తమిళ స్టార్ రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంచన(ముని-2). 2007లో రిలీజైన ముని సిరీస్‌లో వచ్చిన రెండో చిత్రమే కాంచన. 2011లో విడుదలైన బాక్సాఫీస్ బరిలో నిలిచిన ఈ చిత్రం ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. శరత్ కుమార్, కోవై సరళ, లక్ష్మీ రాయ్, దేవదర్శిని, శ్రీమాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. హార్రర్- కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే దాదాపు 12 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి అప్పట్లోనే రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.
(ఇది చదవండి: అందుకే నా ట్రస్ట్‌కి విరాళాలు వద్దని చెప్పా: లారెన్స్)
కాంచన కథ మొత్తం లారెన్స్ చుట్టే తిరుగుతుంది. అతను ఒక దుష్ట ఆత్మతో బాధపడుతుంటూ ఉంటారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు భయానకంగా అనిపిస్తాయి. కాగా.. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏ(A) సర్టిఫికేట్ ఇచ్చింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం అప్పట్లోనే రుజువు చేసిన చిత్రంగా కాంచన నిలిచింది. పలు భాషల్లో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్ల వసూళ్లు రాబట్టింది.
చిన్న చిత్రంగా వచ్చిన వంద కోట్ల మార్కును దాటేసిన కాంచనకు మొదట ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కాగా.. 2020లో విడుదలైన అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రం కాంచన చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: ఆమె ఒక స్టార్ హీరోయిన్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! )
మిమి కూడా..
2021లో ఇటీవల పంకజ్ త్రిపాఠి, కృతి సనన్‌ల చిత్రం మిమీ సైతం వసూళ్లపరంగా దుమ్ములేపింది. కేవం రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.298 కోట్ల రూపాయలు రాబట్టింది. తక్కువ బడ్జెట్ చిత్రమైన కలెక్షన్ల పరంగా అద్భుత విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment