
వరుసగా హారర్ చిత్రాలతో ఆకట్టుకుంటున్న సౌత్ దర్శకుడు రాఘవ లారెన్స్. ముని సిరీస్‌తో వరుస విజయాలు అందుకున్న లారెన్స్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. సౌత్‌లో తనకు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన ముని సిరీస్‌లోని కాంచన సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్న లారెన్స్. ఈ రీమేక్‌లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్నాడట.
అయితే అక్షయ్‌తో కాంచన సినిమాను ఉన్నదున్నట్టుగా రీమేక్ చేయటం లేదు. ముని కాంచన రెండు సినిమాలను కలిపి ఓ కామెడీ హారర్ ఎంటర్‌టైనర్‌ను రెడీ చేస్తున్నారట. ఈ సినిమాను 2019 ద్వితీయార్థంలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు లారెన్స్. 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి 2020లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment