మహిళల ఆసియా చాంపియన్‌స ట్రోఫీ లో భారత హాకీ జట్టుకు తొలి పరాజయం ఎదురైంది.
సింగపూర్: మహిళల ఆసియా చాంపియన్‌స ట్రోఫీ లో భారత హాకీ జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 2-3 తేడాతో చైనా చేతిలో పోరాడి ఓడింది. నేడు (శనివారం) జరిగే ఫైనల్లోనూ భారత జట్టు చైనానే ఎదుర్కోనుంది.
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరి నిమిషాల్లో విజయానికి కావాల్సిన గోల్ చేసి చైనా గట్టెక్కింది. భారత్ తరఫున పూనమ్ రాణి (52వ నిమిషంలో), వందన కటారియా (55) గోల్స్ చేశారు.