దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమవుతున్న తరుణంలో సుప్రీంకోర్టు బీఎస్3 పెట్రోల్ కార్లను, బీఎస్4 డీజిల్ కార్లను నడపడం నిషేదించింది. ఈ నిషేధం గురువారం (డిసెంబర్ 5) వరకు కొనసాగుతుంది. రెండు రోజులుగా సాధారణ స్థాయికంటే.. ఎక్కువ కాలుష్యం ఏర్పడింది. కాబట్టి పొల్యూషన్ అదుపులోకి వచ్చే వరకు నిర్దేశించిన కార్లను ఉపయోగించకూడదది సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) నవంబర్ 8 నుంచి పరిమితులను అమలు చేసింది. కాలుష్యాన్ని తగ్గించడానికి కొన్ని వాహనాలను నియంత్రించింది. ఈ చర్యలు తీసుకోకపోతే.. కాలుష్యం మరింత తీవ్రతరం అవుతుంది. నిషేధిత వాహనాల జాబితాలో కార్లు మాత్రమే కాకుండా కమర్షియల్ ట్రక్కులు, డీజిల్‌తో నడిచే పబ్లిక్ బస్సులు.. కాలం చెల్లిన ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి.
డిసెంబర్ 5 తరువాత బీఎస్3 పెట్రోల్ కార్లను, బీఎస్4 డీజిల్ కార్లను అనుమతించే ముందు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు చెందిన అధికారులను సుప్రీంకోర్టులో హాజరు కావాలని ధర్మాసనం కోరింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు సమర్థవంతంగా పనిచేయలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
గత వారం.. బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ వాహనాలపై నిషేధాన్ని పాక్షికంగా సడలించింది. అయితే ప్రస్తుతం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ.. మళ్ళీ కఠినమైన ఆంక్షలు విధించింది. కాబట్టి నియమాలను ఉల్లంఘిస్తే.. రూ. 20,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పీయూసీ సర్టిఫికేట్ లేకుండా తిరిగే వాహనాలకు రూ. 10,000 జరిమానా విధించారు. ఇవి కాకుండా 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ కార్లు లేదా 10 ఏళ్లు పైబడిన డీజిల్ కార్లు రోడ్డుపై తిరిగితే.. వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి వీటిని గుర్తుంచుకుని వ్యవహరించాలి. లేకుంటే భారీ జరిమానాలు చెల్లించక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment