The Indian hockey team
-
శ్రీజేశ్కు నిరాశ
చండీగఢ్: భారత హాకీ జట్టు కెప్టెన్ గోల్‌కీపర్ శ్రీజేశ్.. రైజింగ్ స్టార్ హర్మన్ ప్రీత్ సింగ్‌లకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల ప్రకటనలో నిరాశే ఎదురైంది. వీరిద్దరు ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నా అవార్డులను మాత్రం అందుకోలేకపోయారు. గురువారం ఎఫ్ఐహెచ్, హాకీ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో భారత ఆటగాళ్లకు నిరాశే మిగిలింది. బెల్జియంకెప్టెన్ జాన్ జాన్ న్ ( పురుషుల విభాగం), నెదర్లాండ్‌కి చెందిన నవోమి వాన్ (మహిళా విభాగం) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచారు. పురుషుల విభాగం లో ఉత్తమ గోల్ కీపర్‌గా డేవిడ్ హార్తే( ఐర్లాండ్), రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్‌గా ఆర్థర్ వాన్ డోరెన్ ( బెల్జియం) పతకాలు సాధించగా.. మహిళల విభాగంలో ఉత్తమ గోల్ కీపర్‌గా మాడీ హించ్(గ్రేట్ బ్రిటన్ ), రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్‌గా మారియా గ్రాన్నెటో(అర్జెంటీనా) అవారు్డలు గెలిచారు. -
భారత్‌కు తొలి ఓటమి
సింగపూర్: మహిళల ఆసియా చాంపియన్స ట్రోఫీ లో భారత హాకీ జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 2-3 తేడాతో చైనా చేతిలో పోరాడి ఓడింది. నేడు (శనివారం) జరిగే ఫైనల్లోనూ భారత జట్టు చైనానే ఎదుర్కోనుంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరి నిమిషాల్లో విజయానికి కావాల్సిన గోల్ చేసి చైనా గట్టెక్కింది. భారత్ తరఫున పూనమ్ రాణి (52వ నిమిషంలో), వందన కటారియా (55) గోల్స్ చేశారు. -
యూరప్ పర్యటనకు భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ: కొత్త కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ ఆధ్వర్యంలో భారత హాకీ జట్టు ఈనెల 31న యూరప్ పర్యటనకు వెళ్లనుంది. సర్దార్ సింగ్ నేతృత్వంలోని 21 మంది సభ్యుల బృందం 15 రోజులపాటు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో పర్యటిస్తుంది. ఆగస్టు 14న టూర్ ముగిసేలోపు ఓవరాల్‌గా ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ కోసం ఈ మ్యాచ్‌లను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. వివాదాస్పద పరిస్థితిలో కోచ్‌గా ఉన్న పాల్ వాన్ యాస్పై హాకీ ఇండియా (హెచ్ఐ) వేటు వేసిన విషయం తెలిసిందే. మరో ఏడాదిలో రియో ఒలింపిక్స్ ఉన్న నేపథ్యంలో కొత్త కోచ్‌ను కాకుండా జట్టులో హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్‌గా ఉన్న ఓల్ట్‌మన్స్‌కు బాధ్యతలు అప్పగించారు. -
17న వాల్ష్‌పై నిర్ణయం
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ భవితవ్యంపై ఈనెల 17న నిర్ణయం తీసుకోనున్నారు. శుక్రవారం సమావేశమైన ముగ్గురు సభ్యుల కమిటీ ఆయన చేసిన డిమాండ్లను పరిశీలించినా తుది నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో సోమవారం మరోసారి చర్చించాలని నిర్ణయించుకుంది. మాజీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్, అశోక్ కుమార్, జాఫర్ ఇక్బాల్‌ల బృందం వాల్ష్తో పాటు హై ఫెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలెంట్ ఆల్ట్‌మన్, ‘సాయ్’ అధికారులతో కలిసి మూడు గంటల పాటు చర్చలు జరిపారు. హాకీ ఇండియా అధికారులు మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. మరోవైపు తన డిమాండ్లను నెరవేర్చకపోతే కోచ్ పదవిలో కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన వాల్ష్... భారత్‌లో క్రీడా పరిపాలన వ్యవస్థ బాగాలేదని విమర్శించారు. -
హాకీ సిరీస్ భారత్ కైవశం
పెర్త్: హాకీ ఇండియా పురుషుల జట్టు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి సిరీస్ ను కైవశం చేసుకుంది. ఆదివారం జరిగిన నాల్గో మ్యాచ్ లో భారత హాకీ ఆటగాళ్లు 3-1 తేడాతో విజయభేరి మోగించారు. వారి సొంత గడ్డపైనే వరుస మ్యాచ్ ల్లో ఆసీస్ ను మట్టికరిపించిన భారత్ సిరీస్ ను 3-1 తేడాతో చేజిక్కించుకుంది. ఆదివారం నాటి మ్యాచ్ లో అద్భుతం చేసిన హాకీ ఇండియా అదే ఆట తీరును కనబరిచి ఆస్ట్రేలియా ఆశలకు చెక్ పెట్టింది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావించిన ఆస్ట్రేలియాకు చుక్కెదురైంది. ఏ దశలోనూ అవకాశం ఇవ్వని హాకీ ఇండియా ఆటగాళ్లు తన సత్తాను మరోసారి రుచి చూపించి టైటిల్ ను ఎగురేసుకుపోయారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అనంతరం మంచి ఊపుమీద ఉన్న భారత జట్టు తన విజయ యాత్రను కొనసాగిస్తోంది. -
భారత్... మళ్లీ సంచలనం
ప్రపంచ హాకీ చాంపియన్ ఆస్ట్రేలియాపై రెండో విజయం పెర్త్: రెగ్యులర్ కెప్టెన్ సర్దార్ సింగ్ గాయంతో ఆడకపోయినా... భారత హాకీ జట్టు మళ్లీ అద్భుతం చేసింది. నమ్మశక్యం కానీరీతిలో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే వరుసగా రెండోసారి ఓడించి సంచలనం సృష్టించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 1-0తో ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించింది. ఆట 34వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ అందించిన పాస్‌ను ఎస్వీ సునీల్ గోల్‌గా మలచడంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషం వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని టీమిండియా విజయాన్ని ఖాయం చేసుకుంది. కెరీర్లో 100వ మ్యాచ్ ఆడిన ‘డ్రాగ్ ఫ్లికర్’ రూపిందర్ పాల్ సింగ్ ఈ మ్యాచ్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4-0తో నెగ్గగా... రెండో మ్యాచ్‌లో భారత్ 2-1తో గెలిచింది. సిరీస్‌లో చివరిదైన నాలుగో మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో ఓడినా భారత్ సిరీస్‌ను కోల్పోదు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం... ఓవరాల్‌గా భారత్, ఆస్ట్రేలియాల మధ్య 105 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 18 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 71 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మిగతా 16 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. జూనియర్ మహిళల జట్టుకు ఓటమి మరోవైపు న్యూజిలాండ్ జూనియర్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 0-5 గోల్స్ తేడాతో ఓడింది. ఆరు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.