హైదరాబాద్: ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తనపై ఉన్న స్టే ఎత్తివేస్తూ.. చర్యలు తీసుకోవడానికి మహిళా కమిషన్కు పూర్తి అధికారాలు ఉన్నాయని సోమవారం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా.. వారం రోజుల్లో వేణుస్వామిపై తదుపరి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకున్న అనంతరం వారి వైవాహిక జీవితం సక్రమంగా సాగదంటూ ఇటీవల వేణుస్వామి జోస్యం చెప్పారు. నిశ్చితార్థం చేసుకున్నరోజునే.. నాగచైతన్య, శోభిత మూడేళ్లలో విడిపోతారని అన్నారు. మరో మహిళ ప్రమేయంతో 2027లో ఈ జంట విడిపోతారని అంచనా వేశారు. వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో వైరల్ కావటంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు పాలయ్యారు.
వేణుస్వామి జోస్యంపై తెలుగు ఫిల్మ్ జర్న లిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు.. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగష్టు 13న రాష్ట్ర మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో.. తనపై చర్యలు తీసుకునే అధికారం మహిళా కమిషన్కు లేదని వేణు స్వామి స్టే తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment