
కొంతమంది తారలకు తొలి చిత్రంతోనే స్టార్ ఇమేజ్ వరిస్తుంది. మరికొందరు అందుకోసం చాలా కాలం పోరాటం చేయాల్సి వస్తుంది. దీనినే లక్కు, కిక్కు అంటారేమో. నటి వేదిక రెండో కోవకు చెందుతుందని చెప్పవచ్చు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం అంటూ నాలుగు భాషల్లోనూ నాయకిగా చాలా కాలంగా నటిస్తున్న నటి ఈ అమ్మడు. అయినా తనకుంటూ ఒక స్థానాన్ని ఏ భాషలోనూ సంపాదించుకోలేకపోయింది.
అలాగని అవకాశాలు లేవని చెప్పలేం. ఇప్పటికీ ఒక్కో భాషలో ఒక్కో చిత్రం చేస్తూనే ఉంది. విషయం ఏమిటంటే వేదికకు ఇప్పటి వరకూ కమర్శియల్ హీరోయిన్ ముద్ర పడలేదు. అందుకోసం చాలా కాలంగానే పోరాడుతోంది.అందుకు తగిన ప్రయత్నాలు చేయడంలేదనే విషయాన్ని ఇన్నాళ్లకు గుర్తించిందో, లేక ఎవరైనా హితవు పలికారో తెలియదుగానీ, తాజాగా అందాలారబోతకు రెడీ అని చెప్పకనే చెప్పేలా గ్లామరస్ ఫొటోలను ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసుకుని తీయించుకుని ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసింది.
ఇప్పుడా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీటి ప్రభావం వేదిక కోరుకున్న స్టార్ ఇమేజ్ తెచ్చి పెడుతుందా అన్నది వేచి చూడాల్సిందే. ఈ బ్యూటీకి నటుడు లారెన్స్ అవకాశం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆయన కథానాయకుడిగా నటించి తెరెక్కించనున్న హర్రర్ నేపథ్యంలో సాగే కాంచన–3లో వేదికనే కథానాయకి అనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment