Womens Asian Champions Trophy
-
మహిళల హాకీ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ సత్తా
-
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్
రాజ్‌గిర్ (బిహార్): భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, జపాన్‌పై 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ 48వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచింది. అనంతరం లాల్రెమ్సియామి 56వ నిమిషంలో మరో గోల్ చేసింది. రేపు జరుగబోయే ఫైనల్లో భారత్ చైనాతో తలపడనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ లీగ్ దశలో చైనాను ఓడించింది. చైనా తొలి సెమీఫైనల్లో మలేసియాపై 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది.మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో మలేసియా, జపాన్ తలపడతాయి. ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో కొరియా థాయ్‌లాండ్‌ను 3-0 గోల్స్ తేడాతో ఓడించి, ఐదో స్థానాన్ని దక్కించుకుంది. -
దీపిక ఐదు గోల్స్... సెమీస్‌లో భారత్
రాజ్‌గిర్ (బిహార్): ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్ జట్టుతో గురువారం జరిగిన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 13–0 గోల్స్ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. భారత్ తరఫున దీపిక అత్యధికంగా ఐదు గోల్స్ (3వ, 19వ, 43వ, 45వ, 45వ నిమిషంలో) చేయగా ... ప్రీతి దూబే (9వ, 40వ నిమిషంలో), లాల్రెమ్సియామి (12వ, 56వ నిమిషంలో), మనీషా చౌహాన్ (55వ, 58వ నిమిషంలో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. బ్యూటీ డుంగ్‌డుంగ్ (30వ నిమిషంలో), నవ్‌నీత్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఈ గెలుపుతో భారత జట్టు అధికారికంగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. ఆరు జట్లు మూడేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా, భారత్ 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే గోల్స్ అంతరం కారణంగా చైనా (చేసిన గోల్స్ 22; ఇచ్చిన గోల్స్ 1) టాప్ ర్యాంక్‌లో, భారత్ (చేసిన గోల్స్ 20; ఇచ్చిన గోల్స్ 2) రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. 3 పాయింట్లతో మలేసియా మూడో స్థానంలో, 2 పాయింట్లతో జపాన్ నాలుగో స్థానంలో, 1 పాయింట్‌తో కొరియా ఐదో స్థానంలో, 1 పాయింట్‌తో థాయ్‌లాండ్ ఆరో స్థానంలో ఉన్నాయి. నిర్ణీత ఐదు మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్తాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా చైనా, భారత జట్ల తొమ్మిది పాయింట్లను మిగతా జట్లు దాటే పరిస్థితి లేదు. దాంతో ఈ రెండు జట్లకు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. మూడో నిమిషంలో మొదలై... గత పదేళ్లలో ఏడోసారి థాయ్‌లాండ్‌తో తలపడిన భారత జట్టుకు ఈసారీ ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. గతంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌కు ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకొని 39 గోల్స్ సాధించిన భారత జట్టు ఏడోసారీ అదే దూకుడును కొనసాగించింది. మూడో నిమిషంలో దీపిక చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. అటునుంచి టీమిండియా వెనుదిరిగి చూడలేదు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 11 పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో ఐదింటిని మాత్రమే భారత్ గోల్స్‌గా మలిచింది. లేదంటే విజయాధిక్యం మరింతగా ఉండేది. గురువారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో చైనా 2–1 గోల్స్‌తో జపాన్‌పై, మలేసియా 2–1 గోల్స్‌తో కొరియాపై గెలిచాయి. శనివారం జరిగే నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియాతో జపాన్; కొరియాతో థాయ్‌లాండ్; చైనాతో భారత్ తలపడతాయి. -
ఛాంపియన్ భారత్
రాంచీ: స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున సంగీత కుమారి (17వ ని.లో), నేహా (46వ ని.లో), లాల్రెమ్సియామి (57వ ని.లో), వందన కటారియా (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. Congrats to the 🇮🇳 Women’s 🏑 team as they beat 🇯🇵 4-0 in the final to win the Asian Champions Trophy at Ranchi. 7 matches,7 convincing wins. After the disappointment of missing out on the Asian Games🥇this will give the team huge confidence for the Olympic Qualifiers in 2024 pic.twitter.com/6XY2yPCc4m— Viren Rasquinha (@virenrasquinha) November 5, 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీని భారత్ నెగ్గడం ఇది రెండోసారి. 2016లో టీమిండియా తొలిసారి ఈ టైటిల్ సాధించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యురాలిగా రూ. 3 లక్షలు చొప్పున అందజేస్తామని తెలిపింది. -
అజేయ భారత్.. జపాన్‌పై గెలుపు
రాంచీలో జరుగుతున్న మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు మరో విజయాన్ని అందుకుంది. టోర్నీలో ఇది భారత్‌కు వరుసగా నాలుగో గెలుపు కావడం విశేషం. మంగళవారం హోరాహోరీగా జరిగిన పోరులో భారత్ 2–1 గోల్స్ తేడాతో జపాన్ను ఓడించింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ 31వ నిమిషంలో ఫీల్డ్ గోల్ సాధించగా...47వ నిమిషంలో సంగీత కుమారి పెనాల్టీని గోల్‌గా మలచింది. జపాన్‌కు లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకుంటూ 37వ నిమిషంలో ఉరాటా కానా గోల్ నమోదు చేసింది. భారత సీనియర్ ప్లేయర్ వందన కటారియాకు ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ సందర్భంగా హాకీ ఇండియా ఆమెను ఘనంగా సన్మానించింది. టోర్నీలో థాయిలాండ్, మలేసియా, చైనా, జపాన్‌లను ఓడించి భారత్ నేడు జరిగే మ్యాచ్‌లో కొరియాతో తలపడుతుంది. -
లెక్క సరిచేసిన భారత్.. చైనాపై ప్రతీకార విజయం
రాంచీ: ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. చైనా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున దీపిక (15వ ని.లో), సలీమా టెటె (26వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. చైనా జట్టుకు జాంగ్ జియాకి (41వ ని.లో) ఒక గోల్ అందించింది. ఈ గెలుపుతో ఇటీవల హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా జట్టు చేతిలో సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. -
భారత్ శుభారంభం
డాంఘయీ సిటీ (కొరియా): మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. నవ్‌నీత్ కౌర్ ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో చెలరేగడంతో తొలి మ్యాచ్‌లో జపాన్‌పై గెలుపొందింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సునీత లాక్రా బృందం 4–1తో ప్రపంచ 12వ ర్యాంకర్ జపాన్ను మట్టికరిపించింది. నవ్‌నీత్ కౌర్ (7వ, 25వ, 55వ నిమిషాల్లో) హ్యాట్రిక్ సాధించింది. అనూప బర్లా (53వ ని.లో) మరో గోల్ నమోదు చేసింది. ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు జపాన్ డిఫెన్స్‌ను ఛేదించడంలో సఫలీకృతమైంది. జపాన్ తరఫున అకి యమదా (58వ ని.లో) ఏకైక గోల్ చేసింది. ‘తొలి మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. ఏ టోర్నీలోనైనా శుభారంభం ముఖ్యం. ఇదే జోరు కొనసాగిస్తాం. టైటిల్ గెలవడమే మా లక్ష్యం’ అని ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవ్‌నీత్ పేర్కొంది. ఈనెల 16న జరిగే తదుపరి మ్యాచ్‌లో చైనాతో భారత్ ఆడతుంది. -
చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ టీం
భారత మహిళల హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆసియన్ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సింగపూర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి చైనాను 2-1 తేడాతో ఓడించి విజయాన్ని సొంతంచేసుకుంది. స్టార్ స్ట్రైకర్ దీపికా చివరి నిమిషంలో గోల్ చేసి భారత్‌కు టైటిల్‌ను అందించింది. 60వ నిమిషంలో హోమ్ పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న దీపికా గోల్ చేసి భారత్‌కు విజయాన్ని చేకూర్చింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత్ ఆధిక్యంలో కొనసాగినప్పటికీ, 44వ నిమిషంలో చైనా ప్లేయర్ గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోరు సమమైంది. అనంతరం ఇరు టీమ్‌ల మధ్య మ్యాచ్‌పై ఎంతో ఆసక్తి నెలకొంది. అయితే మరో 20 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా దీపికా గోల్ చేసి భారత్‌ను చాంపియన్‌గా నిలిపింది. -
భారత్‌కు తొలి ఓటమి
సింగపూర్: మహిళల ఆసియా చాంపియన్స ట్రోఫీ లో భారత హాకీ జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 2-3 తేడాతో చైనా చేతిలో పోరాడి ఓడింది. నేడు (శనివారం) జరిగే ఫైనల్లోనూ భారత జట్టు చైనానే ఎదుర్కోనుంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరి నిమిషాల్లో విజయానికి కావాల్సిన గోల్ చేసి చైనా గట్టెక్కింది. భారత్ తరఫున పూనమ్ రాణి (52వ నిమిషంలో), వందన కటారియా (55) గోల్స్ చేశారు.