Kanchana 3 Actress Alexandra Djavi Committed Suicide In Goa - Sakshi

Kanchana 3 Heroine: అలెగ్జాండ్రా జావి ఆత్మహత్య

Aug 23 2021 3:21 PM | Updated on Aug 23 2021 6:37 PM

kanchana 3 Actress Alexandra Djavi Commits Suicide In Goa - Sakshi

‘కాంచ‌న 3’ మూవీ హీరోయిన్‌, రష్యన్‌ నటి అలెగ్జాండ్రా జావి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. గోవాలో ఆమె అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంటు గదిలో శుక్రవారం ఉరివేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్యన్‌ మోడల్‌, నటి అయిన అలెగ్జాండ్రా.. రాఘవ లారెన్స్‌ నటించిన ‘కాంచన 3’లో పగ తీర్చుకునే దెయ్యం పాత్ర‌లో క‌నిపించించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తనదైన న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆక‌ట్టుకున్నారు. గోవాలో తను నివసిస్తున్న అపార్టుమెంటులో మృతి చెందడం సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. అకస్మాత్తుగా ఆమె మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చదవండి: హీరోయిన్‌ రకుల్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా?

ఆమె చనిపోవడం ఏంటని, అది కూడా మూడు రోజుల తర్వాత ఈ విషయం బయటకు రావడంతో అందరూ షాక్‌ అవుతున్నారు. ఇదిలా ఉండగా అలెగ్జాండ్రా  కొద్దిరోజుల కిందట తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి విడిపోయినట్లుగా సినీవర్గాల నుంచి సమచారం. ఆ కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో గోవా పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా చెన్నైలోని ఓ యాక్టింగ్‌ స్కూల్‌లో చేరిన అలెగ్జాండ్రా ఇటీవల అక్కడి ఫొటోగ్రాఫర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలెగ్జాండ్రా ప్రియుడితో పాటు ఫొటో గ్రాఫర్‌ను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: సీక్రెట్‌గా హీరో కార్తికేయ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement