
రాంచీ: ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. చైనా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున దీపిక (15వ ని.లో), సలీమా టెటె (26వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
చైనా జట్టుకు జాంగ్ జియాకి (41వ ని.లో) ఒక గోల్ అందించింది. ఈ గెలుపుతో ఇటీవల హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా జట్టు చేతిలో సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment