‘మా నగరానికి ఏమైంది’
ముంబైలో రోజురోజుకీ క్షీణిస్తున్న వాయునాణ్యతపై ప్రభుత్వానికి నెటిజన్ల ప్రశ్న
దీనికి బాధ్యులెవరు? పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చేదెన్నడంటూ ఆగ్రహం
సాక్షి, ముంబై: దేశరాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కా లుష్యంతో ఇప్పటికే సతమత మవుతుండగా, ఇప్పు డు ముంబై కూడా అదే సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా నగరంలో వాయునాణ్యత క్షీణిస్తుండటంతో పర్యావరణవేత్తలు, ముంబైవాసు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మా నగరా నికి ఏమైంది? దీనికి బాధ్యులెవరు?‘అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
బహిరంగప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి
ముంబైలోని అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించిన బాంద్రా – కుర్లా కాంప్లెక్స్, బైకుల్లా, శివ్డీ, కొలాబా, శివాజీనగర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్రమేపీదిగజారుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలనెదుర్కొంటున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు.
కాలుష్య నియంత్రణకు సూచనలు..
ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నగరంలో కాలుష్య నియంత్రణకు పలు సూచనలు చేస్తున్నారు
పరిశ్రమల నుంచి వెలువడే వాయు మలినాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం.
ట్రాఫిక్ నియంత్రణ ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించడం.
పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం.
కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయడం.
Comments
Please login to add a commentAdd a comment