ఢిల్లీ : దీపావళికి ముందే ఢిల్లీలో వాయి కాలుష్యం భారీగా పెరిగింది. ఢిల్లీలో ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ 221గా నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు టపాసుల కాల్చివేతపై నిషేధం విధించింది.
అంతేకాదు, అన్నీ రకాల బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు నిర్వహించకుండా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు కొత్త నిబంధనలు వెంటనే అమ్మల్లోకి తెచ్చేలా కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా పండుగ సీజన్ కొనసాగుతుంది. ఈ తరుణంలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డీపీసీసీ) ఢిల్లీలో గాలి కాలుష్యంపై దృష్టి సారించింది. పండుగ సీజన్‌లో ముఖ్యంగా నిన్నటి దసరా వరకు గాలి నాణ్యత భారీగా తగ్గినట్లు గుర్తించింది.
అదే సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యతను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విశ్లేషించింది. ఆదివారం మద్యాహ్నం 4గంటల వరకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 224కి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్ బోర్డ్ బాణా సంచాపై నిషేధం విధించింది. దీంతో ఢిల్లీ వాసులు బాణా సంచా కాల్చకుండానే ఈ దీపావళి జరుపుకోనున్నారు.
గాలిలో నాణ్యత ఎలా ఉంటే మంచిది..
సాధారణ గాలి ఏక్యూఐ 0–50 మంచి గాలి.. ఇబ్బంది లేదు.
51 – 100 పర్వాలేదు.. చిన్న చిన్న స్థాయిలో రోగాలు
101 – 150 శరీరంపై చిన్నదద్దుర్లు, ఎలర్జీ, నీరసం
151 – 200 ఊపిరితిత్తులు, గుండె సమస్యలు వస్తాయి, కళ్లు తిరుగుతాయి.
201 – 300 ఊపిరితిత్తులు, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలుగా మారిపోతాయి. కిడ్నీలపై ప్రభావం వాటి సమస్యలు
300+ అయితే ఆ ప్రాంత గాలి పిలిస్తే నిత్యం ప్రమాదమే.. అనేక రోగాలబారిన పడతారు.
Comments
Please login to add a commentAdd a comment