
17న వాల్ష్‌పై నిర్ణయం
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ భవితవ్యంపై ఈనెల 17న నిర్ణయం తీసుకోనున్నారు. శుక్రవారం సమావేశమైన ముగ్గురు సభ్యుల కమిటీ ఆయన చేసిన డిమాండ్‌లను పరిశీలించినా తుది నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో సోమవారం మరోసారి చర్చించాలని నిర్ణయించుకుంది. మాజీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్, అశోక్ కుమార్, జాఫర్ ఇక్బాల్‌ల బృందం వాల్ష్‌తో పాటు హై ఫెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలెంట్ ఆల్ట్‌మన్, ‘సాయ్’ అధికారులతో కలిసి మూడు గంటల పాటు చర్చలు జరిపారు.
హాకీ ఇండియా అధికారులు మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. మరోవైపు తన డిమాండ్లను నెరవేర్చకపోతే కోచ్ పదవిలో కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన వాల్ష్... భారత్‌లో క్రీడా పరిపాలన వ్యవస్థ బాగాలేదని విమర్శించారు.