మనం మరిచినా.. జపనీయులు మరువలేదు! | Hindu gods forgotten in India revered in Japan | Sakshi
Sakshi News home page

మనం మరిచినా.. జపనీయులు మరువలేదు!

Published Mon, Jan 11 2016 8:54 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

మనం మరిచినా.. జపనీయులు మరువలేదు!

మనం మరిచినా.. జపనీయులు మరువలేదు!

కోల్ కతా: మీకు తెలుసా? దాదాపు 20 మంది హిందూ దేవతలు జపాన్లో నిత్యం పూజలు అందుకుంటున్నారు. చదువుల తల్లి సరస్వతికి ఆ దేశంలో వందలకొద్ది ఆలయాలు ఉన్నాయి. లక్ష్మి, ఇంద్ర, బ్రహ్మ, గణేషుడు, గరుడ మొదలైన ఎంతోమంది హిందూ దేవుళ్లను జపాన్వాసులు కొలుస్తున్నారు. భారతీయులు మరిచిపోయిన దేవుళ్లను సైతం.. వారు మరిచిపోకుండా నిత్యం పూజలు చేస్తున్నారు.

వందల ఏళ్ల కిందట భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతోపాటు హిందూ దేవుళ్లు కూడా జపాన్కు చేరారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు తెగిపోయాయి. అయినా అక్కడికి చేరిన హిందూ దేవుళ్లు ఇప్పటికీ జపాన్ వాసుల పూజలందుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో చారిత్రక విషయాలతో కోల్కతాలో ఇండియన్ మ్యూజియంలో విశిష్ఠ ప్రదర్శన ఒకటి ప్రారంభమైంది. సోమవారం ప్రారంభమై.. ఈ నెల 21 వరకు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్లో ఇరుదేశాల సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన అరుదైన ఫొటోలెన్నింటినో ఇందులో ఉంచారు. జపాన్ ఫౌండేషన్, సినీ దర్శకుడు, చరిత్రకారుడు బినోయ్ కే బెహల్ సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేశారు. జపాన్ లో భారత సాంస్కృతిక మూలాలకు సంబంధించి ఎన్నో వాస్తవాలను ఈ ఫొటోలు వెల్లడిస్తాయని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement