లక్ష్మీబాంబులు కొనొద్దు.. కాల్చొద్దు: ఎమ్మెల్యే రాజాసింగ్‌ | Raja Singh Says Crackers Should Not Be Fire, If They Have Images Of Hindu Gods On Them | Sakshi
Sakshi News home page

లక్ష్మీబాంబులు కొనొద్దు.. అదో పెద్ద కుట్ర: ప్రజలకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ పిలుపు

Published Thu, Oct 31 2024 2:42 PM | Last Updated on Thu, Oct 31 2024 2:59 PM

Raja Singh Says Crackers Should Not Be Fire, If They Have Images Of Hindu Gods On Them

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి పండుగ వేళ.. గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పటాకులపై హిందూ దేవతల బొమ్మలు ఉంచడం పెద్ద కుట్ర అని, అలాంటి వాటిని బహిష్కరించాలని ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. 

‘‘హిందూ దేవతల బొమ్మలు ఉంటే పటాకులు కాల్చొద్దు. లక్ష్మీదేవి బొమ్మ ఉంటే కొనద్దు.  ఇది హిందువుల దేవుళ్లను హిందువుల చేతే కాల్చివేసే కుట్ర’’ అంటూ దీపావళి ఆయన సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. అలాగే..

ఈ దీపావళి నుంచి ఒక సంకల్పం తీసుకోవాలని, మన దేవుడి బొమ్మలు ఉన్న పటాకులు మనం కాల్చకుండా ఉంటే.. వచ్చే సంవత్సరం అలాంటి పటాకులు ఎవరూ అమ్మకుండా ఉంటారని, దయచేసి అందరూ ఇది పాటించాలని విజ్ఞప్తి చేశారు. పండుగ రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తామని, పిల్లలను తల్లిదండ్రులు దగ్గరుండి పటాకులు కాల్పించాలని సూచించారు.

టపాసులపై దేవతల బొమ్మలు ఉంటే కాల్చొద్దు

ఇదీ చదవండి: వేణు స్వామి జోస్యం.. చర్యలకు హైకోర్టు ఆదేశం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement