ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ | Women Asian Champions Trophy 2024: India Beat Japan To Set Up Final Clash With China, More Details Inside | Sakshi
Sakshi News home page

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌

Published Tue, Nov 19 2024 8:37 PM | Last Updated on Wed, Nov 20 2024 1:36 PM

Women Asian Champions Trophy 2024: India Beat Japan To Set Up Final Clash With China

రాజ్‌గిర్‌ (బిహార్‌): భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ భారత్‌, జపాన్‌పై 2-0 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. భారత్‌ తరఫున వైస్‌ కెప్టెన్‌ నవ్‌నీత్‌ కౌర్‌ 48వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచింది. 

అనంతరం లాల్‌రెమ్సియామి 56వ నిమిషంలో మరో గోల్‌ చేసింది. రేపు జరుగబోయే ఫైనల్లో భారత్‌ చైనాతో తలపడనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్‌  లీగ్‌ దశలో చైనాను ఓడించింది. చైనా తొలి సెమీఫైనల్లో మలేసియాపై 3-1 గోల్స్‌ తేడాతో గెలుపొందింది.

మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో మలేసియా, జపాన్‌ తలపడతాయి. ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో కొరియా థాయ్‌లాండ్‌ను 3-0 గోల్స్‌ తేడాతో ఓడించి, ఐదో స్థానాన్ని దక్కించుకుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement