చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ టీం
భారత మహిళల హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆసియన్ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుంది. సింగపూర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థి చైనాను 2-1 తేడాతో ఓడించి విజయాన్ని సొంతంచేసుకుంది. స్టార్ స్ట్రైకర్ దీపికా చివరి నిమిషంలో గోల్ చేసి భారత్కు టైటిల్ను అందించింది.
60వ నిమిషంలో హోమ్ పెనాల్టీ కార్నర్ను సద్వినియోగం చేసుకున్న దీపికా గోల్ చేసి భారత్కు విజయాన్ని చేకూర్చింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత్ ఆధిక్యంలో కొనసాగినప్పటికీ, 44వ నిమిషంలో చైనా ప్లేయర్ గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోరు సమమైంది. అనంతరం ఇరు టీమ్ల మధ్య మ్యాచ్పై ఎంతో ఆసక్తి నెలకొంది. అయితే మరో 20 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా దీపికా గోల్ చేసి భారత్ను చాంపియన్గా నిలిపింది.