
మస్కట్: మహిళల ‘ఫైవ్స్’ ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. అమెరికాతో జరిగిన పూల్ ‘సి’ రెండో మ్యాచ్‌లో టీమిండియా 7–2 గోల్స్‌తో గెలిచింది.
భారత్ తరఫున మరియానా (20వ, 22వ ని.లో), దీపిక (23వ, 25వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేయగా... ముంతాజ్ (27వ ని.లో), అజ్మీనా (29వ ని.లో), మహిమ (17వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. పోలాండ్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–4తో గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment