు కాల్పించాలని సూచించారు.ఇదీ చదవండి: వేణు స్వామి జోస్యం.. చర్యలకు హైకోర్టు ఆదేశం -
Archaeological Survey Of India: జ్ఞానవాపి మసీదులో దేవతా విగ్రహాలు
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద పురాతన హిందూ ఆలయ అవశేషాలున్నాయంటూ కోర్టుకు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) సమర్పించిన సర్వే నివేదికలో మరి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. శివలింగం భాగాలు, హిందూ దేవతల ధ్వంసమైన విగ్రహాలు మసీదులో ఉన్నాయి. వాటి ఫొటోలు తాజాగా జాతీయ మీడియాకు లభించాయి. హనుమాన్, గణేష, నంది విగ్రహాల ఫొటోలు, కొన్ని పానవట్టాలు, కిందిభాగం లేని శివలింగం వాటిలో ఉన్నాయి. శతాబ్దాల నాటి నాణేలు, పర్షియన్ లిపి సున్నపురాయి శాసనం, రోలు ఉన్నాయి. మసీదు కింద భారీ ఆలయముండేదని నివేదిక నిరూపిస్తోందని హిందువుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. ఆలయ రాతిస్తంభాలనే కాస్త మార్చి మసీదు నిర్మాణంలో వాడారని నివేదికలో ఉందన్నారు. ‘‘17వ శతాబ్దంలో ఔరంగజేబు ఇక్కడి ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని కూల్చేసినట్లు నివేదికలోని ఆధారాలు బలంగా చాటుతున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ ఒక ఆలయం ఉండేదని స్పష్టమవుతోంది’’ అని ఆయన చెప్పారు. దీనితో అంజుమన్ అంజామియా మసీదు కమిటీ ప్రతినిధి అఖ్లాఖ్ అహ్మద్ విభేదించారు. ‘‘ఇందులో కొత్తేమీ లేదు. గతంలోనూ అవి ఉన్నాయని ఏఎస్ఐ తెలిపింది. తాజా నివేదికలో వాటి కొలతలను స్పష్టంగా పేర్కొంది. అవి పురాతనమైనవని చెప్పే ఆధారాలను ఏఎస్ఐ ప్రస్తావించలేదు. ఆ రాళ్ల వయసు ఎంత అనే అంశాలపై ఏఎస్ఐ ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. సర్వేలో ఉన్నవన్నీ ఏఎస్ఐ అభిప్రాయాలు మాత్రమే. అవి నిపుణుల అభిప్రాయాలు కాదు’’ అని ఆయన వాదించారు. గత ఏడాది జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ మసీదు కాంప్లెక్స్‌లో శాస్త్రీయసర్వే చేపట్టి గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన సీల్డ్ కవర్లో సర్వే నివేదికను సమర్పించింది. తాజాగా కోర్టు వాటిని కేసులో భాగమైన ఇరుపక్షాల ప్రతినిధులు, న్యాయవాదులకు అందజేశారు. దీంతో నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి. -
గుడిలో దళితుడికి ఘోర అవమానం
జైపూర్: రాజస్తాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలోని బెహ్రార్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హిందూ దేవుళ్లను విమర్శించాడని గుడిలో ఓ దళితుడితో ముక్కు నేలకు రాయించారని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనకు బాధ్యులైన 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల విడుదలైన ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను విమర్శిస్తూ రాజేశ్ కుమార్ మేఘవాల్ అనే దళిత వ్యక్తి మూడు రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దీనిపై కొందరు కామెంట్లు చేయగా, ప్రతిస్పందనగా హిందూ దేవుళ్లను(రాముడు, కృష్ణుడు) కించపరుస్తూ మళ్లీ పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు వ్యక్తులు మంగళవారం రాజేశ్ కుమార్‌ను గుడికి రప్పించారు. క్షమాపణలు చెప్పించారు. తప్పు ఒప్పుకోవాలంటూ బలవంతంగా ముక్కు నేలకు రాయించారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనాత్మకంగా మారాయి. బాధితుడు రాజేశ్ కుమార్ మేఘవాల్ ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. -
టాయిలెట్ గోడలపై హిందూ దేవుళ్లు!
న్యూయార్క్ : ఓ పబ్ టాయిలెట్ గోడలపై హిందూ దేవుళ్లను చూసి ఖంగుతిన్న ఓ భారత సంతతికి చెందిన అమెరికా మహిళా... ఆ పబ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి మెయిల్ ద్వారా భారత సంస్కృతి, హిందూ దేవుళ్ల సంప్రదాయం గురించి తెలియజేసింది. ఆమె మెయిల్‌కు స్పందించిన సదరు పబ్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పడంతో పాటు టాయిలెట్ గోడలపై ఆ చిత్రాలను తొలిగిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో వివరించింది. వివరాల్లోకి వెళ్తే.. అంకితా మిశ్రా అనే భారత సంతతి మహిళా.. కొద్ది రోజుల క్రితం స్నేహితులతో కలిసి న్యూయార్క్, బష్విక్లోని హాస్ ఆఫ్ ఎస్ పబ్‌కు వెళ్లింది. అక్కడ చిందేస్తూ ఆస్వాదించింది. ఇంతలో టాయిలెట్‌కు వెళ్లిన ఆమె షాక్‌కు గురైంది. టాయిలెట్‌లోని గోడలపై హిందూ దేవుళ్లు.. వినాయక, సరస్వతి, కాళీ, శివుడి చిత్రాలున్నాయి. దీంతో ఇది దేవాలయమా లేక టాయిలెటా? అని ఆశ్చర్యపోయింది. వెంటనే అక్కడ ఉండలేక బయటకు వచ్చి.. సదరు పబ్‌కు మెయిల్ పెట్టింది. ఆ చిత్రాలన్ని హిందూ దేవుళ్లని, భారత్‌లో ఆరాధ్యదైవంగా భావిస్తారని వివరించింది. దీనికి స్పందించిన సదరు పబ్ నిర్వాహకులు.. ఈ విషయం తమకు తెలియదని, ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రాలును చూసి.. అందంగా ఉన్నాయి కదా అని ఇక్కడ వేయించామని క్షమాపణలు తెలిపారు. ఆ చిత్రాలను తొలిగిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇక ఇలా హిందూ దేవుళ్లను అవమానించడం ఇదే తొలిసారేం కాదు.. గతంలో చెప్పులపై.. టాయిలెట్ సీట్స్‌పై కూడా వేసిన ఘటనలున్నాయి. -
మలిచేది ముస్లింలు.. కొలిచేది హిందువులు
సాక్షి, గుంటూరు: కులం, మతం అంటూ అడ్డుగోడలు ఏర్పరుచుకుంటూ జీవిస్తున్న చాలామందికి తురకపాలెం ముస్లింల్లో వెల్లివెరుస్తున్న మత సామరస్యాన్ని చూసైనా కనువిప్పు కలగాలి. గుంటూరు జిల్లాలోని మాచవరం మండలం తురకపాలెం ధ్వజస్తంభాల నిర్మాణానికి ప్రసిద్ధి. ఇక్కడ ధ్వజస్తంభాలను మలిచేవారంతా ముస్లింలే కావడం విశేషం. వందేళ్ల క్రితం నుంచి క్వారీల్లోని రాళ్లతో స్తంభాలు చెక్కడం మొదలుపెట్టారు. దేవాలయాల్లో ప్రతిష్టించి, పూజించే ధ్వజస్తంభాలను చెక్కేది ముస్లింలని తెలిసి కూడా వీరిలో నైపుణ్యాన్ని గుర్తించి హిందువులు వీరికే ఆర్డర్లు ఇస్తున్నారు. పరమత సహనానికి, మత సామరస్యానికి ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. 80 శాతం మంది ముస్లింలు ధ్వజస్తంభాలు చెక్కే వృత్తిని ఎంచుకుని జీవనం సాగిస్తున్నారు. 20 మంది గ్రూపుగా..: వంద అడుగుల నుంచి రెండు వందల అడుగుల పొడవైన ధ్వజస్తంభాలను 20 మంది గ్రూపుగా ఏర్పడి చెక్కుతుంటారు. అయితే 200 అడుగులు ఉన్న ఒకే రాయిని వెతికి పట్టడం అంత సులువైన పనేమీ కాదు. ఒక్కో ధ్వజస్తంభాన్ని చెక్కడానికి 20 మందికి నెల రోజులు పడుతుందని వారు చెబుతున్నారు. ఒక్కో స్తంభం చెక్కడానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ తీసుకుంటారు. దాన్ని దేవాలయం వరకు చేర్చే బాధ్యత వీరిదే. మధ్యలో ధ్వజస్తంభం విరిగితే మళ్లీ కొత్తదాన్ని తయారుచేసి అందిస్తారు. ఇలాంటి సందర్భాల్లో కార్మికులు నెల రోజులపాటు కూలీ లేకుండానే పనిచేస్తారు. తమను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మతం పేరుతో తన్నుకోవడం దారుణం మతం పేరుతో కొందరు తన్నుకోవడం చూస్తుంటే బాధేస్తుంది. మేము మూడు తరాలుగా ధ్వజస్తంభాలు చెక్కుతున్నాం. హిందువులు మా వద్దకు వచ్చి ఆర్డర్లు ఇస్తుంటారు. మేము ఆంజనేయస్వామిని పూజించిన తర్వాతే ధ్వజస్తంభాలు చెక్కుతాం. మతసామరస్యానికి మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. – షేక్ మహబు, మేస్త్రీ, తురకపాలెం అనేక ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం ధ్వజస్తంభం చేసినందుకు రోజూ రూ.200 మాత్రమే ముడుతుంది. అయితే మేము చెక్కిన ధ్వజస్తంభాలను ప్రతిష్టించి వాటికి పూజలు చేస్తుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. మా కళను హిందువులు గౌరవిస్తుండటం మంచి పరిణామం. – షేక్ సైదా, తురకపాలెం -
‘లక్ష్మీబాంబ్’ కాల్చొద్దు.. ఇది మనకు అవమానం
సాక్షి, భోపాల్: హిందూ దేవుళ్ల చిత్రాలున్న పటాసులు కాల్చి మన దేవుళ్లను అవమానించవద్దని మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. ఈ దీపావళికి ఫైర్ క్రాకర్స్ కాల్చకుండా పర్యావరణాన్ని రక్షిద్దామని ప్రజలను కోరుతున్నారు. లక్ష్మీబాంబ్, గణేష్ చక్రా వంటి బాంబులు కాల్చడంతో మన దేవుళ్ల చిత్రాలను మనమే కాల్చివేసినట్లవుతుందని, మరుసటి రోజు దేవుళ్ల చిత్రాలు ముక్కలు, ముక్కలుగా రొడ్లపై చిందరవందరగా పడుంటాయన్నారు. ఇది మన దేవుళ్లకు, మనకు అవమానకరమని చంద్రశేఖర్ తివారీ అనే హిందూ సామాజిక కార్యకర్త అన్నారు. దీనికోసం 6,500 మందితో ఓ గ్రూప్‌ను రూపోందించి దేవుళ్ల చిత్రాలతో ఉన్న పటాసులు కొనవద్దని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అయితే ఈ విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని భోపాల్ ఫైర్ క్రాకర్స్ అసోసియేషన్ తెలిపింది. ఫైర్ క్రాకర్స్ సరుకు ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తుందని, హిందూ దేవుళ్ల చిత్రాలతో కూడిన పటాసులు రాలేదన్నారు. -
పెను దుమారం.. చిక్కుల్లో అమెజాన్
ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజ సంస్థ ఆమెజాన్ వివాదంలో చిక్కుకుంది. ఆ సంస్థపై హిందువులలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ విశ్వాసాలను దెబ్బతీసేలా ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ ప్రవర్తిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువులు పూజించే దేవుళ్ల చిత్రాలను డోర్ మ్యాట్ లపై చిత్రిస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదంపై ఇంటర్ నెట్ లో దుమారం చెలరేగుతోంది. అమెజాన్ వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టిన డోర్ మ్యాట్స్ పై దేవుళ్ల చిత్రాలు ఉన్నట్లు గుర్తించడంతో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అమెజాన్ ను భారత్ లో బాయ్ కాట్ చేయాలని కొన్ని హిందూ మత సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అమెజాన్ సంస్థ చేస్తున్న వ్యవహారంపై షాక్ తిన్నామని హిందూ మతానికి చెందిన ఓ కమిటీ అధికార ప్రతినిధి రాజన్ నెవడాలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అమెజాన్ ప్రెసిడెంట్ పి.బెజోస్ ఈ విషయంపై హిందువులకు క్షమాపణ చెప్పాలని, దేవుళ్ల చిత్ర పటాలున్న మ్యాట్ లను ఆన్ లైన్ నుంచి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. శివుడు, విష్ణువు, కృష్ణుడు, వినాయకుడు, లక్ష్మీదేవి, హిందువులు పవిత్రంగా పూజించే దేవుళ్ల చిత్రాలను డోర్ మ్యాట్ లపై చిత్రించి మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని, కించపరుస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హిందువుల దేవుళ్లతో పాటు క్రిస్టియన్ల ఆరాధ్యుడైన జీసస్ పటాలను కూడా డోర్ మ్యాట్ లపై చిత్రించి సెల్స్ చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తుండటం గమనార్హం. -
మనం మరిచినా.. జపనీయులు మరువలేదు!
కోల్ కతా: మీకు తెలుసా? దాదాపు 20 మంది హిందూ దేవతలు జపాన్‌లో నిత్యం పూజలు అందుకుంటున్నారు. చదువుల తల్లి సరస్వతికి ఆ దేశంలో వందలకొద్ది ఆలయాలు ఉన్నాయి. లక్ష్మి, ఇంద్ర, బ్రహ్మ, గణేషుడు, గరుడ మొదలైన ఎంతోమంది హిందూ దేవుళ్లను జపాన్‌వాసులు కొలుస్తున్నారు. భారతీయులు మరిచిపోయిన దేవుళ్లను సైతం.. వారు మరిచిపోకుండా నిత్యం పూజలు చేస్తున్నారు. వందల ఏళ్ల కిందట భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతోపాటు హిందూ దేవుళ్లు కూడా జపాన్‌కు చేరారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు తెగిపోయాయి. అయినా అక్కడికి చేరిన హిందూ దేవుళ్లు ఇప్పటికీ జపాన్ వాసుల పూజలందుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో చారిత్రక విషయాలతో కోల్‌కతాలో ఇండియన్ మ్యూజియంలో విశిష్ఠ ప్రదర్శన ఒకటి ప్రారంభమైంది. సోమవారం ప్రారంభమై.. ఈ నెల 21 వరకు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్లో ఇరుదేశాల సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన అరుదైన ఫొటోలెన్నింటినో ఇందులో ఉంచారు. జపాన్ ఫౌండేషన్, సినీ దర్శకుడు, చరిత్రకారుడు బినోయ్ కే బెహల్ సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేశారు. జపాన్ లో భారత సాంస్కృతిక మూలాలకు సంబంధించి ఎన్నో వాస్తవాలను ఈ ఫొటోలు వెల్లడిస్తాయని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు. -
దేవతలను కించపర్చారని వర్మపై ఫిర్యాదు
హైదరాబాద్: హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిన సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్‌లోని మ ల్కాజిగిరి పదో మెట్రోపాలిటన్ కోర్టులో సోమవారం ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. రెండు రోజుల క్రితం ఓ దినపత్రిక (సాక్షి కాదు)కు రామ్‌గోపాల్ వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో హిం దూ దేవతలు శివుడు, సరస్వతి, లక్ష్మిలను కించపరిచేలా మాట్లాడారని కుషాయిగూడకు చెందిన న్యాయవాది సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. రామ్‌గోపాల్ వర్మపై 295 ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు నివేదిక రెండు నెలల్లో ఇవ్వాలని జడ్జి శ్రీదేవి కుషాయిగూడ పోలీసులను ఆదేశించినట్లు న్యాయవాది తెలిపారు.